వికీపీడియా:ఖాతా కోసం అభ్యర్థన/ఖాతా మార్గసూచీ/BlockedIP
Jump to navigation
Jump to search
వికీపీడియా ఖాతా అభ్యర్థనకు మార్గసూచీ
IP address blocks
|
ఏం పర్లేదు! ఈ పరిస్థితుల్లో మీరు స్వయంగా ఖాతా సృష్టించుకోవడం చాలావరకూ సాధ్యమే!
కాలానుగుణంగా, నిర్దుష్ట నెట్వర్కులు, నెట్వర్కు కనెక్షన్లూ వికీపీడియాలో ఖాతాలను సృష్టించకుండా నిరోధించబడాలి. నిరోధపు పరిస్థితులను బట్టి, మీరు ఇప్పటికీ ఖాతాను సృష్టించుకోవడం సాధ్యపడొచ్చు. ఖాతాను అభ్యర్థించడం, దాని కోసం క్యూలో నుంచోడం.. వీటిని నివారించేందుకు గాను, ఖాతా కోసం అభ్యర్థించడానికి ముందు దిగువ ఇచ్చిన సమాచారాన్ని సమీక్షించండి.
ఐపీ లేదా నెట్వర్కు పరిమితులకు సంబంధించి వివిధ లోపాల గురించిన వివరాలు, సమాచారం:
- మీపైనే నిరోధం
- మీరు గతంలో వికీపీడియాలో దిద్దుబాట్లు చేసి ఉంటే, మీ దిద్దుబాట్ల కారణం గానే ఈ నిరోధం విధించారని మీరు భావిస్తే, మీరు ఖాతాను సృష్టించలేరు, ఖాతా కావాలని అభ్యర్థించనూ లేరు. దానికి బదులు ఆ నిరోధాన్ని ఎత్తివేయమని అభ్యర్థించండి. మీ ఐపీ చర్చ పేజీలో ఆ నిరోధం గురించిన మరింత సమాచారం ఉండవచ్చు.
- నా కాలేజీ, గ్రంథాలయం, లేదా సంస్థని నిరోధించారు
- కాలేజీలు, గ్రంథాలయాలు, సంస్థలు వంటి చోట్ల అనేక మంది వాడుకరులు నెట్వర్కును వాడతారు. వారిలో ఎవరైనా దుశ్చర్యలు చేస్తే సదరు ఐపీ చిరునామాలను నిరోధించే అవకాశం ఉంది. ఆ నిరోధానికి కారణం మీరు కానట్లైతే, మీకు వేరే చోట నుండీ ఇంటర్నెట్ కనెక్షను అందుబాటులో ఉంటే, అక్కడి నుండి ఖాతా సృష్టించుకునే ప్రయత్నం చెయ్యండి.
- నేను ప్రాక్సీ, VPN, Tor వాడుతున్నాను
- దుర్వినియోగాన్ని నిరోధించడానికి, ప్రాక్సీ, VPN, టోర్ ఎగ్జిట్ నోడ్ ద్వారా కనెక్టయ్యే వాడుకరులు పేజీలను సవరించడానికి లేదా ఖాతాలను సృష్టించడానికీ ప్రత్యేక అనుమతి ఉండాలి. లేదంటే వారు ఈ అనులు చెయ్యలేరు. Opera Mini వంటి కొన్ని బ్రౌజర్లు వాటంతట అవే ప్రాక్సీ ద్వారా కనెక్ట్ కావచ్చు. ఖాతాను అభ్యర్థించడానికి ముందు, మరొక బ్రౌజర్ నుండి లేదా మీ బ్రౌజరులో ప్రాక్సీని ఆఫ్ చేసుకుని ఖాతాను సృష్టించడానికి ప్రయత్నించండి. ప్రాక్సీ లేకుండా వికీపీడియాను చూడలేకపోతే (ఉదా. ఇంటర్నెట్ సెన్సార్షిప్ కారణంగా) ఖాతా కోసం అభ్యర్థించవచ్చు.
పై పరిస్థితుల్లో ఏదీ మీకు వర్తించకపోతే, మీరు ఖాతా కోసం అభ్యర్థించవచ్చు.