ఈశాన్య మండలి
ఈశాన్య మండలి (నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ NEC) నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ యాక్ట్ 1971 కు అనుగుణంగా ఏర్పాటైన చట్టబద్ధమైన సలహా సంస్థ. ఇది 1972 నవంబరు 7 న షిల్లాంగ్‌లో ఏర్పాటైంది.[1] ఈశాన్య భారతదేశంలోని ఎనిమిది రాష్ట్రాలు - అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ , మిజోరాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కింలు - ఈ కౌన్సిల్‌లో సభ్యులు. వాటి ముఖ్యమంత్రులు, గవర్నర్లు ప్రాతినిధ్యం వహిస్తారు. సిక్కిం 2002 లో కౌన్సిల్‌లో చేరింది.[2] కౌన్సిల్, భారత ప్రభుత్వ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖ (DONER) క్రింద పనిచేస్తుంది.[3]
పాత్ర
[మార్చు]కౌన్సిల్‌ను మొదట్లో సలహా సంఘంగా ఏర్పాటు చేసినప్పటికీ, 2002 నుంచి ప్రాంతీయ ప్రణాళికా సంఘంగా మంజూరు చేయబడింది. వారు ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలకు ఉమ్మడి ఆసక్తి ఉన్న ఏ అంశాన్నైనా చర్చించి, దానిపై ఏ చర్య తీసుకోవాలో నిర్ణయిస్తారు. ఈ రాష్ట్రాల ఆర్థిక, సామాజిక ప్రణాళికలను చూసుకోవడానికి, అంతర్ రాష్ట్ర వివాదాల సందర్భంలో మధ్యవర్తిత్వం వహించడానికి ఈ ఏర్పాటు చేసారు.[4]
నిధులు
[మార్చు]కౌన్సిల్ నిధులు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం వద్ద ఉంటాయి. చారిత్రికంగా 56% రాష్ట్ర ప్రభుత్వాలు సమకూర్చగా, మిగిలినది కేంద్ర ప్రభుత్వ విభాగాల ద్వారా అందిస్తారు.[5] 2017 లో జారీ అయిన 3 సంవత్సరాల ప్రణాళికలో, రూ 2500 కోట్ల వార్షిక బడ్జెట్ ప్రతిపదించారు. ఇందులో ప్రభుత్వం నుండి 40% రాగా, మిగిలిన 60% నాన్-లాస్పేబుల్ సెంట్రల్ పూల్ ఆఫ్ రిసోర్సెస్ (NLCPR) నుండి అందుతుంది.[4]
ప్రభావం
[మార్చు]2017 లో ఆర్థిక వనరులలో రవాణా, కమ్యూనికేషన్ కోసం 47%, వ్యవసాయానికి 14%, మానవ వనరుల అభివృద్ధి, విద్యకు 11%, శక్తికి 9%, ఆరోగ్య రంగానికి 4%, పర్యాటకానికి 3%, పరిశ్రమలకు 3% ఖర్చు చేసారు.[5] కౌన్సిల్ ఈశాన్య రాష్ట్రాలలో విద్యుత్, విద్య, రహదారులు, వంతెనల అభివృద్ధిలో గణనీయమైన విజయాలను సాధించింది. ప్రధాన రహదారి, వంతెన నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టింది. అనేక ఇంజనీరింగ్, వైద్య కళాశాలలకు నిధులు సమకూర్చింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలపై ఈ ప్రాంతం ఆధారపడటాన్ని తగ్గించేందుకు దాదాపు 250 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రాజెక్టులకు కౌన్సిల్ నిధులు సమకూర్చింది.
ఇవి కూడా చూడండి
[మార్చు]- ఆగ్నేయ ఆసియా దేశాల సమాఖ్య (ASEAN)
- లుక్-ఈస్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టులు
మూలాలు
[మార్చు]- ↑ "Establishment of North Eastern Council". Archived from the original on 22 March 2023. Retrieved 2 December 2023.
- ↑ "Sikkim becomes eighth state under NEC". The Times of India. 10 December 2002. Archived from the original on 21 January 2018. Retrieved 24 November 2017.
- ↑ Organisations Archived 2010-07-23 at the Wayback Machine DoNER.
- ↑ 4.0 4.1 "NEC Final plan 2017" (PDF). Archived from the original (PDF) on 24 October 2018. Retrieved 20 December 2017.
- ↑ 5.0 5.1 "NEC Final plan 2017" (PDF). Archived from the original (PDF) on 24 October 2018. Retrieved 20 December 2017.