వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 41వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్రికెట్ ప్రపంచ కప్

క్రికెట్ ప్రపంచ కప్ (అధికారికంగా ఐసిసి పురుషుల క్రికెట్ ప్రపంచ కప్) ఒక అంతర్జాతీయ వన్ డే మ్యాచ్ క్రికెట్ పోటీ. దీనిని క్రికెట్ అధికారిక సంఘమైన అంతర్జాతీయ క్రికెట్ సంఘం (ఐసిసి) ప్రతి నాలుగేళ్ళకు ఒకసారి నిర్వహిస్తుంది. ఈ పోటీలను ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ప్రేక్షకులు వీక్షిస్తారు. ప్రస్తుతం భారతదేశంలో 2023 ప్రపంచ కప్ జరుగుతోంది. మొట్టమొదటి క్రికెట్ ప్రపంచ కప్ 1975 జూన్ లో ఇంగ్లాండులో జరిగింది. 2019 దాకా 12 సార్లు ఈ పోటీ జరిగితే 20 జట్లు ఇందులో పాల్గొన్నాయి. ఆస్ట్రేలియా జట్టు అత్యధికంగా ఐదు సార్లు కప్ గెలవగా, వెస్టిండీస్, భారత్ రెండు సార్లు, పాకిస్థాన్, శ్రీలంక, ఇంగ్లండ్ ఒక్కోసారి కప్పు గెలిచాయి. ప్రస్తుత విధానంలో పోటీ ముందు మూడు సంవత్సరాల కాలం అర్హత దశ ఉంటుంది. ఈ దశ నుంచి అసలైన టోర్నమెంటులో పాల్గొనే జట్లేవో నిర్ణయిస్తారు. టోర్నమెంటులో మొత్తం పది జట్లు కప్పు కోసం పోటీ పడతాయి. ఈ పది జట్లలో పోటీలకు ఆతిథ్యం ఇచ్చే జట్టుకు కచ్చితంగా పాల్గొనే అర్హత ఉంటుంది.
ప్రస్తుతం జరుగుతున్న క్రికెట్ ప్రపంచ కప్ కొరకు, 2023 క్రికెట్ ప్రపంచ కప్ చూడండి.
(ఇంకా…)