ఈశాన్య ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1971
Jump to navigation
Jump to search
ఈశాన్య ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1971 | |
---|---|
మణిపూర్, త్రిపుర రాష్ట్రాల స్థాపనకు, ప్రస్తుత అస్సాం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ద్వారా మేఘాలయ రాష్ట్రం, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటుకు, దానితో అనుసంధానించబడిన విషయాల కోసం చేసిన చట్టం. | |
Citation | [1] |
Enacted by | Parliament of India |
Date enacted | 1971 డిసెంబరు 30 |
స్థితి: అమలైంది |
ఈశాన్య ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1971, భారతదేశపు ఈశాన్య ప్రాంతం లోని భూభాగాల సరిహద్దులను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చడంలో ప్రధానమైన సంస్కరణ. దీనితో కొన్ని కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.
మార్పుల ప్రభావం
[మార్చు]మూలం: [2]
- మణిపూర్, త్రిపుర రాష్ట్రాల స్థాపన. అవి అంతకు ముందు కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉండేవి.
- మేఘాలయ రాష్ట్ర స్థాపన. ఇది అంతకు ముందు అస్సాంలో స్వయంప్రతిపత్తి కలిగిన భాగంగా ఉండేది.
- మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ కేంద్రపాలిత ప్రాంతాల ఏర్పాటు.
- పై మార్పుల కారణంగా అస్సాం రాష్ట్ర విస్తీర్ణం తగ్గింది.
- కొత్తగా ఏర్పడిన భూభాగాలకు లోక్సభ, రాజ్యసభ స్థానాల కేటాయింపు.
- కొత్తగా ఏర్పడిన భూభాగాల శాసన సభలకు సీట్ల కేటాయింపు.
- 1971 చట్టం ప్రకారం, అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, మణిపూర్, త్రిపురలకు ఉమ్మడిగా హైకోర్టు ఏర్పడగా, 2012 లో చేసిన సవరణ ప్రకారం 2013 మార్చిలో మేఘాలయ, మణిపూర్, త్రిపురలకు వేర్వేరు హైకోర్టులు ఏర్పాటయ్యాయి.
- మిగతా సవరించిన భూభాగాల కోసం కొత్తగా ఉమ్మడి హైకోర్టు ఏర్పాటైంది.
తదనంతర ప్రాదేశిక మార్పులు
[మార్చు]- 1986లో మిజోరం శాంతి ఒప్పందాన్ని అనుసరించి, 1987లో మిజోరంకు పూర్తి-రాష్ట్ర హోదా లభించింది.[3]
- అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్ర చట్టం, 1986 ద్వారా అరుణాచల్ ప్రదేశ్కు పూర్తి రాష్ట్ర హోదా లభించింది.[4]
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఈశాన్య మండలి
- రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, 1956
- ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014
- భారతదేశ పరిపాలనా విభాగాలు
- భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు
- భారత రాజ్యాంగం
- జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2019
మూలాలు
[మార్చు]- ↑ "North-Eastern Areas (Reorganisation) Act, 1971". www.liiofindia.org. 30 December 1971. Retrieved 24 December 2020.
- ↑ "The North-Eastern Areas (Reorganisation) Act, 1971" (PDF). www.indiacode.nic.in. 30 December 1971. Archived (PDF) from the original on 13 July 2021. Retrieved 24 December 2020.
- ↑ Hazarika, S. (30 September 2016). "'There is Peace in Mizoram Because of Its Brutal Past'". The Wire. Archived from the original on 29 July 2021. Retrieved 24 December 2020.
- ↑ "State of Arunachal Pradesh Act, 1986". liiofindia.org. 24 December 1986. Archived from the original on 29 July 2021. Retrieved 24 December 2020.