అక్షాంశ రేఖాంశాలు: 17°40′N 75°20′E / 17.67°N 75.33°E / 17.67; 75.33

శ్రీ విఠల్ రుక్మిణి ఆలయం, పండరీపురం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ విఠల్ రుక్మిణి ఆలయం, పండరీపురం
విఠోబా మందిర్
శ్రీ విఠల్ రుక్మిణి దేవస్థానం
శ్రీ విఠల్ రుక్మిణి దేవస్థానం
భౌగోళికం
భౌగోళికాంశాలు17°40′N 75°20′E / 17.67°N 75.33°E / 17.67; 75.33
దేశంభారతదేశం
రాష్ట్రంమహారాష్ట్ర
జిల్లాషోలాపూర్
ప్రదేశంపండరీపురం, సోలాపూర్ జిల్లా, మహారాష్ట్ర, భారతదేశం
సంస్కృతి
దైవంవిఠోబా అలియాస్ విఠ్ఠలుడు
ముఖ్యమైన పర్వాలుఆషాఢ ఏకాదశి,
కార్తీక ఏకాదశి
వాస్తుశైలి
నిర్మాణ శైలులుహొయసల ఆర్కిటెక్చర్
చరిత్ర, నిర్వహణ
నిర్మించిన తేదీ1108–1152 CE
సృష్టికర్తవిష్ణువర్ధన, హొయసల సామ్రాజ్యం రాజు[1]

విఠోబా దేవాలయం (మరాఠీ: श्री विठ्ठल-रूक्मिणि देवुळ्) భారతదేశంలోని మహారాష్ట్రలో నెలకొనిఉన్న హిందూ దేవాలయం. ఇది షోలాపూర్ జిల్లాలోని పండరీపురంలో చంద్రభాగా నది (ప్రస్తుతం భీమా నది) ఒడ్డున ఉంది.[2]వైష్ణవాలయంలో శ్రీకృష్ణుడి రూపమైన విఠోబా, అతని దేవేరి రుక్మిణీదేవికి ప్రధాన ఆరాధన కేంద్రం. ఇక్కడ పాండురంగ విఠలుడు రుక్మిణీ దేవి సమేతంగా స్వయంభూగా వెలసి యున్నాడు.[3]

ఈ ఆలయాన్ని భక్తశిఖామణి పుండరీకుడు కోరికమేరకు 1108-1152 CE మధ్య హోయసల సామ్రాజ్యానికి చెందిన రాజు విష్ణువర్ధనుడు నిర్మించాడు. అలాగే, ఆలయంలో 1237 CE నాటి హోయసల రాజు వీర సోమేశ్వరుడి శాసనం ఉంది.[4]

ఇది మహారాష్ట్రలో అత్యధికంగా భక్తులు సందర్శించే దేవాలయం. ఆషాఢ ఏకాదశి, కార్తీక ఏకాదశి పర్వదినాలలో చేరుకోవడానికి వార్కారీలు తమ ఇళ్ల నుండి ఈ ఆలయానికి డిండి (ఊరేగింపు) అని పిలవబడే గుంపులుగా కవాతు చేయడం ప్రారంభిస్తారు. పంఢరీపురంలోని పవిత్రమైన చంద్రభాగానదిలో స్నానం చేస్తే అన్ని పాపాలు హరిస్తాయని నమ్ముతారు. భక్తులందరూ విఠోబా విగ్రహం పాదాలను తాకేందుకు అనుమతిస్తారు. మే 2014లో, వెనుకబడిన తరగతులకు చెందిన వారిని పూజారులుగా ఆహ్వానించిన ఆలయం భారతదేశంలోనే మొదటిది.[5][6][7][8][9]


మూలాలు

[మార్చు]
  1. "The Great Pandharpur Pilgrimage". Live Histrory India. 3 July 2017.
  2. "తొలి ఏకాదశి...ఇక్కడ ప్రత్యేకం | Spiritual". web.archive.org. 2023-06-27. Archived from the original on 2023-06-27. Retrieved 2023-06-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. "శ్రీకృష్ణుడే కదలివచ్చి.. విఠలేశ్వరుడిగా వెలిసే |". web.archive.org. 2023-06-27. Archived from the original on 2023-06-27. Retrieved 2023-06-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "The Great Pandharpur Pilgrimage". Live History India. 3 July 2017.
  5. Vishwas Waghmode (29 May 2014). "Caste no bar: Women, non-Brahmins will be priests in Pandharpur temple". Firstpost. Retrieved 30 August 2018.
  6. Amruta Byatnal (23 May 2014). "Pandharpur temple allows women, men of all castes as priests". The Hindu. Retrieved 30 August 2018.
  7. Daily News & Analysis (15 May 2014). "Athawale slams Sanatan for opposing Dalit priest in temple". Dnaindia.com. Retrieved 29 July 2015.
  8. "First time in 900 yrs, Vitthal Rukmini temple may get non-Brahmin priests". The Indian Express. 6 May 2014. Retrieved 29 July 2015.
  9. "Lord Vithoba temple makes history by having women and lower-caste priests". IANS. news.biharprabha.com. Retrieved 9 May 2014.