పండరీపురం
Pandharpur | |
---|---|
Nickname(s): Pandhari, Pandaripuram | |
Coordinates: 17°40′40″N 75°19′40″E / 17.67778°N 75.32778°E | |
Country | India |
రాష్ట్రం | Maharashtra |
జిల్లా | Solapur |
Government | |
• Type | Municipal Council |
విస్తీర్ణం | |
• Total | 20.2 కి.మీ2 (7.8 చ. మై) |
• Rank | 9 |
Elevation | 450 మీ (1,480 అ.) |
జనాభా (2015) | |
• Total | 2,42,515 |
• జనసాంద్రత | 12,000/కి.మీ2 (31,000/చ. మై.) |
Language | |
• Official | Marathi |
Time zone | UTC+5:30 (భా.ప్రా.కా) |
Vehicle registration | MH-13 |
పండరీపురం (ఆంగ్లం: Pandharpur) మహారాష్ట్ర రాష్ట్రంలో షోలాపూర్ జిల్లాలో ఉంది.
భౌగోళికం
[మార్చు]పండరీపురం 17°40′N 75°20′E / 17.67°N 75.33°E[1]. సముద్ర మట్టం నుంచి 458 మీటర్లు (1502 అడుగులు) ఎత్తులో ఉంది.
జనాభా గణాంకాలు
[మార్చు]2001 జనాభా లెక్కల ప్రకారం పండరీపురంలో 91,381 మంది నివసిస్తున్నారు. ఇందులో పురుషులు 52 శాతం, స్త్రీలు 48 శాతం. 71 శాతం మంది అక్షరాస్యులు (జాతీయ సగటు 59.5% కంటే ఎక్కువగా). 12 శాతం మంది చిన్న పిల్లలు.
చరిత్ర
[మార్చు]పండరీపురం మహారాష్ట్రలోని ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఇది చంద్రభాగా నది (ప్రస్తుతం భీమా నది) ఒడ్డున ఉంది. ఇక్కడ ప్రసిద్ధమైన పాండురంగ విఠలుడు రుక్మిణీ దేవి సమేతంగా వెలసి యున్నాడు. హిందువులు ఇతన్ని శ్రీకృష్ణుని అవతారంగా భావిస్తారు. మహారాష్ట్రకు కర్నాటకకు చెందిన వైష్ణవ భక్తులు 13 నుండి 17 శతబ్దాల మధ్యకాలంలో జ్ఞానేశ్వర్, నామ్ దేవ్, ఏక్ నాథ్, తుకారాం, పురంధర దాసు, విజయ్ దాస్, గోపాల్ దాస్, జగన్నాథ్ దాస్, ఇతన్ని కొలిచి తరించారు. ఈ దేవాలయానికి ఆరు ద్వారాలున్నాయి. మహారాష్ట్రీయులు పండరీ పురాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఇక్కడి స్వామి వారిని విఠోభా, పాండురంగ, పండరినాధ్, విఠల్, విఠల్ నాద్ అనే పేర్లతో కూడా పిలుస్తారు.
కొందరు భక్తులు దేవుళ్లపై దీక్ష వహిస్తారు. అలాంటి దీక్షలో ముఖ్యమైనది అయ్యప్ప దీక్ష. అలాగే, వేంకటేశ్వర దీక్ష, శివ దీక్ష, దుర్గమ్మ దీక్ష భవానీ దీక్ష చేపట్టి కొన్ని రోజులు నియమ నిష్టలతో దీక్ష సాగించి ఒక రోజున ఆయా దేవాలయాలకు యాత్రగా కాలినడకన బయలు దేరుతారు. ఆలాంటి దీక్షకు పండరి నాధుని దీక్షకూడ ఒక మంచి ఉదాహరణ.
ఆషాఢ మాస తొలి ఏకాదశి నాడు జరిగే ఉత్సవాలకు జనం లక్షల సంఖ్యలో వస్తారు. పక్కనున్న నదీ ప్రాంతమంతా జన సంద్రంలాగా కోలాహలంగా వుంటుంది. పాద యాత్రికులు ఆ రోజుకు చేరుకునేలాగా తమ ప్రయాణాన్ని నిర్ణయించుకుంటారు.
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]గ్రంథ పట్టిక
[మార్చు]- G.A.Deleury, The cult of Vithoba (Pune: Deccan College (Pune), 1960)
- M.S.Mate, Temples and legends of Maharashtra (Bombay: Bharatiya Vidya Bhavan, 1988), pp188–220
- D.B.Mokashi, Palkhi: a pilgrimage to Pandharpur (translated from the Marathi) (Albany, NY: State University of New York Press; Hyderabad: Orient Longman, 1990)