Jump to content

వికీపీడియా:ఖాతా కోసం అభ్యర్థన/ఖాతా మార్గసూచీ/TroubleshootBrowser

వికీపీడియా నుండి
వికీపీడియా ఖాతా అభ్యర్థనకు మార్గసూచీ
సాంకేతిక సమస్యలు
సాధారణంగా ఈ సమస్యను పరిష్కరించే పనులు కొన్ని చేద్దురుగాని రండి!

మీ సమస్యను పరిష్కరించే కొన్ని సూచనలను కింద ఇచ్చాం. ఖాతా సృష్టించమని ఎవరినో అభ్యర్థించి, దాని కోసం క్యూలో ఉండేబదులు, మీరే అన్ని పరిష్కార మార్గాలనూ ప్రయత్నించండి. అవి ఫలించకపోతే అప్పుడే ఖాతా సృష్టించమని అభ్యర్థన పంపిద్దురు లెండి.

ఖాతా అభ్యర్థన ఫారం సరిగ్గా కనబడకపోతే చెయ్యాల్సిన మామూలు పనులు కొన్ని ఇవి:
  • మీ కంప్యూటరును ఆపేసి మళ్ళీ స్టార్టు చెయ్యండి.
  • మీ ఆపరేటింగు సిస్టము, మీ బ్రౌజరూ పూర్తిగా అప్‌టుడేట్‌గా ఉన్నాయని నిర్థారించుకోండి. అవి పాతబడిపోతే, వాటిని ఇటీవలి కూర్పు వరకూ తాజాకరించండి. ఆ తరువాత మీ కంప్యూటరును ఆపేసి మళ్ళీ స్టార్టు చెయ్యండి.
  • బ్రౌజర్లో యాడాన్‌లు గానీ, పాపప్‌లను అడ్డుకునే సాఫ్టువేర్లు గానీ, వెబ్ పేజీలను, వెబ్ కంటెంటునూ, డొమెయిన్లను, కనెక్షన్లనూ వడకట్టే ఇతర సాఫ్టువేర్లు ఏమైనా గానీ ఉంటే వాటిని అచేతనం చెయ్యండి. అదయ్యాక మీ బ్రౌజరును ఆపేసి మళ్ళీ స్టార్టు చెయ్యండి.
  • మొజిల్లా ఫైర్‌ఫాక్సు లేదా గూగుల్ క్రోమ్ వంటి వేరే బ్రౌజరును స్థాపించుకుని దాన్ని వాడండి.
  • వేరే ఇంటర్నెట్ కనెక్షన్ను వాడండి (మీ మొబైలు గానీ, వేరే వైఫై కనెక్షను గానీ). మీరు ప్రస్తుతం వాడుతున్నది పబ్లిక్ ఇంటర్నెట్ కనెక్షనైతే, దానికి ప్రాక్సీ వడపోత అడ్డుపడుతూ ఉండవచ్చు. ప్రాక్సీ అడ్డేమీ లేని ఇంటర్నెట్ కనెక్షన్ను వాడండి.[notes 1]
  • వేరే కంప్యూటరునో, డివైసునో వాడండి (మీ మొబైలు ఫోను గానీ, మిత్రునిదో, కుటుంబ సభ్యులదో కంప్యూటరు గానీ). మీరు వాడుతున్నది పబ్లిక్ కంఫ్యూటరైతే, దాన్ని ఆపేసి, మీ ఇంటి కంప్యూటరు వాడండి. పబ్లిక్ కంఫ్యూటర్లు ప్రాక్సీ వడపోతల వెనక ఉంటాయి. అవి ఖాతా సృష్టించే పేజీలో ఉన్న ఫారాన్ని, బొమ్మలనూ లోడు కానివ్వకుండా అడ్డుపడుతూ ఉండవచ్చు.[notes 2]
  • మీకు తెలిసిన స్నేహితుల, కుటుంబ సభ్యుల, నెట్‌వర్కు నిపుణుల సహాయం తీసుకోండి.[notes 3]
  1. భద్రతా కారణాల రీత్యా మీకు బాగా తెలిసిన, విశ్వసనీయమైన వైఫై నెట్‌వర్కులకు మాత్రమే కనెక్టవ్వమని మా సలహా. పబ్లిక్ ఇంటర్నెట్ కనెక్షన్లను, అవి భద్రమైనవే, వీశ్వసనీయమైనవే అని మీకు నిశ్చయంగా తెలిసి ఉంటే తప్ప, వాడకండి.
  2. భద్రతా కారణాల రీత్యా మీకు బాగా తెలిసిన వారి, విశ్వసనీయమైన, వైరస్‌లు, మాల్‌వేర్‌లూ లేని, కంప్యూటర్లను మాత్రమే వాడమని మా సలహా. పబ్లిక్ కంప్యూటర్లు, అవి భద్రమైనవే, వీశ్వసనీయమైనవే అని మీకు నిశ్చయంగా తెలిసి ఉంటే తప్ప వాటిలో వైరస్‌లు, మాల్‌వేర్‌లూ ఏమీ లేవని నిశ్చయంగా తెలిసి ఉంటే తప్ప, వాటిని వాడకండి.
  3. తెలియని వారికి కంఫ్యూటరు అప్పజెప్పకండి. వాళ్ళకు మీ ఖాతా సంకేతపదం తెలిసి పోయే అవకాశం ఉంది. ఇది వికీపీడియా విధానాలకూ ఖాతా భద్రతకూ విరుద్ధం.