వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 49వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఎం.వి.ఎస్. హరనాథరావు

ఎం. వి. ఎస్. హరనాథ రావు (1948 జూలై 27 - 2017 అక్టోబరు 9) నాటక రచయిత, సినీ మాటల రచయిత, నటుడు. 150 సినిమాలకు పైగా సంభాషణలు రాశాడు. ప్రతిఘటన, భారతనారి, అన్న, అమ్మాయి కాపురం ఆయన సంభాషణలు రాసిన కొన్ని సినిమాలు. ఈ నాలుగు సినిమాలకు ఆయనకు నంది పురస్కారాలు దక్కాయి. 20 కి పైగా సినిమాల్లో నటించాడు. ఈయన తమ్ముడు మరుధూరి రాజా కూడా సంభాషణల రచయిత. హరనాథ రావు తన స్నేహితుడైన టి. కృష్ణ ద్వారా సినీ పరిశ్రమలో 1985 లో రచయితగా అడుగుపెట్టాడు. ఒక్క సినిమా మినహాయించి ఆయన తీసిన అన్ని సినిమాలకూ హరనాథ రావే సంభాషణలు రాశాడు. మరో వైపు కొన్ని సినిమాలలో కూడా నటించాడు. తన 40 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 80 చిత్రాలకు రచయతగా, నటుడిగా 40 చిత్రాలకు పనిచేసారు. కె.విశ్వనాధ్, కె.రాఘవేంద్రరావు, దాసరి నారాయణరావు, కోడి రామకృష్ణ, ఎ.కోదండరామిరెడ్డి, సురేష్ కృష్ణ వంటి దిగ్గజ దర్శకులతో పనిచేసిన అనుభవం ఈయన సొంతం. రచయితగా సినిమాల్లో, రంగస్థలంలో ఎన్నో పురస్కరాలు అందుకున్నాడు.
(ఇంకా…)