మైక్ ఆథర్టన్
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మైకెల ఆండ్రూ ఆథర్టన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ఫెయిల్స్‌వర్త్, లాంకషైర్, ఇంగ్లాండ్ | 1968 మార్చి 23|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | ఆతేర్స్, కాక్రోచ్, డ్రెడీ, ఐరన్ మైక్, FEC, లాంగ్ హ్యాండిల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 0 అం. (1.83 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి వాటం లెగ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | Josh de Caires (son) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వెబ్‌సైటు | http://www.mikeatherton.co.uk/ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 538) | 1989 ఆగస్టు 10 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2001 ఆగస్టు 27 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 108) | 1990 జూలై 18 - ఇండియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1998 ఆగస్టు 20 - శ్రీలంక తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1987–1989 | Cambridge University | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1987–2001 | Lancashire | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2007 సెప్టెంబరు 1 |
1968, మార్చి 23న జన్మించిన మైక్ ఆథర్టన్ లేదా మైకేల్ ఆథర్టన్ ( (Michael Andrew Atherton) ఇంగ్లాండుకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. ఇంగ్లాండు తరఫున రికార్డు స్థాయిలో 54 టెస్టులకు [1] నాయకత్వం వహించిన ఆథర్టన్ రిటైర్‌మెంట్ అనంతరం క్రికెట్ వ్యాఖ్యాతగా, జర్నలిస్టుగా పనిచేశాడు.
క్రీడాజీవితం
[మార్చు]1989లో తొలిసారిగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదవ టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండు తరఫున ప్రాతినిధ్యం వహించాడు. కాని తొలి ఇన్నింగ్సులోనే డకౌట్ అయ్యాడు.[2] రెండో ఇన్నింగ్సులో 47 పరిగులు చేశాడు. 1990 వేసవిలో న్యూజీలాండ్, భారత్‌తో జరిగిన టెస్టులలో సెంచరీలు సాధించి యంగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు పొందినాడు. 1990-91లో ఆస్ట్రేలియాతో జరిగిన యాషెష్ సీరీస్‌లో ఇంగ్లాండు జట్టు 3-0 తో ఓడినప్పటికీ ఆథర్టన్ మూడవ టెస్టులో సెంచరీ సాధించాడు. 1992-93లో భారత్, శ్రీలంక పర్యటించిననూ మంచి ఫలితాలు పొందలేడు.
1993 యాషెష్ సీరీస్‌లో పాల్గొనడం చివరివరకు సందేహంగా ఉన్ననూ 6 టెస్టుల సీరీస్‌లో లార్డ్స్‌లో 99 పరుగులతో కలిపి మొత్తం 6 అర్థశతకాలను సాధించి భవిష్యత్తులో జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. గ్రాహం గూచ్ ఆస్ట్రేలియాతో వరుసగా టెస్టులలో ఓడిపోవడంతో కేవలం 25 సంవత్సరాల వయస్సులోనే మైక్ ఆథర్టన్ తో ఆ స్థానాన్ని భర్తీ చేశారు. తన తొలి కెప్టెన్సీ టెస్టులో ఆస్ట్రేలియాతో ఓడిపోయినప్పటికీ నైతికంగా ఇంగ్లాండు విజయం సాధించింది. ఇది వరుసగా ఆస్ట్రేలియాపై ఇంగ్లాండుకు 18వ పరాజయం కావడం గమనార్హం.
1993-94లో ఆథర్టన్ నాయకత్వంలో వెస్టీండీస్ పర్యటించిన ఇంగ్లాండు జట్టుకు మళ్ళీ 3-1 తేడాతో పరాజయం ఎదురైంది. ఇదే సీరీస్‌లో ఆంటిగ్వా టెస్టులో బ్రియాన్ లారా 375 పరుగుల వ్యక్తిగత సాధించి ప్రపంచ రికార్డు సృష్టించాడు (ఈ రికార్డును హేడెన్ 380 పరుగులతీ ఛేధించగా మళ్ళీ లారా 400 పరుగులతో తన స్థానాన్ని తిరిగి పొందినాడు). ఈ సీరీస్‌లో ఆథర్టన్ 56.67 సగటుతో 510 పరుగులు సాధించి ఇంగ్లాండు బ్యాట్స్‌మెన్‌లలో టాపర్‌గా నిలిచాడు. ఆ తరువాత స్వదేశంలో న్యూజీలాండ్‌తో జరిగిన సీరీస్‌లో 2 సెంచరీలు సాధించాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన లార్డ్స్ టెస్టులో బాల్ టాపరింగ్ వివాదంలో చిక్కుకొని 2000 పౌండ్ల అపరాధరుసుంకు గురైనాడు. ఈ సంఘటన అనంతరం హెడింగ్లీ టెస్టులో చెలరేగి ఆడి 99 పరుగులు చేశాడు.
ఆ తరువాత రెండేళ్ళలో భారత్, న్యూజీలాండ్ లపై విజయాలు పొందిననూ ఆస్ట్రేలియా, పాకిస్తాన్ లపై తీవ్రంగా పోరాడవలసి వచ్చింది. 2001 యాషెష్ సీరీస్ వరకు ఆథర్టన్ జట్టు తరఫున విజయాలకు శాయశక్తుల పోరాడినాడు. ఆగష్టు 27న ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌తో రిటైర్‌మెంట్ తీసుకున్నాడు.
రిటైర్‌మెంట్ తదనంతరం
[మార్చు]ఆథర్టన్ క్రికెట్ ఆట నుంచి రిటైర్‌మెంట్ పొందిన తరువాత "ది సండే టెలిగ్రాఫ్" పత్రిక తరఫున జర్నలిస్టుగా పనిచేశాడు. 2002 నుంచి 2005 వరకు ఛానెల్-4 తరఫున, బిబిసి రేడియా తరఫున వ్యాఖ్యాతగా పనిచేశాడు. 2005 స్కైస్పోట్స్ వ్యాఖ్యాతల టీంలో స్థానం పొందినాడు.
రచనలు
[మార్చు]మైక్ ఆథర్టన్ 2002లో తన ఆత్మకథ ఓపెనింగ్ అప్ (Opening Up)ను విడుదల చేశాడు. 2006లో విడుదలచేసిన Gambling: A Story of Triumph and Disaster కూడా రచించాడు.
టెస్టు క్రికెట్ గణాంకాలు
[మార్చు]ఇంగ్లాండు తరఫున 115 టెస్టులలో ప్రాతినిధ్యం వహించి 37.69 సగటుతో 7728 పరుగులు సాధించాడు. ఇందులో 16 సెంచరీలు, 46 అర్థసెంచరీలు కలవు. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 185నాటౌట్. బౌలింగ్‌లో రెండి వికెట్లు, ఫీల్డింగ్‌లో 83 క్యాచ్‌లు సాధించాడు.
వన్డే క్రికెట్ గణాంకాలు
[మార్చు]ఆథర్టన్ 54 వన్డేలలో జట్టుకు ప్రాతినిధ్యం వహించి 35.11 సగటుతో 1791 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 12 అర్థసెంచరీలు ఉన్నాయి. వన్డేలలో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరు 127 పరుగులు. ఫీల్డింగ్‌లో 15 క్యాచ్‌లు పొందినాడు.
ప్రపంచ కప్ క్రికెట్
[మార్చు]1996లో జరిగిన ప్రపంచ కప్ టోర్నమెంటులో ఆథర్టన్ ఇంగ్లాండు జట్టుకు నాయకత్వం వహించాడు. 1998లో వన్డేలనుంచి నిష్క్రమించడంతో తదుపరి టోర్నమెంటులో ఆడే అవకాశం రాలేదు.
మూలాలు
[మార్చు]- ↑ "Tests as captain". Archived from the original on 2006-02-14. Retrieved 2008-05-19.
- ↑ Test debut