Jump to content

వికీపీడియా:మీడియాలో తెవికీ

వికీపీడియా నుండి

ప్రసార మాధ్యమాల్లో వికీపీడియా గురించి వచ్చిన వార్తల సంక్షిప్త నివేదిక ఇది.

2007, జూన్ 10 ఆదివారం నాడు ఈనాడు ఆదివారం పుస్తకంలో

[మార్చు]

2007, జూన్ 10 ఆదివారం నాడు ఈనాడు ఆదివారం పుస్తకంలో వెబ్ లో తెలుగు వెలుగులు[dead link] పేరిట వచ్చిన వ్యాసంలో వికీపీడియా గురించి ప్రస్తావించారు. భారతీయ భాషల్లోకెల్లా అతి పెద్ద వికీపీడియాగా తెవికీని వర్ణించారు. వ్యాసం ఇలా అన్నది.. "..వికీపీడియా తెలుగు వెబ్‌సైట్‌లో 27వేలకు పైగా తెలుగు వ్యాసాలున్నాయి, చూడొచ్చు. మరే భారతీయభాషలోనూ ఇన్ని ఆర్టికల్స్‌లేవు." తెవికీ గురించి ఈనాడు ఇంకా ఇలా రాసింది..

"తెవికీ ...అంటే తెలుగు వికీపీడియా. భారతీయ భాషలన్నిటిలోకి అత్యధిక వ్యాసాలున్న వెబ్‌సైట్‌ (http://te.wikipedia.org)ఇది. 2003, డిసెంబరు 9న ఇందులో తెలుగు వ్యాసాలుంచడం మొదలైంది. 2007 ఫిబ్రవరి నాటికి దాదాపు 27వేలకు పైగా తెలుగు వ్యాసాలు ఈ వెబ్‌సైట్‌లో ఉన్నాయి. దాదాపు రెండువేల మందికి పైగా ఉన్న తెలుగు బ్లాగర్ల కృషి ఫలితమే ఇన్ని వ్యాసాలు. రాష్ట్రంలోని ప్రతిఊరికీ ఒక పేజీ కేటాయించి దానిగురించి రాయాలనేది తెవికీ సభ్యుల బృహత్తర లక్ష్యాల్లో ఒకటి."

2006 నవంబర్ 5 న ఈనాడు ఆదివారం పుస్తకంలో

[మార్చు]
  • వికీపీడియా గురించి 2006 నవంబర్ 5 న ఈనాడు ఆదివారం పుస్తకంలో వ్యాసంగా వచ్చింది. ఇది తెవికీ ప్రస్థానంలో ఓ మలుపు. ఈ వ్యాసానికి స్పందనగా ఎన్నడూ లేనంత ఎక్కువ మంది కొత్త సభ్యులు ఈ ఒక్క రోజే చేరారు. ఈనాడు దండకవిలలో పాత పత్రికలను మూడు నెలల పాటే ఉంచి తరువాత తొలగించడం వలన ప్రస్తుతం ఈ వ్యాసం ఈనాడు వెబ్సైటులో ఉండదు. ఆ వ్యాసం యొక్క పూర్తి పాఠం ఇక్కడ[dead link] చూడవచ్చు.

ఆంధ్రప్రభలో మహిళా దినోత్సవం గురించి

[మార్చు]

నేడు తెవికీ మహిళా దినోత్సవం శీర్షికన ఆంధ్రప్రభలో వచ్చిన వార్తాంశం.

తెలుగు వెలుగు ఫిభ్రవరి 2013 సంపాదకీయంలో

[మార్చు]

తెలుగు వెలుగు ఫిభ్రవరి 2013 సంపాదకీయం లో రామోజీరావు గారు తెలుగు వికీపీడియాని ప్రస్తావించారు. దానిలోని కొన్ని వ్యాఖ్యలు వికీపీడియన్ల సౌకర్యము కొరకు ఇక్కడ పొందుపరుస్తున్నాను.

"తలచుకోవాలే గాని ఎవరైనా ఎన్నెన్ని అద్భుతాలైనా సృష్టించగలరు. ఇక్కడ కొన్ని ఉదాహరణలను ప్రస్తావించాలి.ఆధునిక సమాచారయుగమిది. ఎటువంటి సమాచారం కావాలన్నా చిటికెలో తెలుగులో అందుబాటులోికి తెచ్చేఅంతర్జాల విజ్ఞానసర్వస్వంగురించి విన్నారా? అవును. 'తెలుగు వికీపీడియా' రూపేణా కొన్నేళ్ళుగా అది సంచలనం సృష్టిస్తోంది. అందులో పండితులు పామరులు ఎవరైనా రాయవచ్చు. వేలసంఖ్యలో పొందుపరచిన వ్యాసాలను ఉచితంగా చదువుకోవచ్చు. చరిత్ర సంస్కృతి, సంగీతం, సాహిత్యం,భాష రాజకీయాలు,నదులు,క్రీడలు, ఎన్నో అంశాలపై ... ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారెందరో వ్రాసిన వ్రాస్తున్న వ్యాససంకలనమది. నచ్చినది, మెచ్చినది ఉచితంగా ప్రతులు తీసి పంచుకోనువచ్చు. ఉత్సాహం చొరవవుండి, కొద్దిమందే అయినా చేయి చేయి కలిపితే సాధించగల అధ్భుతానికి 'తెలుగు వికీపీడియా' మచ్చుతునక"

వికీ మహోత్సవ ప్రకటన వార్తలు

[మార్చు]

వికీ మహోత్సవ నివేదికలు

[మార్చు]

హెచ్ఎమ్టివి వారి శభాష్ వికీ కార్యక్రమం

[మార్చు]

హెచ్ఎమ్టివి వారి తెలుగు వికీకి సహకరిద్దాం కార్యక్రమం

[మార్చు]

HMTV లో ఫోన్ ఇన్ కార్యక్రమం జూన్ 1, 2013, ఉ11:00 నుండి 12:00గంటలకు ప్రసారమైంది.

మార్చి

[మార్చు]

నేడు తెవికీ మహిళా దినోత్సవం అను శీర్షికతో ఆంధ్రప్రభలో వచ్చిన వార్తాంశం.

మూలాలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]