వికీపీడియా:మీకు తెలుసా? భండారము/2008
Jump to navigation
Jump to search
2006 నుండి 2008 వరకు మీకు తెలుసా విభాగంలో ప్రచురించబడిన వాక్యాలు
[మార్చు]2008 సంవత్సరం లోని వాక్యాలు
[మార్చు]21 వ వారం
[మార్చు]- భారత జాతీయపతాకంలో ఉండే అశోకచక్రంలో 24 ఆకులు (చక్ర మధ్య భాగం నుంచి వలయానికి తాకే గీతలు) ఉంటాయి అనీ! (అశోకచక్రం వ్యాసం) (బొమ్మ ఉన్నది)
- బెరిబెరి వ్యాధి విటమిన్ బి1 (థయామిన్) లోపం వల్ల వస్తుంది అనీ! (నీటిలో కరిగే విటమినులు వ్యాసం)
- మొదటి లేజరు కాంతి పరికరాన్ని ప్రదర్శించినది థియోడర్ మేమన్ అనీ! (లేజర్ వ్యాసం)
- మధ్యయుగ భారతదేశ్ చరిత్రలో ప్రసిద్ధి చెందిన తైమూర్లంగ్ అసలు పేరు అమీర్ తెమూర్ అనీ! (తైమూర్ లంగ్ వ్యాసం)
- ఒకే టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో సెంచరీ మరియు బౌలింగ్‌లో 10 వికెట్లు సాధించిన తొలి ఆల్‌రౌండర్ ఇయాన్ బోథం అనీ! (ఇయాన్ బోథం వ్యాసం)
- 1974లో మరియు 1998లో భారతదేశం అణుపరీక్షలు జరిపిన ప్రాంతం రాజస్థాన్ లోని జైసల్మేర్ జిల్లాలో ఎడారి ప్రాంతమైన పోఖరాన్ అనీ! (పోఖ్రాన్ వ్యాసం)
- కర్బన రసాయనశాస్త్రం (ఆర్గానిక్ కెమిస్ట్రీ) పేరును తొలిసారిగా వాడినది స్వీడన్ దేశపు శాస్త్రవేత్త జాన్ జాకబ్ బెర్జీలియస్ అనీ! (ఆంగిక రసాయనం వ్యాసం)
- విద్యుత్ బల్బు, ఫోనోగ్రాఫ్, టెలిగ్రాఫిక్ లాంటి ఉపకరణాలను తయారుచేసిన శాస్త్రవేత్త అమెరికాకు చెందిన థామస్ ఆల్వా ఎడిసన్ అనీ! (థామస్ అల్వా ఎడిసన్ వ్యాసం)
20 వ వారం
[మార్చు]- ...కుటుంబ నియంత్రణ పథకాలలో ఒకటైన ట్యూబెక్టమీ అనగా ఫెలోపియన్ నాళాలలో చిన్న భాగాన్ని తొలిగించడం అనీ! (ఫెలోపియన్ నాళాలు వ్యాసం) (బొమ్మ ఉన్నది)
- ... రామకృష్ణ మఠాన్ని ప్రారంభించింది స్వామి వివేకానంద అనీ! (స్వామీ వివేకానంద వ్యాసం)
- ... భూమి మీద చంద్రగ్రహణం ఏర్పడే సమయంలో చంద్రునిపై నుంచి చూసినప్పుడు సూర్యగ్రహణంగా కనిపిస్తుంది అనీ! (చంద్ర గ్రహణం వ్యాసం)
- ... విజయనగర సామ్రాజ్య స్థాపకుడు హరిహర రాయలు అనీ (మొదటి హరిహర రాయలు వ్యాసం)
- ... కర్ణాటక సంగీత త్రిమూర్తులలో ఒకడైన త్యాగరాజు కీర్తనలు శ్రీరామచంద్రునికి స్తుతిస్తూ చేసినవి అనీ! (త్యాగరాజు వ్యాసం)
- ...ఇంగ్లాండుకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు కొలిన్ కౌడ్రి తమిళనాడులోని ఉదకమండలంలో జన్మించాడు అనీ! (కొలిన్ కౌడ్రి వ్యాసం)
- ...భారత రాజ్యాంగ రచనకై ఏర్పర్చిన రాజ్యాంగసభ అద్యక్షుడిగా ఎన్నికైనది రాజేంద్రప్రసాద్ అనీ! (భారతదేశంలో ప్రాధమిక హక్కులు వ్యాసం)
- ...గంగానదిగా ఏర్పడు అలకానంద మరియు భగీరథి నదుల సంగమస్థానం దేవప్రయాగ్ అనీ! (హిమాలయాలు వ్యాసం)
19 వ వారం
[మార్చు]- ... ఆంధ్ర ప్రదేశ్ అధికారిక చిహ్నం పూర్ణకుంభం అనీ! (పూర్ణకుంభం వ్యాసం) (బొమ్మ ఉన్నది)
- ...బోయింగ్ విమానాల కర్మాగారం అమెరికాలో వాషింగ్టన్ రాష్ట్రంలోని ఎవరెట్ట్ నగర్ సమీపాన ఉన్నది అనీ! (బోయింగ్ 747 వ్యాసం)
- ... ప్రఖ్యాత "సారంగధర" నాటకంలో వచ్చే రాజరాజనరేంద్రుడూ, రాజ మహేంద్ర వరాన్ని ఏలిన చాళుక్యరాజు రాజరాజ నరేంద్రుడూ ఒకరు కారనీ! (ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర కాలరేఖ వ్యాసం)
- ... శ్రీకృష్ణుడు జన్మించిన ప్రదేశం మథుర అనీ! (మథుర వ్యాసం)
- ... భూదానోద్యమం ప్రారంభించినది వినోబా భావే అనీ! (నిర్మలా దేశ్‌పాండే వ్యాసం)
- ... పండరీపురంలో కొలువైన దేవుడు పాండురంగ విఠలుడు అనీ! (పండరీపురము వ్యాసం)
- ... రాకెట్ న్యూటన్ మూడవ గమన సూత్రంపై ఆధారపడి పనిచేస్తుంది అనీ! (రాకెట్ వ్యాసం)
- ... ఆంధ్ర అభిమన్యుడిగా పేరుగాంచిన బాలచంద్రుడు పల్నాటి బ్రహ్మనాయుడు కుమారుడు అనీ! (బాలచంద్రుడు వ్యాసం)
- ... అనంతపురంకు ఆపేరు బుక్కరాయల భార్య అనంతాదేవి పేరు మీదుగా వచ్చినది అనీ! (అనంతపురం చరిత్ర వ్యాసం)
17 వ వారం
[మార్చు]- ఏప్రిల్ 21, 2008 నుంచి మే 4 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
- ... నెల్సన్ మండేలా దక్షిణాఫ్రికాకు నల్లజాతికి చెందిన మొట్టమొదటి అధ్యక్షుడని! (నెల్సన్ మండేలా వ్యాసం)(బొమ్మ ఉన్నది)
- ... ప్రపంచంలోని అత్యంత పెద్ద కట్టడము విమాన తయారికి వాడుతారని! (బోయింగ్ 747 వ్యాసం)
- ... శ్రీకాళహస్తి కలంకారీ కళకు పుట్టినిల్లు అని! (కలంకారీ వ్యాసం)
- ... ఒరాకిల్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద సాఫ్ట్వేర్ సంస్థ అని! (ఒరాకిల్ వ్యాసం)
- ... రామాయణంలో సీత తండ్రి, జనక మహారజు అసలు పేరు స్వీరధ్వజుడని! (జనక మహారాజు వ్యాసం)
- ... మానవ శరీరంలో అతి పెద్ద ఎముక తొడఎముక అనీ! (మానవ శరీరము-కొన్నిముఖ్యాంశాలు వ్యాసం)
- ... ప్రఖ్యాత చారిత్రక గ్రంథమైన ఇండికా రచయిత గ్రీకు రాయబారి అయిన మెగస్తనీసు అనీ! (మెగస్తనీసు వ్యాసం)
- ... యాహూ! సృష్టికర్తలు డేవిడ్ ఫిలో మరియు జెర్రీ యాంగ్ అనీ! (యాహూ! వ్యాసం)
16 వ వారం
[మార్చు]- ఏప్రిల్ 14, 2008 నుంచి ఏప్రిల్ 21 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
- ... భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనిన నావికుడు వాస్కోడగామా అనీ! (వాస్కోడగామా వ్యాసం)
- ... శాతవాహన రాజ్య స్థాపకుడు శ్రీముఖుడు అనీ! (శ్రీముఖుడు వ్యాసం)
- ... వందేమాతరం గేయ రచయిత బంకిం చంద్ర చటర్జీ అనీ! (బంకించంద్ర ఛటర్జీ వ్యాసం)
15 వ వారం
[మార్చు]- ఏప్రిల్ 6, 2008 నుంచి ఏప్రిల్ 14 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
- ... ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా బరువు 59 లక్షల టన్నులు అనీ! (ఈజిప్ట్ పిరమిడ్లు వ్యాసం) (బొమ్మ ఉన్నది)
- ... ఉదయ్‌పూర్ నగర్ నిర్మాత మహారాజ ఉదయ్‌సింగ్ అనీ! (ఉదయపూర్ వ్యాసం)
- ... అత్యధిక వింబుల్డన్ టెన్నిస్ సింగిల్స్ టైటిళ్ళను గెలుపొందిన క్రీడాకారిణి మార్టినా నవ్రతిలోవా అనీ! (మార్టినా నవ్రతిలోవా వ్యాసం)
- ... ఇస్లామీయ ప్రవక్త అయిన ముహమ్మద్ కుమార్తె ఫాతిమా అనీ! (ఫాతిమా జహ్రా వ్యాసం)
- ... ఒక కాంతి సంవత్సరం 9,460,730,472,580.800 కిలోమీటర్లతో సమానం అనీ! (కాంతి సంవత్సరం వ్యాసం)
- ... కబీరుదాసు గురువు రామానందుడు అనీ! (కబీరుదాసు వ్యాసం)
- ... 2007 ట్వంటీ-20 ప్రపంచ కప్ క్రికెట్లో పాల్గొన్న భారత క్రికెట్ జట్టుకు మేనేజర్‌గా వ్యవహరించినది లాల్‌చంద్ రాజ్‌పుత్ అనీ! (లాల్‌చంద్ రాజ్‌పుత్ వ్యాసం)
14 వ వారం
[మార్చు]- ... క్యూబా రాజకీయ విప్లవ నాయకుడు ఫిడేల్ కాస్ట్రోను హతమార్చడానికి అమెరికా 638 సార్లు విఫలయత్నం చేసినదనీ! (ఫిడెల్ కాస్ట్రో వ్యాసం) (బొమ్మ ఉన్నది)
- ... ఒకే ఓవర్లో వరుసగా 6 సిక్సర్లు సాధించిన తొలి భారతీయ క్రికెట్ క్రీడాకారుడు రవిశాస్త్రి అనీ! (తిలక్ రాజ్ వ్యాసం)
- ... భారతదేశపు తపాలా వ్యవస్థ ప్రపంచంలోనే అతి పెద్ద తపాలా వ్యవస్థ అనీ! (భారతీయ తపాలా వ్యవస్థ వ్యాసం)
- ... ఆరావళి పర్వతాలలో ఎత్తయిన పర్వత శిఖరం గురుశిఖర్ అనీ! (ఆరావళీ పర్వత శ్రేణులు వ్యాసం)
- ... ప్రపంచంలోనే అతి పెద్ద విష్ణుదేవాలయం కంబోడియాలో ఉన్నదనీ! (ఆంగ్కోర్ వాట్ వ్యాసం)
- ... దశరథుడికి పుత్రశోక శాపం ఇచ్చినది శ్రవణ కుమారుడి తండ్రి అనీ! (దశరథుడు వ్యాసం)
- ... కాకతీయ గణపతి దేవునిపై గౌరవ పూర్వకంగా గణపేశ్వరుని పేరుపై గుడిని నిర్మించినది జాయపసేనాని అనీ! (జాయప నాయుడు వ్యాసం)
13 వ వారం
[మార్చు]- ... భారతదేశంలో ప్రయోగింపబడిన మొదటి ఉపగ్రహం రోహిణి అని! (ఇస్రో వ్యాసం)(బొమ్మ ఉన్నది)
- ... బేతాళ కథలలో విక్రమార్కుడు మోస్తున్న శవంలో ఉన్నది బేతాళుడు అని! (బేతాళ కథలు వ్యాసం)
- ... భారత్‌లో దశాంక విధానం అమలులోకి వచ్చిన సంవత్సరం 1957 అని! (పైసా వ్యాసం)
- ... శ్రీకృష్ణదేవరాయలు సింహాసనం అధిష్టించినది 1509లో అని! (రాయచూరి యుద్ధము వ్యాసం)
- ... ప్రాచీన అవంతి రాజ్యానికి రాజధాని ఉజ్జయినీ అని! (ఉజ్జయిని వ్యాసం)
- ... 1971లో బొమ్మరిల్లు పత్రికను స్థాపించినది విజయ బాపినీడు అని! (బొమ్మరిల్లు (పత్రిక) వ్యాసం)
- ... బద్రీనాథ్ దేవాలయం ఆది శంకరాచార్యులచే స్థాపించబడినది అని! (బద్రీనాథ్ వ్యాసం)
12 వ వారం
[మార్చు]- ...శత బిలియన్ డాలర్ల ఆస్తిపరుడైన తొలి వ్యక్తి బిల్ గేట్స్ అనీ! (బిల్ గేట్స్ వ్యాసం) (బొమ్మ ఉన్నది)
- ...భారతదేశంలో ఏర్పాటు చేయబడిన తొలి జాతీయ వనం జిమ్‌కార్బెట్ నేషనల్ పార్క్ అనీ! (జిమ్ కార్బెట్ వ్యాసం)
- ...అర్జునుడికి విలువిద్య నేర్పిన గురువు ద్రోణాచార్యుడు అనీ! (ఏకలవ్యుడు వ్యాసం)
- ...టెస్ట్ క్రికెట్ చరిత్రలో మొట్టమొదటి సెంచరీని సాధించినది ఆస్ట్రేలియాకు చెందిన చార్లెస్ బాన్నర్‌మన్ అనీ! (చార్లెస్ బాన్నర్‌మన్ వ్యాసం)
- ...భారతదేశంలో నిర్మించిన తొలి మాటల (టాకీ) సినిమా ఆలం ఆరా అనీ! (ఆలం ఆరా వ్యాసం)
- ...భారతదేశంల్ అత్యధిక సర్క్యులేషన్ కల వార్తాపత్రిక మలయాళ మనోరమ అనీ! (మలయాళ మనోరమ వ్యాసం)
- ...భారత నావికాదళం చేపట్టిన తొలి ఆపరేషన్ చర్య 1961లో గోవాలో పోర్చుగీసు పాలనపై సాగించిన ఆపరేషన్ విజయ్ అనీ! (భారత నావికా దళం వ్యాసం)
11 వ వారం
[మార్చు]- ...పురుషుల టెన్నిస్ ర్యాంకింగ్‌లో అత్యధిక వారాలపాటు నెంబర్ 1 గా నిల్చిన క్రీడాకారుడు రోజర్ ఫెడరర్ (బొమ్మ) అనీ! (రోజర్ ఫెడరర్ వ్యాసం)
- ...న్యూయార్క్ స్టాక్ ఎక్ఛేంజీలో లిస్టింగ్ అయిన తొలి భారతీయ సంస్థ ఐసిఐసిఐ బ్యాంకు అనీ! (ఐ.సి.ఐ.సి.ఐ.బ్యాంకు వ్యాసం)
- ...భారతదేశంలో తొలి ఐఐటిని ఖరగ్‌పూర్ లో స్థాపించారనీ! (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వ్యాసం)
- ...ఆర్.ఎస్.ఎస్ సంస్థ వ్యవస్థాపక అద్యక్ష్యుడు కె.బి.హెగ్డేవార్ అనీ! (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ వ్యాసం)
- ...అమెరికాలో నాలుగవ పెద్ద రాష్ట్రమైన కాలిఫోర్నియా 1846కు పూర్వం మెక్సికోలో భాగం అనీ! (శాన్ ఫ్రాన్సిస్కో వ్యాసం)
- ...అతిపిన్న వయస్సులో ప్రపంచ చదరంగ చాంపియన్ టైటిల్ గెలిచిన క్రీడాకారుడు బాబీ ఫిషర్ అనీ!(బాబీ ఫిషర్ వ్యాసం)
- ...మూసీ నది జన్మస్థానం రంగారెడ్డి జిల్లా అనంతగిరి కొండలు అనీ! (అనంతగిరి వ్యాసం)
- ...యాపిల్ ఇంకోర్పరేటెడ్ చైర్మన్ స్టీవ్ జాబ్స్ జీతం కేవలం ఒక్క డాలర్ మాత్రమే అని! (స్టీవ్ జాబ్స్ వ్యాసం)
10 వ వారం
[మార్చు]- ...తాజ్ మహల్ నిర్మాణానికి 20 వేల మంది కూలీలు పనిచేశారనీ! (తాజ్ మహల్ వ్యాసం)
- ...కాకతీయ ప్రతాపరుద్రుడు ఢిల్లీకి బందీగా తరలించు సమయములో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడనీ! (ముసునూరి నాయకులు వ్యాసం)
- ...అమెరికా తొలి అధ్యక్షుడు జార్జి వాషింగ్టన్ అనీ! (జార్జి వాషింగ్టన్ వ్యాసం)
- ...భారత్‌లో టెస్ట్ క్రికెట్ మ్యాచ్‌ను నిర్వహించిన తొలి స్టేడియం ముంబాయిలోని జింఖానా స్టేడియం అనీ! (భారత క్రికెట్ జట్టు వ్యాసం)
- ...ఫోటోషాప్ ప్రోగ్రాంను తొలిసారిగా తయారుచేసినది థామస్ నోవ్ అనీ! (అడోబ్ ఫోటోషాప్ వ్యాసం)
- ...మలాయిక అనగా ఇస్లాంలో దేవదూతలు అనీ! (మలాయిక వ్యాసం)
- ...భారతదేశపు తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ అనీ! (రాజ్ నారాయణ్ వ్యాసం)
09 వ వారం
[మార్చు]- ఫిబ్రవరి 24, 2008 నుంచి మార్చి 2 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
- ...ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్ పోటీలలో పతకం సాధించిన తొలి భారతీయ వ్యక్తి అంజు బాబీ జార్జ్ అనీ! (అంజు బాబీ జార్జ్ వ్యాసం)
- ...భారతీయులచే భారతదేశంలో స్థాపించిన తొలి బ్యాంకు పంజాబ్ నేషనల్ బ్యాంకు అనీ! (పంజాబ్ నేషనల్ బ్యాంకు వ్యాసం)
- ...వన్డే క్రికెట్లో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాట్స్‌మెన్ సచిన్ టెండుల్కర్ అనీ! (భారత క్రికెట్ జట్టు వ్యాసం)
- ...లాల్ కృష్ణ అద్వానీ భారతీయ జనతా పార్టీ ఉక్కుమనిషి అనీ! (లాల్ కృష్ణ అద్వానీ వ్యాసం)
- ...వాలి ఋష్యమూక పర్వతం సమీపంలోకి రాకపోవడానికి మాతంగమహర్షి శాపం కారణం అనీ! (కిష్కింధకాండము వ్యాసం)
- ...సమ్మక్క సారక్క జాతర భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర అనీ! (సమ్మక్క సారక్క జాతర వ్యాసం)
- ...1977లో ఇందిరా గాంధీని ఆమె సొంత నియోజకవర్గం రాయ్‌బరేలీలో ఓడించిన జనతా పార్టీ అభ్యర్థి రాజ్ నారాయణ్ అనీ! (ఇందిరా గాంధీ వ్యాసం)
08 వ వారం
[మార్చు]- ఫిబ్రవరి 16, 2008 నుంచి ఫిబ్రవరి 24 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
- ...భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్‌మెన్ వీరేంద్ర సెహ్వాగ్ అనీ! (వీరేంద్ర సెహ్వాగ్ వ్యాసం)
- ...గొప్ప విష్ణుభక్తుడైన భక్తప్రహ్లాదుడు అసుర రాక్షసుడైన హిరణ్య కశపుని కుమారుడనీ! (భక్త ప్రహ్లాదుడు వ్యాసం)
- ...తొలి తెలుగు ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు ప్రధానిగా నంద్యాల లోక్‌సభ నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహించాడనీ! (నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం వ్యాసం)
- ...సింగపూర్‌కు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే పార్టీ అధికారంలో ఉన్నదనీ! (సింగపూర్ వ్యాసం)
- ...భారతదేశంలో అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనీ! (భారతీయ స్టేట్ బ్యాంకు వ్యాసం)
- ...అమెరికన్ సెనేట్‌కు ఎన్నికైన తొలి ప్రథమ మహిళ హిల్లరీ క్లింటన్ అనీ! (హిల్లరీ క్లింటన్ వ్యాసం)
- ...ఒలింపిక్ క్రీడలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన తొలి ఆటగాడు నార్మన్ ప్రిచర్డ్ అనీ! (ఒలింపిక్ క్రీడలలో భారతదేశం వ్యాసం)
50 వ వారం
[మార్చు]- డిసెంబర్ 3, 2008 నుంచి జనవరి 5 2009 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
- ... ఇరాన్ రాజధానియైన టెహరాన్ మద్య ప్రాచ్యంలో అత్యంత పెద్దదైన మరియు అత్యధిక జనాభా గల నగరమనీ! (టెహరాన్ వ్యాసం)(కుడివైపున బొమ్మ చూపబడినది)
- ... తమిళనాడులోని కోయంబత్తూర్ దక్షిణ భారత మాంచెస్టర్ గా పిలవబడుతుందనీ! (కోయంబత్తూర్ వ్యాసం)
- ... భారతదేశపు మొట్టమొదటి విద్యుత్ మోటారును తయారు చేసింది గోపాలస్వామి దొరస్వామి నాయుడు అనీ! (గోపాలస్వామి దొరస్వామి నాయుడు వ్యాసం)
- ... పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 175 ఏళ్ళ తర్వాత సజీవ సమాధి చెందాడనీ! (బ్రహ్మంగారి కాలజ్ఞానం వ్యాసం).
- ... పాశ్చరైజేషన్ అనగా ద్రవాలను వేడి చేసి బాక్టీరియా, ప్రోటోజోవా, శిలీంద్రాలు మొదలైన్ వ్యాధికారక క్రిములను నిర్మూలించే ఒక ప్రక్రియ అనీ! ( పాశ్చరైజేషన్ వ్యాసం)
46 వ వారం
[మార్చు]- నవంబర్ 7, 2008 నుంచి డిసెంబర్ 3 2008 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
- ... ఐన్‌స్టీన్ మెదడును పరిశోధనల నిమిత్తం ప్రయోగ శాలలో భద్రపరచారనీ! (ఐన్‌స్టీన్ వ్యాసం)
- ... జ్యోతి నృత్యం అనేది కర్నూలు జిల్లాలో చేనేత కులాలు వారు ప్రముఖంగా జరుపుకునే ఉత్సవం అనీ! (జ్యోతి నృత్యము వ్యాసం)
- ... బెల్జియం దేశం యూరోపియన్ యూనియన్ వ్యవస్థాపక దేశం అనీ! (బెల్జియం వ్యాసం)
- ... శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ అనేది కళలు, విజ్ఞానం, సాహిత్యం, వైద్యం, పత్రికలు, మరియు ఇతర మేధోకృషులను గుర్తించి ఆయా రంగాలలో ఉన్నత సాధన జరిపినవారిని సన్మానించడానికి వెలకొల్పబడిన ఒక సంస్థ అనీ! (శ్రీ రాజా లక్ష్మీ ఫౌండేషన్ వ్యాసం)
- ... ప్రతి రెండు సంవత్సరాలకొకసారి వరల్డ్ సోలార్ చాలెంజ్ పేరుతో ఆస్ట్రేలియా లో సూర్యరశ్మితో నడిచే కార్ల రేస్ నిర్వహించబడుతుందనీ! (సౌర విద్యుత్తు వ్యాసం)
- ... ఇప్పటిదాకా వ్యోమగాములు 382 కిలోల చంద్ర శిలల్ని భూమి మీదకు తీసుకువచ్చారనీ! (చంద్రుడు వ్యాసం)
41 వ వారం
[మార్చు]- అక్టోబర్ 2, 2008 నుంచి నవంబర్ 6 2008 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
- ... భారతదేశము తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించినపుడు మొదటిసారిగా జాతీయ పతాకాన్ని ఎర్రకోట పైనే ఎగురవేశారనీ! (ఎఱ్ఱకోట వ్యాసం)
- ... భారతదేశములో అత్యున్నత ప్రమాణాలు కలిగిన పరిశోధనా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగుళూరులో ఉన్నదనీ! (బెంగుళూరు వ్యాసం)
- ... హ్యూస్టన్ అమెరికాలో నాలుగవ అతి పెద్ద నగరం అనీ! (హ్యూస్టన్ వ్యాసం)
- ... గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2 ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవంగా గుర్తించిందనీ! (అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం వ్యాసం)
- ... ఎర్ర చందనం (Red sandalwood) చెట్టు ప్రపంచం మొత్తానికి కడప జిల్లాలో తప్ప మరెక్కడా లభించదు అనీ! (ఎర్రచందనం వ్యాసం)
- ... ఉపపాండవులు అనగా ద్రౌపదికి పాండవులకు కల్గిన సంతానం అనీ! (ఉప పాండవులు వ్యాసం)
- ... తెలుగులో మొట్ట మొదటి స్వతంత్ర వ్యాకరణ గ్రంథంగా భావిస్తున్న ఆంధ్ర భాషా భూషణము ను రచించింది కేతన అనీ! (కేతన వ్యాసం)
39 వ వారం
[మార్చు]- సెప్టెంబర్ 17, 2008 నుంచి అక్టోబర్ 2 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
- ... కేరళ రాష్ట్రపు సంప్రదాయిక నృత్యమైన కథాకళి లో కళాకారులు కథను కేవలం సంజ్ఞల ద్వారా మాత్రమే ప్రదర్శిస్తారు అనీ! (కథాకళి వ్యాసం)(కుడివైపున బొమ్మ చూపబడినది)
- ... భారతదేశములో దేవభాషగా పేరుపొందిన భాష సంస్కృత భాష అనీ! (సంస్కృతం వ్యాసం)
- ... బీహార్ దు:ఖదాయినీగా పేరుగాంచిన నది కోసి నదీ అనీ! (కోసీ నది వ్యాసం)
- ... అంతర్జాతీయ వన్డే క్రికెట్ పోటీలలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని అనీ! (మహేంద్రసింగ్ ధోని వ్యాసం)
- ... దీర్ఘకాలంలో ఒక వ్యక్తి దృష్ట్యా ప్రయోజనకరమైన పొదుపు మొత్తం ఆర్థిక వ్యవస్థ దృష్ట్యా శ్రేయస్కరం కాదు అనీ! (పొదుపు వ్యాసం)
- ... సిరివెన్నెల పాటలకు వేణుగాన సహకారం అందించిన ప్రముఖ విద్వాంసుడు హరిప్రసాద్ చౌరాసియా అనీ! (సిరివెన్నెల వ్యాసం)
- ... కలరా వ్యాధి కారకమైన విబ్రియో కలరాను తొలిసారిగా గుర్తించినది రాబర్ట్ కోచ్ అనీ! (రాబర్ట్ కోచ్ వ్యాసం)
34 వ వారం
[మార్చు]- ఆగష్టు 15, 2008 నుంచి సెప్టెంబర్ 16 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు:
- ... ఒలింపిక్ క్రీడలలో వ్యక్తిగత పోటీలలో స్వర్ణపతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారుడు అభినవ్ బింద్రా అనీ! (అభినవ్ బింద్రా వ్యాసం)(కుడివైపున బొమ్మ చూపబడినది)
- ... భారతదేశంలో ప్రముఖ బహుళార్థక సాధక ప్రాజెక్టులలో ఒకటైన బాక్రానంగల్ ప్రాజెక్టును సట్లెజ్ నదిపై నిర్మించారు అనీ! (సట్లెజ్ నది వ్యాసం)
- ... బ్రిటీష్ పాలన కాలంలో రాయలసీమ జిల్లాలకు అనేక సేవలందించిన థామస్ మన్రో కర్నూలు జిల్లాలో పర్యటిస్తూ కలరా వ్యాధి సోకి మరణించాడు అనీ! (థామస్ మన్రో వ్యాసం)
- ... భారతదేశంలో మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసిన వైద్యుడు డా.పి.వేణుగోపాల్ అనీ! (పి.వేణుగోపాల్ వ్యాసం)
- ... మొదటి లోక్‌సభలో డిప్యూటీ స్పీకర్‌గా వ్యవహరించిన తెలుగు వ్యక్తి అనంతశయనం అయ్యంగార్ అనీ! (మాడభూషి అనంతశయనం అయ్యంగార్ వ్యాసం)
- ... హైదరాబాదు నగరంలో పురాతన కళాశాలలో ఒకటైన నిజాం కళాశాలకు తొలి ప్రిన్సిపాల్‌గా పనిచేసినది సరోజినీ నాయుడు తండ్రి అఘోరనాథ చటోపాధ్యాయ అనీ! (నిజాం కళాశాల వ్యాసం)
- ... ధర్మరాజు అనంతరం పాండురాజ్యాన్ని పాలించిన పరీక్షిత్తు అభిమన్యుడి కుమారుడు అనీ! (పరీక్షిత్తు వ్యాసం)
29 వ వారం
[మార్చు]- ... ఆంధ్రప్రదేశ్‌లో దక్షిణాదిన ఉన్న చిట్టచివరి అసెంబ్లీ నియోజకవర్గం కుప్పం శాసనసభ నియోజకవర్గం అనీ! (కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం వ్యాసం)(కుడివైపున బొమ్మ చూపబడినది)
- ... బాదామి చాళుక్యుల అనంతరం పరిపాలించిన రాష్ట్రకూట వంశపు తొలి రాజు దంతిదుర్గుడు అనీ! (రాష్ట్రకూటులు వ్యాసం)
- ... జైనమత స్థాపకుడు వృషభనాథుడు అనీ! (జైన మతము వ్యాసం)
- ... నియోజకవర్గాల పునర్విభజన అనంతరం అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన జిల్లా తూర్పు గోదావరి అనీ! (ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు వ్యాసం)
- ... ఆంధ్రదేశ చరిత్రలో త్రికూట మలయాధిపతిగా పేరుగాంచినది విష్ణుకుండినులలో గొప్పరాజైన రెండో మాధవవర్మ అనీ! (విష్ణుకుండినులు వ్యాసం)
- ... భారతదేశపు ప్రముఖ అవార్డు అయిన బి.సి.రాయ్ అవార్డును వైద్యరంగంలో కృషిచేసిన వారికి ప్రధానం చేస్తారు అనీ! (వర్తమాన ఘటనలు - జూలై 2008)
27 వ వారం
[మార్చు]- ... స్వతంత్ర్య భారతదేశపు మొట్టమొదటి ఫీల్డ్‌మార్షల్ మానెక్షా అనీ! (మానెక్షా వ్యాసం)(కుడివైపున బొమ్మ చూపబడినది)
- ... తెలుగులో రచించబడిన తొలి గద్యనవల కందుకూరి వీరేశలింగం వ్రాసిన రాజశేఖర చరిత్ర అనీ! (రాజశేఖర చరిత్ర వ్యాసం)
- ... సంగీతకళకు సంబంధించి తెలుగులో వెలువడుతున్న ఏకైక పత్రిక "గానకళ" వ్యవస్థాపకుడు మునుగంటి శ్రీరామమూర్తి అనీ! (గానకళ వ్యాసం)
- ... నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద శాసనసభ నియోజకవర్గం ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం అనీ! (ఖైరతాబాదు అసెంబ్లీ నియోజకవర్గం వ్యాసం)
- ... భారతదేశంలో పార్శీ మతస్థులు అధికంగా నివశించు ప్రాంతం ముంబాయి అనీ! (భారతదేశంలో మతములు వ్యాసం)
- ... శ్రీశ్రీ తన ప్రముఖ రచన "మహాప్రస్థానం"ను కొంపెల్ల జనార్థనరావుకు అంకితం ఇచ్చాడు అనీ! (కొంపెల్ల జనార్ధనరావు వ్యాసం)
- ... ప్రపంచంలో అతి తక్కువ అవినీతి కల దేశం భూటాన్ అనీ! (వర్తమాన ఘటనలు - జూన్ 2008)
26 వ వారం
[మార్చు]- ... బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాకు డైలాగులు రచించినది నాగభైరవ కోటేశ్వరరావు అనీ! (నాగభైరవ కోటేశ్వరరావు వ్యాసం)(కుడివైపున బొమ్మ చూపబడినది)
- ... మచిలీపట్నంలో ఆంధ్రజాతీయ కళాశాలను ప్రారంభించినది కోపల్లె హనుమంతరావు అనీ! (కోపల్లె హనుమంతరావు వ్యాసం)
- ... వ్యంగ చిత్రాల సంపుటి అయిన డెనిస్ ది మెనేస్(Dennis the Menace) సృష్టికర్త అమెరికాకు చెందిన హాంక్ కెచ్చమ్ అనీ! (డెనిస్-ఓ బెడద వ్యాసం)
- ... ఆంధ్రదేశంలో కుబీరక రాజు ప్రశక్తి ఉన్న శాసనం లభించిన ప్రదేశం భట్టిప్రోలు అనీ! (భట్టిప్రోలు స్తూపం వ్యాసం)
- ... శ్రీహరి హిరణ్యకశ్యపుడిని సంహరించుటకు నరసింహ అవతారము దాల్చాడు అనీ! (నరనారాయణులు వ్యాసం)
- ... తూర్పు గోదావరి జిల్లా చోడవరం గ్రామానికి ఆ పేరు రావడానికి కారకుడు చోడరాజు రాజేంద్ర చోడుడు అనీ! (చోడవరం వ్యాసం)
- ... సాహిత్య, భాషా, పరిశోధనా పత్రాలకు, కవిత్వానికి పెద్ద పీటవేసిన "భారతి" మాసపత్రికను స్థాపించినది కాశీనాథుని నాగేశ్వరరావు అనీ! (భారతి (మాస పత్రిక) వాసం)
- ... స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాదుకు తొలి మహిళా మేనేజింగ్ డైరెక్టర్ రేణు చల్లు అనీ! (వర్తమాన ఘటనలు - జూన్ 2008)
24 వ వారం
[మార్చు]- ... మొదటి ప్రపంచ యుద్ధంలో అమరులైన జవానుల స్మృత్యర్థం ఢిల్లీలో నిర్మించిన ఇండియా గేట్‌కు రూపకల్పన చేసినది ఎడ్విన్ ల్యుటెన్స్ అనీ! (ఇండియా గేట్ వ్యాసం)(కుడివైపున బొమ్మ చూపబడినది)
- ... యజ్ఞసేనుడు అనే పేరు కలిగిన దృపదుడు పాంచాల దేశానికి రాజుగా పాలించాడనీ ! (దృపదుడు వ్యాసం)
- ... మెట్రిక్ పద్దతిలో ద్రవ పదార్థాల ఘనపరిమాణం కొలవడానికి అంతర్జాతీయంగా స్థిరీకరించబడిన కొలమానం లీటరు అనీ! (లీటరు వ్యాసం)
- ... దక్షిణ భారతదేశములో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తొలి భారతీయ జనతా పార్టీ నేత బి.ఎస్.యడ్యూరప్ప అనీ! (బి.ఎస్.యడ్యూరప్ప వ్యాసం)
- ... ప్రపంచంలో అత్యధిక బిలియనీర్లు ఉన్న నగరం మాస్కో అనీ (వర్తమాన ఘటనలు-మే 2008)
- ... కొలెస్టరాల్ అనగా శరీరంలో సహజ ప్రక్రియ ద్వారా ఉత్పత్తి అయ్యే ఒక రకపు కొవ్వు అనీ! (కొలెస్టరాల్ వ్యాసం)
- ... తొలి ఆధునిక ఒలింపిక్ క్రీడలు నిర్వహించబడిన నగరం ఎథెన్స్ అనీ! (1896 ఒలింపిక్ క్రీడలు వాసం)
- ... పార్థియన్లు పూజించే గ్రీకుల నాగరికత యుద్ధదేవత అయిన 'అథేనా'ను రూపొందించినది ఫిడియాస్ అనీ! (విగ్రహారాధన వ్యాసం)
23 వ వారం
[మార్చు]- ...బౌద్ధ స్తూపాలు అనగా గౌతమబుద్ధుని అవశేషాలపై నిర్మించిన పూజానిమిత్తమైన కట్టడాలు అనీ! (అమరావతి స్తూపం వ్యాసం) (బొమ్మ ఉన్నది)
- ...ఒలింపిక్ క్రీడలలో భారతదేశం తరఫున పాల్గొన్న మరియు పతకం సాధించిన తొలి క్రీడాకారుడు నార్మన్ ప్రిచర్డ్ అనీ! (1900 ఒలింపిక్ క్రీడలు వ్యాసం)
- ...ఆధునిక తెలుగు పద్యకవులలో అగ్రగణ్యుడిగా పేరుగాంచి తెనుగులెంకగా ప్రసిద్ధిచెందిన కవి అసలుపేరు తుమ్మల సీతారామమూర్తి అనీ! (తుమ్మల సీతారామమూర్తి వ్యాసం)
- ...యమునా నది జన్మస్థలమైన యమునోత్రిలో ఉన్న ప్రముఖ దేవాలయం గర్భగుడిలో గంగా, యమునా, సరస్వతి మూర్తులు ఉంటాయి అనీ! (యమునోత్రి వ్యాసం)
- ...కర్ణాటకలోని చారిత్రక నగరమైన శ్రీరంగపట్టణానికి ఆపేరు శ్రీరంగనాథస్వామి ఆలయంలో వెలసిన రంగనాథస్వామి వల్ల వచ్చినదీ అనీ! (శ్రీరంగపట్టణం వ్యాసం)
- ...బిర్లామందిరములు సంపన్నమైన బిర్లాకుటుంబం వారి ఆర్థిక సహాయంతో నిర్వహించబడుతున్నాయి అనీ! (బిర్లా మందిరం (ఢిల్లీ) వ్యాసం)
- ...ఇంగ్లాండు టెస్ట్ క్రికెట్ జట్టుకు అత్యధిక పర్యాయాలు నాయకత్వం వహించిన కెప్టెన్ మైక్ ఆథర్టన్ అనీ! (మైక్ ఆథర్టన్ వ్యాసం)
22 వ వారం
[మార్చు]- ... కర్ణాటక సంగీత పితామహుడిగా పేరుగాంచిన పురందర దాసు తన కీర్తనలన్నీ విష్ణుమూర్తికి అంకితమిస్తూ రచించాడు అనీ! (పురందర దాసు వ్యాసం) (బొమ్మ ఉన్నది)
- ... ప్రాచీన ఒలింపిక్ క్రీడలలో విజేతలకు బహుమతిగా ఆలివ్ కొమ్మలను ప్రధానం చేసేవారు అనీ! (ఒలింపిక్ క్రీడలు వ్యాసం)
- ... ఆధునిక ద్వినామీకరణానికి నాంది పలికి ఆధునిక వర్గీకరణశాస్త్ర పితామహుడిగా పేరుగాంచిన జీవశాస్త్రవేత్త స్వీడన్ కు చెందిన కరోలస్ లిన్నేయస్ అనీ! (కరోలస్ లిన్నేయస్ వ్యాసం)
- ... మాద్రి నకులుడు మరియు సహదేవుడు కవలలను పొందుటకు దూర్వాసుని వరమును ఉపయోగించినది అనీ! (పాండురాజు వ్యాసం)
- ... ఆరోగ్యంగా ఉన్న వ్యక్తుల రక్తపుపోటు కొలతలు 120/80 ఉంటాయి అనీ! (రక్తపు పోటు వ్యాసం)
- ... సెల్సియస్ కొలమానంలో నీరు గడ్డకట్టే ఉష్ణోగ్రత 0°C అనీ! (ఉష్ణోగ్రత వ్యాసం)
- ... భారతదేశంలో స్థాపించబడిన తొలి జాతీయవనం 1935లో ఏర్పాటుచేసిన జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనీ! (భారతదేశంలో జాతీయ వనాలు వ్యాసం)
ఫిబ్రవరి 9, 2008 నుంచి ఫిబ్రవరి 16 వరకు మొదటి పేజీలో ప్రదర్శించబడిన వాక్యాలు
[మార్చు]- ...భారతీయ భాషలలో అత్యధిక వ్యాసాలు కల్గిన వికీపీడియా తెలుగు వికీపీడియా అని! (తెలుగు వికీపీడియా వ్యాసం)
- ...సుధీర్ఘ టెస్టు మ్యాచ్‌ల అనంతరం సెంచరీ సాధించిన క్రికెటర్ అనిల్ కుంబ్లే అని! (అనిల్ కుంబ్లే వ్యాసం)
- ...ఆంధ్ర ప్రదేశ్ లో ప్రారంభించిన తొలి గ్రామపంచాయతి షాద్‌నగర్ అనీ ! (షాద్‌నగర్ వ్యాసం)
- ...ఆంధ్ర రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు అసలు ఇంటిపేరు పుల్లంరాజు అని! (బూర్గుల వ్యాసం)
- ...భారత్ లో గ్రామీణ బ్యాంకును స్పాన్సర్ చేసిన తొలి బ్యాంకు సిండికేట్ బ్యాంకు అని! (సిండికేట్ బ్యాంకు వ్యాసం)
- ...ఒకే ఒలింపిక్ క్రీడలో అత్యధిక స్వర్ణాలు సాధించిన క్రీడాకారుడు మార్క్ స్పిట్జ్ అని! (ఒలింపిక్ క్రీడలు వ్యాసం)
- ...బాబీ జిందాల్ అమెరికా చరిత్రలోనే భారతీయ సంతతికి చెందిన తొలి గవర్నర్ అని! (బాబీ జిందాల్ వ్యాసం)
2008 సంవత్సరంలో ఫిబ్రవరి 9 వరకు ప్రదర్శించబడిన వాక్యాలు
[మార్చు]- ...టెన్నిసన్ ఆంగ్లంలో ఎక్కువగా కోట్ చేయబడిన రచయితలలో రెండవ వాడని
- ...పూర్వ నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు తానా వ్యవస్థాపకుడు మరియు మెదటి అధ్యక్షుడు అని మీకు తెలుసా
- .... ప్రాంతీయ భాషల్లో నాలుగు వేదాలు కలిగి ఉన్నది ఒక్క తెలుగు మాత్రమే.
- .... ప్రపంచంలోనే అతి పెద్దదైన శివుని విగ్రహం కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా మురుడేశ్వరలో ఉన్నది అని
- .....డచ్ వారి అవశేషాలు ఇప్పటికి ఉన్న భీమునిపట్నం భారతదేశంలోని రెండవ మునిసిపాలిటి అని
- .....దక్షిణ చిరపుంజి గా పేరు గాంచిన ఆగుంబె భారతదేశం లొనే అత్యధిక వర్షపాతం నమోదుచేసుకొంటున్న ప్రదేశాలలొ రెండవ స్థానం
- ... కళ్ళు అనే తెలుగు సినిమా ఆస్కార్ నామినేషనుకు ఎంపికచేబడింది అని.
- ...భారతీయ సినిమారంగములో మొట్టమొదటి ద్విపాత్రాభినయము చేసిన తొలి నటి, కలకత్తా కు చెందిన ఆంగ్లో-ఇండియన్ కుటుంబములో జన్మించిన పేషన్స్ కూపర్ అని.
- నరస భూపాలీయం గా ప్రఖ్యాతి చెందిన కావ్యాలంకార సంగ్రహ కర్త రామరాజ భూషణుడు అని.
- శబ్దాలంకారాలకు ప్రసిద్ధుడైన తెలుగు పూర్వకవి పోతన అని.
- ...కృష్ణుని ప్రియ మిత్రుడు, సహాధ్యాయి సుదాముని స్వస్థలము, జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన నేటి పోర్బందర్ అని.
- ...పాకిస్తాన్ లో మాట్లాడే ఏకైక ద్రవిడ భాష బ్రహుయి అని. ఇది ఏదో ఒకరిద్దరు మాట్లాడే భాష కాదు 22 లక్షల మంది మాట్లాడే భాష.
- ... జగ్గయ్య, లోక్‌సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీనటుడు అని.
- ... 1934 లో విడుదలైన తొలి కన్నడ టాకీ చలనచిత్రము సతీ సులోచనను తీసినది తెలుగు సినిమా దర్శకుడు, నిర్మాత, నటుడు మరియు తెలుగు సినీనటి లక్ష్మి తండ్రి అయిన యెర్రగుడిపాటి వరదరావు(వై.వి.రావు) అని.
- ... ఆంధ్ర మహిళలు ఐదవతనముగా భావించే నల్లపూసల గురించిన ప్రస్థావన సాహిత్యములో తొలిసారిగా చేసినది శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజములలో ఒకడైన మాదయ్యగారి మల్లన అని.
- ... 1885లో ప్రారంభించబడిన సురభి నాటక సమాజం వ్యవస్థాపకుడు వనారస గోవిందరావు అని. కడప జిల్లా సురభి గ్రామంలో మొదట కీచక వధ తో సురభి నాటకప్రస్థానం మొదలయ్యింది అని.
- తెలుగునేలను ఏలిన తొలి మహిళ రుద్రమ దేవి అని
- ...పంచమ వేదం అని మహా భారతంను అంటారు అని
- ...దండి యాత్ర సబర్మతి ఆశ్రయం నుంచి ప్రారంభమైంది అని
- ...దక్షిణ భారతాన్ని అత్యధికకాలం పాలించిన రాజవంశం పాండ్యులు అని
- ...పంజాబ్‌ను పాలించిన రంజిత్ సింగ్ రాజధాని లాహోర్ అని
- షోడస మహాజనపద రాజ్యాలలో ఏకైక దక్షిణ రాజ్యం అస్మక అని
- ...హిందీ, తమిళ, తెలుగు భాషలలో తొలి టాకీ చిత్రాలయిన అలంఅరా, కాళిదాస్ మరియూ భక్తప్రహ్లాద మూడింటిలోనూ ఎల్.వి.ప్రసాద్ నటించాడు అని.
- ...హైదరాబాదు నందలి ట్యాంకుబండ్ నందు మొత్తం 32 మంది ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి అని!..
- ...19వ శతాబ్దం లో ఆంధ్ర ప్రాంతం లోని ప్రతి గ్రామమునకు 12 మంది గ్రామ సేవకులు ఉండేవారనీ, వారిని బారబలావతి అనేవారు అని.
- ...తెలుగు అనే శబ్దం త్రిలింగ నుండి వచ్చిందని చదువుకుంటూ వచ్చాం. కాదు, తెలివాహ అని పిలవబడిన గోదావరి నుండి వచ్చింది అని అంటోంది ఈ పరిశోధనాత్మక వ్యాసం.
- రాయలసీమ కు ఆ పేరు పెట్టింది గాడిచర్ల హరిసర్వోత్తమ రావు. అంతకు ముందు దానిని దత్తమండలం (Ceded) అని పిలిచేవారు. 1928 లో కర్నూలు జిల్లా నంద్యాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ అధ్యక్షతన జరిగిన ఆంధ్ర మహాసభలో ఆయన ఈ పేరు పెట్టాడు.
- 1951 లో న్యూయార్క్ హెరాల్డ్ ట్రిబ్యూన్ నిర్వహించిన ప్రపంచ కథల పోటీకి భారత్ నుండి మూడు కథలు ఎంపికయ్యాయి. మొత్తం 23 దేశాల నుండి 59 కథలు పోటీకి వచ్చాయి. వాటిలో రెండవ బహుమతిని భారత కథే గెలుచుకుంది. ఆ కథ పేరు గాలివాన , రచయిత పాలగుమ్మి పద్మరాజు - తెలుగు వాడి కథ.
- ...మన జాతీయ పతకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య మన తెలుగు వారేనని.
- ...బంగాళాఖాతము ను తూర్పు సముద్రం అని పిలిచేవారని.
- ...మొదటి ప్రయాణంలోనే మునిగిపోయిన టైటానిక్ లో ప్రయాణించిన ఏకైక భారతీయ కుటుంబం గుంటూరు నుండి అని. అయితే వీరు బ్రిటిషు వారు.
- ...ఆలంపూర్ లోని నవబ్రహ్మ దేవాలయములు శివుని గుళ్లని.
- ...కోస్తా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల నాయకుల మధ్య జరిగిన పెద్దమనుషుల ఒప్పందం, 1956 లో తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఏకమై ఆంధ్ర ప్రదేశ్ అవతరణకు మార్గం సుగమము చేసిందని.
- ...తెలుగు, భారత దేశములో అత్యంత ఎక్కువమంది మాట్లాడే భారతీయ భాషలలో హిందీ తర్వాత రెండవదని.
- తొలి తెలుగు మూకీ చిత్రం 1920లలో తీసిన భీష్మ ప్రతిజ్ఞ అని.
- తెలుగునాట తీయబడ్డ తొలి తెలుగుచిత్రం భక్త మార్కండేయ (1926) అని.
- తొలి తెలుగు టాకీ భక్త ప్రహ్లాద (1931) అని.
- తెలుగులో ఒకరి జీవిత కథ ఆధారంగా తీసిన తొలి (బయోగ్రాఫికల్) సినిమా భక్త రామదాసు (1933) అని.
- తొలి తెలుగు సాంఘిక చిత్రం ప్రేమ విజయం (1936) అని.
- తొలి తెలుగు అభ్యుదయ చిత్రం మాలపిల్ల (1938) అని.
- తొలి తెలుగు డాక్యుమెంటరీ మహాత్మా గాంధీ అని.
- ఒక అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో పాల్గొన్న తొలి తెలుగు సినిమా స్వర్గసీమ (1945) అని.
- రాష్ట్రప్రభుత్వం నుంచి సబ్సిడీ పొందిన మొదటి చిత్రం 'పదండి ముందుకు (1985 సినిమా)' (1962) అని.
- తొలి తెలుగు రంగుల సినిమా లవకుశ (1963) అని.
- ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి నీలంసంజీవరెడ్డి. ఈయన భారతరాష్ట్ర్రపతిగా కూడాపనిచేసారు.
- రాష్ట్రప్రభుత్వ నంది బహుమతి పొందిన తొలి సినిమా డాక్టర్ చక్రవర్తి (1964 లో) అని.
- తొలి తెలుగు జేమ్స్ బాండ్ సినిమా గూఢచారి 116 (1966) అని.
- తొలి తెలుగు కౌబాయ్ సినిమా మోసగాళ్ళకు మోసగాడు (1971) అని.
- తొలి తెలుగు స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు (1974) అని.
- జాతీయ బహుమతి పొందిన తొలి తెలుగు పాట 'తెలుగువీర లేవరా' (1974) అని.
- తొలి తెలుగు 70 ఎం.ఎం. సినిమా సింహాసనం (1986) అని.
- 1952 లో తొలి మిస్ మద్రాసు టంగుటూరి సూర్యకుమారి.
- రాష్ట్రగీతమైన "మా తెలుగుతల్లికి...." గీతాన్ని రచించిన శంకరంబాడి సుందరాచారి తిరుపతిలో జన్మించారని.
- దేశంలో నిర్మించబడిన మొట్టమొదటి త్రీ డి చలనచిత్రం ఛోటా చేతన్ అని.
- మనదేశంలో ఒక అథ్లెట్ జీవితంపై నిర్మించిన తొలి చిత్రం అశ్విని అని,
- అమెరికా మొట్టమొదటి ఉపాద్యక్షుడు జాన్ ఆడమ్స్ అని,
- జాతీయ గీతం జనగణ మన ను తొలిసారిగా ప్రచురించిన పత్రిక తత్వబోధిని అని,
- అర్థశాస్త్రం లో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారత సంతతి వ్యక్తి అమర్త్యా సేన్ అని,
- భారత దేశపు తొలి క్రికెట్ కెప్టెన్ కనకయ్య నాయుడు అని,
- ఆంధ్రప్రదేశ్ లో ఎత్తయిన పర్వత శిఖరం మహేంద్ర గిరి అని,
- అత్యధిక ఉపనదులు ఉన్న నది అమేజాన్ అని,
- అతి పెద్ద రుతుపవన ప్రభావం కల్గిన దేశం భారతదేశం అని,
- సప్త ద్వీపాల నగరం అనే పేరు కల్గిన నగరం ముంబాయి అని,
- మనదేశంలో అతిపెద్ద ఉపనది యమున అని,
- ఆంధ్రప్రదేశ్ లో అతిపెద్ద ఓడరేవు విశాఖపట్నం అని,
- అమెరికా లో అత్యధిక జనాభా కల రాష్ట్రం [కాలిపోర్నియా]] అని,
- సౌర కుటుంబం లో అందమైన గ్రహం శనిగ్రహం అని,
2007 సంవత్సరంలో వాక్యాలు
[మార్చు]2007 నవంబరు 13
[మార్చు]- ...టెన్నిసన్ ఆంగ్లంలో ఎక్కువగా కోట్ చేయబడిన రచయితలలో రెండవ వాడని!
- ...పూర్వ నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు తానా వ్యవస్థాపకుడు మరియు మొదటి అధ్యక్షుడు అని
- ...ప్రాంతీయ భాషలలో నాలుగు వేదాలు కలిగి ఉన్నది ఒక్క తెలుగు మాత్రమేనని
- ...ప్రపంచంలో అతి పెద్దదైన శివుని విగ్రహం కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా మురుడేశ్వరలో ఉన్నదని
- ...డచ్ వారి అవశేషాలు ఇప్పటికీ ఉన్న భీమునిపట్నం భారతదేశం లోని రెండవ ప్రాచీన మున్సిపాలిటీ అని
2007 అక్టోబరు 4
[మార్చు]- ...పూర్వ నిమ్స్ డైరెక్టర్ కాకర్ల సుబ్బారావు తానా వ్యవస్థాపకుడు మరియు మెదటి అధ్యక్షుడు అని
- ...ప్రాంతీయ భాషల్లో నాలుగు వేదాలు కలిగి ఉన్నది ఒక్క తెలుగు మాత్రమేనని
- ...ప్రపంచంలో అతి పెద్దదైన శివుని విగ్రహం కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా మురుడేశ్వరలో ఉన్నదని
- ...డచ్ వారి అవశేషాలు ఇప్పటికీ ఉన్న భీమునిపట్నం భారతదేశంలోని రెండవ ప్రాచీన మున్సిపాలిటీ అని
- ...దక్షిణ చిరపుంజి గా పేరు గాంచిన ఆగుంబె భారతదేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదు చేసుకొంటున్న ప్రదేశాలలో రెండవదని
- ...టెన్నిసన్ ఆంగ్లంలో ఎక్కువగా కోట్ చేయబడిన రచయితలలో రెండవ వాడని!
2007 ఆగస్టు 22
[మార్చు]- ...పూర్వ నిమ్స్ డైరెక్టర్ కాకార్ల సుబ్బారావు తానా వ్యవస్థాపకుడు మరియు మెదటి అధ్యక్షుడు అని మీకు తెలుసా
- .... ప్రాంతీయ భాషల్లో నాలుగు వేదాలు కలిగి ఉన్నది ఒక్క తెలుగు మాత్రమే.
- .... ప్రపంచం లొ అతి పెద్దదైన శివుని విగ్రహం కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా మురుడేశ్వరలో ఉన్నదని
- .....డచ్ వారి అవశేషాలు ఇప్పటికీ ఉన్న భీమునిపట్నం భారతదేశంలోని రెండవ ప్రాచీన మున్సిపాలిటీ అని
- .....దక్షిణ చిరపుంజి గా పేరు గాంచిన ఆగుంబె భారతదేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదు చేసుకొంటున్న ప్రదేశాలలో రెండవదని
2007 ఆగస్టు 19
[మార్చు]- .... ప్రాంతీయ భాషల్లో నాలుగు వేదాలు కలిగి ఉన్నది ఒక్క తెలుగు మాత్రమే.
- .... ప్రపంచం లొ అతి పెద్దదైన శివుని విగ్రహం మురుడేశ్వర్‌లో ఉన్నదని
- .....డచ్ వారి అవశేషాలు ఇప్పటికీ ఉన్న భీమునిపట్నం భారతదేశంలోని రెండవ ప్రాచీన మున్సిపాలిటీ అని
- .....దక్షిణ చిరపుంజి గా పేరు గాంచిన ఆగుంబె భారతదేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదు చేసుకొంటున్న ప్రదేశాలలో రెండవదని
- ... కళ్ళు అనే తెలుగు సినిమా ఆస్కారు నామినేషనుకు ఎంపికచేబడింది.
2007 జూలై 9
[మార్చు]- .....దక్షిణ చిరపుంజి గా పేరు గాంచిన ఆగుంబె భారతదేశం లొనే అత్యధిక వర్షపాతం నమోదుచేసుకొంటున్న ప్రదేశాలలొ రెండవ స్థానం
- .....డచ్ వారి అవశేషాలు ఇప్పటికి ఉన్న భీమునిపట్నం భారతదేశం లొని రెండవ మునిసిపాలిటి అని
- ... కళ్ళు అనే తెలుగు సినిమా ఆస్కారు నామినేషనుకు ఎంపికచేబడింది.
- ... నాటకాల్లో పాడరాని నటీనటులకు తెర వెనుక నుండి పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడే విధానానికి పిఠాపురం నాగేశ్వరరావు శ్రీకారం చుట్టారు.
- ... భారతీయ సినిమా రంగంలో తొలి ద్విపాత్రాభినయము చేసిన నటి, కలకత్తాకు చెందిన ఆంగ్లో-ఇండియన్ కుటుంబములో జన్మించిన పేషన్స్ కూపర్.
- ... పాకిస్తాన్లో మాట్లాడబడే ఏకైక ద్రవిడ భాష బ్రహుయి. ఇది ఏదో ఒకరిద్దరు మాట్లాడే భాష కాదు 22 లక్షల మంది మాట్లాడే భాష.
- ... మొట్టమొదటగా 1985వ సంవత్సరములోనే టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ అనే అంతర్జాతీయ సంస్థ బెంగుళూరులో అడుగుపెట్టింది.
2007 జూన్ 23
[మార్చు]- ... కళ్ళు అనే తెలుగు సినిమా ఆస్కారు నామినేషనుకు ఎంపికచేబడింది.
- ... నాటకాల్లో పాడరాని నటీనటులకు తెర వెనుక నుండి పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడే విధానానికి పిఠాపురం నాగేశ్వరరావు శ్రీకారం చుట్టారు.
- ... భారతీయ సినిమా రంగంలో తొలి ద్విపాత్రాభినయము చేసిన నటి, కలకత్తాకు చెందిన ఆంగ్లో-ఇండియన్ కుటుంబములో జన్మించిన పేషన్స్ కూపర్.
- ... పాకిస్తాన్లో మాట్లాడబడే ఏకైక ద్రవిడ భాష బ్రహుయి. ఇది ఏదో ఒకరిద్దరు మాట్లాడే భాష కాదు 22 లక్షల మంది మాట్లాడే భాష.
- ... మొట్టమొదటగా 1985వ సంవత్సరములోనే టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్ అనే అంతర్జాతీయ సంస్థ బెంగుళూరులో అడుగుపెట్టింది.
2007 మే 26
[మార్చు]- ... కళ్ళు అనే తెలుగు సినిమాను ఆస్కారు నామినేషనుకు ఎంపికచేబడినదని.
- ... నాటకాల్లో పాడుకోలేని ఇతర నటీనటులకు తర వెనుక నుండి పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడే విధానానికి పిఠాపురం నాగేశ్వరరావు శ్రీకారం చుట్టారు.
- ... భారతీయ సినిమా రంగములో మొట్టమొదటి ద్విపాత్రాభినయము చేసిన తొలి నటి, కలకత్తాకు చెందిన ఆంగ్లో-ఇండియన్ కుటుంబములో జన్మించిన పేషన్స్ కూపర్.
- ... కృష్ణుని ప్రియ మిత్రుడు, సహాధ్యాయి సుదాముని స్వస్థలము, జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన నేటి పోర్బందర్.
- ... పాకిస్తాన్ లో మాట్లాడే ఏకైక ద్రవిడ భాష బ్రహుయి. ఇది ఏదో ఒకరిద్దరు మాట్లాడే భాష కాదు 22 లక్షల మంది మాట్లాడే భాష.
2007 మార్చి 7
[మార్చు]- ... నాటకాల్లో పాడుకోలేని ఇతర నటీనటులకు తర వెనుక నుండి పాటలు, పద్యాలు, శ్లోకాలు పాడే విధానానికి పిఠాపురం నాగేశ్వరరావు శ్రీకారం చుట్టారు అని.
- ... భారతీయ సినిమా రంగములో మొట్టమొదటి ద్విపాత్రాభినయము చేసిన తొలి నటి, కలకత్తాకు చెందిన ఆంగ్లో-ఇండియన్ కుటుంబములో జన్మించిన పేషన్స్ కూపర్ అని.
- ... కృష్ణుని ప్రియ మిత్రుడు, సహాధ్యాయి సుదాముని స్వస్థలము, జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన నేటి పోర్బందర్ అని.
- ... పాకిస్తాన్ లో మాట్లాడే ఏకైక ద్రవిడ భాష బ్రహుయి అని. ఇది ఏదో ఒకరిద్దరు మాట్లాడే భాష కాదు 22 లక్షల మంది మాట్లాడే భాష.
- ... 1952 లో తొలి మిస్ మద్రాసు, టంగుటూరి ప్రకాశం పంతులు అన్న కూతురు అయిన సినీ నటి టంగుటూరి సూర్యకుమారి అని.
2007 జనవరి 7
[మార్చు]- ... భారతీయ సినిమా రంగములో మొట్టమొదటి ద్విపాత్రాభినయము చేసిన తొలి నటి, కలకత్తాకు చెందిన ఆంగ్లో-ఇండియన్ కుటుంబములో జన్మించిన పేషన్స్ కూపర్ అని.
- ... కృష్ణుని ప్రియ మిత్రుడు, సహాధ్యాయి సుదాముని స్వస్థలము, జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన నేటి పోర్బందర్ అని.
- ... పాకిస్తాన్ లో మాట్లాడే ఏకైక ద్రవిడ భాష బ్రహుయి అని. ఇది ఏదో ఒకరిద్దరు మాట్లాడే భాష కాదు 22 లక్షల మంది మాట్లాడే భాష.
- ... 1952 లో తొలి మిస్ మద్రాసు, టంగుటూరి ప్రకాశం పంతులు అన్న కూతురు అయిన సినీ నటి టంగుటూరి సూర్యకుమారి అని.
2006 సంవత్సరంలో వాక్యాలు
[మార్చు]2006 అక్టోబరు 2
[మార్చు]- ... కృష్ణుని ప్రియ మిత్రుడు, సహాధ్యాయి సుధాముని స్వస్థలము, జాతిపిత మహాత్మా గాంధీ పుట్టిన నేటి పోర్బందర్ అని.
- ... పాకిస్తాన్ లో మాట్లాడే ఏకైక ద్రవిడ భాష బ్రహుయి అని. ఇది ఏదో ఒకరిద్దరు మాట్లాడే భాష కాదు 22 లక్షల మంది మాట్లాడే భాష.
- ... 1952 లో తొలి మిస్ మద్రాసు, టంగుటూరి ప్రకాశం పంతులు అన్న కూతురు అయిన సినీ నటి టంగుటూరి సూర్యకుమారి అని.
- ... జగ్గయ్య, లోక్‌సభకు ఎన్నికైన తొలి భారతీయ సినీనటుడు అని.