బాబీ ఫిషర్
బాబి ఫిషర్ | |
---|---|
పూర్తి పేరు | రాబర్ట్ జేమ్స్ ఫిషర్ |
దేశం | United States Iceland (2005–08) |
పుట్టిన తేది | చికాగో, అమెరికా | 1943 మార్చి 9
మరణం | 2008 జనవరి 17 అమెరికా, ఐస్‌లాండ్ | (వయసు 64)
టైటిల్ | Grandmaster (1958) |
ప్రపంచ ఛాంపియన్ | 1972–75 |
అత్యున్నత రేటింగ్ | 2785 (July 1972 FIDE rating list) |
బాబీ ఫిషర్ (Robert James "Bobby" Fischer) మార్చి 9, 1943న , అమెరికాలో జన్మించాడు. చిన్నతనంలోనే అరవై నాలుగు గళ్ళ చదరంగం క్రీడలో అపారమైన ప్రతిభను చూపినాడు. 1972లో ప్రపంచ చదరంగ కిరీటాన్ని గెలిచి ఆ ఘనత సాధించిన తొలి అమెరికన్‌గా రికార్డు సృష్టించాడు. అమెరికా-రష్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతున్న రోజులలో ఒక అమెరికన్ చదరంగంలో రష్యా ఆధిపత్యాన్ని అంతం చేయడం చాలా ప్రాధాన్యత వహించింది. ఐస్‌లాండ్ లో జరిగిన పోటీలో ప్రముఖ క్రీడాకారుడు బొరిస్ స్పాస్కీని ఓడించి చదరంగంలో రష్యా ఆధిపత్యాన్ని సవాలు చేశాడు. ఆ తరువాత అతని జీవితం అనేక మలుపులు తిరిగి ప్రవాసంలోకి వెళ్ళిపోవలసి వచ్చింది. చివరికి టైటిల్ నెగ్గి పేరు సంపాదించిన ఐస్‌లాండ్ దేశ పౌరసత్వం తీసుకున్నాడు. ప్రపంచ చదరంగ క్రీడలో అతను సుస్థిర స్థానం సంపాదించినాడు. జనవరి 17, 2008న తుదిశ్వాస వదిలాడు.
బాల్యం
[మార్చు]బాబీ ఫిషర్ అమెరికాలోని చికాగోలో మార్చి 9, 1943న జన్మించాడు. ఆరు సంవత్సరాల ప్రాయంలోనే ఫిషర్ చదరంగ క్రీడపై మక్కువ చూపినాడు. ఇతడి అక్క జోన్‌నీ ప్రభావంతో గంటల తరబడి చదరంగం క్రీడలోనే మునిగి తేలేవాడు. ఈ కృషితో 13 ఏళ్ళ ప్రాయంలో ఫిషర్ అమెరికా జూనియర్ చెస్ చాంపియన్‌గా చేసింది.
క్రీడా జీవితం
[మార్చు]13 సంవత్సరాల వయస్సులో అమెరికా జూనియర్ చాంపియన్‌షిప్ గెలుపొంది అతిపిన్న వయస్సులో ఈ టైటిల్ సాధించిన రికార్డు కూడా పొందినాడు.[1] ఈ రికార్డు నేటికీ పదిలంగానే ఉంది. 1960లో రష్యాకు చెందిన బొరిస్ స్పాస్కీతో తొలిసారిగ తలపడ్డాడు. అందులో 13.5/15 స్కోరు సాధించాడు.[2] 1962లో స్టాక్‌హోం ఇంటర్ జోనల్ టైటిల్ పొందినాడు. అమెరికన్ చెస్ చాంపియన్‌షిప్ ను బాబీ ఫిషర్ 8 పర్యాయాలు విజయం సాధించాడు.
రష్యా ఆధిపత్యానికి సవాలు
[మార్చు]అమెరికా-రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న రోజులలో ఏ చిన్న విషయమైనా ఇరుదేశాల మధ్య అగ్ని ప్రజ్వరిల్లేది. అలాంటి సమయంలో రష్యా ఆధిపత్యంలో ఉన్న చదరంగం క్రీడలో బాబీ ఫిషర్ జయపతాకం ఎగురవేసి సంచలనం సృష్టించాడు. అప్పటి వరకు ఏ అమెరికన్ కూడా చదరంగంలో ప్రపంచ చాంపియన్ కాలేదు. 1972లో ఐస్‌లాండ్ రాజధాని నగరం రిక్జావిక్ లో జరిగిన పోరులో రష్యాకు చెందిన ప్రముఖ చెస్ మేధావి బొరిక్ స్పాస్కీని బోల్టా కొట్టించి రష్యా ఆధిపత్యానికి పగ్గాలు వేశాడు. 21 గేములు సాగిన పోరులో విజయం సాధించి అమెరికా తరఫున తొలి చదరంగ ప్రపంచ చాంపియన్ అయ్యాడు.
వివాదాల క్రీడా జీవితం
[మార్చు]రష్యా ఆధిపత్యాన్ని అంతంచేసిన బాబీ ఫిషర్ అమెరికాలో గొప్ప పేరు సంపాదించాడు. కాని వింత మనస్తత్వంతో తన క్రీడాజీవితాన్ని తానే కూలగొట్టుకున్నాడు. 1975లో అంతర్జాతీయ చెస్ సమాఖ్య తన నిబంధనలను ఆమోదించలేదని రష్యా గ్రాండ్‌మాస్టర్ అనతోలీ కార్పోవ్ తో చదరంగం ఆడేందుకు నిరాకరించినాడు. తద్వారా ప్రపంచ చాంపియన్ టైటిల్ కోల్పోయాడు. తక్కువ వయస్సులోనే చెస్‌కు వీడ్కోలు చెప్పాడు. 1992లో మళ్ళీ అంతర్జాతీయ పోటీలలో పాల్గొని యుగోస్లేవియాలో జరిగిన పోరులో బొరిస్ స్పాస్కీని ఓడించాడు. అదే సంఘటన అతని జీవితాన్ని విషాదమయం చేసింది. యుగోస్లేవియాపై ఉన్న ఆంక్షలు కారణంగా ఆ దేశంలో జరిగే పోటీలలో పాల్గొనరాదనే హెచ్చరికను లెక్కచేయని బాబీ ఫిషర్‌పై అమెరికా చర్యలు తీసుకుంది. అంతవరకు చదరంగం క్రీడ ద్వారా ఆర్జించిన పారితోషికాలను అమెరికా కోశాగారంలో జప్తుచేయాలని ఆదేశించింది. దీనిపై బాబీ ఫిషర్ అమెరికాపై విరుచుకుపడ్డాడు.
అజ్ఝాత జీవితం
[మార్చు]బాబీ ఫిషర్ అమెరికాను విమర్శించుటతో అమెరికా ఫిషర్‌ను పట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నించింది. దీనితో ఫిషర్ చాలా కాలం జపాన్ లో అజ్ఞాతజీవితం గడిపాడు. 2001, సెప్టెంబర్ 11న అమెరికాపై జరిగిన దాడులను సమర్థించి సంచలనం సృష్టించాడు. ఆ తరువాత మొదటిసారి బొరిక్ స్పాస్కీని ఓడించి ప్రపంచ చదరంగం టైటిల్ సాధించిన ఐస్‌లాండ్‌లో తలదాచుకున్నాడు. ఐస్‌లాండ్ ప్రభుత్వం కూడా బాబీ ఫిషర్‌కు పౌరసత్వం ప్రసాదించింది.
నెరవేరని కోరిక
[మార్చు]భారత్ కు వచ్చి విశ్వనాథన్ ఆనంద్ తో ఫిషర్ రాండమ్, చెస్ 960 పద్దతులలో తలపడాలని భావించిన ఫిషర్ కోరిక నెరవేరకుండానే 2008, జనవరి 17న మూత్రపిండాల వ్యాధితో రిక్జావిక్‌లో మరణించాడు.[3] [4] [5] [6] [7][8][9]
మూలాలు
[మార్చు]- ↑ Wade, Robert and Kevin O'Connell, editors. The Games of Robert J. Fischer. Batsford 1972. p. 100.
- ↑ Wade, Robert and Kevin O'Connell, editors. The Games of Robert J. Fischer. Batsford 1972. p. 183.
- ↑ "|title=Fischer Hospitalized in Reykjavik |author=Mig Greengard |publisher=Chess Ninja |date=2007-11-23 చెస్ నింజా డాట్ కామ్". Archived from the original on 2008-01-29. Retrieved 2008-01-23.
- ↑ "చెస్ మేధావి బాబీ ఫిషర్". Archived from the original on 2008-01-20. Retrieved 2008-01-20.
- ↑ Bobby Fischer: Demise of a chess legend, the BBC on Fischer's personality and downfall
- ↑ Chess legend Fischer dies at 64, BBC News, 2008-01-18
- ↑ William Hartston, Bobby Fisher (obituary) Archived 2008-01-22 at the Wayback Machine, The Independent, 19 January 2008
- ↑ "AP Obituary". 2008-01-18. Archived from the original on 2008-01-23. Retrieved 2008-01-23.
- ↑ "Chess Champion Bobby Fischer Has Died". The Post Chronicle. 2008-01-17. Archived from the original on 2008-01-20. Retrieved 2008-01-17.
ఇతర లింకులు
[మార్చు]- బాబీ ఫిషర్ player profile and games at Chessgames.com
- "The Chessman", Garry Kasparov Archived 2013-08-22 at the Wayback Machine, TIME magazine, January 26, 2008
- "Death of a madman driven sane by chess", Stephen Moss The Guardian, January 19, 2008
- "Bobby Fischer's Pathetic Endgame", Rene Chun The Atlantic, December 2002
- Extensive collection of Fischer photographs, Echecs-photos online
- Edward Winter, List of books about Fischer and Kasparov
- Archive of Fischer's personal homepage
- Bobby Fischer Live Radio Interviews (1999–2006)
- A compilation of pictures of Fischer in the Philippines 1967 made into a video
- "Breaking news: Fischer comeback? (May 27, 2005)", chessbase.com Alex Titomirov initiated discussion about Fischer comeback to the arena of competitive chess
- The Bobby Fischer Defense, an essay by Garry Kasparov in the New York Review of Books, February 2011.
- Me & Bobby Fischer | A documentary about getting Bobby Fischer out of jail in Japan and his last years in Iceland
- A ninety-minute HBO documentary about Bobby's Fischer's life entitled "Bobby Fischer Against the World" that aired in June 2011
- Bobby Fischer: Chess's beguiling, eccentric genius BBC News, July 4, 2011