Jump to content

వికీపీడియా:నిర్వాహక హోదా కొరకు విజ్ఞప్తి/S172142230149

వికీపీడియా నుండి

మీ మద్దతు ఇక్కడ తెలుపుము (ఆగష్టు 07, 2007) ఆఖరి తేదీ 22:00 ఆగష్టు 14 2007 (UTC)

S172142230149 (చర్చదిద్దుబాట్లు) మాటలబాబు తెవికీ స్వయంప్రకటిత నిర్వాహకుడు. తెవికీలో అడుగుపెట్టినప్పటి నుండి చొరవ తీసుకొని అందరినీ పలకరించి, కొత్త సభ్యులని ఆహ్వానించి, ప్రోత్సహించాడు. అతి తక్కువ సమయంలోనే తెవికీలో 2500కు పైగా దిద్దుబాట్లు చేసిన మాటలబాబు శ్వాశ్వత బహిష్కారము నుండి నిర్వాహక అభ్యర్ధి వరకు చాలా దూరం ప్రయాణం చేశాడు. ఆ ప్రయాణంలో వికీ విధి విధానాలు బాగా ఆకళింపు చేసుకున్నాడు. ఈయన ముఖ్యంగా పౌరాణిక వ్యక్తులు మరియు కర్ణాటక సంబంధిత వ్యాసాలపై చేసిన కృషి అభినందనీయం. తెలుగు వికీ అభివృద్ధికి కట్టుబడిన వ్యక్తిగా మాటలబాబును నిర్వాహక హోదాకు ప్రతిపాదిస్తున్నాను. --వైజాసత్య 18:17, 7 ఆగష్టు 2007 (UTC)

మాటలబాబు తన అంగీకారము దిగువ తెలియ చేయవలెను.

అంగీకారము

నిర్వాహక హోదాకి నన్ను ప్రతిపాదించినందుకు చాలా సంతోషంగా ఉన్నది.సత్యా గారు,ప్రదీప్ గారు, సుజాత గారు సహృదయం తొ పలికిన పలుకులకు కృతార్థుడిని.నిన్న నవమి అని అంగీకరింకారం తెలుపలేదు. ఈవల దశమి కదా అందుకు అంగీకారం తెలుపుతున్నాను.చాలా ధన్యవాదాలు. ఇంటర్నెట్ సదుపాయం ఉన్నంతలొ తెవికీ కి నా వంతు సహాయం ఇలాగే కొనసాగిస్తానని మాట ఇస్తున్నాను.--మాటలబాబు 09:44, 8 ఆగష్టు 2007 (UTC)

అంగీకారము తెలిపినందుకు కృతజ్ఞతలు --వైజాసత్య 11:02, 8 ఆగష్టు 2007 (UTC)
మద్దతు ఇస్తున్నవారు
  1. నాకు కూడా చాలా రోజుల నుండి మాటలబాబుకి నిర్వాహకుడి హోదా కల్పించటానికి ప్రతిపాదించాలని అనిపిస్తూ ఉంది. మాటలబాబు వచ్చిన తరువాతే కదా చర్చాపేజీలకు అంత కళ వచ్చింది. మాటలబాబుకి నిర్వాహకుడి హోదా కల్పించటానికి నా పూర్తి మద్దతు తెలుపుతున్నాను. __మాకినేని ప్రదీపు (+/-మా) 20:48, 7 ఆగష్టు 2007 (UTC)
మాటలతో

వైజా సత్యగారు,ప్రదీపు గారు వెలిబుచ్చిన అభిప్రాయాలతో సంపూర్తిగా ఏకీభవిస్తూ నా మద్దతు ప్రకటిస్తున్నాను. ఆయన మాటలు అందరిని అలరిస్తూ ఒక్కోసారి అల్లరికూడా చేస్తుంటాయి.వీకీ సభ్యులను ఉత్సాహపరిచే మాటల బాబు గారికి నిర్వాహకుడు కావటం ముదావహం. t.sujatha 02:48, 8 ఆగష్టు 2007 (UTC)


నిర్వాహకునిగా మాటలబాబు అభ్యర్ధిత్వాన్ని నేను సమర్ధిస్తున్నాను. సందర్భానుసారంగా ఇంతకు ముందు జరిగిన వివిధ చర్చలను మననం చేసుకొంటే నాకు తట్టేది - వికీ సభ్యులలో చాలామంది యువకులు అని గమనిస్తున్నాను. వారి సంయమనం, మర్యాద, నిబద్ధత మనకున్న గొప్ప వనరులు. అవే రచయితలలోని తెలుగు భాషాభిమానాన్ని వెనుదట్టి ముందుకు నడుపుతున్నాయి. అజ్ఞాత సభ్యుడిని ఇంత త్వరగా నిర్వాహక ప్రతిపాదన వరకు లాక్కొచ్చాయి. ఒక్కరోజు ఉబుసుపోకకు వికీలో కెలకడం మొదలు పెట్టిన నాకు దీన్ని వ్యసనంగా అంటగట్టాయి. అందరికీ అభినందనలు. మరోసారి మాటలబాబుకు నా వోటు.--కాసుబాబు 10:35, 8 ఆగష్టు 2007 (UTC)
  • నా మద్దుతు కూడా మాటలబాబుకు --వైజాసత్య 12:46, 15 ఆగష్టు 2007 (UTC)

-- ఈ చర్చ ఇంతటితో ముగిసింది. తత్ఫలితముగా మాటలబాబు సరికొత్త నిర్వాహకునిగా ఎన్నికైనారు -- --వైజాసత్య 12:46, 15 ఆగష్టు 2007 (UTC)

మద్దతు ఇవ్వనివారు