నీటిలో కరిగే విటమినులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విటమిన్-బి సప్లిమెంట్ టాబ్లెట్లు

విటమిన్ బి1, (థయామిన్)

[మార్చు]

విటమిన్ను 'యాంటీ బెరి బెరి విటమిన్', 'యాంటీ న్యూరైటెక్ విటమిన్' అని కూడా అంటారు. థయామిన్ ధాన్యం పై పొరల్లో లభ్యమౌతుంది. ముఖ్యంగా బియ్యం, జొన్నలు, గోధుమ మొదలైన ధాన్యం పై పొరల్లో పుష్కలంగా లభిస్తుంది. పాలిష్ చెయ్యని (దంపుడు) బియ్యంలో ఈ విటమిన్ సమ్రుద్ధిగా లభిస్తుంది. పాలిష్ చెయ్యని గోధుమల ద్వారా వచ్చిన పిండిలో కూడా థయామిన్ లభిస్తుంది. థయామిన్ ధాన్యాల్లోనే కాకుండా పాలు, పప్పు ధాన్యాలు, కాలేయం, ఈస్ట్ లలో కూడా లభ్యమౌతుంది. శరీరంలో పిండి పధార్థాల జీవక్రియలో థయామిన్ ఉపయోగపడుతుంది. ఈ విటమిన్ లోపం వల్ల 'బెరి బెరి' వ్యాధి వస్తుంది.

విటమిన్ బి 2,(రైబో ఫ్లావిన్)

[మార్చు]

దీనిని విటమిన్ -జి అని, ఎల్లో ఎంజైమ్ అని కూడా అంటారు. పాలు, గ్రుడ్లు, కాలేయంలలో ఈ విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. ఈ విటమిన్ లోపం వల్ల నాలుక, నోటి మూలలు పగులుతాయి. దీనినే 'గ్లాసిటిస్' అంటారు. వృద్ధుల్లో ఈ విటమిన్ లోపం వల్ల కళ్ళలో నీళ్ళు కారుతుంటుంది.

విటమిన్ బి 3,(నియాసిన్/నికోటిక్ ఆమ్లము)

[మార్చు]

దీనిని పెల్లెగ్రా ప్రివెంటివ్ విటమిన్ అని కూడా అంటారు. ఇది ఆకు కూరలు, జంతువుల కాలేయం, మూత్ర పిండాలు, కోడి గ్రుడ్లు, పాలు, చేపలు, వేరుశనగ పప్పులో లభిస్తుంది. ఈ విటమిన్ లోపం ఏర్పడినప్పుడు 'పెల్లగ్రా' వ్యాధి వస్తుంది. ఈ వ్యాధిగ్రస్తుల్లో మెడ, చేతులపై చర్మం ఎండి పోయి పొలుసులుగా మారుతుంది.

విటమిన్ బి 6,(పైరిడాక్సిన్)

[మార్చు]

ఈ విటమిన్ అన్ని రకాల ఆహార పధార్థాలలో లభిస్తుంది. ఇది మన శరీరంలో విడుదలయ్యే అమైనొ ఆమ్లాల జీవక్రియల్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది.

ఫాంటోథినిక్ ఆమ్లం

[మార్చు]

ఈ విటమిన్ కూడా అన్ని రకాలైన ఆహార పధార్థాల నుండి లభిస్తుంది. కాలేయం, గ్రుడ్లు, వేరుశనగ, బటాణీ, మొదలైన వాటిలో పుష్కలంగా లభిస్తుంది. ఈ విటమిన్ లోపం వల్ల మనుషుల కాళ్ళలో మంటలు పుడతాయి.

బయాటిన్

[మార్చు]

దీనిని విటమిన్ -హెచ్ అని కూడా అంటారు. బయాటిన్ కాలేయం, మూత్ర పిండం, ఆకుకూరల్లో పుష్కలంగా లభిస్తుంది. మానవుల జీర్ణ నాళంలో ఉండే సహజీవన బాక్టీరియా కూడా ఈ విటమిన్‌ను తయారు చేస్తుంది. యాంటీ బయాటిక్ మందులు ఎక్కువ కాలం వాడినప్పుడు, పచ్చి గ్రుడ్లను ఆహారంగా తీసుకున్నప్పుడు, ఈ విటమిన్ లోపం ఏర్పడే ప్రమాదం ఉంది. గ్రుడ్లలోని తెల్లసొనలో ఉండే 'ఆడ్విన్' అనబడే ప్రొటీను బయాటిన్ శోషణాన్ని అడ్డుకుంటుంది, కాబట్టి పచ్చి గ్రుడ్లను ఆహారంగా తీసుకున్నప్పుడు ఈ విటమిన్ లోపం ఏర్పడుతుంది. ఈ విటమిన్ లోపం వలన, శరీరం పాలిపోవడము, అలసట, కండరాల నొప్పులు, ఆకలి మందగించడం మొదలైన లక్షణాలు కలుగుతాయి.

ఫోలిక్ ఆమ్లం

[మార్చు]

ఈ విటమిన్ ఆకు కూరలు, కాలేయం, గ్రుడ్లు, పాలు, మొదలైన వాటిల్లో సమ్రుద్దిగా లభిస్తుంది. ఎముక మధ్యలో ఎర్ర రక్త కణాల తయారీకి ఈ విటమిన్ ఉపయోగ పడుతుంది. ముఖ్యంగా ఎర్ర రక్త కణాల తయారీలో ఫోలిక్ ఆమ్లంతొ పాటు ఐరన్, కోబాల్ట్, విటమిన్ బి 12, విటమిన్ సి కూడా తోడ్పడతాయి. ఈ విటమిన్ లోపం వల్ల ఎర్ర రక్త కణాల సంఖ్య తగ్గి పోతుంది. దాని ఫలితంగా హిమోగ్లోబిన్ శాతం కూడా పడి పోతుంది. దీనినే 'ఎనీమియా'(రక్త హీనత) అంటారు.

విటమిన్ బి 12,(సయనో కొబాలమిన్)

[మార్చు]

ఈ విటమిన్ కాలేయం, గ్రుడ్లు, పాలు, మాంసం మొదలైన వాటిల్లో పుష్కలంగా లభిస్తుంది. ఈ విటమిన్ లోపం వల్ల ఫెర్నీషియస్ ఎనీమియాకు దారి తీస్తుంది.

విటమిన్ -సి

[మార్చు]

ఈ విటమిన్ నిమ్మజాతి పండ్లలో, ఉసిరికాయలు, జామకాయలు, మామిడి కాయల్లో ఎక్కువగా లభిస్తుంది. ఈ విటమిన్ యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేస్తుంది. వ్యాధి నిరోధకతను పెంచి, గాయాలు తొందరగా మానడానికి, విరిగిన ఎముకలు తొందరగా అతకటానికి తోడ్పడుతుంది. విటమిన్ -సి లోపం వల్ల చర్మం క్రింద రక్త నాళాలు చిట్లుతాయి. దాని వల్ల చర్మం క్రింద నల్లటి మచ్చలు ఏర్పడతాయి. చిగుళ్ళ నుండి రక్తం కారుతుంది...