వికీపీడియా:ఖాతా కోసం అభ్యర్థన/ఖాతా మార్గసూచీ/BadUsername
Jump to navigation
Jump to search
వికీపీడియా ఖాతా అభ్యర్థనకు మార్గసూచీ
వాడుకరిపేరు సమస్యలు
|
మీరు ఎంచుకున్న వాడుకరిపేరుకు సంబంధించి లోపాలు ఎదురయ్యాయా?
చాలా సందర్భాలలో, దాన్ని పరిష్కరించడానికి మీరు వేరే వాడుకరిపేరును ఎంచుకోవలసి ఉంటుంది.
చాలా సందర్భాలలో, దాన్ని పరిష్కరించడానికి మీరు వేరే వాడుకరిపేరును ఎంచుకోవలసి ఉంటుంది.
దాదాపుగా ఈ సందర్భాలన్నింటిలో అభ్యర్థన ప్రాసెస్ సహాయం చెయ్యలేదు. ఖాతా సృష్టి పరికరాన్ని వాడే వాడుకరులు కూడా ఆ పరిమితులకు ఎదురెళ్ళి ఖాతాను సృష్టించలేరు. వాడుకరిపేరు-సంబంధ లోపాలను అందుకున్నప్పటికీ, మీరు చేసే ఖాతా సృష్టి అభ్యర్థనను ఆమోదించజాలరు. దీనికి చాలా కొద్ది మినహాయింపులు ఉన్నాయి. వాటిని దిగువ జాబితాలో మరింత వివరంగా ఇచ్చాం. ఖాతా సృష్టి పద్ధతిని ఉపయోగించి ఖాతాను అభ్యర్థించడానికి కొనసాగే ముందు, మీరు దిగువన ఉన్న సాధారణ పరిష్కారాలు, సమాధానాల జాబితాను చూడండి. చాలా సందర్భాలలో, ఖాతా కోసం అభ్యర్థించాల్సిన అవసరం ఉండదు, ఈ పద్ధతి వాడుకరిపేరు-సంబంధ సమస్యలో మీకు సహాయం చేయలేదు.
వాడుకరిపేరుకు సంబంధించిన లోపాలకు పరిష్కారాలు:
- నా వాడుకరిపేరును ఇదివరకే ఎవరో తీసుకున్నారు
- మీరు ఎంచుకున్న వాడుకరిపేరును ఇప్పటికే మరొక వికీపీడియా ఖాతా లేదా వికీమీడియా ఫౌండేషన్ ఖాతా తీసుకున్నట్లయితే, ఆ ఖాతా స్థితి ఎలా ఉన్నప్పటికీ వేరే వాడుకరిపేరును ఎంచుకోవాలి -ప్రస్తుతం ఆ ఖాతా బ్లాక్ చేయబడి ఉన్నా లేదా లాక్ చేయబడి ఉన్నా సరే. ఖాతాని సృష్టించమని అభ్యర్థింంచే ముందు, మీరు ఎంచుకున్న వాడుకరిపేరు ఇప్పటికే తీసుకోబడిందా లేదా అని మీరు తనిఖీ చేయాలి. ఇక్కడ నొక్కి, ఫీల్డ్‌లో వాడుకరిపేరు (కేస్ సెన్సిటివ్) ఇచ్చి వెతకవచ్చు. పేజీ, "[మీరు ఎంచుకున్న వాడుకరిపేరు]'కి గ్లోబల్ ఖాతా లేదు" అనే సందేశం ఇవ్వకపోయినా, లేదా ఏదైనా WMF ప్రాజెక్టులో ఆ వాడుకరిపేరు వాడుకలో ఉందని చూపినా ఆ వాడుకరిపేరును తీసుకున్నారనీ, అది అందుబాటులో లేదనీ అర్థం. మీరు వేరే వాడుకరిపేరుని ఎంచుకోవాల్సిందే.
- నా వాడుకరిపేరు చెల్లదు
- మీరు ఎంచుకున్న వాడుకరిపేరులో
#
,<
,>
,[
,]
,|
,{
,}
,_
,/
,@
,:
ఉంటే, ఆ వాడుకరిపేరు చెల్లదు. వేరొక దానిని ఎంచుకోవడం తప్పనిసరి. ఇక్కడ క్లిక్ చేసి మరిన్ని పరిమితులు, వివరాలను చూడవచ్చు. కొన్ని ఇతర కారెక్టర్లు ఖాతా సృష్టించడానికి అడ్డుపడనప్పటికీ, ఇతర సమస్యలు, పరిమితులు లోపాలకు కారణం కావచ్చు. మీ వాడుకరిపేరులో ఈ కారెక్టర్లను ఉపయోగించకుండా ఉండటం ఉత్తమం. - నా వాడుకరిపేరు బ్లాక్‌లిస్టులో ఉంది
- వాడుకరిపేరు విధానాన్ని ఉల్లంఘించినందున నిర్దిష్ట పదాలు, పదబంధాలు, అక్షరాలు వాడుకరిపేర్లలో అనుమతించబడవు. చాలా సందర్భాలలో, వేరొక వాడుకరిపేరును ఎంచుకోవడమే ఉత్తమమైన పరిష్కారం. మీరు ఎంచుకున్న వాడుకరిపేరు వాడుకరిపేరు విధానాన్ని ఉల్లంఘించదని మీరు విశ్వసిస్తే, దానిని సృష్టించమని మీరు అభ్యర్థించవచ్చు.
- నా వాడుకరిపేరు మరొక వాడుకరిపేరును బాగా పోలి ఉంది
- మీరు ఎంచుకున్న వాడుకరిపేరు మరొక ఎడిటరు వాడుకరిపేరుకు బాగా దగ్గరగా ఉంటే, ఆ వాడుకరిపేరుతో ఖాతాను సృష్టించకుండా సాఫ్ట్‌వేర్ ఆటోమాటిగ్గా మిమ్మల్ని నిరోధిస్తుంది. పేరు మార్చిన ఖాతాల పాత వాడుకరిపేర్లతో సరిపోలే వాడుకరిపేర్లను కూడా సాఫ్ట్‌వేర్ నిరోధిస్తుంది. చాలా సందర్భాలలో, మీ వాడుకరిపేరు చివర పదాలు లేదా సంఖ్యలను జోడించడం వంటి విభిన్న వాడుకరిపేరును ఎంచుకోవడం ఉత్తమ పద్ధతి.
- ఇప్పటికే ఉన్న ఖాతా నిష్క్రియంగా ఉంటే, ఖాతా సృష్టి బృందం ఆటోమేటిక్ ఫిల్టర్‌ను అతిక్రమించి మీ ఖాతాను సృష్టించగలదు. ఒరిజినలు ఖాతా చాలా తక్కువ సవరణలు చేసి ఉంటేనే, చాలా కాలంగా ఉపయోగించకుంటేనే సారూప్య వాడుకరిపేర్లతో ఖాతాలు సృష్టిస్తాం. ఇది ఎలా నిర్ణయించబడుతుందనే దాని గురించి మరింత సమాచారం కోసం ఖాతా సృష్టి అభ్యర్థన ప్రాసెసింగ్ గైడ్‌లోని ఈ విభాగాన్ని చూడండి.