హిల్లరీ క్లింటన్
![]() |
1947, అక్టోబర్ 26న చికాగోలో జన్మించిన హిల్లరీ రోధమ్ క్లింటన్ (Hillary Rodham Clinton) రెండు సార్లు అమెరికా అధ్యక్ష పదవికి చేపట్టిన బిల్ క్లింటన్ సతీమణి. ప్రస్తుతం హిల్లరీ అమెరికన్ సెనేట్‌లో న్యూయార్క్ నుంచి సెనేటర్‌గా వ్యవహరిస్తున్నది. చిన్న వ్యాపారి కూతురైన హిల్లరీ క్లింటన్ అసలు పేరు హిల్లరీ రోధమ్ 1973లో యేల్ విశ్వవిద్యాలయం నుంచి న్యాయశాస్త్ర పట్టా పుచ్చుకొని న్యాయవాద వృత్తి చేపట్టినది. 1975లో బిల్ క్లింటన్‌తో వివాహమైంది. 2000లో అమెరికన్ సెనేట్‌కు ఎన్నికై, ప్రభుత్వ పదవికి ఎన్నికైన తొలి ప్రథమ మహిళగా రికార్డు సృష్టించింది. అంతేకాదు న్యూయార్క్ నుంచి సెనేటర్‌గా ఎన్నికైన తొలి మహిళ కూడా హిల్లరీనే. ఆ తరువాత 2004లో మళ్ళీ ద్వితీయ పర్యాయం అదే స్థానం నుంచి సెనేటర్‌గా ఎన్నికై ప్రస్తుతం ఆ పదవిలో కొనసాగుతోంది. 2008లో జరిగే అమెరికన్ అధ్యక్ష ఎన్నికలలో డెమోక్రటిక్ పార్టీ తరఫున బరిలో నిలబడి బరాక్ ఒబామాతో తీవ్ర పోటీ పడి ఒబామా అభ్యర్థిత్వానికి అవసరమైన ఓట్లు పొందటంతో చివరికి పోటీ నుంచి వైదొలిగి ఒబామాకు మద్దతు ప్రకటించింది. హిల్లరీ, బిల్ క్లింటన్‌ల కూతురు చెల్సీ క్లింటన్.