వికీపీడియా:తొలగింపుకై వోట్లు, మార్గదర్శిని

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

విశ్వనాధ నాయకుడు విశ్వానాధ నాయకుడు నాయక వంశ రాజ్యపాలనకు ఆద్యుడు.

విజయనగరాన్ని పరిపాలించిన శ్రీ కృష్ణదేవరాయల వారి సర్వ సేనాధిపతి నాగమ నాయకుడు. మహామంత్రి తిమ్మరుసు తర్వాత నాగమనాయకుడే శ్రీ కృష్ణదేవరాయల వారి ఆంతరంగికుడు. అతనికి చాల కాలం సంతానం కలగలేదు. అతడు భార్యతో కాశీ  యాత్ర చేసి వచ్చిన పిమ్మట కుమారుడు జన్మించాడు. కాశీ విశ్వనాధుని కృప వలన జన్మించాడని కుమారునికి విశ్వనాధ నాయకునిగా నామకరణం చేసేడు నాగమ నాయకుడు.విశ్వనాధ నాయకుడు శస్త్ర్ర విద్యే కాకుండా సంగీత, సాహిత్యాలలో మంచి అభినివేశం ఉంది. విద్యాభ్యాసం ముగిసిన పిమ్మట తండ్రి ప్రమేయం లేకుండా. స్వయంప్రతిభతో శ్రీ కృష్ణదేవరాయల వారి అంగ రక్షకునిగా నియమితుడయ్యాడు.

శ్రీ కృష్ణదేవరాయల సామంతుడు మధురను పాలించే చంద్రశేఖర పాండ్యునిపై మరొక సామంతుడు, తంజావూరును పాలిస్తున్న చోళ రాజు దండయాత్ర చేసి మధురను స్వాధీన పరచుకున్నాడు.రాజ్య భ్రష్టుడైన పాండ్యరాజు శ్రీ కృష్ణదేవరాయలను ఆశ్రయించేడు. శ్రీ కృష్ణదేవరాయలు చోళ రాజును శిక్షించి పాండ్యుని తిరిగి సింహాసనం పై పునఃప్రతిష్టించడమని నాగమనాయకుని ఆదేశిస్తాడు. నాగమ నాయకుడు చోళ రాజును పరాజితుణ్ణి చేస్తాడు. కానీ శ్రీకృష్ణదేవరాయల ఆజ్ఞను ధిక్కరించి తననే స్వతంత్ర రాజుగా ప్రకటించుకుంటాడు. రాజ భక్తునిగా కీర్తిగన్న నాగమనాయకుని చర్యకు శ్రీ కృష్ణదేవరాయలు విస్తుపోతాడు. నాగమ నాయకునికి బుధ్ది గరిపి విజయనగర ప్రతిష్ట నిలబెట్టే భాద్యతను విశ్వనాధనాయకుడు స్వీకరిస్తాడు. తద్వార తండ్రి చేసిన తప్పిదాన్ని సరిచేసి వంశం పై పడ్డ రాజద్రోహ ముద్రని చెరపవచ్చని అతని భావన. తండ్రి పై దాడికి వెడలతాడు విశ్వనాధనాయకుడు. ఇది నాగమనాయకునికి అనూహ్య పరిణామం.తనతో చేతులు కలుపమని కొడుకుని కోరతాడు నాగమ. తనతో వచ్చి శ్రీ కృష్ణదేవరాయల క్షమాపణ కోరమంటాడు విశ్వనాధనాయకుడు. కొడుకు మాటలకు క్రద్దుడౌతాడు నాగమనాయకుడు.తండ్రీ, కొడుకుల పోరు అనివార్యమవుతుంది. నాగమనాయకుని యుధ్ధంలో ఓడించి బంధించి శ్రీ కృష్ణదేవరాయల ముందు నిలబెడతాడు విశ్వనాధ నాయకుడు. శ్రీ కృష్ణదేవరాయలు నాగమ నాయకుని మన్నించి విశ్వనాదుని పాండ్య, చోళ మండలాలకు రాజును చేస్తాడు. పాండ్యరాజుకు విజయనగరం లో ఆశ్రయమిస్తాడు.