వికీపీడియా:ఈ వారపు వ్యాసం/2023 50వ వారం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆరావళి పర్వత శ్రేణులు

ఆరావళి పర్వతాలు వాయవ్య భారతదేశంలోని పర్వత శ్రేణి. ఈ పర్వత శ్రేణి ఢిల్లీ వద్ద మొదలై నైరుతి దిశలో సుమారు 670 కి.మీ.(430మైళ్లు) పాటు, దక్షిణ హర్యానా రాజస్థాన్ గుండా వెళ్ళి, గుజరాత్‌లో ముగుస్తుంది. ఈ పర్వత శ్రేణిలో ఎత్తైన శిఖరం గురు శిఖర్ - ఎత్తు 1,722 మీటర్లు. మూడు ప్రధాన నదులు, వాటి ఉపనదులూ ఆరావళి శ్రేణి గుండా ప్రవహిస్తున్నాయి. అవి, యమునకు ఉపనదులైన బానస్, సాహిబి నదులు, అలాగే రాన్ ఆఫ్ కచ్ లోకి ప్రవహించే లూని నది. ఆరావళి శ్రేణి వన్యప్రాణులతో సమృద్ధిగా ఉంది. హర్యానాకు చెందిన ఐదు జిల్లాల్లోని 200 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 2017 లోమొట్టమొదటిగా చేసిన వన్యప్రాణి సర్వేలో చిరుతపులులు, చారల హైనా, బంగారు నక్క, నీల్గాయ్, పామ్ సివెట్, అడవి పంది, రీసస్ మకాక్, పీఫౌల్, ఇండియన్ క్రెస్టెడ్ పోర్కుపైన్ లు కనిపించాయి.
(ఇంకా…)