Jump to content

వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 47వ వారం

వికీపీడియా నుండి
నార్కెట్‌పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారి

నార్కెట్‌పల్లి - అద్దంకి - మేదరమెట్ల రహదారి (నామ్ ఎక్స్‌ప్రెస్‌వే) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గుండా వెళ్ళే ప్రధానమైన నాలుగు వరుసల రహదారి. ఇది NH 65లో తెలంగాణలోని నార్కెట్‌పల్లి వద్ద ప్రారంభమై NH 16లో ఆంధ్రప్రదేశ్‌లోని మేదరమెట్ల వద్ద ముగుస్తుంది. దీని వలన హైదరాబాద్ నుండి చెన్నైకి దూరం తగ్గుతుంది. దీని మొత్తం పొడవు 212.5 కిలోమీటర్లు. ఇది 1998 వరకు ఒకే వరుస రహదారిగా వుండేది. 2001-2010 కాలంలో రెండు వరుసల రవాణా సౌకర్యంతో "రాష్ట్ర రహదారి 36" గా మార్చారు. రాష్ట్రం లోని రహదారుల అభివృద్ది కొరకు ఆంధ్రప్రదేశ్, ప్రపంచ బ్యాంకు నుండి US$ 32 కోట్లు అప్పు తీసుకుంది. దీనిని నాలుగు వరుసలకు విస్తరించడానికి 2010 లో ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా అభివృద్ధి సంస్థ, 24 సంవత్సరాలు రహదారి సుంకం వసూలు చేసుకొనే అనుమతితో, నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చుకొనడం, నిర్మించటం, నిర్వహించటం, చివరిగా బదిలీ చేయడం ప్రాతిపదికపై, పోటీపద్ధతిలో రామ్కీ సంస్థ, ఐఎల్‌ఎఫ్‌ఎస్ ల సంయుక్త సంస్థ అయిన నామ్ ఎక్స్‌ప్రెస్‌వే లిమిటెడ్ ను గుత్తేదారుగా ఎంపిక చేసింది. మొత్తం ప్రాజెక్టు నిర్మాణ ఖర్చు 1196.84 కోట్లు.
(ఇంకా…)