రాబర్ట్ కోచ్
స్వరూపం
రాబర్ట్ కోచ్ | |
---|---|
![]() | |
జననం | Clausthal, Kingdom of Hanover | 1843 డిసెంబరు 11
మరణం | మే 27, 1910 Baden-Baden, Grand Duchy of Baden | (aged 66)
రంగములు | సూక్ష్మ జీవశాస్త్రం |
వృత్తిసంస్థలు | Imperial Health Office, బెర్లిన్ విశ్వవిద్యాలయం |
చదువుకున్న సంస్థలు | University of Göttingen |
పరిశోధనా సలహాదారుడు(లు) | Friedrich Gustav Jakob Henle |
ప్రసిద్ధి | బాక్టీరియాలను కనిపెట్టడం కోచ్ ప్రతిపాదితాలు ఆంథ్రాక్స్, క్షయ, కలరా వ్యాధి కారకాలను గుర్తించడం. |
ముఖ్యమైన పురస్కారాలు | నోబెల్ బహుమతి (1905) |
డాక్టర్ రాబర్ట్ కోచ్ (జ: డిసెంబర్ 11 1843 – మ: మే 27 1910) జర్మనీకి చెందిన ప్రపంచ ప్రసిద్ధ వైద్యుడు, శాస్త్రవేత్త. ఇతడు ఆంథ్రాక్స్ వ్యాధి కారకమైన బాసిల్లస్ ఆంథ్రసిస్ను (1877), క్షయ వ్యాధి కారకమైన మైకోబాక్టీరియాను (1882), కలరా వ్యాధి కారకమైన విబ్రియో కలరాను (1883) తొలిసారిగా గుర్తించాడు. ఇతడే వ్యాధులకు వాటి కారకాలకు సంబంధించిన కోచ్ ప్రతిపాదితాలను సూచించాడు.
క్షయ వ్యాధికి సంబంధించిన దానిపై 1905లో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందాడు. ఇతడు సూక్ష్మ జీవశాస్త్రంలో ప్రముఖులైన పాల్ ఎర్లిష్ వంటి ప్రముఖులకు మార్గదర్శకులు.
బయటి లింకులు
[మార్చు]- Robert Koch Biography at the Nobel Foundation website
- Robert Koch Biography and bibliography in the Virtual Laboratory of the Max Planck Institute for the History of Science