వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/నిర్వాహకత్వం పొందటానికి మార్గదర్శకాలు
ఈ పేజీ వికీపీడియా మార్గదర్శకాలలో ఒకటి. సర్వామోదం పొందిన ప్రమాణాలను వివరించే పేజీ ఇది. చాలామంది వీటిని ప్రామాణికంగా స్వీకరించారు. అయితే ఇవి శిలాక్షరాలేమీ కాదు. ఈ పేజీలో మార్పులు అవసరమని భావిస్తే చొరవగా ముందుకు వచ్చి తగు మార్పులు చెయ్యండి. కాకపోతే, ఆ మార్పులు విస్తృతంగా ఆమోదిస్తారని మీరు భావిస్తేనే చెయ్యండి. సందేహాస్పదంగా ఉంటే, ముందుగా ఆ మార్పులను చర్చా పేజీ లో ప్రస్తావించండి. |
తెలుగు వికీపీడియాలో నిర్వాహకత్వం పొందగోరే వాడుకరులకు అవసరమైన మార్గదర్శకాలను ఈ పేజీలో చూడవచ్చు. వికీపీడియా:రచ్చబండ (పాలసీలు)/నిర్వాహకత్వ హక్కులు పొందటానికి మార్గదర్శకాలు పేజీలో విస్తృత చర్చ జరిగిన తరువాత వచ్చిన నిర్ణయంతో ఈ మార్గదర్శకాలు ఏర్పడ్డాయి.
ఈ మార్గదర్శకాలు అమల్లోకి రావడంతో, గతంలో వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి, వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/ప్రమాణాలు పేజీల్లో ఉన్న ప్రమాణాలు రద్దయ్యాయి.
కనీస అర్హతలు, ఆవశ్యకతలు
[మార్చు]- అనామక సభ్యులు నిర్వాహకులు కాలేరు, వారు ఇంకొకరిని ప్రతిపాదించలేరు, వోటుహక్కు ఉండదు. వ్యాఖ్యానించవచ్చు
- స్వీయ ప్రతిపాదన చేసుకోవాలి
- స్వీయ ప్రతిపాదన చేసేనాటికి తెవికీలో వాడుకరిగా నమోదై రెండు సంవత్సరాలు దాటాలి. అన్ని పేరుబరులలో కలిపి కనీసం 2000 దిద్దుబాట్లు చేసి ఉండాలి
- స్వీయ ప్రతిపాదన చేసేనాటికి 20 "చర్చ:" పేరుబరిలో (ప్రధానబరి వ్యాసాల చర్చలలో) లేదా రచ్చబండ చర్చలలో పాల్గొని ఉండాలి
- అభ్యర్ధికి వాడుకరి పేజీ ఉండాలి. ఆ సభ్య పేజీలో తమ తెవికీ ఇష్టాలు, పరిజ్ఞానం, వికీలో స్వయం ప్రతిపాదన చేసేనాటికి చేసిన కృషి గురించి కొంత సమాచారం ఉండాలి. ఈ విధంగా తెలుపుటవలన ఓటింగు సందర్భంలో అభ్యర్ధి కృషి గురించి వాడుకరులు తెలుసుకునే అవకాశం ఉంటుంది
ఇతర సూచనలు
[మార్చు]ఇవి ఆవశ్యకమైన అంశాలు కావు, కేవలం అభ్యర్థులకు సహాయకారిగా ఉండే సూచనలు మాత్రమే
నిర్వాహక బడి
[మార్చు]నిర్వాహకత్వాన్ని ఆశించే వాడుకరులకు ప్రత్యేకించి ఒక శిక్షణ ఉంటే బాగుంటుందని చర్చలో భావించారు. అభ్యర్థులు కోరిన మీదట అనుభవజ్ఞులైన నిర్వాహకులు అలాంటి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
నిర్వాహక-సంబంధ పనులపై కృషి
[మార్చు]నిర్వాహకత్వం కోరే అభ్యర్థులు నిర్వహణకు సంబంధించిన పనులపై కొంత కృషి చేసి ఉంటే, అది వారి భవిష్యత్తు పనుల్లో సహాయకారిగా ఉంటుంది. కింది పట్టిక ఈ పనులకు సంబంధించి అభ్యర్థులకు మార్గదర్శకంగా ఉంటుంది.
ఇది నిర్వాహకత్వాన్ని నిర్ణయించే "కొలత" కాదు. దీనిపై ఆధారపడి నిర్ణయం చెయ్యరాదు. అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడంలో దీన్ని ఒక పనిముట్టుగా మాత్రమే చూడాలి.
సం | పని |
---|---|
1 | ఇటీవలి మార్పులపై నిఘా పెట్టి పేజీల్లో జరిగే దుశ్చర్యలు మొదలైనవాటిని పరిశీలిస్తూ ఆయా దిద్దుబాట్లను తిరగ్గొడుతూ ఉండడం. కొత్త వ్యాసాలను తనిఖీ చెయ్యడం. (తెవికీ నాణ్యతపై, సమగ్రతపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది) చేసిన ప్రతి తనిఖీకీ.. |
2 | నిర్వహణకు సంబంధించి చేసే చర్యలు (అనాథ వ్యాసాలు, అగాధ వ్యాసాలు, కోరిన వ్యాసాలు/వర్గాలు/మూసలు వగైరా జాబితాలపై పనిచేయడం) (తెవికీ నాణ్యతపై, సమగ్రతపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది) |
3 | వ్యాసాల్లో భాష నాణ్యతపై చర్యలు - భాషను సవరించడం, సముచితమైన మూసను చేర్చడం వగైరా (తెవికీ నాణ్యతపై, సమగ్రతపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది) |
4 | నిర్వాహకుల నోటీసుబోర్డులో ఏదైనా విషయాన్ని నిర్వాహకుల దృష్టికి తీసుకురావడం. ఉదా: దుశ్చర్య, తొలగింపు చర్య, సంరక్షణ, వగైరా (తెవికీ నాణ్యతపై, సమగ్రతపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది) |
5 | అయోమయ నివృత్తి పేజీల సృష్టి/విస్తరణ/నిర్వహణ (వ్యాసాల నిర్వహణపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది) |
6 | అయోమయ నివృత్తి పేజీలకు వెళ్తున్న లింకులను గమనించి వాటిని సరైన పేజీకి మార్చడం (వ్యాసాల నిర్వహణపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది) |
7 | తక్షణమే తొలగించాల్సిన పేజీల్లో CSD మూసలు చేర్చడం (తెవికీ నాణ్యతపై, సమగ్రతపై ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది) |
8 | తొలగింపు చర్చపై నిర్ణయాన్ని ప్రకటించడం (నిర్ణయం ఎలా ప్రకటించాలనే పరిజ్ఞానాన్ని తెలియజేస్తుంది) |
9 | తొలగింపుకు ప్రతిపాదించడం (తొలగింపు హేతుకత తెలిసి ఉండడాన్ని సూచిస్తుంది) |
10 | తొలగింపు చర్చలో పాల్గొని అభిప్రాయం ప్రకటించడం (తొలగింపు హేతుకత తెలిసి ఉండడాన్ని సూచిస్తుంది. చర్చల్లో అభిప్రాయాలు చెప్పి ఒక నిర్ణయం కోసం కృషిచేసే నిబద్ధతను తెలియజేస్తుంది) |
11 | తొలగింపు ప్రతిపాదన వచ్చినపుడు ఆ వ్యాసంలో తగు మార్పులు చేసి తొలగింపు నుండి రక్షించడం (తొలగింపు హేతుకత తెలిసి ఉండడాన్ని, వ్యాసాలను తొలగించకుండా నిలిపి ఉంచే నిబద్ధతను సూచిస్తుంది) |
12 | రచ్చబండలో చర్చలో పాల్గొనడం (చర్చల్లో అభిప్రాయాలు చెప్పి ఒక నిర్ణయం కోసం కృషిచేసే నిబద్ధతను తెలియజేస్తుంది) |
13 | కొత్తవారికి తోడ్పాటు (స్వాగతం కాకుండా, వాడుకరి చేసిన పనిని ప్రస్తావిస్తూ ప్రోత్సహించడం, దోషాలేమైనా ఉంటే మర్యాదగా తెలియజేయడం) |
14 | ఎడబ్ల్యుబి వాడుక |
15 | అనువాద పరికరం వాడుక |