Jump to content

వికీపీడియా:తెలుగు వికీపీడియా కరదీపిక/వ్యాసాల రూపం, సబ్జెక్టులు, ముఖ్యమైన విశేషాలు

వికీపీడియా నుండి

వికీపీడియాలో సమాచారమంతా వ్యాసాల రూపంలో ఉంటుంది. విజ్ఞాన సర్వస్వంలో ఉండదగిన అర్హతలు కలిగి, చదవడానికి వీలుగా సమాచారాన్ని కలిగివున్న దానిని వికీపీడియా వ్యాసం అంటారు. వ్యాస విషయానికే ఇక్కడ ప్రాధాన్యత ఉంటుంది. మన అభిప్రాయాలను, సభ్యుల పేర్లను ఇక్కడ రాయకూడదు.

ఇక, వికీపీడియా వ్యాసానికి వస్తే... వ్యాసం పైన కొన్ని ట్యాబ్స్ ఉంటాయి. ఆయా ట్యాబ్స్ లో వ్యాసం, చర్చ, చదువు, సవరించు, చరిత్ర, తరలించు, వీక్షించు/వీక్షించవద్దు అనే భాగాలు ఉంటాయి. ఇప్పుడు ఆయా విభాగాల గురించి తెలుసుకుందాం...

వ్యాస చర్చాపేజీ
వ్యాసాలనికి సంబంధించిన మార్పులు, ఇతర అంశాల గురించి వికీపీడియా వాడుకరులు చర్చలు జరిపే పేజీని చర్చాపేజీ అంటారు. వ్యాసాన్ని మెరుగుపరచడానికి సంబంధించి ఏదైనా ప్రశ్న లేదా వ్యాఖ్య ఉంటే వ్యాసపు చర్చాపేజీలో రాయవచ్చు. ఈ వ్యాసానికి సంబంధించి, సభ్యుల అభిప్రాయాలు, వాదనను ఇక్కడ చూడవచ్చు
సవరించు
వికీపీడియా వ్యాసంలో సవరించు అనగా వ్యాసంలో సవరణలు చేయడం అని అర్థం. వికీపీడియా వ్యాసంలోని ఏదైనా సమాచారాన్ని మార్చడంగానీ, చేర్చడంగానీ చేయాలనుకుంటే సవరించు అనే ట్యాబ్ నొక్కడం ద్వారా ఎవరైనా వ్యాసంలో సవరణలు చేయవచ్చు.
చరిత్ర
వ్యాసం పేజీలోగానీ, చర్చా పేజీలోగానీ ఆది నుండి జరిగిన మార్పుచేర్పుల జాబితా చరిత్ర విభాగంలో ఉటుంది. ఎవరెవరు, ఏయే మార్పులు, ఎప్పుడెప్పుడు చేసారో తెలిపే జాబితా ఇది.
వ్యాస శీర్షిక, ఉప శీర్షిక
వికీపీడియా వ్యాస పేజీ పేరును వికీపీడియా వ్యాస శీర్షిక అని, వికీపీడియా వ్యాసంలో వివిధ విభాగాలు ఉన్నప్పుడు వాటికి పేర్లు పెట్టడాన్ని ఉప శీర్షిక అంటారు. ఈ శీర్షికల వల్ల వ్యాసం ఒకే విధమైన పాఠ్యంతో కాకుండా ఓ క్రమపద్ధతిలో అమర్చడానికి శీర్షికలు, ఉపశీర్షికలు ఉపయోగపడతాయి.
సమాచారపెట్టె
వికీపీడియా వ్యాసంలో కుడివైపు పైభాగంలో వ్యాసపు విషయానికి సంబంధించిన ముఖ్య విషయాలను కలిగివుండే దానిని సమాచారపెట్టె అంటారు. వ్యాసానికి సంబంధించి ముఖ్య విషయాలను తెలుసుకోవడానికి ఈ సమాచారపెట్టె ఉపయోగపడుతుంది.
మూలాలు, వనరులు
వికీపీడియాలో రాసిన సమాచారం ధృవీకరించడానికి చేర్చే వాటిని మూలాలు లేదా వనరులు అంటారు. చేర్చిన మూలాన్ని ఇతర సభ్యులు లేదా పాఠకులు నిర్ధారించగలిగేటట్లు ఉండాలి.
ఇవికూడా చూడండి
పాఠకుడు చదువుతున్న వికీపీడియా వ్యాస అంశానికి సంబంధించి ఉన్న ఇతర వ్యాసాల లింకులు ఈ విభాగంలో చేర్చబడుతాయి. దానివల్ల, పాఠకుడు మరింత సమాచారం తెలుసుకునే అవకాశం ఉంటుంది.
బయటి లంకెలు/బాహ్య లింకులు
కాపీహక్కుల కారణంగా వికీపీడియా వ్యాసం పేజీలో పెట్టలేని విషయాన్ని కలిగిఉండి, ఆ విషయంపై ఖచ్చితమైన సమాచారం అందించే వాటిని వ్యాసంలో మూలంగా చేర్చలేము. అలాంటి వాటికోసం వ్యాసం కింది భాగంలో బయటి లంకెలు/బాహ్య లింకులు అనే ఒక విభాగం పెట్టి అందులో ఆ లింకులను చేర్చవచ్చు.
వర్గాలు
ఒక అంశానికి సంబంధించిన లేదా ఒక ప్రాంతానికి సంబంధించిన వ్యాసాలు అన్ని ఒకచోటే ఉంటూ పాఠకులకు సులభంగా లభించడానికి వ్యాసంలో అడుగున చేర్చే లింకును వర్గం అంటారు. పాఠకులు తమకు కావలసిన సమాచారం కొరకు వెదికేటపుడు ఈ వర్గాలు ఉపయోగపడతాయి.