వికీపీడియా:మీకు తెలుసా? భండారము/2013

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2013 సంవత్సరంలో వివిధ వారాలలో "మీకు తెలుసా!" వాక్యాలు

01 • 02 • 03 • 04 • 05 • 06 • 07 • 08 • 09 • 10 • 11 • 12 • 13 • 14 • 15 • 16 • 17 • 18 • 19 • 20 • 21 • 22 • 23 • 24 • 25 • 26
27 • 28 • 29 • 30 • 31 • 32 • 33 • 34 • 35 • 36 • 37 • 38 • 39 • 40 • 41 • 42 • 43 • 44 • 45 • 46 • 47 • 48 • 49 • 50 • 51 • 52

2013 లో వివిధ వారాలలో ప్రచురితమైన వాక్యాలు[మార్చు]

12 వ వారం[మార్చు]

 • మాక్స్‌ డెల్‌బ్రక్ (సెప్టెంబర్ 4,1906 - మార్చి 9, 1981) మాలిక్యులర్‌ బయాలజీకి మార్గదర్శకుడు. 'బ్యాక్టీరియో ఫేజ్‌' (Bacterio Phase) అనే నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించి 1969లో వైద్యశాస్త్రంలో నోబెల్‌ అందుకున్నాడు.
 • ఎన్ రికో ఫెర్మి (29 సెప్టెంబర్ 1901 - 28 నవంబర్ 1954) ఇటాలియన్ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త మరియు ప్రయోగాత్మక భౌతిక శాస్త్రవేత్త. ఈయన "చికాగో పైల్-1", "మొదటి నూక్లియర్ రియాక్టర్" వంటి అభివృద్ధికి కృషిచేశారు.
 • ఇవాంజెలిస్టా టొర్రిసెల్లి అనే శాస్త్రవేత్త భారమితి మరియు రకరకాల టెలిస్కోప్ లను, మైక్రోస్కోప్ లను రూపొందించాడు. ఈ పరికరాలు ఊహాతీతమైన శాస్త్రీయపు అంచనాలతో ఉండటం ఎవరినైనా కదిలించే విషయం.టొర్రిసెల్లి గణిత శాస్త్రవేత్త కూడా!
 • లాగరిధమ్స్ గురించి ఎంతోమందికి తెలుసు. క్లిష్టమైన సమస్యలను త్వరితగతిలో చేయాలంటే ఇప్పటికీ ఎంతో మంది లాగరిధమ్స్ నే ఉపయోగిస్తారు. క్యాలిక్యులేటర్లు,కంప్యూటర్లు వచ్చి లాగరిథంమ్స్ వాడకాన్ని తగ్గించాయి. కాని దాని వైశిష్ట్యాన్ని మాత్రం కొంచెంకూడా తగ్గించలేకపోయాయి. ఈ వేళ ఏ విజ్ఞాన శాస్త్రాన్ని తీసుకున్నా లాగరిథమ్స్ వాడటం తప్పనిసరిగా జరుగుతోంది. అంత ప్రాముఖ్యాన్ని పొందిన లాగరిథమ్స్ సృష్టి కర్త జాన్ నేపియర్.
 • ఆర్యభటుని సంఖ్యాపద్ధతి, సంస్కృత అక్షరమాలమీద ఆధారపడినట్టిది. ఇది క్రీ.శ 6వ శతాబ్దికి చెందిన ఆర్యభట వ్రాసిన ఆర్యభటీయం, "గీతిక పదం" అనే మొదటి అధ్యాయం లో పేర్కొనబడింది. ఇందులో సంస్కృత అక్షరమాలలోని ప్రతీ గుణింతానికీ ఒక సంఖ్యావిలువనివ్వడం జరిగింది
 • మేళకర్త రాగాలు మొత్తం 72 ఉన్నాయి. అనంతమైన జన్య రాగాలు ఈ మేళకర్త రాగాల నుండే జనించాయి. ఇవి దక్షిణ భారత శాస్త్రీయ సంగీతానికి ప్రాథమిక రాగాలు. ఉత్తరభారత శాస్త్రీయ సంగీతం(హిందుస్తానీ సాంప్రదాయం)లో ఠాట్ ఈ మేళకర్తకు సమానకం.
 • నేడు మనం ఉపయోగిస్తున్న అంకెలు ప్రాచీన భారతీయులు ఉపయోగించిన లిపి నుండి, అరబ్బు అంకెల నుండి రూపొందాయనీ! (ప్రాచీన సంఖ్యా విధానము వ్యాసం).
 • గూగోల్ ప్లెక్స్ అనగా 1 తర్వాత గూగోల్ సున్నాలు చేర్చిన సంఖ్య అనీ! (ఆంగ్ల సంఖ్యామానం లో స్థానవిలువలు వ్యాసం).

13 వ వారం[మార్చు]

 • వార్తాప్రసార సాధనాలుగా వార్తా పత్రిక లు రూపకల్పన కావటానికి అవసరమైన సాధనం ముద్రణా యంత్రం. దీని అభివృద్ధి జరిగిన తర్వాత వార్తాపత్రికల రంగంలో విశేష మార్పులు జరిగాయి అనీ..... ముద్రణా యంత్రం వ్యాసం.....
 • వెల్డింగ్ అనగా ఒకే రకమైన (సజాతి) లోహాలను, లేదా రెండు రకాల (విజాతి) లోహాల ఫలకాలను (plates), వస్తువులను ఒకదానితో నొకటి అతుకు ప్రక్రియ. ఇది పురాతనమైన ప్రక్రియ. మానవుడు మృత్తిక నుండి లోహాల ముడి ఖనిజాన్ని గుర్తించి, వేరుచేసి అందుండి లోహాలను ఉత్పత్తి చేసీ, వాటి నుండి తన అవసరానికి సరిపడ వస్తువులను తయారు చేయ్యడం ప్రారంభించిన తరువాత లోహాలను అతుకుట వెల్డింగ్ అవసరమైనది.....అనీ......వెల్డింగ్ వ్యాసం......
 • "యత్రనార్యస్తు పూజ్యంతే రమంతే తత్రే దేవతాః" అన్నారు పెద్దలు. ఆడవాళ్ళకు గౌరవం వున్నచోట దేవతలు విహరిస్తారు అని దీని అర్థం.వేద కాలం నాడు మహిళకే అగ్రస్థానం. ఇంటి పెత్తనం ఆమెది. అన్ని విషయాలలో ఆమె మాటే వేదం. ఆనాడు పురుషులతో సమంగా చదువుకున్న వారూ ఉన్నారు. శాస్త్ర విషయాలు వాదించి నెగ్గినవారూ ఉన్నారు. ప్రస్తుతం కూడా అనేక రంగాలలో విశేష ప్రతిభ కనబరచిన అనేక మహిళలు ఉన్నారు... అనీ...ఆదర్శ వనితలు వ్యాసం........
 • సంగం లక్ష్మీబాయి స్వాతంత్ర సమరయోధులు మరియు భారత పార్లమెంటు సభ్యురాలు. ఆంధ్రప్రదేశ్ నుండి పార్లమెంటు సభ్యురాలైన తొలి మహిళ సంగం లక్ష్మీబాయే.లక్ష్మీబాయి ఇందిరా సేవాసదన్ అనే అనాథశరణాలయానికి వ్యవస్థాపక సభ్యురాలు మరియు గౌరవ కార్యదర్శి. ఇదే కాకుండా ఈమె రాధికా మెటర్నిటీ హోమ్, వసు శిశువిహార్ మరియు మాశెట్టి హనుమంతుగుప్తా బాలికల ఉన్నత పాఠశాలల యొక్క స్థాపనలో ముఖ్యపాత్ర వహించినది.....అనీ సంగం లక్ష్మీబాయి వ్యాసం....
 • దుస్తులు మనకు అందాన్నిస్తాయి. వివిధ కాలలలో వాతావరన పరిస్థితులను బట్టి మనం వివిధ రకాల దుస్తులు ధరిస్తాము. మన ఆంధ్ర ప్రదేశ్ నందలి ప్రజల ధరించే వివిధ దుస్తులు గూర్చి తెలిపే వ్యాసం....ఆంధ్రుల దుస్తులు ......
 • వివిధ రకాల కార్యక్రమములను, వార్తా ప్రసారాలను వినడమే కాకుండా చూచి అనందింపజేయటానికి అనేకమంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా తయారుచేయబడిన వ్యవస్థ టెలివిజన్ అనీ......టెలివిజన్ వ్యాసం.....
 • భారతీయులు దేశ ఆచార వ్యవహారలను బట్టి కొన్ని దుస్తులను ధరిస్తారు. యివి వివిధ రాష్ట్రాలలో వివిధ రకాలుగా ఉంటాయి. మనకు స్వాతంత్ర్యం వచ్చినా కొన్ని రకాల విదేశాల దుస్తులను భారతీయులు ధరిస్తున్నారు. వారు ధరించే దుస్తులను తెలిపే వ్యాసం భారతీయులు ధరించే విదేశీ వస్త్రాలు .
 • అనీ బిసెంట్ ప్రముఖ బ్రిటిష్ సామ్యవాది, బ్రహ్మ జ్ఞానవాది, మహిళాహక్కుల ఉద్యమవాది, రచయిత మరియు వాక్పటిమ కలిగిన స్త్రీ. ఈమె భారతీయ మరియు ఐరోపా స్వరాజ్యపోరాటానికి మద్దతు ఇచ్చింది. ఆమె జీవిత విశేషాలను తెలిపే వ్యాసం అనీ బిసెంట్

14 వ వారం[మార్చు]

సైకిల్
 • 19 వ శతాబ్దంలో వివిధ దేశాలు సాధించిన ప్రగతికి రైలు మార్గాలు ప్రధాన కారణమని చెప్పవచ్చు. రవాణా వ్యవస్థ మెరుగుపడి పారిశ్రామికాభివృద్ధి జరగడానికి ముఖమైన కారణం రైలు మార్గాలే అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రైలు మార్గాల అభివృద్ధి, రైలు కనుగొనుటలో అనేక మంది శాస్త్రవేత్తలు సాధించిన కృషిని తెలియ జేసిన వ్యాసం ---రైలు
 • 1902 లో ఎలక్ట్రాన్ యొక్క సిద్ధాంతాన్ని అభివృద్ధి చేసి ఎలక్ట్రాన్ ఖచ్చిత గోళాకారంగా ఉండి దాని చుట్టూ సరిసమానంగా ఆవేశం వ్యాపించి ఉంటుందని పరికల్పనలు చేసి విజ్ఞాన శాస్త్రంలో వినూత్న ఆవిష్కరణలకు ఎంతో కృషి చేసిన జర్మన్ శాస్త్రవేత్త , మాక్స్ ప్లాంక్ శిష్యుడు అయిన మాక్స్‌ అబ్రహం జీవిత గాధను తెలియజేసే వ్యాసం --- మాక్స్ అబ్రహమ్
 • భౌతిక శాస్త్రము ను తెలుగు మాధ్యమం లో చదివి ఉన్నత విద్య అభ్యసించుటకు ఒకేసారి తెలుగు మాధ్యమం నుండి ఆంగ్ల మాధ్యమం లోనికి మారి అధ్యయనం చేయగోరు విద్యార్థులకు భౌతిక శాస్త్రంలో పారిభాషిక పదాలను తెలియజేసే వ్యాసం --- భౌతిక శాస్త్రము - పారిభాషిక పదాలు (ఆంగ్లం - తెలుగు)
 • మానవ శక్తి తో నడిచే ముఖ్యమైన రవాణా సాధనం సైకిల్. దీని వినియోగం వల్ల కాలుష్య నివారణ అగుటయే కాకుండా మన ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈ సైకిల్ యొక్క చరిత్రను తెలిపే వ్యాసం --- సైకిల్
 • అభివృద్ధికి రవాణా సాధనాలు ఎంత అవసరమో అవి ప్రయాణించటానికి అవసరమైన రహదార్లు కూడా అంతే అవసరం. రహదార్ల చరిత్రను తెలిపే వ్యాసం --- రహదారి
 • మనిషి కనుగొన్న మొట్టమొదటి పరికరం చక్రం.యిది ఒక అక్షం (axis) చుట్టూ తిరిగే గుండ్రటి పరికరం. రవాణా మరియు ఎన్నోరకాల యంత్రాలలో చక్రాలు విరివిగా వాడబడుతున్నాయి. ఇరుసు సహాయంతో చక్రం దొర్లడం వల్ల రవాణాలో ఘర్షణ లేదా రాపిడి తగ్గుతాయి. ఈ చక్రం పుట్టు పూర్వోత్తరాలను తెలిపే వ్యాసం --- చక్రం
 • 1925 సంవత్సరంలో పునర్ముద్రించబడిన వేదాంతశాస్త్ర నిఘంటువు సకలతత్వార్థదర్పణము. ఇందులో వేదాంతశాస్త్రం కు సంబంధించిన చాలా పదాలను చక్కగా నిర్వచించారు. దీనిని గూర్చి తెలియజేసే వ్యాసం --- సకలతత్వార్థదర్పణము

15 వ వారం[మార్చు]

విజయవాడలో కృష్ణానదిపై ప్రకాశం బ్యారేజి మరియు రైలు వంతెన
 • రామాయణ కాలంలో కూడా వానర సేన లంకా నగరానికి యుద్ధానికి వెళ్ళేందుకు సేతువు అవసరమైనది. ఈకాలంలో కూడా రహదార్లను ఎంత బ్రహ్మాండంగా నిర్మించినా అవి నదుల దగ్గర ఠపీమని ఆగిపోతె ప్రయోజనముండదు. రోడ్లు ఎంత ముఖ్యమో వంతెనలు కూడా అంతే అవసరం. వంతెనల నిర్మాణాల చరిత్రను తెలిపే వ్యాసం.......వంతెన
 • ఆధునిక తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేసిన అతి ముఖ్య వ్యక్తుల్లో చలం ఒకడు. చలం రచనలు చాలా వరకు స్త్రీల జీవితాలను ఇతివృత్తంగా చేసుకుని ఉంటాయి. చలంయొక్క జీవిత విశేషాలను తెలియజేసే వ్యాసం...గుడిపాటి వెంకట చలం
 • నీతి, శృంగార, వైరాగ్యాలనే మూడు భాగాలుగా సుభాషిత త్రిశతి ని రచించిన భర్తృహరి విఖ్యాత సంస్కృత భాషా ప్రాచీన కవులలో ఒకడు. ఆయన చరిత్రను తెలిపే వ్యాసం....భర్తృహరి
 • ప్రపంచ ప్రఖ్యాత మతములలో జైన మతం ఒకటి. దీనిని మొదటి తీర్థంకరుడు అయిన వృషభనాథుడు. ఈ మతం గూర్చి వివరంగా తెలిపేవ్యాసం...జైన మతము
 • " ఇతరులు నీ మంచి కోరనిదేదీ, నీవు వారినుంచి కోరకు . ఆ వ్యక్తి స్థానంలో నీవు ఉన్నప్పుడు, నిన్ను ఎలా చూడాలని కోరుకొంటావో, నీవు ఆ వ్యక్తిని అలా చూడు " అనే ప్రఖ్యాత సూత్రాన్ని ప్రవచించినవాడు కన్ఫ్యూషియస్, ఆయన ప్రతిపాదించిన మతం గూర్చి తెలియజేసే వ్యాసం....కన్ఫ్యూషియస్ మతం
 • జె.డి. బిర్లాగా పిలిచే ఘనశ్యాం దాస్ బిర్లా భారతదేశపు అతి పెద్ద వ్యాపారపు సమూహానికి యజమాని.ఆయన జీవిత విశేషాలను తెలిపే వ్యాసం....ఘనశ్యాం దాస్ బిర్లా

16 వ వారం[మార్చు]

హొరనాడు అన్నపూర్ణేశ్వరి
 • ఈ రోజు మనం అనేక విజ్ఞాన శాస్త్ర పరికరాలను వాడుతున్నాము. ఇవి పనిచేయుటకు మూల కారణం ఎలక్ట్రాన్ ప్రవాహం. ఇవి పరమాణువులో ఉంటాయి. వీటి ఆవిష్కరణకు దోహదం చేసిన పరికరం ఉత్సర్గ నాళం లేదా క్రూక్స్ నాళం. దీనిని ఆవిష్కరించినవాడు విలియం క్రూక్స్.ఆయన ప్రఖ్యాత భౌతిక మరియు రసాయన శాస్త్రవేత్త. ఆయన గూర్చి తెలిపే వ్యాసం......విలియం క్రూక్స్
 • కర్ణాటక రాష్ట్రములోని చిక్‌మగళూరు జిల్లాలో చికమగళూరుకు నైఋతి దిశగా 100 కి.మీల దూరంలో ఉన్న హిందూ పుణ్యక్షేత్రము హొరనాడు. ప్రకృతి రమణీయ సౌందర్యాలు వెల్లువిరిసిన పశ్చిమ కనుమలలో ఉన్న ఈ గ్రామంలో ప్రసిద్ధమైన అన్నపూర్ణేశ్వరి దేవి దేవాలయం ఉన్నది. ఈ పుణ్యక్షేత్రం విశిష్టతను తెలియజేసే వ్యాసం.....హొరనాడు
 • 1962, 67, 78, 83 లలో ఎమ్మెల్యే గా 1984 నుంచి 2004 వరకు 6 సార్లు వరుసగా హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎన్నికైన ప్రముఖ వ్యక్తి సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ. ఆయన కుమారుడైన అసదుద్దీన్ ఒవైసీ ఎన్నికైనంత వరకు పార్లమెంటు సభ్యునిగా పనిచేశారు. ఈయన ముస్లిం ప్రముఖులలో ఒకడు. ఆయన జీవితం గూర్చి తెలియజేసే వ్యాసం.......సుల్తాన్ సలాహుద్దీన్ ఒవైసీ
 • హైదరాబాదు లోని ఈ.సి.ఐ.ఎల్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇండియా లిమిటెడ్) సంస్థ వ్యవస్థాపకుడు మరియు పద్మ భూషణ్ పురస్కార గ్రహీత అయిన ప్రసిద్ధ భారతదేశ అణు శాస్త్రవేత్త అయ్యగారి సాంబశివరావు.హైదరాబాదు లో ఈ.సి.ఐ.ఎల్ ఉద్యోగులు నివసించే కాలనీకి ఎ.యస్.రావు నగర్ గా నామకరణం చేశారు. ఆయన జీవిత విశేషాలను తెలియజేసే వ్యాసం .......అయ్యగారి సాంబశివరావు
 • మనం యిండ్లలో రక రకాల తినుబండారాలను తయారు చేసినపుడు ముఖ్యంగా గారెలు చేసినపుడు పప్పు రుబ్బుకొనుటకు, మిరపకాయలు లేదా పసుపుకొమ్ములు చూర్ణం చేయుటకు, ఆయుర్వేదంలో వివిధ రకాల పదార్థాలను కలిపి చూర్ణం చేయాల్సిన అవసరం ఉన్నపుడు పురాతన కాలం నుండి వాడబడే ముఖ్యమైన వస్తువులు రోలు, రోకలి మరియు కల్వం వీటి అవసరాన్ని ఉపయోగాన్ని తెలియజేసే వ్యాసం.... రోలు మరియు రోకలి
 • ఆయుర్వేదం లో సంతాన సాఫల్యానికి, చర్మ వ్వాధులకు, కీళ్ళనెప్పుల నివారణకు, మొటిమలు, పుండ్లు వంటి వాటి నివారణకు ముఖ్యంగా వాడే పోయేసి కుటుంబానికి చెందిన గడ్డి మొక్క వట్టివేరు. దీనిని పరిమళ తైలాలలోనూ, సబ్బులు, లోషన్లు వంటి సౌందర్య సాధనాలలో విరివిగా వాడతారు. దీని అవసరాన్ని, ఉపయోగాలను తెలియజేసే వ్యాసం ....వట్టివేరు

17 వ వారం[మార్చు]

హంపిలో గల లోటస్ మహల్
 • తెలుగు వారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న శ్రీ కృష్ణదేవ రాయలు పరిపాలించిన విజయనగర సామ్రాజ్యానికి ముఖ్య పట్టణం హంపి. సుమారు నాలుగు వందల సంవత్సరాల కాలం దక్షిణాపథమంతా వ్యాపించి సుపరిపాలనను అందించిన ఆ సామ్రాజ్యం 16 వ శతాబ్దాంలో ముష్కరుల చేతిలో సర్వనాశనమై పోయింది.ఇక్కడి చారిత్రాత్మక నిర్మాణాల ప్రాధాన్యతను గూర్చి తెలిపే వ్యాసం....హంపి వద్ద నిర్మాణ సమూహాలు
 • ఝాన్సి కి చెందిన లక్ష్మిభాయి కన్న 56 సంవత్సరముల ముందే పుట్టి, తన రాజ్యమైన కిత్తూరు స్వాతంత్రం కై బ్రీటిషు కంపెనీతో పోరాటము చేసిన మొదటి భారతీయ వీరవనిత కిత్తూరు చెన్నమ్మ. ఈమె ఈస్టు ఇండియా కంపెని పాలనకాలంలో, కన్నడదేశానికి చెందిన కిత్తూరు అనే చిన్నరాజ్యానికి రాణి. ఈమె పరాక్రమం, దేశస్వాతంత్రం కోసం చేసిన కృషిని తెలిపే వ్యాసం .....కిత్తూరు చెన్నమ్మ
 • బెండ కాయలను కూరలు చేయుటకే కాదు. దాని గింజలతో నూనెను తయారుచేయవచ్చును. ఈ నూనెను పత్తి గింజల నునెకు ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. ఈ నూనెలో గల పోషక పదార్థములు, ఉపయోగాలను తెలిపే వ్యాసం...బెండగింజల నూనె
 • లోహాలతో వివిధ వస్తువులు తయారుచేయాలంటే అవసరమైన చోట వాటిని అతుకు ప్రక్రియ అవసరం. లోహాలను అతికించు ప్రక్రియకు వెల్డింగ్ అందురు. ఈ ప్రక్రియలలో ముఖ్యమైన ఒక వెల్డింగ్ విధానము సబ్‌మెర్జ్‌డ్ ఆర్కు వెల్డింగు. దీనిని గూర్చి వివరంగా తెలియజేసే వ్యాసం....సబ్‌మెర్జ్‌డ్ ఆర్కు వెల్డింగు
 • సాహిత్యరంగంలో సరికొత్త భావాలకు, నూతన ఆలోచనా రీతులకు మనోవికాసాత్మకమైన విమర్శలకు దోహదపడిన మహోన్నత వ్యక్తి "కట్టమంచి". ఆయన చరిత్రను తెలిపే వ్యాసం...కట్టమంచి రామలింగారెడ్డి

18 వ వారం[మార్చు]

 • అంతరిక్షం లో అడుగు పెట్టిన మొదటి మహిళగా చరిత్రలో ప్రసిద్ధి పొందిన రష్యా మహిళ వాలెంతినా తెరిష్కోవా.ఆమె రష్యాకు మరియు పూర్వపు సోవియట్ యూనియన్ కు చెందిన వ్యోమగామి. ఆమె జూన్ 16,1963 న అంతరిక్షంలోకి "వోస్కోట్-6" అనే అంతరిక్ష నౌక ద్వారా ప్రయాణించినది. అమె జీవితం, విజయాలను తెలిపే వ్యాసం.....వాలెంతినా తెరిష్కోవా
 • భారతదేశానికి చెందిన ప్రాచీన భాషలలో సంస్కృతము ఒకటి. ఇది భారతదేశ 23 అధికారిక భాషల లో ఒకటి. పరమేశ్వరుని ఢమరుక నాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష అని విజ్ఞులందురు. అట్లు వెలువడిన పదునాలుగు రకములైన సూత్రములను మహేశ్వర సూత్రములందురు...ఈ భాష యొక్క స్వరూపం, గొప్పతనం గూర్చి తెలిపే వ్యాసం....సంస్కృతము
 • కూచిపూడి నృత్యము, భారతీయ నృత్యరీతులలో ప్రధానమైనది.ఇది ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాకు చెందిన కూచిపూడి గ్రామములో ఆవిర్భవించినది. ఈ నృత్యం గూర్చి తెలిపే వ్యాసం....కూచిపూడి (నృత్యము)
 • స్వల్పకాలములోనే వివిధ భాషలలో 900కి పైగా సినిమాలలోనటించి ప్రపంచములోనే అరుదయిన రికార్డు సృష్టించి గిన్నీస్ ప్రపంచ రికార్డును స్వంతం చేసుకున్న హాస్య కళాకారుడు బ్రహ్మానందం.ఇప్పటికి ఈయన తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత ఎక్కువ సినిమాలలో నటిస్తూవున్న హాస్య చక్రవర్తి....ఆయన గూర్చి తెలిపే వ్యాసం ...కన్నెగంటి బ్రహ్మానందం
 • వేసవికాలం వచ్చిందంటే చాలు... మండే ఎండలు, భరించలేని చెమట. ఇది అందరికీ తెలిసినదే. వేడిమి, చెమట... కొన్నిసార్లు ఇవే కాదు... చెమటకాయలూ మొదలవుతాయి. ఈ కాలంలో ఇది చాలామందిని బాధించే సమస్య. పిల్లల్లో మరీ ఎక్కువ. ఇదొక రకమైన చర్మవ్యాధి. వేడిగా ఉండే వాతావరణంలో ఈ సమస్య సర్వసాధారణం...దీనికి గల కారణాలు, నివారణోపాయాలను తెలిపే వ్యాసం....చెమటకాయలు

19 వ వారం[మార్చు]

ద్వారకాధీశుడి ఆలయం
 • ద్వారకాధీశ్ మరియు ద్వారక రాజు అన్న నామాలతో ఆరాధించబడుతూ శ్రీకృష్ణునికి అంకితం అయిన ఆలయమే ద్వారకాధీశ్ అనే హిందూ దేవాలయం. గుజరాత్ లోని ద్వారకలో ఈ ఆలయం ఉన్నది. ఈ ఆలయ నిర్మాణ విశేషాలను తెలియజేసే వ్యాసం....ద్వారకాధీశుడి ఆలయం
 • నెల్లూరుజిల్లా సోమశిలలో ఉన్న ఒక పురాతన శివాలయంలో ఉండే పురాతన మామిడిచెట్టు నాలుగు కొమ్మలతో వివిధ రుచులు గల నాలుగు రకాల మామిడి కాయలు కాసేదని పెద్దలు చెప్తుండేవారు. అంటే దీనిని బట్టి పూర్వమే మన పెద్దలు తలమార్పిడి అనే ప్రత్యుత్పత్తి విధానాన్ని అవలంభించారని చెప్పవచ్చు. ఈ విధానాన్ని తెలియజేసే వ్యాసం.....మామిడిలో తలమార్పిడి
 • పద్మపాదాచార్యులు క్రీ.శ. 9వ శతాబ్దానికి చెందిన తత్త్వజ్ఞుడు, అద్వైత వేదాంతి. శంకరాచార్యుని నలుగురు ముఖ్యశిష్యులలో వీరు ఒకరు. శంకరాచార్యులు భారతదేశానికి తూర్పున పూరిలో గోవర్ధన పీఠాన్ని సంస్థాపించి, వీరిని అధిపతిగా నియమించారు. ఈయన జీవిత విశేషాలను తెలియజేసే వ్యాసం....పద్మపాదాచార్యులు
 • శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో నాలుగవది పళని. ఈ క్షేత్రం తమిళనాడు లోని దిండిగల్ జిల్లాలో, మధురై నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాలలో చాలా ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం. దీనిని గూర్చి తెలియజేసే వ్యాసం .....పళని
 • ఇరువరి ఒకటి అచ్చ తెలుగు కథలున్నసంకలన పుస్తకము ప్రళయకావేరి కథలు.ఇందులోని కథలు 'ఆదివారం ఆంధ్రజ్యోతి'లో మొదట ధారావాహికం గా ప్రచురింపబడినవి. ప్రళయకావేరి కథలు సరళమైన గ్రామీణ వ్యవహరిక తెలుగులో వ్రాయబడినవి. ఈ పుస్తక రచయిత స.వెం.రమేశ్. ఈ పుస్తకాన్ని గూర్చి మరింత సమాచారం తెలియ జేసే వ్యాసం.....ప్రళయకావేరి కథలు

20 వ వారం[మార్చు]

శ్రీ కృష్ణ రాయబారం నాటకంలో ఒక దృశ్యం
 • భారత దేశం లో గల పల్లెవాసులకు వినోద కార్యక్రమాలుగా నేడు అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చినా పూర్వం నుంచి వారసత్వ సంపదగా కొన్ని కార్యక్రమాలు యిప్పటికీ నిర్వహింపబడుతున్నవి. వీటిలో ముఖ్యంగా బుర్రకత, హరికథ, జాతరలు, సర్కస్, మోడి, మహా భారత నాటకము, వీది నాటకాలు, భజనలు, కోలాటము, మొదలైనవి. వీటిని గూర్చి తెలియ జేసే వ్యాసం.....పల్లెల్లో వినోద కార్యక్రమాలు
 • తమిళనాడు లోని సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశిష్టమైనదిగా పేర్గాంచిన క్షేత్రం తిరుత్తణి. ఇది తమిళులందరికీ ఆరాధ్య క్షేత్రం. తమిళుల ఇష్టదైవంగా, ఇలవేల్పుగా పూజలందుకుంటున్న సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఇక్కడ మురుగపెరుమాళ్ళుగా పూజలందుకుంటున్నాడు. ఈ క్షేత్రం గూర్చి తెలియజేసే వ్యాసం...తిరుత్తణి
 • హిందూ తత్వం,సంస్కృతి,రాజకీయ అర్థశాస్త్రం పై సూద్ర విమర్శ చేస్తూ కంచ ఐలయ్య వ్రాసిన పుస్తకం నేను హిందువు నెట్లయిత?.ఈ పుస్తకం అఖిలభారత అనుభవాలనుండి,చారిత్రక పరిణామ క్రమాన్ని,ఇక్కడి మత జీవన విధాలను పరిశోధించి,ప్రదానంగా తెలుగు దేశపు దళిత బహుజనుల ప్రసవవేదన లో పుట్టిందని రచయిత తెలియజేశారు. ఈ పుస్తకాన్ని గురించి పూర్తి విషయాలను తెలియజేసే వ్యాసం,,,నేను హిందువు నెట్లయిత?
 • ప్రపంచ వ్యాప్తంగా మధుమేహవ్యాధి అత్యంత ఆందోళనకరమైన రీతిలో విస్తరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి పది సెకన్లకు ఇద్దరు కొత్తగా మధుమేహ వ్యాధికి గురవుతున్నారు. మధుమేహ వ్యాధి ఉన్నవారు తమపాదాల సంరక్షణ గురించి సరైన అవగాహన కల్గిఉండాలి. పాదాల సంరక్షణ గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను తెలియజేసే వ్యాసం...మధుమేహంలో పాదాల సంరక్షణ
 • వెన్న పండు అనేది మధ్య మెక్సికో ప్రాంతానికి చెందిన ఫల వృక్షం. ఈ వృక్షం ఫలించే కాయను వెన్న పండు అని అంటారు. వెన్న పూస దొరకని సమయాల్లో పసి పిల్లలకు వెన్న పండు అతి శ్రేష్టమైన ఆహారం. దీని మద్య కల గింజలను పలు ఔషదాలలో వాడుతుంటారు. ఈ వృక్షం యొక్క గొప్పతనాన్ని తెలియజేసే వ్యాసం.....వెన్న పండు

21 వ వారం[మార్చు]

కర్ణాటక లో ఓ ఆలయ గోపురం
 • శిలలపై శిల్పాలు చెక్కినారు..... సృష్టికే అందాన్ని తెచ్చారు ..... ఇది సినీగీతంలోని భావమే కావచ్చు..... కాని అది నిజము. శిల్ప కళలో లేని విద్యలేదు. గతంలో శిల్పుల చేతిలో శిలలు వెన్న ముద్దలుగా మారాయి. ఆ శిల్పాల అందచందాలు వర్ణనాతీతం. ఆ శిల్పాల సౌందర్యాన్ని తెలిపే వ్యాసం .......శిల్పకళాశోభిత స్తంభాలు
 • వంగారి మధాయ్ గా పేరొందిన వంగారి మట్టా మధాయ్ కెన్యా దేశానికి చెందిన ప్రపంచ ప్రసిద్ది చెందిన పర్యావరణవేత్త, రాజకీయవేత్త మరియు శరీర ధర్మశాస్త్ర పరిశోధకురాలు. ఈమె స్థాపించిన గ్రీన్ బెల్ట్ ఉద్యమానికి గానూ 2004 లో నోబెల్ శాంతి బహుమతికి ఎంపికయ్యారు. ఈమె సాధించిన విజయాలను తెలిపే వ్యాసం......వంగారి మాథాయ్
 • యునైటెడ్ స్టేట్స్‌ లోని సెయింట్ లూయిస్ పట్టణము తూర్పున ఉన్న మిస్సోరీ నది కింది భాగములో ఏర్పడిన అద్భుతమైన గుహలు "మెరామిక్ జలాంతర్గత గుహలు" . ఇవి లైమ్ స్టోన్స్(సున్నపురాయి) నీటి కలయిక వలన భూ అంతర్భాగంలో రూపుదిద్దుకున్నాయి. ఆ గుహల సౌందర్యాన్ని అవి యేర్పడు విధానాన్ని తెలియజేసే వ్యాసం....మెరామిక్ జలాంతర్గత గుహలు
 • రెండవ ప్రపంచయుద్ధం చివరలో టోక్యో పై నిత్యం బాంబుల వర్షం కురిసేది. యుద్ధం కారణంగా పట్టణంలోని జంతుప్రదర్శనశాల అధికారులు అనేక జంతువులను చంపెయ్యవలసి వచ్చింది.ఆ సమయంలో యానో జంతుప్రదర్శన శాలలో చంపివేసిన మూడు ఏనుగుల విషాద కథ 'ప్రాణమిచ్చిన ఏనుగులు'. ...... ఈ కథ యొక్క పూర్తి వివరాలను తెలియజేసే వ్యాసం....ప్రాణమిచ్చిన ఏనుగులు
 • బోయ్ డే (Boide) కుటుంబానికి చెందిన విషరహిత సర్పం రెండు తలల పాము . ఇది ప్రధానంగా ఇరాన్, పాకిస్తాన్, మరియు భారత దేశం లలో కనిపిస్తుంది. రాజస్థాన్ రాష్ట్రంలో దీన్ని బోగి అని అందురు. ఈ పామును నల్లబజారులో 3 నుండి 10 లక్షల వరకు విక్రయిస్తున్నారు. ఈ పామును గూర్చి తెలియజేసే వ్యాసం.....రెండు తలల పాము

22 వ వారం[మార్చు]

1054 సూపర్ నోవా వల్ల ఏర్పడ్డ క్రాబ్ నెబ్యులా.
 • సూపర్ నోవా సాధారణ నోవా కన్నా అతిశక్తిమంతమైన పేలుడు. సూపర్నోవా ఒక్కసారిగా విడుదల చేసే శక్తి వల్ల ఒక్కసారిగా మొత్తం గెలాక్సీ కంటే ఎక్కువ వెలిగిపోతుంది. తర్వాత కొన్ని వారాల నుండి కొన్ని నెలల లోపు మొత్తంగా ఆరిపోతుంది. ఈ సమయంలో అది సూర్యుడు తన జీవితకాలం మొత్తంలో విడుదల చేసే శక్తి కన్నా ఎక్కువ శక్తి విడుదల చేస్తుంది. అంతరిక్షంలో ఒక అలజడి తరంగాన్ని (shock wave) సృష్టిస్తుంది....దీనిని గూర్చి తెలియజేసే వ్యాసం...సూపర్ నోవా
 • క్విట్ ఇండియా, సత్యాగ్రహ ఉద్యమాలు, కందుకూరి వీరేశలింగం వంటి వారి వలన ఆంధ్రదేశంలో మారుతున్న పరిస్థితుల ప్రభావాలను, తెలుగు ప్రాంతంలో జాతీయోద్యమ చరిత్రను శాస్త్రీయమైన అవగాహనతో, అన్ని వైపుల నుంచీ అధ్యయనం చేసి రాసిన రచన "కొల్లాయిగట్టితేనేమి". ఇది ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు పొందిన నవల.... ఈ నవలను తెలిపే వ్యాసం.....కొల్లాయిగట్టితేనేమి?
 • తూర్పు గోదావరి జిల్లా లోని రాజమండ్రి కి సమీపమునవున్న ధవళేశ్వరము మరియు పశ్చిమ గోదావరి జిల్లా లోని విజ్జేశ్వరము లనుకలుపుచూ గోదావరినదికి అడ్డంగా నిర్మించిన ఆనకట్టయే ధవళేశ్వరం-విజ్జేశ్వరము ఆనకట్ట.ఈ ఆనకట్ట సర్ ఆర్థన్ కాటన్ అనే బ్రిటిషు ఇంజనీరు ఆధ్వర్యంలో 1847లో ప్రారంభించి,1852నాటికి పూర్తిచెయ్యబడినది....ఈ ఆనకట్టను గూర్చిన విశేషాలను తెలిపే వ్యాసం....ధవళేశ్వరం ఆనకట్ట
 • పిల్లలమర్రి చెట్టు (Pillalamarri Tree) మహబూబ్ నగర్ జిల్లా చిహ్నమైన పిల్లల మర్రి మహబూబ్ నగర్ పట్టణానికి 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒకపెద్ద మర్రి చెట్టు. 700 సంవత్సరాల గతానుభవాల్ని మౌనంగా వీక్షించింది ఈ ఘన వృక్షం. చెట్లు సైతం రాళ్ళవలే కలకాలం బ్రతుకుతాయి సుమా! అనుకునేటట్టుగా పుట్టి పెరిగి ఎదిగిపోయిన పిల్లల మర్రిని చూడడం నిజంగానే అద్భుతమైన అనుభవం.... ఈ మహా మర్రిచెట్టును గూర్చి తెలియజేసే వ్యాసం.....పిల్లలమర్రి (వృక్షం)
 • భారత దేశంలోని ఎత్తైన జలపాతలలో ప్రథమ స్థానాన్ని ఆక్రమిస్తున్న జలపాతం జోగ్ జలపాతం. ఇది కర్ణాటక రాష్ట్రం, శివమొగ్గ (షిమోగా) జిల్లాలో కలదు. ఈ జలపాతం విశేషాలను తెలియజేసే వ్యాసం.....జోగ్ జలపాతం

23 వ వారం[మార్చు]

ఈజిప్టు పిరమిడ్లు
 • ప్రపంచంలో అత్యంత గొప్ప మరియు అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించిన కట్టడాల్లో ఈజిప్టు పిరమిడ్లు ప్రముఖమయినవి. వీటిలో గీజా పిరమిడ్ ప్రపంచ అద్భుతాలలో ఒకటి. ఈ పిరమిడ్ల నిర్మాణం, అప్పటి ఈజిఫ్టు ప్రజల నమ్మకాలను తెలియజేసే వ్యాసం.....ఈజిప్టు పిరమిడ్లు
 • ఆసియా ఖండంలో ACM ట్యూరింగ్ అవార్డు పొందిన మొదటి ఆసియన్ గా గుర్తింపు పొందిన మన ఆంధ్రుడు డా.రాజ్ రెడ్డి. ఈ అవార్డు కంప్యూటర్ విజ్ఞానం నందు యిచ్చే అత్యున్నత అవార్డు. ఇది ఆయన కృత్రిమ మేథస్సు రంగంలో చేసిన కృషికి ఇవ్వబడినది. ఆయన జీవిత విశేషాలను, విజయాలను తెలియజేసే వ్యాసం.....డా.రాజ్ రెడ్డి
 • 1988 సంవత్సరంలో భారతదేశంలోని అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం ప్రదానం చేయబడిన కావ్యము విశ్వంభర. దీని రచయిత డా.సి.నారాయణరెడ్డి .ఈ కావ్యం గూర్చి విశేషాలను తెలియజేసే వ్యాసం......విశ్వంభర
 • గణిత శాస్త్రంలో గల ప్రతి సంఖ్యకూ ఒక ప్రత్యేకత ఉంటుంది. ఈ సంఖ్యలు వాటి ప్రాముఖ్యతను తెలియజేసే వ్యాసం.....సంఖ్యలు, వాటి ప్రత్యేకతలు
 • కుండలిని అనేది ఒక అనిర్వచనీయమైన శక్తి. ఇది మానవ శరీరంలో వెన్నుపాములో దాగి ఉంటుంది. యోగము లో కుండలినిని జాగృతం చేయడానికి, ప్రాణాయామ సాధన ఒక ముఖ్యమైన మార్గము. ఈ కుండాలినీ శక్తిని తెలియజేసే వ్యాసం.....కుండలిని

24 వ వారం[మార్చు]

వ్రేలాడే ఉద్యానవనాలు
 • వ్రేలాడే తోటలు(బాబిలోనియా) ప్రాచీన ప్రపంచంలో గల ఏడు వింతలలో ఒకటిగా ఉండేది. అవి యిప్పటి ఇరాక్ దేశంలో బాబిల్ అనే ప్రాంతంలో ఉండేవి. ప్రపంచంలోని ప్రప్రథమంగా ఏర్పడి ఉన్న మహా సామ్రాజ్యాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందినది బాబిలోనియా. అచట వ్రేలాడే ఉద్యానవనాలు, నిర్మాణ శైలి గూర్చి తెలియజేసే వ్యాసం.....వ్రేలాడే తోటలు-బాబిలోనియా
 • హ్యారీ పాటర్ పుస్తకాలు ఇంగ్లండుకు చెందిన రచయత్రి జె.కె. రౌలింగ్ రచించిన ఫాంటసీ సాహిత్యపు పుస్తకాల వరుస. హ్యారీ పాటర్ సినిమాలు, వీడియో ఆటలు, ఇతర వస్తువులకు శ్రీకారము చుట్టడము జరిగింది. ఇప్పటి వరకు వచ్చిన ఆరు పుస్తకాలు కలిపి సుమారు 30 కోట్ల కాపీలు అమ్ముడుపోయి ఉంటాయని ఆంచనా. ఈ హారీపాటర్ గూర్చి వివరంగా తెలియజేసే వ్యాసం....హ్యారీ పాటర్
 • తోలుబొమ్మలాట ఒక జానపద కళారూపం. తాను స్వయంగా అనుకరించలేని జానపదుడు కావ్యాల్లోనూ, పురాణాల్లోను వర్ణింపబడిన పాత్రల ఆహార్య విశేషాలను స్వయంగా షృష్టించుకున్నాడు. తన భాషతో ఆ మూగ చిత్రాలకు ప్రాణం పోశాడు. రకరకాల విన్యాసాలను వాటి చేత చేయించాడు. ఈ జానపద కళారూపాన్ని గూర్చి తెలియజేసే వ్యాసం.....తోలుబొమ్మలాట
 • హనుమంతుని చెట్లు గాలిలో తేమ, వర్షపాతం ఎక్కువ ఉండే దట్టమైన అడవుల్లో పెరుగుతాయి. బాగా పక్వానికి వచ్చి మగ్గిన కాయలను తినవచ్చు. సీతాఫలం, రామఫలం వలె కాకుండా లక్ష్మణ ఫలంలో పీచు పదార్ధం ఎక్కువగా ఉంటుంది. కనుక హనుమంతుని ఫలాన్ని నేరుగా తినడం కంటే జ్యూస్ చేసుకొని సేవించడం మేలు...... ఈ ఫలం విశిష్టతను తెలియజేసే వ్యాసం....హనుమంతుని ఫలం
 • కుక్కుట శాస్త్రము అనగా పందెం కోడిపుంజుల గురించి వ్రాయబడిన పంచాంగము. ఉభయ గోదావరి జిల్లాలలో కుక్కుట శాస్త్రాన్ని సంక్రాంతి పండుగ సమయాల్లో కోడి పందెములు వేసేటప్పుడు చదువుతారు. కోడి పుంజుల సంరక్షణ,కోడి పుంజుల వర్గీకరణ, ఏ సమయాల్లో పందెము వేయాలి, కోడి పుంజు జన్మ నక్షత్రము, కోడి పుంజు జాతకము మొదలుగు విషయాలు ఈ శాస్త్రములో ఉండును. మరిన్ని విషయాలను తెలియజేసే వ్యాసం.....కుక్కుట శాస్త్రం

25 వ వారం[మార్చు]

జీయాస్ విగ్రహం
 • ప్రపంచంలో మూడవ వింతగా చెప్పుకునే జీయాస్ విగ్రహం గ్రీసు దేశంలో కలదు. ఈ దేవతనే "జూపిటర్" అని కూడా అంటారు. ఇది సుమారు 13 మీటర్లు(42 అడుగులు) పొడవు ఉంటుంది. గ్రీస్ దేశానికి చెందిన ప్రఖ్యాత శిల్పి ఫిడియాస్ ఈ బృహత్తర జూపిటర్ విగ్రహాన్ని క్రీ.పూ 430-422 మధ్య కాలంలో రూపొందించారు....ఈ విగ్రహ విశేషాలను తెలియజేసే వ్యాసం.....జీయాస్ విగ్రహం-ఒలింపియా
 • "తెల్ల ఏనుగు" అనగానే మనకు జంతువు అనే భావన కలుగుతుంది. కానీ ఒక విలువైన వస్తువు పోషణకు అధిక వ్యయం అయ్యే పరిస్థితిలో యజమాని దానిని విక్రయించలేని మరియు భరించేందుకు వీలుగాని పరిస్థితిలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు. ఈ జాతీయం వ్యుత్పత్తి విధానాన్ని తెలియజేసే వ్యాసం.....తెల్ల ఏనుగు
 • ఇస్లామీయ లిపీ కళాకృతులకు అరబ్బీ లిపీకళ అనికూడా వ్యవహరిస్తారు. ఇది వ్రాసే కళ. ప్రముఖంగా ఇది, ఖురాన్ ప్రతులు వ్రాసేందుకు ఉద్దేశింపబడినది. మొత్తం ఇస్లామీయ చరిత్ర లో దీనిని శ్లాఘించారు. ఇది ఇస్లామీయ కళలను వ్యక్తీకరించడానికి కూడా ఉపయోగించేవారు. ఈ కళాకృతులను తెలిపే వ్యాసం.....ఇస్లామీయ లిపీ కళాకృతులు
 • ఆరుబయటనుండి పైకి చూస్తే మనకు కనిపించే నీలిరంగు ఆవరణమే ఆకాశం.ఆకాశం నీలి రంగులో ఎందుకు కనబడుతుంది? దీనిని గూర్చి వివరించే వ్యాసం.....ఆకాశం
 • 1857 నాటి మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధానికి పదేళ్ళ ముందే, బ్రిటిషు దుష్టపాలనపై ఎదిరించి తిరుగుబాటు చేసిన తెలుగు వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. కంపెనీ దొరతనము ఎదిరించి వీరమరణం పొందినాడు.ఆయన జీవిత విశేషాలను దేశభక్తిని వివరించే వ్యాసం..........ఉయ్యాలవాడ నరసింహారెడ్డి

26 వ వారం[మార్చు]

సూర్యాస్తమయ సమయంలో హార్స్ టెయిల్ జలపాతం దృశ్యం
 • అదొక జపాతం... ఏటా కొన్ని రోజులు మాత్రం అదొక అద్భుతం!...పపంచ పర్యాటకులు వచ్చి చూస్తారు...ఇంతకీ ఏం జరుగుతుంది? నీళ్లు మంటల్లా కనిపిస్తాయి! ఎందుకు? ఈ జలపాతం గూర్చి తెలియజేసే వ్యాసం.....హార్స్ టెయిల్ జలపాతం
 • సాధారణముగా నీటి వనరులు ఉన్న గట్లు మీద ఆంధ్రప్రదేశ్ అంతటా బంజరు భూముల్లో పెరిగే మొక్క ...వావిలి... ఇది ఔషథ మొక్క. ఇది చాలా వ్యాధులను నయం చేస్తుంది. ఈ మొక్కను గూర్చి, దాని ఔషథ గుణాలను తెలియజేసే వ్యాసం.....వావిలి
 • ప్రపంచములో అత్యంత పెద్ద మరియు పొడవైన విష సర్పములలో నల్లత్రాచు లేదా రాచనాగు . ఇది నేల పైన జీవించగలిగే సర్పము. సాధారణముగా ఇది 18.5 అడుగుల (5.7 మీటర్) పొడవు పెరుగుతుంది.ఈ పాముగూర్చి తెలియజేసే వ్యాసం. కింగ్ కోబ్రా
 • సీమ కథలు -సింగమనేని నారాయణ సంకలనసారధ్యంలో వెలువడిన కథల సంపుటం.పద్దెనిమిదిమంది రాయలసీమ కవుల కలాలనుండి జాలువారిన కథలనుండి,ఆణిముత్యాలవంటి కథలను ఏరి,కూర్చి ప్రచురించిన కథలసంకలనం ఈపుస్తకము.ఈ పుస్తకాన్ని గురించి మరిన్ని వివరాలను తెలియజేసే వ్యాసం.....సీమ కథలు
 • నూనెగింజల నుండి నూనెను తీయు పరిశ్రమలవారు మొదట నూనెగింజలను సేకరించునప్పుడు తమ పరిశ్రమలో వున్న క్వాలిటి కంట్రోల్ లాబోరెటరిలో సేకరించు విత్తనాల నమూనాలను (sample) పరిక్షించిన పిదప మాత్రమే కొనుగోలు చేస్తారు. ఈ పరీక్షా విధానాన్ని తెలియజేసే వ్యాసం.....నూనె గింజలను పరీక్షించు పద్ధతులు

27 వ వారం[మార్చు]

యక్ష గానం లో కళాకారుడు
 • యక్షగానం నృత్య, నాటక, సంగీత, వేష, భాష, అలంకారాల కలబోత. ఇది ఒక శాస్త్రీయ శైలి. ఇది కర్ణాటక రాష్ట్రంలోని ఆతి ప్రాముఖ్యమైన శాస్త్రీయ కళారూపం. ఈ నృత్యం గూర్చి పూర్తి వివరాలను తెలియజేసే వ్యాసం.....యక్షగానం
 • మొక్కలకు, జంతువులకు శ్వాసించుటకు అవసరమైన వాయువు ఆక్సిజన్. ఇది సమస్త జీవరాశులకు ప్రాణవాయువు. ఇది గాలిలో గల వివిధ వాయువులలో ఒకటి. దీనిని కనుగొన్న శాస్త్రవేత్త "షీలే" దీనిని ప్రయోగాత్మకంగా తయారుచేసిన మొట్టమొదటి శాస్త్రవేత్తగా చరిత్రలో నిలిచారు. ఈ శాస్త్రవేత్త గురించి తెలియజేసే వ్యాసం.....కార్ల్ విల్‌హెల్మ్‌ షీలే
 • రేగడి భూములలో, పొలం గట్ల పైన విస్తారంగా కనిపించే ఔషధ మొక్క "గడపరాకు". దీనిని 'గాడిద గడప ' అని కూడా అందురు. ఈ మూలిక చేదు రుచి కల్గి వెగటుగా ఉంటుంది. దీని అన్ని భాగాలు ఔషధ ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. ఈ మొక్క యొక్క ప్రాధాన్యతను తెలియజేసే వ్యాసం.....గడపరాకు
 • పళముదిర్చోళై ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలలో మూడవది. ఈ సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం కోండపైన ఉంటుంది కోండ క్రింద ప్రఖ్యాత వైష్ణవ క్షేత్రమైన “అళగర్ కోయిల్ ఉంది. ఈ క్షేత్రం గూర్చి విశేషంగా తెలియజేసే వ్యాసం....పళముదిర్చోళై
 • "విజయానికి అయిదు మెట్లు" అనేది ఆధునిక తెలుగు నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ వ్రాసిన ఒక పుస్తకం. ఇందులో వ్యక్తిత్వ వికాసం మరియు మనో విజ్ఞానం కు సంబంధించిన విషయాలున్నాయి. ఈ పుస్తక పరిచయాన్ని తెలియజేసే వ్యాసం...విజయానికి అయిదు మెట్లు

28 వ వారం[మార్చు]

దేవాలయ ప్రధాన ద్వారము, తూర్పునుండి దృశ్యం, నాగా మార్గం నుండి
 • "అంగ్ కోర్ వాట్ " ఒక ప్రపంచ వారసత్వ ప్రదేశం, కంబోడియా లోని అంగ్ కోర్ వద్ద ఒక దేవాలయం. 12వ శతాబ్దంలో నిర్మించిన ఈ దేవాలయం 'వైష్ణవాలయం' . ఇది ఖ్మేర్ నిర్మాణ శైలి లో నిర్మింపబడింది. ప్రపంచంలోనే అతిపెద్ద విష్ణుదేవాలయం. ఈ దేవాలయం యొక్క విశిష్టతను తెలియజేసే వ్యాసం....ఆంగ్‌కోర్ వాట్
 • 80 యేళ్ళ వయస్సులో ఎవరెస్టు శిఖరం ఎక్కి ఎవరెస్టు ఎక్కి ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి వృద్ధుడుగా రికార్డు సృష్టించి చరిత్రను తిరగరాసిన వ్యక్తి ... యుషిరో మిరియా. ఈయన ఘనతను తెలియజేసే వ్యాసం యుషిరో మియురా
 • నోటిలో కొంత ఇంధనాన్ని ఉంచుకొని ఆ నోటిలోని ఇంధనాన్ని శ్వాస ద్వారా వెలుపలికి వెదజిమ్మడం ద్వారా వెలువడిన ఇంధనపు తుంపర వెలుపల ఉన్న మంట ను తగిలినప్పుడు, ఆ ఇంధనం మండుట ద్వారా అగ్నికీలలు ఏర్పడతాయి. ఈవిధంగా అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసే నపుణ్యం గల విద్య ...అగ్ని శ్వాస.. దీని గూర్చి తెలుసుకొనే వ్యాసం ...అగ్ని శ్వాస
 • ప్రతి సంవత్సరం గుజరాత్ లో రెండు వేలకు పైగా పండుగలను జరుపుకుంటారు. ఉత్తరాయణంలో జరుపుకునే అతిపెద్ద వేడుకగా భావించబడే పండగ గాలిపటాల పండగ. ఈ పండగను తెలుసుకొనే వ్యాసం...అంతర్జాతీయ గాలిపటాల పండుగ - గుజరాత్
 • ఆయుర్వేద వైద్యం లో విశేషమైన ఔషధం "త్రిఫల చూర్ణం" ఉసిరి, కరక్కాయ, తానికాయల మిశ్రమాన్ని త్రిఫల అంటారు. ఆయుర్వేదం నందు త్రిఫల చూర్ణాన్ని విరివిగా ఉపయోగిస్తారు.దీని ఔషథ గుణాలను తెలియజేసే వ్యాసం...త్రిఫల చూర్ణం

29 వ వారం[మార్చు]

 • దుండగుల దురాగతంలో తన కుడికాలు పోగొట్టుకున్న జాతీయస్థాయి వాలీబాల్‌ మాజీ క్రీడాకారిణి అరుణిమా సిన్హా చరిత్ర సృష్టించారు.ఒంటి కాలితో ఆత్మవిశ్వాసంతో మౌంట్‌ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన భారతదేశపు మొట్టమొదటి వ్యక్తిగా కీర్తి పతాకాన్ని ఎగురవేశారు. ఆమె సాహసాన్ని తెలియజేసే వ్యాసం...అరుణిమ సిన్హా.
 • ఆయన ఒక అద్భుత శిల్పి...శిలలను శిల్పాలుగా మార్చి గణతికెక్కిన ఎందరో శిల్పులకన్నా భిన్నంగా ఈయన సముద్రపు ఒడ్డును, ఇసుకను తన కళాత్మక ప్రతిభతో శిల్పాలుగా మార్చి...సందర్శకుల ప్రశంసలతో పాటు... భారత రాష్టప్రతి పురస్కారాన్ని కూడా అందుకున్న ప్రముఖ సైకత శిల్పి. ఆయన గూర్చి తెలుసుకొనే వ్యాసం.....సుదర్శన్ పట్నాయక్
 • మికిక్ ఆక్టోపస్ అనేది పరిసరాలకు అనుగుణంగా రంగులు, ఆకారాలు మార్చుకొనే ఒక ప్రత్యేక ఆక్టోపస్. యిది సముద్రపు జీవులలో ఒక వెవిధ్యతను ప్రదర్శిస్తుంది.చాలా ఆక్టోపస్ లు వాటి పరిసరాలకు అనుగుణంగా శరీర రంగును మార్చుకొని, టెక్ట్చర్ ను వివిధరాకాలుగా మార్చి శతృవులనుండి రక్షించుకుంటాయి. యీ ఆక్టోపస్ గూర్చి తెలుసుకొనే వ్యాసం...మిమిక్ ఆక్టోపస్
 • ప్రకృతి లో ఎన్నో వింతలు, అధ్బుతాలు ఉంటాయి. యిటువంటు వింతల లో కొన్ని జీవులకు తమ శరీరం పారదర్శకంగా ఉంటుంది. వీటిని పారదర్శక జీవులు లేదా గాజు జీవులు అందురు. ఈ పారదర్శక జీవుల రకాలను తెలియజేసే వ్యాసం.,,గాజు జీవులు
 • భూమి మీద జీవులకైనా, సముద్రంలో జీవులకైనా బ్రతకడానికి ఆక్సిజన్ అవసరం అని అందరికీ తెలిసిందే. కానీ ఆక్సిజన్ లేకుండా బ్రతక గలిగే కొత్తరకం జీవులను యిటీవల శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ జీవుల గూర్చి తెలియజేసే వ్యాసం...ఆక్సిజన్ లేకుండా జీవించే జీవులు

30 వ వారం[మార్చు]

భూ అంతర్భాగ చర్చి, కూబర్‌పెడీ
 • అదొక పట్టణం... దానికో ప్రత్యేకత ఉంది... అది ప్రపంచంలో ఏ పట్టణానికీ లేదు! ఏమిటా ప్రత్యేకత? ఆ పట్టణం ఉన్నది నేలపై కాదు... భూగర్భంలో! ఏ పట్టణానికి వెళ్లాలన్నా బస్సులోనో, రైళ్లోనో, విమానంలోనో వెళతాం. కానీ ఆ పట్టణానికి మాత్రం భూమి కిందకి వెళ్లాలి. ఆ పట్టణం గూర్చి తెలియజేసే వ్యాసం ...నేల క్రింద నగరం
 • ఆ ఇద్దరు సోదరీమణులు వోకల్‌ మరియూ వయొలీన్‌ వాదనలోనూ సుప్రసిద్దులు.టీనేజ్‌ నుంచే వీరిద్దరూ వయొలీన్‌ ప్రదర్శనలు ఇచ్చేవారు.అంతేకాక ఎంతో మంది ప్రముఖులకి పక్కవాయిద్యంగా కూడా వయోలీన్‌ సహకారం అందించారు.ఆ తర్వాత వోకల్‌ కచేరీలు కూడా ప్రారంభించి అందులో కూడా ప్రాచుర్యాన్ని పొందారు.వారే కర్నాటకుకు చెందిన రంజని- గాయత్రి సోదరీమణులు. వీరి గొప్పతనాన్ని తెలియజేసే వ్యాసం...రంజని-గాయత్రి
 • మల్లిక్ ప్రముఖ కార్టూనిస్టు. తెలుగు కార్టూన్ ప్రపంచంలో మల్లిక్ తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు! మల్లిక్ వేసిన కార్టూన్లకు,వ్యంగ్యాస్త్రాలకు నవ్వనివారు ఉండరు. ఆయన వేసిన ప్రతీ వ్యంగ్యాస్త్రం ఆలోచన రేకెత్తించేదిగా ఉంటుంది.అలాగే సమకాలీన విషయాలపై వారు వ్రాసిన వ్యంగ్యకధలు కూడా ఆలోచింపజేసేవిగా ఉంటాయి. వారి గొప్పతనాన్ని తెలియజేసే వ్యాసం...మల్లిక్
 • ఖజురహో మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఛత్తర్ పూర్ జిల్లాలోని ఒక గ్రామం. ఢిల్లీకు 620 కి.మీ. దూరంలో గల ప్రాంతం.ఇక్కడి నిర్మాణ సమూహాలు యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడ్డాయి. ఈ నిర్మాణ సమూహాలను , శిల్పకళను తెలుసుకోవాలనుకుంటున్నారా! చూడండి...ఖజురహో వద్ద నిర్మాణ సమూహాలు
 • సరస్వతీ ఆకు ఒక ఔషధ మొక్క. ఇవి చెమ్మ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో, నీటివనరులకు దగ్గరలో పెరుగుతాయి. ఈ మొక్క ఆయుర్వేదంలో జ్ఞాపకశక్తిని పెంపొందించేదుకు ఉపయోగపడటమే కాక అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. ఈ మొక్క ఔషథ గుణాలను తెలియజేసే వ్యాసం...సరస్వతీ ఆకు

31 వ వారం[మార్చు]

 • గంగిరెద్దులాటలు అనునది ఒక జానపద కళారూపం.ఇది ప్రాచీనమైనది. తెలుగు సాంప్రదాయాలకు గుర్తు సన్నాయి అప్పన్న, విశాఖ పట్నంలో జరిగే విశాఖ ఉత్సవ్ చిహ్నం కూడా సన్నాయి అప్పన్నే. కానీ సన్నాయి అప్పన్నల జీవితాలలో విషాదమైన సంగీతము మారుమ్రోగుతోంది. ఈ గంగిరెద్దులోళ్ళ జీవన విధానం గూర్చి తెలియజేసే వ్యాసం .....గంగిరెద్దులాటలు
 • సాలీడు ఏం తింటుంది?దోమల్లాంటి చిన్న చిన్న కీటకాల్ని...కానీ పక్షుల్ని, పాముల్ని కూడా తినే సాలీడు గురించి తెలుసా? అది గోలియత్ బర్డ్ ఈటింగ్ స్పైడర్. ప్రపంచంలోని సాలీళ్లన్నింటిలోకీ అతి పెద్దది! విషపూరితమైనది కూడా! ఈ సాలీడు గూర్చి తెలియజేసే వ్యాసం....పక్షుల్ని తినే సాలీడు
 • "నామ్‌గైల్ వాంగ్డీ " జన్మనామం గల నేపాలీ ఇండియన్ కు చెందిన వ్యక్తి టెన్సింగ్ నార్కే.ఆయన ఒక పర్వతారోహకుడు. ఆయన ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కిన మొదటి వ్యక్తులలో ఒకరు. ఆయన సహచరుడు అయిన ఎడ్మండ్ హిల్లరీ తో కలసి ఎవరెస్టు శిఖరాన్ని మే 29 , 1953 లో అధిరోహించి చరిత్రలో మొదటి వ్యక్తిగా నిలిచారు. ఆయన జీవిత విశేషాల గూర్చి తెలియజేసే వ్యాసం...టెన్సింగ్ నార్కే
 • చిత్తూరు జిల్లా కు చెందిన నాగలాపురం లో గల విశిష్ట దేవాలయం వేదనారాయణస్వామి ఆలయం. ఈ ఆలయ విశేషాలను తెలియజేసే వ్యాసం...వేదనారాయణస్వామి ఆలయం
 • నాలుక పూత ఒకరకమైన శిలీంద్ర సంబంధమైన వ్యాధి. నోరుమంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు. అది నోటి మాటలకు వర్తిస్తుంది అనుకోండి. కాని నోటిని అపరిశుభ్రంగా ఉంచుకుంటే మాత్రం నోటి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే నోరు మన మాట వినదు సరికదా. పైగా నోరే మనలోని జబ్బులను బయటపెడుతుంది. ఈ వ్యాధి మరియు నివారణ గూర్చి తెలియజేసే వ్యాసం...నాలుక పూత

32 వ వారం[మార్చు]

ఉప్పు హోటల్
 • అది ఒక హోటల్. అయితే అక్కడ గోడలు గీకడాలు చేయ కూడదు.ఈ హోటల్‌ లోకి ఎవరెైనా వెళ్లవచ్చు కానీ, ఒకటే షరతు! అదేంటో తెలుసా? ‘ఇచ్చట గోడలు నాకరాదు!’ అని ముందే చెబుతారు.బొలివియా దేశంలోని ఉయుని పట్టణం దగ్గర ఈ ‘లవణ మందిరం’ ఉంది. ఈ హోటల్ విశేషాలను తెలియజేసే వ్యాసం.....ఉప్పు హోటల్
 • సూదిబెజ్జంలో తొమ్మిది ఒంటెలు.... అంతే స్థలంలో ఒబామా కుటుంబం...ఇసుక రేణువుపై రథం...ఈమిటివన్నీ... ప్రపంచంలో చిన్నబొమ్మలు! యిలాంటి సూక్ష్మ శిల్పాలను సృష్టించే వ్యక్తి "విల్లార్డ్ విగన్". ఈ ప్రఖ్యాత సూక్ష్మ శిల్పకారుని గూర్చి తెలియజేసే వ్యాసం... విల్లార్డ్ విగన్
 • అప్‌షాట్ - నోథోల్ ఎన్‌కోర్ అనునది ఒక "కేంద్రక శస్త్ర పరీక్ష"(అణు పరీక్ష}. యిది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లో "ఆపరేషన్ అప్‌నాట్ - నోథోల్" లో భాగంగా చేసిన అణు పరీక్ష యిది. ఈ పరీక్ష ను మే 8 , 1953 లో యు.ఎస్. నందు గల "నోవెడా టెస్ట్ సైట్" లో గల "యుక్కా ప్లాట్" లో నిర్వహింపబడినది. ఈ అణ్యాయుధ పరీక్ష గూర్చి తెలియజేసే వ్యాసం...అప్‌షాట్ - నోథోల్ ఎన్‌కోర్
 • ఆచార్య హేమచంద్రుడు జైన మతానికి చెందిన ఆచార్యుడు, కవి మరియు బహుశాస్త్రజ్ఙుడు.ఈయన వ్యాకరణ శాస్త్రము, తత్వశాస్త్రము,ఛందస్సు మరియు సమకాలీన చరిత్ర వంటి గ్రంథాలను వ్రాసాడు. ఈయన ప్రఖ్యాత భారతీయ గణిత శాస్త్రవేత్త. ఈయన గూర్చి తెలియజేసే వ్యాసం ...ఆచార్య హేమచంద్రుడు
 • పెరుగు రుచికి కొద్దిగా పుల్లగా ఉంటుంది. ఎలాంటి వాత వ్యాధినయినా జయిస్తుంది. బరువును పెంచుతుంది. నపుంసకత్వాన్ని తగ్గిస్తుంది. శరీరంలో వాపుని పెంచుతుంది. ఆహారం మీద యిష్టం లేని వాళ్ళకి పెరుగు మంచిదని ఆయుర్వేదం చెబుతుంది... ఈ ఆయుర్వేద ఔషథం గూర్చి తెలియజేసే వ్యాసం...పెరుగు

33 వ వారం[మార్చు]

 • కనీసం కదలడానికి సహకరించని శరీరం, చక్రాల కుర్ఛీకి అతుక్కు పోయిన మనిషి, కనీసం మాట్లాడటానికీ కంప్యూటర్ సహాయం... ఇవి ప్రఖ్యాత ఖగోళ శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ ను గుర్తించడానికి ఆనవాళ్లు. మోతార్ న్యూరాన్ వ్యాధి శరీరాన్ని కబళిస్తున్నా... చేస్తున్న పనికి శరేరం సహకరించక పోయినా... కృష్ణ బిలాల పై ఆయన పరిశోధనలు ఖగోళ శాస్త్రంలో ఎన్నో ప్రశ్నలకు సమాధానాన్ని చూపాయి.ఈ ప్రముఖ శాస్త్రవేత్త గూర్చి వ్యాసం....స్టీఫెన్ హాకింగ్
 • కృష్ణానదీ ప్రాంతంలో నివశించే విప్ర వినోదులు - బ్రిటిష్ వారు పరిపాలన సాగిస్తున్న కాలంలో ప్రదర్శించిన ఒక అద్భుత కార్యం ఇండియన్ రోప్ ట్రిక్. ఆ కాలంలో ఈ ఫీట్ ను వారు మాత్రమే దేశం నలుమూలలా ప్రదర్శించేవారు. ఆ కాలంలో మన దేశానికి విచ్చేసిన విదేశీయులెందరో ఈ అద్భుతమైన ఇండియన్ రోప్ ట్రిక్ ను ఎంతగానో ప్రశంసించారు. విదేశాలలోని వార్థాపత్రికలు దీనికి బహుళ ప్రచారం ఇచ్చాయి. ఈ విన్యాసమును తెలియజేసే వ్యాసం ఇండియన్ రోప్ ట్రిక్
 • మాల్గుడి కథలు అనే కాథాసంకలన పుస్తకం ప్రముఖ ,ప్రసిద్ద ఆంగ్లకథా రచయిత ఆర్.కె. నారాయణ్ వ్రాసిన ప్రసిద్ధ రచన.ఈపుస్తకంలోని కథలు మాల్గుడి అనే వూరును కేంద్రంగా చేసుకొని,ఆవూరిలోని ప్రజలజీవితంలోని సంఘటనలను ఆధారంచేసుకొని కథలల్లబడ్డాయి. ఈ పుస్తక విశేషాలను తెలియజేసే వ్యాసం.......మాల్గుడి కథలు
 • ఆయుర్వేద వైద్యం లో అనేక రకాల వ్యాధులను నయం చేసే మొక్కలలో ముఖ్యమైన మొక్క కలబంద. ఇది ఔషధ మొక్క. ఈ మొక్క ఔషథ గుణాలను తెలియజేసే వ్యాసం ...కలబంద
 • పూర్వం వాగ్గేయకారులు కర్ణాటక సంగీతం లో గల 72 మేళకర్త రాగములకు ఆయా వరుస సంఖ్యను బట్టి సరియగునట్లు పేర్చు పెట్టి యున్నారు. ఈ మేళకర్త రాగము పేరు బట్టి ఆ రాగం యొక్క సంఖ్యను తెలుసుకొనే విధానం "కటపయాది సంఖ్య" ... ఈ విధానం గూర్చి తెలియజేసే వ్యాసం...కటపయాది సంఖ్య

34 వ వారం[మార్చు]

 • తీగలతో నిర్మించే వంతెనల గూర్చి మనకు తెలుసు.... అయితే చైనా ప్రపంచంలో అతి పొడవైన వంతెన నిర్మించి ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ బ్రిడ్జి సముద్రంలో 10 కి.మీ వేయబడింది. ఈ బ్రిడ్జి విశేషాలను తెలియజేసే వ్యాసం...జియాజింగ్ షోయాజింగ్ సీ బ్రిడ్జ్.
 • హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ ప్రముఖ బెంగాళీ ఆంగ్ల కవి, హిందీ సినిమా నటుడు, సరోజినీ నాయుడు సోదరుడు మరియు లోక్ సభ సభ్యుడు. ఈయన జీవిత విశేషాలను తెలియజేసే వ్యాసం... హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ
 • చాతుర్మాస్య వ్రతం ప్రాచీన కాలం నుండి హిందూదేశంలో మునీశ్వరులు పాటిస్తూ వస్తున్న వ్రతం. చాతుర్మాస్య వ్రతం అంటే నాలుగు నెలల కాలం అనుష్ఠించవలసిన వ్రతమని అర్ధం. ఈ వ్రతాచరణకు స్త్రీ,పురుష భేదం కానీ, జాతి భేదం కానీ లేదు. వితంతువులు, యోగినులు మున్నగువారెవరైనా చేయవచ్చును. ఈ వ్రతం గూర్చి పూర్తి వివరాలను తెలియజేసే వ్యాసం ...చాతుర్మాస్యము
 • గొల్లపూడి మారుతీరావు రాసిన ప్రసిద్ధ నవలల లో ఒక నవల సాయంకాలమైంది. దీనిని శ్రీ వైష్ణవ సాంప్రదాయ నేపథ్యంలో రాశారు. ఇది ఆంధ్రప్రభ వారపత్రికలో 2001 సంవత్సరంలో ధారావాహికగా వెలువడింది. ఈ నవల విశేషాలను తెలియజేసే వ్యాసం...సాయంకాలమైంది
 • నిన్న మొన్నటిదాకా నేపాల్ దేశం హిందు మతతత్వ రాజ్యము. అక్కడి అధిక జనాబా హిందువులే. అక్కడున్న ప్రజలు హిందువులే అయినా భారదేశంలో వున్న హిందువులు జరుపుకునే పండగలకు నేపాల్లో హిందువులు జరుపునునే పండగలకు కొన్నింటిలో కొంతతేడా వున్నది. ఈ పండగల గూర్చి తెలియజేసే వ్యాసం.....నేపాల్ దేశంలో పండగలు

35 వ వారం[మార్చు]

 • "ఓడ లన్నింటిలో యే ఓడ మేలు" అని ఎవరైనా అడిగారనుకోండి. ఈ ఓడ గూర్చి చకచకా చెప్పేయండి. ఎందుకంటే యిది వ్యక్తిగత విహార నౌకల్లో ప్రపంచంలో కెల్లా అతి పెద్దది. జర్మనీలో దీనిని ఈమధ్యనే తయారుచేశారు.సముద్ర అలలపై ఇంద్రభవనంలా ఉండే ఈ ఓడ వివరాల గూర్చి తెలుసుకొనే వ్యాసం.....ఆజమ్‌ సూపర్ యాచ్
 • తిమింగలాలలో 80 జాతులున్నాయి. వీటిలో అతి పెద్దది "నీలి తిమింగలం" . యిది 100 ఆడుగుల పొడవు,20,000 కి.గ్రా. ల బరువు ఉంటుంది. తిమింగలాలలో అతి చిన్నది. పిగ్మీ స్పెర్మ్ వేల్. యిది 11 అడుగుల పొడవు వుంటుంది. ఈ తిమింగలం విశేషాలను తెలియజేసే వ్యాసం.....పిగ్మీ స్పెర్మ్ వేల్
 • పాము కాటు వేయటం ద్వారా తన కోరలతో ఏర్పరచిన గాయాన్ని పాముకాటు అంటారు. పాముకాటు విషపూరితమైనది. అయితే పాము జాతుల యొక్క అధిక భాగం విషపూరితం కానివి ఉన్నాయి. ఈ పాము కాటు గూర్చి, ప్రథమ చికిత్స గూర్చి తెలియజేసే వ్యాసం...పాముకాటు
 • అప్పలాయగుంట శ్రీ వేంకటేశ్వరాలయం అత్యంత ప్రాముఖ్యత వహించిన తిరుమల శ్రీ వేంకటేశ్వరాలయానికి చుట్టు ఉన్న ఏడు పురాతన శ్రీ వేంకటేశ్వరాలయాలలో ఒకటి. యిది అప్పలయ గుంట లో వెలసినది. ఈ ఆలయ చరిత్ర మరియు విశేషాలను తెలియజేసే వ్యాసం...అప్పలాయగుంట వేంకటేశ్వరాలయం
 • మోడి అనునది ఒక జానపద కళా రూపం. మోడి అనగా మంత్ర, తంత్ర విద్యను ప్రదర్శించడం. మంత్రాలతో ఎత్తులకు పైయెత్తులు వేసి ఒకరి నొకరు అడ్డు కుంటుంటారు. చివరకు ఎవరో ఒకరు గెలుస్తారు. ఈ పురాతన గారడీ విద్యను తెలియజేసే వ్యాసం....మోడి

36 వ వారం[మార్చు]

 • దక్షిణ అమెరికా లో ఎక్కువగా ఉండే గ్రీన్ అనకొండ పాములన్నింటిలో బరువైనది. ఆకుపచ్చ అనకొండ అనేది ప్రపంచంలోని అతి పెద్ద పాములలో ఒకటి. దీని పొడవు 6.6 m (22 ft) ఉంటుంది. ఈ పాము గూర్చి విశేషాలను తెలియజేసే వ్యాసం...గ్రీన్ అనకొండ
 • భారతీయ సంగీతం లో సంగీత శాస్త్రం అభ్యసించేవారికి, సంగీత పదాలను వాటి అర్థాలను తెలుసుకొనగోరే వారికి అవసరమైన నిఘంటువు ...సంగీత పద నిఘంటువు
 • మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారు వ్రాసిన మానసిక వ్యక్తిత్య పుస్తకం ఎవరికీ తలవంచకు. దీనిని ప్రముఖ తెలుగు రచయిత వాడ్రేవు చిన వీరభద్రుడు తెనుగీకరించారు.ఈ పుస్తక విశేషాలను తెలియజేసే వ్యాసం...ఎవరికీ తలవంచకు
 • తిరుప్పరంకుండ్రం తమిళనాడు లో గల మదురై మీనాక్షి అమ్మవారి దేవాలయానికి 9 కిలోమీటర్ల దూరం లో కలదు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రములలో రెండవది తిరుప్పరంకుండ్రం. ఈ క్షేత్రములో శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఇంద్రుని కుమార్తె అయిన దేవయాని (దేవసేనా) అమ్మతో కళ్యాణం జరిగింది. ఈ ఆలయ విశేషాలను తెలియజేసే వ్యాసం...తిరుప్పరంకుండ్రం
 • తెలుగునాట అనేక జానపద కళారూపాలలో జముకుల కథలు విశేషమైనవి. జముకుల కథలను జక్కుల కథల ని పిలవడం కూడా కద్దు. ఈ కథలు కాకతీయుల కాలంలో బహుశ ప్రచారంలో వున్నట్లు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఈ కథల విశేషాలను తెలియజేసే వ్యాసం...జముకుల కథలు

37 వ వారం[మార్చు]

ముక్తినాథ్
 • నేపాల్ దేశంలోని మస్తంగ్ జిల్లాలో ఉన్న హిమాలయ పర్వతాలలో భాగమైన తొరంగ్ లా పర్వతపాదం పాదం వద్ద ఉన్న పవిత్ర క్షేత్రం ముక్తినాథ్. ముక్తినాథ్ హిందువులకు ముస్లిములకు కూడా పవిత్రక్షేత్రం. ఈ క్షేత్ర విశేషాలను తెలియజేసే వ్యాసం...ముక్తినాథ్
 • సువాసనలు మనసును ఉత్తేజభతం చేయడమే కాక మనసు వత్తిడి తగ్గిస్తాయి. సువాసన తైలాల మర్ధన ఒక వైద్య విధానంగా ఆధునిక కాలంలో ఉపయోగపడుతోంది. దీనిని ఆంగ్లభాషలో అరోమాథెరఫీ అంటారు. ఈ వైద్య విధానం గూర్చి తెలియజేసే వ్యాసం...సుగంధతైలచికిత్స
 • మారేడు లేదా బిల్వము (Bael) హిందూ దేవతలలో ఒకరైన శివపూజలో ముఖ్యం. మారేడు దళాలు లేకుండా శివార్చన లేదు.దీని ఆకులు సుగంధ భరితంగా ఏదో దివ్యానుభూతిని కలుగజేస్తూ ఉంటాయి.ఈ చెట్టు యొక్క ఔషధ గుణాలను తెలియజేసే వ్యాసం...మారేడు
 • ధర్మస్థల హిందువుల పవిత్రక్షేత్రం. ఈ నగరం కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెల్తాంగడి తాలూకాలో నేత్రావతి నదీతీరంలో ఉంది. ఈ గ్రామం లో ప్రసిద్ధి చెందిన శ్రీ మంజునాథ స్వామి ఆలయం ఉంది. ఈ ఆలయ విశేషాలను తెలియజేసే వ్యాసం....ధర్మస్థల
 • ఉత్తరాంధ్ర లో గల జానపద కళారూపాలలో యాదవుల కళారూపం "తప్పెటగుళ్ళు". రాత్రిపూట మందకాపలా సమయంలో వీరు ఈ తప్పెటగుళ్ళుపాట, గొల్లచెరువు మొదలగు పాటలను, కాటమరాజు కథలు పాడుతుంటారు. ఈ కళావిశేషాలను తెలియజేసే వ్యాసం....తప్పెటగుళ్ళు

38 వ వారం[మార్చు]

 • దక్షిణ అమెరికా ఖండంలోని అమెజాన్ అడవులలో ఓ వింత చెట్టు ఉంది.దాన్ని తీసుకొని వచ్చి మీ పెరట్లో వేసి యేడాది తర్వాత చూస్తే ముందుకో , వెనుకకో, ప్రక్కకో వెళ్ళిపోయి ఉంటుంది. భూమి లోని సారం సూర్యరశ్మి ఉన్నచోటుకి యివి జరుగుతాయి. ఈ వింత చెట్టు గూర్చి తెలియజేసే వ్యాసం....నడిచే చెట్టు
 • మెదక్ జిల్లా సిద్ధిపేట కు చెందిన ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య. ఈయన జీవిత విశేషాలను తెలియజేసే వ్యాసం...కాపు రాజయ్య
 • విజయనగర చక్రవర్తుల కాలంలో నాట్యకళతో పాటు, సంగీత విద్యకూడ ఎంతో అభివృద్ధి పొందింది. విజయనగర సామ్రాజ్యము లో సంగీత కళ అభివృద్ధికి ఎందరో దోహదపడ్డారు.సంగీత కళాభివృద్ధికి కృషిచేసిన వారి విశేషాలను తెలియజేసే వ్యాసం...సంగీత సాగరం విజయనగర సామ్రాజ్యము
 • సౌర కుటుంబంలో గల ఎనిమిది గ్రహాలలో నెప్ట్యూన్ చివరిది. ఆ గ్రహానికి 14 ఉపగ్రహాలున్నాయి. వీటిలో జూలై 1 2013 న 14 వ ఉపగ్రహాన్ని కనుగొన్నారు. ఈ ఉపగ్రహ సమాచారాన్ని తెలిపే వ్యాసం...నెప్ట్యూన్ గ్రహ 14 వ చంద్రుడు
 • కూచిపూడి భాగవతుల వీథి నాటక ప్రదర్శనలతో ఆంధ్ర దేశం అంతటా విజయ యాత్ర సాగిస్తున్న రోజుల్లో అంత వుత్తమం గానూ వీథి నాటకాలు ప్రదర్శించి సెహబాష్ అనిపించు కున్న వ్వక్తి శ్రీ తమ్మారపు వెంకటస్వామి. ఈయన పగటి వేషాలను అద్భుతంగా ప్రదర్శించి ఆ తరువాత కట్టు దిట్టమైన వీథి నాటక సమాజాన్ని నడిపిన దిట్ట. ఈయన ప్రదర్శించిన వీధినాటకాల గూర్చి తెలియజేసే వ్యాసం....తమ్మారపు వెంకటస్వామి వీధినాటకాలు

39 వ వారం[మార్చు]

పాలిటానా పాలరాతి గుడులు
 • గుజరాత్ లోని పాలిటానా చిన్న నగరం. అక్కడ శతృంజయ్ అనే కొండపై నిర్మించిన గుడులను "పాలిటానా గుడులు" అనిపేరు. యివి మొత్తం 1000 ఉన్నాయి! ఇన్ని గుడులు ఉన్నా ప్రతి ఒక్కటీ దేనికదే ప్రత్యేకంగా నిర్మించారు. ఈ పర్యాటక ప్రాంతం గూర్చి తెలియజేసే వ్యాసం....పాలిటానా పాలరాతి గుడులు
 • ఉత్తరాంధ్ర లో తూర్పు భాగవతమనే భాగవతం ప్రచారంలో వుంది. ఈ జానపద కళారూపాన్ని తెలియజేసే వ్యాసం...తూర్పు భాగవతం
 • పాకుడురాళ్ళు రావూరి భరద్వాజ గారి విశిష్టమైన నవలా రచన. చలనచిత్ర పరిశ్రమను వస్తువుగా చేసుకొని తెలుగు లో వెలువడిన మొట్టమొదటి నవల పాకుడురాళ్లు. ఈ నవల విశిష్టతలు తెలిపే వ్యాసం....పాకుడురాళ్ళు
 • శిల్పకళా విశిష్టతతో నిర్మితమైన రామప్ప గుడి వరంగల్ జిల్లా ములుగు తాలూకాలో వుంది.రామప్ప గుడిలోని విగ్రహాలు, స్థంబాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా పెద్ద నల్లారాతి నాట్య కత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఈ శిల్ప కళా సౌందర్యాన్ని తెలియజేసే వ్యాసం...రామప్ప గుడిలో శిల్ప కళా చాతుర్యం
 • బంగాళాదుంప చిప్స్ అనునవి నూనెలో వేయించిన సన్నని బంగాళాదుంప ముక్కలు. వీటిని తయారుచేసే విధానం, ఆరోగ్య సూచనలను తెలియజేసే వ్యాసం ...బంగాళాదుంప చిప్స్

40 వ వారం[మార్చు]

రూఫా చేపలు
 • ... చేపలు కూడా సొరియాసిస్ వంటి వ్యాధులకు వైద్య చికిత్స చేయగలవనీ! (డాక్టర్ చేప )
 • ... శిల్పకళ, గాజుపై చిత్రకళ లోనూ ఆరితేరిన వ్యక్తి లక్ష్మాగౌడ్ అనీ! ( లక్ష్మా గౌడ్ )
 • ...అల్జీమర్స్ అనే వ్యాధితో బాధపడుతున్న ఒక మతిమరపు నాన్న కథ "అనగనగా ఓ నాన్న" అనీ! (అనగనగా ఓ నాన్న)
 • ...పల్లె ప్రజలు హృదయాల్లో పదిలంగానే వున్నాయి గొబ్బి పాటలు అనీ! ( గొబ్బియళ్ళొ గొబ్బియళ్ళు)
 • ...ఇస్లాం ధర్మ పరిచయం మరియు ప్రచారం కొరకు వచ్చిన ధార్మిక పురుషుడు మాలిక్ బిన్ దీనార్ అనీ! (మాలిక్ బిన్ దీనార్ )

41 వ వారం[మార్చు]

Trivarna padardhalu.png
 • నారింజ , తెలుపు , ఆకుపచ్చ రంగుల త్రివర్ణ పదార్ధాలు పదార్ధాలు శరీరానికి ఆరోగ్యాన్నిస్తాయి!
 • అన్నమయ్య నుండి రవీంద్రుడి వరకు, ఆంధ్ర రాగం నుండి జ్యోతిషం వరకు గల వ్యాసాల సంకలనం రజనీ భావతరంగాలు.
 • కాశీ క్షేత్రాన్ని చృడలేని వారికి చూసి నట్లే అనుభూతి చెందించేది కాశీకావడి
 • రక్తమోక్షణ వైద్య విధానంలో జలగ కూడా ఉపయోగపడుతుంది!
 • పుట్టిన బిడ్డకు చనుబాలతో వస ను కలిపి పడితే కఫం పోతుంది!

42 వ వారం[మార్చు]

అజంతా గుహలు

43 వ వారం[మార్చు]

గోల్కొండ కోట

44 వ వారం[మార్చు]

కిలిమంజారో పర్వతం
 • ఆఫ్రికాలో మంచుతో కప్పబడిన అద్భుతమైన పర్వతం కిలిమంజారో పర్వతం అనీ!
 • వాము భారతదేశ వాసులకు తెలిసిన గొప్ప ఓషధి అనీ!
 • ముస్లింల సాంప్రదాయంలో ఒకరి నొకరు శుభాకాంక్షలు తెలుపుకునే రీతి ఈద్ ముబారక్ అనీ!
 • బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి పోరాడిన వీరులు పాలెగాళ్లు అనీ!
 • ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ప్రముఖ క్షేత్రం చార్‌ ధామ్‌ అనీ!

45 వ వారం[మార్చు]

సౌర తుఫాను
 • సూర్యుడి ఉపరితలం నుండి వచ్చే ఉధృతమైన అయస్కాంత తరంగాల మేఘమే సౌర తుఫాను అనీ!
 • జుత్తు నల్లబడుటకు, కంటి చూపుకు అద్భుతమైన ఔషథం తానికాయ అనీ!
 • అత్యంత గౌరవనీయుడైన పర్షియన్ కవి ఫిరదౌసి అనీ!
 • భగవంతుని తల్లిగా, స్నేహితునిగా, కొడుకుగా, యజమానిగా, ప్రేయసిగా భావించి పూజించినవారే నాయనార్లు అనీ!
 • శివుని త్రినేత్రంగా, ఓం కార రూపంగా ఉన్న ఏకముఖ రుద్రాక్ష ధరిస్తే విజయం చేకూరుతుందనీ!

46 వ వారం[మార్చు]

Mars Orbiter Mission - India - ArtistsConcept.jpg
 • అరుణగ్రహంపై పరిశోధనల కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన ప్రాజెక్ట్ మంగళయాన్ అనీ!
 • పార్శీ ప్రపంచపు జాతీయ ఇతిహాసము షాహ్ నామా అనీ!
 • దళితుల సమానత్వంకోసం మరియు అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తినరేంద్ర దభోల్కర్ అనీ!
 • మానవ రహిత విమానాన్ని మొట్టమొదట తయారుచేసిన భారతీయుడు శివకర్ బాపూజీ తలపడే అనీ!
 • ఆయుర్వేదం లో విరుద్ధాహారం తీసుకుంటే ఆరోగ్యానికి దుష్ఫలితాలు వస్తాయనీ!

47 వ వారం[మార్చు]

ఆలంపూర్ శక్తిపీఠం
 • ... చక్కెర వ్యాధి నివారణకు మారేడు దివ్యౌషథమనీ!
 • ... ముస్లిం ఆచారాల ప్రకారం బ్రహ్మచర్యం, వైరాగ్యం నిషిద్ధమనీ!
 • ... వెన్న పూస దొరకని సమయాల్లో పసి పిల్లలకు వెన్న పండు అతి శ్రేష్టమైన ఆహారం అనీ! (అవకాడో వ్యాసం).
 • ... తెలంగాణలో ఏకైక శక్తిపీఠం ఆలంపూర్ లో ఉన్నది అనీ! (తెలంగాణ వ్యాసం).
 • ... తొలి తెలుగు రామాయణం రచించినది గోనబుద్ధారెడ్డి అనీ! (గోన బుద్ధారెడ్డి వ్యాసం).

48 వ వారం[మార్చు]

 • .....దుస్తులు కుట్టే యంత్రం ఆవిష్కరించిన శాస్త్రవేత్త ఐజాక్ మెరిట్ సింగర్ అనీ!
 • .....స్త్రీరోగాలను హరించి వేసే ఔషథ మొక్క అత్తిపత్తి అనీ!
 • .....ముస్లిం లు అల్లాహ్ ముందు మోకరిల్లి నిర్వహించు ప్రార్థన నమాజ్ అనీ!
 • .....దక్షిణ భారతదేశంలో వర్థిల్లిన ఏకైక జనపదం "ఆశ్మక జనపదం" అనీ! (తెలంగాణ వ్యాసం).
 • .....దేశీయ ఆవు పేడ, ఆవు మూత్రం తో జీవామృతం తయారు చేస్తారనీ!

49 వ వారం[మార్చు]

వేంకటేశ్వరస్వామి దేవస్థానం

50 వ వారం[మార్చు]

Marre tree.JPG
 • ... మర్రి ఊడల నుంచి జాలువారే లేత వేరులు స్త్రీల సంతాన సాఫల్యతను పెంచుతాయనీ!
 • ... పేనుకొరుకుడు వ్యాధికి ఉత్తమమైన ఔషథం గుంటగలరాకు అనీ!......గుంటకలగర
 • ...దేశంలోనే గిన్నిస్ పుస్తకంలో స్థానం పొందిన తొలి విశ్వవిద్యాలయం పాలమూరు విశ్వవిద్యాలయము అనీ!
 • ...మొరింగేసి మొక్కను పశువుల దాణాకు ఉపయోగిస్తే పాల ఉత్పత్తి గణనీయంగా పెంచవచ్చనీ!
 • ...తెలుగు నాటకరంగంలోని ప్రముఖ వ్యక్తి పందిళ్ళ శేఖర్‌బాబు అనీ!

51 వ వారం[మార్చు]

హైయన్ తుఫాను
 • ...ఫిలిప్పీన్స్ చరిత్రలోనే అత్యధికంగా 10,000 లకు పైగా మరణాలకు కారణమైన అతి భయంకర తుఫాను హైయన్ తుఫాన్ అనీ!
 • ...ఝాన్సీ లక్ష్మీబాయి పరాక్రమాన్ని తలపించే అరుదైన చరిత్రకు ప్రతీక దళిత సిపాయి వీరనారి ఝల్కారీబాయి అనీ!
 • ...బతుకమ్మ పండగతో సారూప్యత కలిగిన పండగ బీహారు రాష్ట్రంలో జరుపుకొనే ఛట్‌ పూజ అనీ!
 • ... తమిళనాడు లో ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం తిరుక్కణ్ణపురం అనీ!
 • ...మహాభారతంలో సావిత్రి-సత్యవంతుల ప్రణయగాథ కథాంశంగా అరవిందయోగి రచించిన పుస్తకం సావిత్రి అనీ!

52 వ వారం[మార్చు]

పారాచూట్
 • .... ఎత్తు గల ప్రదేశాల పై నుండి వాతావరణం గుండా నెమ్మదిగా క్రిందికి దించుటకు వాడే పరికరం పారాచూట్ అనీ!
 • ....అమెరికా అధ్యక్షునిగా పోటీ చేసిన వ్యక్తి అమెరికా సంయుక్త రాష్ట్రాలలో కనీసం 14 సంవత్సరాలు నివాసితుడై యుండాలి అనీ! ( అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షులు వ్యాసం)
 • ....బయటి ప్రదేశాలతో పాటు ఇళ్ళలో కూడా ఈల శబ్దం చేస్తుండే కీటకం ఇలకోడి అనీ!
 • ... కుష్టు వ్యాధి, క్షయ వ్యాధుల నివారణకు వాడే ఔషధగుణాలు గల నూనె అడవిబాదం నూనె అనీ!
 • ....భూమినుండి సుమారు 30 బిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో గల నూతనంగా కనుగొన్న నక్షత్రమండలం z8_GND_5296 అనీ!

53 వ వారం[మార్చు]

ఫీల్డ్స్ పతకం
 • ....యువ గణిత శాస్త్రవేత్తలకు లభించే అత్యంత ప్రతిష్టాత్మకమైన బహుమతి ఫీల్డ్స్ పతకం అనీ!
 • ...అపార ఔషధనిధులతో విరాజిల్లుతూ అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే తిరుమల గిరులలో ఒక్కో శైలానిదీ ఒక్కో చరిత్ర అనీ! ( సప్తగిరులు వ్యాసం )
 • ...కాయలను కృత్రిమంగా త్వరగా పండ్లుగా మార్చుటకు ఎసిటిలీన్ వాయువు వాడతారనీ!
 • ... భూమి నుండి సుదూరంగా ఉన్న మానవ నిర్మిత వస్తువు వోయెజర్ 1 అనీ!
 • ....వాతావరణ పీడనంలోని హెచ్చు, తగ్గులను గుర్తించుటకు వాడే పరికరం భారమితి అనీ!