వికీపీడియా:మీకు తెలుసా? భండారము/పాత విశేషాలు 1
Jump to navigation
Jump to search
- ఫిబ్రవరి 9, 2008 నుంచి ఫిబ్రవరి 16 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
- ...భారతీయ భాషలలో అత్యధిక వ్యాసాలు కల్గిన వికీపీడియా తెలుగు వికీపీడియా అని! (తెలుగు వికీపీడియా వ్యాసం)
- ...సుధీర్ఘ టెస్టు మ్యాచ్‌ల అనంతరం సెంచరీ సాధించిన క్రికెటర్ అనిల్ కుంబ్లే అని! (అనిల్ కుంబ్లే వ్యాసం)
- ...ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభించిన తొలి గ్రామపంచాయతి షాద్‌నగర్ అనీ ! (షాద్‌నగర్ వ్యాసం)
- ...ఆంధ్ర రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అసలు ఇంటిపేరు పుల్లంరాజు అని! (బూర్గుల వ్యాసం)
- ...భారత్ లో గ్రామీణ బ్యాంకును స్పాన్సర్ చేసిన తొలి బ్యాంకు సిండికేట్ బ్యాంకు అని! (సిండికేట్ బ్యాంకు వ్యాసం)
- ...ఒకే ఒలింపిక్ క్రీడలో అత్యధిక స్వర్ణాలు సాధించిన క్రీడాకారుడు మార్క్ స్పిట్జ్ అని! (ఒలింపిక్ క్రీడలు వ్యాసం)
- ...బాబీ జిందాల్ అమెరికా చరిత్రలోనే భారతీయ సంతతికి చెందిన తొలి గవర్నర్ అని! (బాబీ జిందాల్ వ్యాసం)
- ఫిబ్రవరి 9, 2008 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు
- ...టెన్నిసన్ ఆంగ్లంలో ఎక్కువగా కోట్ చేయబడిన రచయితలలో రెండవ వాడని
- ...పూర్వ నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు తానా వ్యవస్థాపకుడు మరియు మెదటి అధ్యక్షుడు అని మీకు తెలుసా
- .... ప్రాంతీయ భాషల్లో నాలుగు వేదాలు కలిగి ఉన్నది ఒక్క తెలుగు మాత్రమే.
- .... ప్రపంచంలోనే అతి పెద్దదైన శివుని విగ్రహం కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా మురుడేశ్వరలో ఉన్నది అని
- .....డచ్ వారి అవశేషాలు ఇప్పటికి ఉన్న భీమునిపట్నం భారతదేశంలోని రెండవ మునిసిపాలిటి అని
- .....దక్షిణ చిరపుంజి గా పేరు గాంచిన ఆగుంబె భారతదేశం లొనే అత్యధిక వర్షపాతం నమోదుచేసుకొంటున్న ప్రదేశాలలొ రెండవ స్థానం
- ... కళ్ళు అనే తెలుగు సినిమా ఆస్కార్ నామినేషనుకు ఎంపికచేబడింది అని.
- ...భారతీయ సినిమారంగములో మొట్టమొదటి ద్విపాత్రాభినయము చేసిన తొలి నటి, కలకత్తా కు చెందిన ఆంగ్లో-ఇండియన్ కుటుంబములో జన్మించిన పేషన్స్ కూపర్ అని.
- నరస భూపాలీయం గా ప్రఖ్యాతి చెందిన కావ్యాలంకార సంగ్రహ కర్త రామరాజ భూషణుడు అని.
- శబ్దాలంకారాలకు ప్రసిద్ధుడైన తెలుగు పూర్వకవి పోతన అని.
- ...కృష్ణుని ప్రియ మిత్రుడు, సహాధ్యాయి సుదాముని స్వస్థలము, జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన నేటి పోర్బందర్ అని.
- ...పాకిస్తాన్ లో మాట్లాడే ఏకైక ద్రవిడ భాష బ్రహుయి అని. ఇది ఏదో ఒకరిద్దరు మాట్లాడే భాష కాదు 22 లక్షల మంది మాట్లాడే భాష.
- ... జగ్గయ్య, లోక్‌సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీనటుడు అని.
- ... 1934 లో విడుదలైన తొలి కన్నడ టాకీ చలనచిత్రము సతీ సులోచనను తీసినది తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు మరియు తెలుగు సినీనటి లక్ష్మి తండ్రి అయిన యెర్రగుడిపాటి వరదరావు(వై.వి.రావు) అని.
- ... ఆంధ్ర మహిళలు ఐదవతనముగా భావించే నల్లపూసల గురించిన ప్రస్థావన సాహిత్యములో తొలిసారిగా చేసినది శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజములలో ఒకడైన మాదయ్యగారి మల్లన అని.
- ... 1885లో ప్రారంభించబడిన సురభి నాటక సమాజం వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు అని. కడప జిల్లా సురభి గ్రామంలో మొదట కీచక వధ తో సురభి నాటకప్రస్థానం మొదలయ్యింది అని.
- తెలుగునేలను ఏలిన తొలి మహిళ రుద్రమ దేవి అని
- ...పంచమ వేదం అని మహా భారతంను అంటారు అని
- ...దండి యాత్ర సబర్మతి ఆశ్రయం నుంచి ప్రారంభమైంది అని
- ...దక్షిణ భారతాన్ని అత్యధికకాలం పాలించిన రాజవంశం పాండ్యులు అని
- ...పంజాబ్‌ను పాలించిన రంజిత్ సింగ్ రాజధాని లాహోర్ అని
- షోడస మహాజనపద రాజ్యాలలో ఏకైక దక్షిణ రాజ్యం అస్మక అని
- ...హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన అలంఅరా, కాళిదాస్ మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఎల్.వి.ప్రసాద్ నటించాడు అని.
- ...హైదరాబాదు నందలి ట్యాంకుబండ్ నందు మొత్తం 32 మంది ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి అని!..
- ...19వ శతాబ్దం లో ఆంధ్ర ప్రాంతం లోని ప్రతి గ్రామమునకు 12 మంది గ్రామ సేవకులు ఉండేవారనీ, వారిని బారబలావతి అనేవారు అని.
- ...తెలుగు అనే శబ్దం త్రిలింగ నుండి వచ్చిందని చదువుకుంటూ వచ్చాం. కాదు, తెలివాహ అని పిలవబడిన గోదావరి నుండి వచ్చింది అని అంటోంది ఈ పరిశోధనాత్మక వ్యాసం.
- రాయలసీమ కు ఆ పేరు పెట్టింది గాడిచర్ల హరిసర్వోత్తమ రావు. అంతకు ముందు దానిని దత్తమండలం (Ceded) అని పిలిచేవారు. 1928 లో కర్నూలు జిల్లా నంద్యాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభలో ఆయన ఈ పేరు పెట్టాడు.
- 1951 లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన ప్రపంచ కథల పోటీకి భారత్ నుండి మూడు కథలు ఎంపికయ్యాయి. మొత్తం 23 దేశాల నుండి 59 కథలు పోటీకి వచ్చాయి. వాటిలో రెండవ బహుమతిని భారత కథే గెలుచుకుంది. ఆ కథ పేరు గాలివాన , రచయిత పాలగుమ్మి పద్మరాజు - తెలుగు వాడి కథ.
- ...మన జాతీయ పతకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య మన తెలుగు వారేనని.
- ...బంగాళాఖాతము ను తూర్పు సముద్రం అని పిలిచేవారని.
- ...మొదటి ప్రయాణంలోనే మునిగిపోయిన టైటానిక్ లో ప్రయాణించిన ఏకైక భారతీయ కుటుంబం గుంటూరు నుండి అని. అయితే వీరు బ్రిటిషు వారు.
- ...ఆలంపూర్ లోని నవబ్రహ్మ దేవాలయములు శివుని గుళ్లని.
- ...కోస్తా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల నాయకుల మధ్య జరిగిన పెద్దమనుషుల ఒప్పందం, 1956 లో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకమై ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు మార్గం సుగమము చేసిందని.
- ...తెలుగు, భారత దేశములో అత్యంత ఎక్కువమంది మాట్లాడే భారతీయ భాషలలో హిందీ తర్వాత రెండవదని.
- తొలి తెలుగు మూకీ చిత్రం 1920లలో తీసిన భీష్మ ప్రతిజ్ఞ అని.
- తెలుగునాట తీయబడ్డ తొలి తెలుగుచిత్రం భక్త మార్కండేయ (1926) అని.
- తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద (1931) అని.
- తెలుగులో ఒకరి జీవిత కథ ఆధారంగా తీసిన తొలి (బయోగ్రాఫికల్) సినిమా భక్త రామదాసు (1933) అని.
- తొలి తెలుగు సాంఘిక చిత్రం ప్రేమ విజయం (1936) అని.
- తొలి తెలుగు అభ్యుదయ చిత్రం మాలపిల్ల (1938) అని.
- తొలి తెలుగు డాక్యుమెంటరీ మహాత్మా గాంధీ అని.
- ఒక అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొన్న తొలి తెలుగు సినిమా స్వర్గసీమ (1945) అని.
- రాష్ట్రప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందిన మొదటి చిత్రం 'పదండి ముందుకు' (1962) అని.
- తొలి తెలుగు రంగుల సినిమా లవకుశ (1963) అని.
- ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలంసంజీవరెడ్డి. ఈయన భారతరాష్ట్ర్రపతిగా కూడాపనిచేసారు.
- రాష్ట్రప్రభుత్వ నంది బహుమతి పొందిన తొలి సినిమా డాక్టర్ చక్రవర్తి (1964 లో) అని.
- తొలి తెలుగు జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి 116 (1966) అని.
- తొలి తెలుగు కౌబాయ్ సినిమా మోసగాళ్ళకు మోసగాడు (1971) అని.
- తొలి తెలుగు స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు (1974) అని.
- జాతీయ బహుమతి పొందిన తొలి తెలుగు పాట 'తెలుగువీర లేవరా' (1974) అని.
- తొలి తెలుగు 70 ఎం.ఎం. సినిమా సింహాసనం (1986) అని.
- 1952 లో తొలి మిస్ మద్రాసు టంగుటూరి సూర్యకుమారి.
- రాష్ట్రగీతమైన "మా తెలుగుతల్లికి...." గీతాన్ని రచించిన శంకరంబాడి సుందరాచారి తిరుపతిలో జన్మించారని.
- దేశంలో నిర్మించబడిన మొట్టమొదటి త్రీ డి చలనచిత్రం ఛోటా చేతన్ అని.
- మనదేశంలో ఒక అథ్లెట్ జీవితంపై నిర్మించిన తొలి చిత్రం అశ్విని అని,
- అమెరికా మొట్టమొదటి ఉపాద్యక్షుడు జాన్ ఆడమ్స్ అని,
- జాతీయ గీతం జనగణ మన ను తొలిసారిగా ప్రచురించిన పత్రిక తత్వబోధిని అని,
- అర్థశాస్త్రం లో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తి అమర్త్యా సేన్ అని,
- భారత దేశపు తొలి క్రికెట్ కెప్టెన్ కనకయ్య నాయుడు అని,
- ఆంధ్రప్రదేశ్ లో ఎత్తయిన పర్వత శిఖరం మహేంద్ర గిరి అని,
- అత్యధిక ఉపనదులు ఉన్న నది అమేజాన్ అని,
- అతి పెద్ద రుతుపవన ప్రభావం కల్గిన దేశం భారతదేశం అని,
- సప్త ద్వీపాల నగరం అనే పేరు కల్గిన నగరం ముంబాయి అని,
- మనదేశంలో అతిపెద్ద ఉపనది యమున అని,
- ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద ఓడరేవు విశాఖపట్నం అని,
- అమెరికా లో అత్యధిక జనాభా కల రాష్ట్రం [కాలిపోర్నియా]] అని,
- సౌర కుటుంబం లో అందమైన గ్రహం శనిగ్రహం అని,