వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 44వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఒసామా బిన్ లాడెన్ సంహారం

ఇస్లామిస్ట్ ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా వ్యవస్థాపకుడు, దాని మొదటి నాయకుడు ఒసామా బిన్ లాడెన్ను పాకిస్తాన్లో 2011 మే 2 న స్థానిక సమయం అర్ధరాత్రి 1:00 (భారత సమయం 1:30) తరువాత అమెరికా దేశపు నావల్ స్పెషల్ వార్ఫేర్ డెవలప్మెంట్ గ్రూప్ కు చెందిన నేవీ సీల్స్ సైనికులు సంహరించారు. ఈ బృందాన్ని DEVGRU లేదా సీల్ టీం సిక్స్ అని కూడా అంటారు. సిఐఎ నేతృత్వం వహించిన, ఆపరేషన్ ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ అనే పేరున్న ఈ ఆపరేషనులో సిఐఎ తో పాటు, దాడిలో పాల్గొన్న స్పెషల్ మిషన్ యూనిట్లతో సమన్వయం చేస్తూ జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ (JSOC) కూడా పాల్గొంది. పాకిస్తాన్‌ భూభాగంలో చేసిన ఈ ఆపరేషన్ను పాకిస్తాన్ బలగాలతో కలిసి సంయుక్తంగా చేపడితే ఎలా ఉంటుందనే అంశాన్ని కూడా పరిశీలించారు. కానీ ఈ విషయంలో పాకిస్తాన్ ప్రభుత్వాన్ని, సైన్యాన్నీ విశ్వసించలేమని బరాక్ ఒబామా నిర్ణయించాడు. దాడి ముగిసాక, అమెరికా చెప్పేదాకా ఈ దాడి జరిగిన సంగతి పాకిస్తాన్‌కు తెలియదు. బిన్ లాడెన్ భౌతిక కాయాన్ని విమాన వాహక నౌకలో తరలిస్తూ, ఉత్తర అరేబియా సముద్రంలో ఖననం చేసారు. బిన్ లాడెన్ చేసిన సెప్టెంబరు 11 దాడుల తరువాత, అతడి కోసం దాదాపు 10 సంవత్సరాల పాటు అమెరికా జరిపిన అన్వేషణ ఈ ఆపరేషనుతో ముగిసింది.
(ఇంకా…)