వికీపీడియా:తెవికీ గమనించదగు దినోత్సవాలు
స్వరూపం
(వికీపీడియా:తెవికీ గమనించగల దినోత్సవాలు నుండి దారిమార్పు చెందింది)
రచ్చబండలో మాతృభాషా దినోత్సవం పై నా ప్రస్తావనను మరింత చర్చించటానికి ఈ పేజీని సృష్టిస్తున్నాను. అందరీ అభిప్రాయాలను సేకరించటానికి ఇది ఒక వేదికగా ఉపయోగపడుతుందని అనుకొంటున్నాను. ఒక ప్రాంతీయ భాషా ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా గా, తెవికీ ఇప్పటికే కొన్ని దినోత్సవాలను నిర్వహిస్తోంది. ఇవే కాక నెలవారీ సమావేశాలు, ఫోటోవాక్ లు, ప్రతి సంవత్సరం తెవికీ వార్షికోత్సవాలు వంటివి నిర్వహిస్తోంది. మంచిదే. కానీ ఇటువంటివే సంబంధిత ఉత్సవాలు మరిన్ని కూడా నిర్వహించి, వీటి గురించి ఆన్లైన్ లో, ఫేస్ బుక్/యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలలో, చిత్రాలు, వీడియోలు ఉంచటం సమంజసమనిపించి ఈ ప్రశ్నను లేవనెత్తాను.
తెవికీ గమనించదగు దినోత్సవాల జాబితా
[మార్చు]జనవరి
[మార్చు]- 12 - జాతీయ యువ దినోత్సవం
- 26 - గణతంత్ర దినోత్సవం
ఫిబ్రవరి
[మార్చు]- 21 - అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం: తెవికీ ద్వారా మాతృభాషకు సేవలు చేసుకొంటున్నాం. మన మాతృభాష పట్ల మనకున్న గౌరవాన్ని చాటటానికి ఇది ఒక్క చక్కని అవకాశం.
మార్చి
[మార్చు]- 3 - ప్రపంచ రచయితల దినోత్సవం: కామిగాని వాడు మోక్షగామి కాలేడు అన్నట్లు రచయిత కాని వాడు తెవికీ వాడుకరి కాలేడు. ఒకవేళ అది వరకూ రచయిత కాకపోయినా, తెవికీ వాడుకరి అవ్వగనే రచయిత అవుతాడు. ఈ దినోత్సవం జరుపటం వలన తెవికీ పరిచయం లేని రచయితలు సైతం తెవికీలో రచనలపట్ల ఆకర్షితులు అయ్యే అవకాశం ఉన్నది.
- 8 - అంతర్జాతీయ మహిళా దినోత్సవం: మహిళా వికీపీడియనులను ప్రోత్సహించటానికి. ఇదివరకే ఇటువంటి ప్రయత్నములు జరిగినవి కానీ అవి ఎంతవరకు సత్ఫలితాలను ఇచ్చాయన్నది బేరీజు వేసుకోవలసిన అవసరం ఉన్నది. నిజంగా సత్ఫలితాలని ఇచ్చినచో ఆ విధంగానే కొనసాగించాలి. లేని యెడల ఏ విధంగా మహిళల పాత్ర వికీపీడియాలో పెంచవచ్చునో ఆలోచనలు చేయాలి.
- 21 - ప్రపంచ కవుల దినోత్సవం: వికీపీడియా కవి సమ్మేళనం కాదు. ఆమోదమే. కానీ, రచన-కవితలు కవలపిల్లల వంటివి అని నా వ్యక్తిగత అభిప్రాయం. కవులను గౌరవించటం వలన ఆ కోణంలో కూడా వాడుకరులను పెంపొందించే అవకాశం ఉన్నది. తెలుగు సాహిత్యంలో కవుల గురించి, కవితలను గురించి మరింతగా తెలుసుకొనటానికి వీరే మనకు వారధులు.
మే
[మార్చు]- రెండవ ఆదివారం - మాతృ దినోత్సవం: తమ శిశువులకు వికీని ఎలా పరిచయం చేయాలి, వికీలో వారి శిశువులు ఎటువంటి సమాచారాన్ని పొందవచ్చు/చేర్చవచ్చు, వారు చక్కని రచయితలు/వికీపీడియనులుగా ఎదగటానికి తల్లులు ఏమి చేయవచ్చును వంటి అంశాలపై తల్లులకు అవగాహన కలిగించవచ్చును.
- 17 - ప్రపంచ సమాచార సంఘ దినోత్సవం (World Information Society Day): వికీ ద్వారా మనం వ్యాపింపజేసేది సమాచారమే. కావున ఈ దినోత్సవాన్ని గమనించటం వికీకి ఎంతైనా ముఖ్యం.
- 18 - కొమర్రాజు లక్ష్మణ రావు జన్మదినం: స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వానికి ఆనాడే కృషి చేసిన లక్ష్మణరావు గారిని స్మరిస్తూ, ఈ నాటి ఈ స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వానికి మెరుగులు దిద్దటంలో "నేను సైతం" అంటూ ముందుకు వెళదాం.
జూన్
[మార్చు]- మూడవ ఆదివారం - పితృ దినోత్సవం: తమ శిశువులకు వికీని ఎలా పరిచయం చేయాలి, వికీలో వారి శిశువులు ఎటువంటి సమాచారాన్ని పొందవచ్చు/చేర్చవచ్చు, వారు చక్కని రచయితలు/వికీపీడియనులుగా ఎదగటానికి తండ్రులు ఏమి చేయవచ్చును వంటి అంశాలపై తండ్రులకు అవగాహన కలిగించవచ్చును.
ఆగష్టు
[మార్చు]- 15 - స్వాతంత్ర్య దినోత్సవం
- 29 - తెలుగు భాషా దినోత్సవం (ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం), వాడుకభాషా దినోత్సవం(తెలుగు భాషోద్యమ సమాఖ్య), గిడుగు రామమూర్తి జన్మదినం: భాషను, విద్యను సామాన్యుల వద్దకు చేర్చిన మహనీయుడిని స్మరించుకొంటూ, తెవికీని కూడా ఇలాగే సామాన్యుడి ముంగిటికి ఎలా తీసుకువెళ్ళాలో సమాలోచనలు జరుపవచ్చును.
సెప్టెంబరు
[మార్చు]- 5 - ఉపాధ్యాయుల దినోత్సవం: విద్యార్థులకు వికీని ఎలా పరిచయం చేయాలి, వికీలో వారి విద్యార్థులు ఎటువంటి సమాచారాన్ని పొందవచ్చు/చేర్చవచ్చు, వారు చక్కని రచయితలు/వికీపీడియనులుగా ఎదగటానికి ఉపాధ్యాయులు ఏమి చేయవచ్చును వంటి అంశాలపై ఉపాధ్యాయులకు అవగాహన కలిగించవచ్చును.
అక్టోబరు
[మార్చు]- 2 - గాంధీ జయంతి
నవంబరు
[మార్చు]- 19 - అంతర్జాతీయ పురుషుల దినోత్సవం: మన్నించండి. పురుషాహంకారంతో విర్రవీగుతున్నానని అపార్థం చేసుకోకండి. కానీ తెవికీలో అధిక రచయితలు పురుషులేనని నా వ్యక్తిగత అభిప్రాయం. (ఇది ఇలానే కొనసాగాలని నేను ఏ మాత్రం ఆశించుట లేదు. పురుషులకు సమాన సంఖ్యలో, వీలైతే అంతకన్నా ఎక్కువ సంఖ్యలో మహిళా వికీపీడియనులు ఉండాలి అనేది నా ఆశ, ఆశయం కూడాను.) ఇతర పురుషులను వికీ వైపుకెలా నడిపించాలన్నది ఈ దినోత్సవం జరపటం వలన ఆలోచించవచ్చును.
డిసెంబరు
[మార్చు]- 10 - తెవికీ వార్షిక ఉత్సవాలు: ప్రతి ఏడాది జరుపబడుతోన్న తెవికీ సంబరాల గురించి నేను ప్రత్యేకంగా ప్రస్తావించక్కర లేదు.