వికీపీడియా:మీకు తెలుసా? భండారము
Jump to navigation
Jump to search
1 • 2 • 3 • 4 • 5 • 6 • 7 • 8 • 9 • 10 • 11 • 12 • 13 • 14 • 15 • 16 • 17 |
ఈ జాబితా, మొదటి పేజీ లోని "మీకు తెలుసా?" విభాగంలో ఇప్పటిదాకా ప్రదర్శించిన వాక్యాల భాండాగారం.
- ఏదైనా వికిపీడియా వ్యాసం చదువుతున్నపుడు మీకు ఆహా! అనిపించే విషయం ఏదైనా కనిపిస్తే ఇక్కడ దానిని చేర్చండి. బహుశా మీలాగే చాలా మందికి ఆ విషయము తెలిసి ఉండకపోవచ్చు.
- ఈ భాండాగారం నుండి ఒక సమయములో కేవలం మూడూ లేదా నాలుగింటిని మాత్రమే ఈ మూసలో చేర్చండి.
- వికీపీడియాలో వ్యాసాలు పూర్తవటం అనేది ఉండదు. ఎప్పుడూ ఎవరో ఒకరు వ్యాసాన్ని మెరుగుపరుస్తూనే ఉంటారు. అందుకని మీరు కొత్తగా తెలుసుకున్న విషయాలను ఎప్పటికప్పుడు ఇక్కడ చేర్చేయండి. అలాగే ఇక్కడ చేర్చిన విషయాలను దాయనవసరం లేదు.
మీకు తెలుసా?
|
2024 సంవత్సరంలోని వాక్యాలు
40 వ వారం
- ... చిన్న వయసులో భారత ప్రభుత్వ రంగ బ్యాంకు పగ్గాలు చేపట్టిన ఘనత నారాయణన్ వాఘుల్ ది అనీ!
- ... కీళ్ళ వాతము వ్యాధి వలన శరీర వ్యాధినిరోధక వ్యవస్థే ఎముకలపై దాడి చేస్తుందనీ!
- ... ప్రపంచంలో కెల్లా అత్యంత తేమ ప్రదేశాలైన చిరపుంజి, మాసిన్‌రామ్ ప్రాంతాలు పట్‌కాయ్ పర్వతశ్రేణుల్లో భాగమనీ!
- ... 12 వ శతాబ్దానికి చెందిన చాళుక్య ప్రభువు మూడవ సోమేశ్వరుడు రచించిన మానసోల్లాస అనే సంస్కృత విజ్ఞానసర్వస్వ గ్రంథంలో ఇడ్లీ గురించిన ప్రస్తావన ఉందనీ!
- ... గాలేరు నగరి సుజల స్రవంతి పథకం ఆంధ్రప్రదేశ్ లోని కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల సాగునీటి అవసరాల కోసం ఉద్దేశించిందనీ!
41 వ వారం
- ... భారతదేశానికి చెందిన విశ్వానంద మారిషన్, జర్మనీ దేశాల్లో నూతన హిందూ మతాన్ని వ్యాప్తిచేస్తున్నాడనీ!
- ... ఈశాన్య ప్రాంతాల భూభాగాల సరిహద్దులను మార్చిన ఈశాన్య ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1971 ద్వారా కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయనీ!
- ... సురపురం సంస్థానం వంశీయులు తమకంటే బలమైన శత్రువైన ఔరంగజేబు చక్రవర్తిని ఎదిరించి పోరాడారనీ!
- ... అనంతపురం నగరానికి పెన్నా అహోబిలం బ్యాలన్సింగ్ రిజర్వాయర్ ద్వారా తాగునీరు అందుతోందనీ!
- ... భారతదేశంలో స్థిరపడ్డ విదేశీ వనిత డెల్లా గాడ్ఫ్రే ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిథ్యం వహించిందనీ!
42 వ వారం
- ... ఆంధ్రప్రదేశ్ కి చెందిన రాజకీయవేత్త రోడా మిస్త్రీ హైదరాబాద్ లోకి గచ్చిబౌలిలో సామాజిక సేవ, పరిశోధనా కేంద్రాన్ని నిర్వహిస్తున్నదనీ!
- ... బ్రిటిష్ కాలం నాటి బాంబే ప్రెసిడెన్సీ నుంచి ఏర్పడ్డ పెద్ద బొంబాయి రాష్ట్రం 1960లో ప్రధానంగా మహారాష్ట్ర, గుజరాత్ అనే రెండు రాష్ట్రాలుగా విడిపోయిందనీ!
- ... దేశంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం 2015లో స్వదేశ్ దర్శన్ పథకం చేపట్టిందనీ!
- ... దుల్ హస్తి జలవిద్యుత్కేంద్రం జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో చీనాబ్ నదిపై నిర్మించబడిన ప్రత్యేకమైన ప్రాజెక్టు అనీ!
- ... వైద్యశాస్త్రంలో మత్తును కల్గించడానికి కేటామైన్ అనే మందును వాడతారనీ!
43 వ వారం
- ... అంతరిక్ష శాస్త్రవేత్త కాటూరు నారాయణ 2002 లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నాడనీ!
- ... హైదరాబాదులోని ముషీరాబాద్ ప్రాంతానికి ఆ పేరు, 18వ శతాబ్దపు చివరి దశకాల్లో హైదరాబాదు రాజ్య ప్రధానమంత్రి (దీవాను)గా పనిచేసిన ముషీరుల్ ముల్క్ అరస్తు ఝా పేరుమీదుగా వచ్చిందనీ!
- ... హిమాచల్ ప్రదేశ్ లో రావి నదిపై నిర్మించిన చమేరా ఆనకట్ట నీటి క్రీడలకు అనువైన ప్రదేశమనీ!
- ... బెంగళూరులో ఉన్న కర్ణాటక చిత్రకళా పరిషత్ లో అనేక చిత్రకళలకు సంబంధించిన ప్రదర్శనలు ఉంటాయనీ!
- ... 1990 వ దశకంలో ఉగ్రవాదుల దాడుల వలన కాశ్మీరీ హిందువుల వలస ప్రారంభమైందనీ!
44 వ వారం
- ... పూర్ణమాసీ జాని ఒరియా, కుయి, సంస్కృత భాషల్లో 50 వేలకుపైగా భక్తిగీతాలు స్వరపరిచిందనీ!
- ... సైకోసిస్ అంటే ఏది నిజమో ఏది కాదో తెలియని ఒక మానసిక స్థితి కలిగియుండటమనీ!
- ... తేలికపాటి రవాణా విభాగంలో భారతదేశంలో తయారైన మొట్టమొదటి విమానం సారస్ అనీ!
- ... పాకిస్తాన్ కు చెందిన కలాష్ ప్రజలు ఇండో ఆర్యన్ కుటుంబానికి చెందిన అరుదైన జాతి ప్రజలు అనీ!
- ... సముద్రాలపై అధ్యయనం చేసే భారత జాతీయ సముద్రశాస్త్ర సంస్థ ప్రధాన కార్యాలయం గోవాలో ఉందనీ!
45 వ వారం
- ... అదనపు ఆక్సిజన్ అవసరం లేకుండా ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించిన మొదటి భారతీయుడు ఫు దోర్జీ అనీ!
- ... తెలంగాణాలోని యాదగిరి గుట్టకు 20 కి.మీ దూరంలో ఉన్న రాజాపేట సంస్థానం సుమారు 250 సంవత్సరాల చరిత్ర కలిగినదనీ!
- ... ద్రాస్ ప్రాంతంలో ఉన్న ముష్కో లోయ పూలకు ప్రసిద్ధి గాంచిన పర్యాటక ప్రదేశమనీ!
- ... రాయలసీమగుండా ప్రవహించే హంద్రీ నీవా సుజల స్రవంతి కాలువ శ్రీశైలం నుంచి వరదనీటిని మళ్ళించి ప్రజావసరాలను తీరుస్తుందనీ!
- ... సికిందరాబాదు లోని ప్యాట్నీ ప్రాంతానికి ఆ పేరు ఎం.ఆర్.పాట్నీ స్థాపించిన ప్యాట్నీ కార్ల షోరూము వలన వచ్చిందనీ!
46 వ వారం
- ... రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో భారతదేశం నుంచి రాయల్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో పైలట్ గా పనిచేసిన సురంజన్ దాస్ పేరు మీదుగా బెంగళూరులో ఒక రహదారి ఉందనీ!
- ... ఆంధ్రప్రదేశ్ లోని రత్నగిరి కోటను భారతప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా గుర్తించిందనీ!
- ... కాశ్మీరీ ఉగ్రవాదులలో కొందరు, అదే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వంతో కలిసి పోరాడారని, వారు ఇఖ్వాన్ అనే సంస్థను స్థాపించారనీ!
- ... ప్రపంచ వ్యాప్తంగా సమాచార నెట్వర్క్ సృష్టించాలనే ఉద్దేశంతో వరల్డ్ వైడ్ వెబ్ రూపొందించారనీ!
- ... రుబెల్లా టీకా ద్వారా 2020 నాటికి సుమారు 81 దేశాల్లో తట్టు వ్యాధిని నిర్మూలించగలిగారనీ!
47 వ వారం
- ... టెన్నిస్ ఆటలో కెరీర్ గ్రాండ్ స్లాం, కెరీర్ సూపర్ స్లాం సాధించిన మొదటి ఆటగాడు ఆండ్రీ అగస్సీ అనీ!
- ... ఎపిగ్రాఫియా ఇండికా భారతీయ పురాతత్వ శాఖవారు ప్రచురించిన అధికారిక పత్రమనీ!
- ... చైనా అణు కార్యక్రమంపై నిఘా పెట్టేందుకు అమెరికా, భారతదేశం లోని నందాదేవి పర్వతంపై ఒక పరికరాన్ని స్థాపించబోయిన ప్రయత్నం విఫలమైందనీ!
- ... సికింద్రబాదులో కీస్ హైస్కూల్‌కు హైదరాబాదు రాజ్యంలో బ్రిటీషు రెసిడెంటుగా పనిచేసిన టెరెన్స్ కీస్ పేరుమీదుగా వచ్చిందని!
- ... 1959 లో విడుదలైన కన్నడ చిత్రం మహిషాసుర మర్దిని, 7 భాషల్లోకి అనువాదం చేయబడి మొదటి పాన్ ఇండియా సినిమాగా పేరు గాంచిందనీ!
48 వ వారం
- ... ఆంధ్రప్రదేశ్ కు చెందిన కృష్ణ చివుకుల తాను చదివిన ఐఐటీ మద్రాసుకు 228 కోట్ల విరాళం అందించాడనీ!
- ... వ్యూహాత్మక ఆలోచన, సంసిద్ధత, నిర్ణయాత్మక చర్యలు లేకపోవడం అనే లక్షణాలను కలిపి పానిపట్ సిండ్రోమ్ అంటారనీ!
- ... భారత రూపాయి నాణేలు మొదటిసారిగా 1950లో ముద్రించబడ్డాయనీ!
- ... తెల్ల మరుగుజ్జు అంటే కృశించిపోయిన నక్షత్ర గర్భపు అవశేషం అనీ!
- ... రోమ్ నగరం విలసిల్లకముందు అలెగ్జాండ్రియా ప్రపంచంలో అతిపెద్ద నగరంగా ఉండేదనీ!
49 వ వారం
- ... చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో పనిచేశాడనీ!
- ... భారతీయ పిల్లలకు సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేయడం కోసం అమర్ చిత్ర కథ స్థాపించబడిందనీ!
50 వ వారం
- ... గుల్షన్ లాల్ టాండన్ భారతీయ మైనింగ్ పరిశ్రమ స్థాపన, అభివృద్ధికి విశేష కృషి చేశాడనీ!
51 వ వారం
- ... హైదరాబాదులోని సారథి స్టూడియోస్ స్థాపించింది చల్లపల్లి జమీందారుగా పేరు గాంచిన యార్లగడ్డ శివరామప్రసాద్ అనీ!
52 వ వారం
- ...అద్దూరు బలరామిరెడ్డి శ్రీకాళహస్తి శాసనసభ నియోజకవర్గానికి మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడనీ!
53 వ వారం
- ... ఐక్యరాజ్యసమితికి భారత శాశ్వత ప్రతినిథిగా హరీష్ పర్వతనేని ఎంపికయ్యాడనీ!