రోజర్ ఫెడరర్
రోజర్ ఫెడరర్ (Roger Federer) స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు. ఇతడు 1981, ఆగస్ట్ 8 వ తేదీన స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో జన్మించాడు. 2004, ఫిబ్రవరి 2 నుంచి వరుసగా 237 వారాల పాటు ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు.[1] టెన్నిస్ క్రీడా ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఫెదదర్ ఒకడు.[2] ఇతడు ఇప్పటి వరకు 20 గ్రాండ్‌స్లాం టెన్నిస్ టైటిళ్ళను కైవసం చేసుకొన్నాడు. అందులో ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టైటిళ్ళను 5 సార్లు, వింబుల్డన్ టెన్నిస్ టైటిళ్ళను 8 సార్లు, అమెరికన్ ఓపెన్ టెన్నిస్ టైటిళ్ళను 5 సార్లు, ఫ్రెంచ్ ఓపెన్ 1 సారి గెలుపొందినాడు. డబుల్స్‌లో కూడా ఇప్పటి వరకు 8 టైటిళ్ళను సాధించాడు.
బాల్యం[మార్చు]
రోజర్ ఫెడరర్ స్విట్జర్లాండ్‌లోని బాసెల్‌లో 1981 ఆగస్టు 8 న జన్మించాడు.[3] చిన్నతనంలో ఫుట్‌బాల్ క్రీడలో మంచి ప్రావీణ్యం సంపాదిచాడు. ఫుట్‌బాల్ ఆటలో మంచి ప్రొఫెషనల్ ఆటగాడు కావాలని అనుకున్నప్పటికీ టెన్నిస్ వైపు దృష్టిసారించి రాకెట్ చేతపట్టాడు.
క్రీడాజీవితం[మార్చు]
6 సంవత్సరాల ప్రాయంలోనే ఫెడరర్ టెన్నిస్ ఆడటం ప్రారంభించాడు.[4] 9 సంవత్సరాల వయస్సులో గుంపు పాఠాలు వినడానికి హాజరయ్యేవాడు. మరో సంవత్సరం గడిచే నాటికి వారం వారం ప్రైవేటు కోచింగ్ వెళ్ళడ ఆరంభించాడు. 12 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు ఫుట్‌బాల్ ఆట కూడా ఆడేవాడు. కేవలం టెన్నిస్ మాత్రమే ఆడాలని ఆ సమయంలోనే నిర్ణయించుకున్నాడు.[5] 14 ఏళ్ళ వయస్సులో టెన్నిస్‌లో జాతీయ చాంపియన్ అయ్యాడు. 1998లో ఫెడరర్ వింబుల్డన్ జూనియర్ టైటిల్ సాధించాడు. 2000లో సిడ్నీ ఒలింపిక్స్‌లో సెమీఫైనల్స్ వరకు వెళ్ళినాడు.
2001 : ఫెడరర్ మిలాన్‌లో మొదటి ఏటిపి టోర్నమెంటులో నెగ్గినాడు. ఫిబ్రవరిలో జరిగిన డేవిస్ కప్‌లో 3 మ్యాచులలో నెగ్గి అమెరికాపై విజయం సాధించడంలో తన దేశానికి తోడ్పడ్డాడు. అదే ఏడాది వింబుల్డన్ టెన్నిస్‌లో క్వార్టర్ ఫైనల్స్ వరకు ప్రవేశించాడు. నాల్గవ రౌండ్‌లో 4 సార్లు డిఫెండింగ్ చాంపియన్ అయిన పీట్ సంప్రాస్‌ను ఓడించాడు.
2002 : ఫెడరర్ తన తొలి ఏటిపి మాస్టర్స్ సీరీస్‌లో ప్రవేశించి ఫైనల్లో ఆండ్రీ అగస్సీ చేతిలో పరాజయం పొందినాడు. ఆ తరువాత హాంబర్గ్‌లో ఏ.ఎం.ఎస్. ఫైనల్స్ గెలుపొందినాడు. డేవిస్ కప్‌లో కూడా రెండు మ్యాచ్‌లను గెల్చాడు.
2003 : 2003లో ఫెడరర్ పురుషుల టెన్నిస్‌లో టాప్ ర్యాంకింగ్‌ను సవాలు చేసాడు. ఇదే ఏడాది తన గ్రాండ్ స్లాం టెన్నిస్ పోరాటాన్ని ఆరంభించాడు. నాలుగవ రౌండ్‌లో పరాజయం పొందిననూ ఆ తరువాత మార్సెల్లీ, దుబాయిలలో జరిగిన హార్డ్‌కోర్ట్ టోర్నమెంట్లలో విజయం సాధించాడు. మ్యూనిచ్‌లో జరిగిన క్లే కోర్ట్ టోర్నమెంటులో కూడా విజయం సాధించాడు. ఆ తరువాత ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్‌లో తొలి రౌండ్‌లోనే ఓడిపోయాడు. జూలైలో హాలేలో జరిగిన టోర్నమెంటులో గెలుపొందినాడు. లండన్‌లో జరిగిన వింబుల్డన్ టెన్నిస్‌ను గెల్చి తన క్రీడా జీవితంలోనే తొలి గ్రాండ్‌స్లాం టైటిల్ సాధించాడు. ఈ టోర్నమెంటులో అతడు కోల్పోయినది ఒకేఒక్క సెట్టు మాత్రమే. అమెరికన్ ఓపెన్ టెన్నిస్‌లో కూడా ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ వలె 4 వ రౌండ్‌లోనే పరాజయం పొందినాడు.
2004 : ఫెదరర్‌కు 2004 అత్యంత ఫలప్రథమైన సంవత్సరంగా చెప్పవచ్చు.[6] ఈ సంవత్సరంలో 3 గ్రాండ్‌స్లాం టైటిళ్ళతో పాటు పలు ఇతర సింగిల్స్ టైటిళ్ళు కైవసం చేసుకున్నాడు. మొదట ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మారట్ సఫిన్‌ను ఓడించి 2004లో తొలి గ్రాండ్‌స్లాం సాధించాడు. దీనితో ప్రపంచ నెంబర్ 1 గా ఉన్న ఆండీ రోడిగ్‌ను వెనక్కి నెట్టి తను ఆ స్థానాన్ని పొందినాడు. అప్పటి నుంచి వరుసగా ఇన్ని వారాలు గడిచిననూ ఫెదరర్ నెంబర్ 1 స్థానాన్ని వదలలేడు. వింబుల్డన్ టోర్నమెంట్‌లో ఆండీ రోడిగ్ పైనే ఫైనల్లో విజయం సాధించాడు. ఆ తరువాత అమెరిక ఓపెన్‌లో ల్యూటన్ హెవిట్ పై గెలిచి టైటిల్ సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో మాత్రం 3వ రౌండ్ వరకు మాత్రమే వెళ్ళగలిగాడు.
2005 : 2005లో 2 గ్రాండ్‌స్లాంలు సాధించి మరో రెండింటిలో సెమీఫైనల్స్ వరకు చేరినాడు. మొదటగా ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీఫైనల్లో సఫిన్ చేతిలో 5 గంటలపాటు జరిగిన పోరులో పరాజయం పొందినాడు.[7] ఫ్రెంచ్ ఓపెన్‌లో కూడా సెమీఫైనల్లో నాదల్ చేతిలో ఖంగుతిన్నాడు. ఆ తరువాత వింబుల్డన్ లో ఆండీ రోడిగ్‌ను ఓడించి టైటిల్ సాధించాడు. అమెరికన్ ఓపెన్‌లో కూడా ఆండ్రీ అగస్సీని ఓడించి టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఈ ఏడాది మొత్తం 15 టోర్నమెంట్లలో పాల్గొని 11 టైటిళ్ళు సాధించాడు.
2006 : 2006లో కూడా ఫెదరర్ 3 గ్రాండ్‌స్లాం టైటిళ్ళు సాధించాడు. ఫ్రెంచ్ ఓపెన్ మినహా మిగితా అన్ని గ్రాండ్ స్లాంలు అతని ఖాతాలో వచ్చాయి. ఆస్త్రేలియన్ ఓపెన్ ఫైనల్లో మార్కొస్ బాగ్దాటిస్ను ఓడించి టైటిల్ పొందగా, వింబుల్డన్‌లో రాఫెల్ నాదల్‌ను పరాజయం చేసి టైటిల్ 4 వ సారి సాధించాడు. అమెరికన్ ఓపెన్‌లో ఆండీ రోడిక్‌ను ఓడించి 3వ సారి టైటిల్ పొందినాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో రాఫెల్ నాదల్ చేతిలో దెబ్బతిన్నాడు.
2007 : 2007లో కూడా ఫెదరర్ 3 గ్రాండ్‌స్లాం టైటిళ్ళు సాధించి మరో దానిలో ఫైనల్స్ వరకు వెళ్ళినాడు. ఈ విధంగా ఒకే సంవత్సరంలో 3 గ్రాండ్‌స్లాం టైటిళ్ళు సాధించడం ఫెదరర్‌కు ఇది 3 వ పర్యాయం. 2004, 2006లో వలె ఫ్రెంచ్ ఓపెన్ మినహా మిగితా అన్ని గ్రాండ్‌స్లాంలు అతని ఖాతాలో చేరినవి. ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఫైనల్లో ఫెర్నాండో గొంజాలెజ్‌ను వరుస సెట్లలో ఓడించాడు. ఈ టోర్నమెంటులో ఒక్క సెట్టు కూడా కోల్పోకుండా టైటిల్ సాధించి 1980లో జాన్ బోర్గ్ తరువాత ఈ ఘనత సాధించిన తొలి టెన్నిస్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.[8] వింబుల్డన్‌లో రాఫెల్ నాదల్‌ను పరాజయం చేశాడు. అమెరిక ఓపెన్‌లో నొవాక్ డొకోవిక్‌ను వరుస సెట్లలో ఓడించాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో మళ్ళి 2006లో వలె రాఫెల్ నాదల్ చేతిలో ఓడిపోయాడు.
2008 : 2008లో తొలి గ్రాండ్‌స్లాం టోర్నమెంటు అయిన ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో సెమీ ఫైనల్స్ వరకు మాత్రమే వెళ్ళినాడు. సెమీస్‌లో నోవాక్ డొకోవిక్ చేతిలో 7-5, 6-3, 7-6 (5) స్కోరుతో పరాజయం పొందినాడు.
రికార్డులు[మార్చు]
- జాన్ బోర్గ్ నెలకొల్పిన 5 వరుస వింబుల్డన్ టైటిళ్ళ రికార్డును సమం చేసాడు.
- ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అత్యధికంగా 4 టైటిళ్ళు సాధించాడు.
- వరుసగా 237 వారాల పాటు ప్రపంచ నెంబర్ వన్‌గా ఉండి కొత్త రికార్డు సృష్టించాడు. ఇంతకు పూర్వం జిమ్మీ కానర్స్ 160 వారాలపాటు నెంబర్‌వన్ గా ఉన్నాడు. మహిళలలో స్టెఫీ గ్రాఫ్ 186 వారాలపాటు నెంబర్‌వన్‌గా ఉండి రికార్డు నెలకొల్పింది.
- ఇప్పటీకి 302 వారాల పాటు ప్రపంచ నెంబర్ వన్‌గా ఉనాడు.
- 20 మాస్టర్ 1000 టైటిళ్ళు సాధింఛిన రికార్డును సమం చేసాడు.
- 7 వింబుల్డన్ టైటిళ్ళను,5 అమెరికన్ టైటిళ్ళను సాధించాడు.
- అన్ని మాస్టర్ 1000 టైటిళ్ళు ఫైనల్ చేరి కొత్త రికార్డు సృష్టించాడు.
సాధించిన గ్రాండ్‌స్లాం టైటిళ్ళు[మార్చు]
Year | Championship | Opponent in Final | Score in Final |
2003 | వింబుల్డన్ టెన్నిస్ | ![]() |
7-6, 6-2, 7-6 |
2004 | ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ | ![]() |
7-6, 6-4, 6-2 |
2004 | వింబుల్డన్ టెన్నిస్ (2వ సారి) | ![]() |
4-6, 7-5, 7-6, 6-4 |
2004 | అమెరికన్ ఓపెన్ టెన్నిస్ | ![]() |
6-0, 7-6, 6-0 |
2005 | వింబుల్డన్ టెన్నిస్ (3వ సారి) | ![]() |
6-2, 7-6, 6-4 |
2005 | అమెరికన్ ఓపెన్ టెన్నిస్ (2వ సారి) | ![]() |
6-3, 2-6, 7-6, 6-1 |
2006 | ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (2వ సారి) | ![]() |
5-7, 7-5, 6-0, 6-2 |
2006 | వింబుల్డన్ టెన్నిస్ (4వ సారి) | ![]() |
6-0, 7-6, 6-7, 6-3 |
2006 | అమెరికన్ ఓపెన్ టెన్నిస్ (3వ సారి) | ![]() |
6-2, 4-6, 7-5, 6-1 |
2007 | ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (3వ సారి) | ![]() |
7-6, 6-4, 6-4 |
2007 | వింబుల్డన్ టెన్నిస్ (5వ సారి) | ![]() |
7-6, 4-6, 7-6, 2-6, 6-2 |
2007 | అమెరికన్ ఓపెన్ టెన్నిస్ (4వ సారి) | ![]() |
7-6, 7-6, 6-4 |
2008 | అమెరికన్ ఓపెన్ టెన్నిస్ (5వ సారి) | ![]() |
6-4, 7-5, 6-1 |
2009 | ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ | ![]() |
6-1, 7-6, 6-4 |
2009 | వింబుల్డన్ టెన్నిస్ (6వ సారి) | ![]() |
5-7, 7-6,7-6, 3-6, 16-14 |
2010 | ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (4వ సారి) | ![]() |
6-4, 6-3, 7-6 |
2012 | వింబుల్డన్ టెన్నిస్ (7వ సారి) | ![]() |
4-6, 7-5,7-6, 6-3, 6-4 |
2017 | ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ (5వ సారి) | ![]() |
6-3, 3-6, 6-1, 3-6, 6-3 |
సింగిల్స్‌లో ఫలితాల విశ్లేషణ[మార్చు]
టోర్నమెంటు | 1998 | 1999 | 2000 | 2001 | 2002 | 2003 | 2004 | 2005 | 2006 | 2007 | 2008 | 2009 | 2010 | 2011 | కేరీర్ గెలుపు వాటా | విజయాలు-ఓటమిలు | |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
గ్రాండ్‌స్లాంలు | |||||||||||||||||
ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ | A | LQ | 3R | 3R | 4R | 4R | W | SF | W | W | SF | F | W | SF | 3 / 9 | 41-6 | |
ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ | A | 1R | 4R | QF | 1R | 1R | 3R | SF | F | F | F | W | QF | F | 0 / 9 | 26-9 | |
వింబుల్డన్ టెన్నిస్ | A | 1R | 1R | QF | 1R | W | W | W | W | W | F | W | QF | QF | 5 / 9 | 38-4 | |
అమెరిక ఓపెన్ టెన్నిస్ | A | LQ | 3R | 4R | 4R | 4R | W | W | W | W | W | F | SF | SF | 4 / 8 | 38-4 | |
విజయాల వాటా | 0 / 0 | 0 / 2 | 0 / 4 | 0 / 4 | 0 / 4 | 1 / 4 | 3 / 4 | 2 / 4 | 3 / 4 | 3 / 4 | 0 / 1 | 12 / 35 | N/A | ||||
గెలుపు-ఓటములు | 0-0 | 0-2 | 7-4 | 13-4 | 6-4 | 13-3 | 22-1 | 24-2 | 27-1 | 26-1 | 5-1 | N/A | 143-23 | ||||
ఒలింపిక్ క్రీడలు | |||||||||||||||||
ఒలింపిక్ క్రీడలు | NH | NH | SF | NH | NH | NH | 2R | NH | NH | NH | 0 / 2 | 5-3 | |||||
క్రీడాజీవితం గణాంకాలు | |||||||||||||||||
సంవత్సరం | 1998 | 1999 | 2000 | 2001 | 2002 | 2003 | 2004 | 2005 | 2006 | 2007 | 2008 | Career | |||||
ఆడిన టొర్నమెంట్లు | 3 | 14 | 28 | 22 | 25 | 23 | 17 | 15 | 17 | 16 | 1 | N/A | 180 | ||||
టైటిళ్ళు | 0 | 0 | 0 | 1 | 3 | 7 | 11 | 11 | 12 | 8 | 0 | N/A | 53 | ||||
రెండోస్థానం | 0 | 0 | 2 | 2 | 2 | 2 | 0 | 1 | 4 | 4 | 0 | N/A | 17 | ||||
విజయాల శాతం | 40% | 43% | 55% | 70% | 73% | 82% | 93% | 95% | 95% | 88% | N/A | 80% | |||||
సంవత్సరం అంతానికి ర్యాంకు | 301 | 64 | 29 | 13 | 6 | 2 | 1 | 1 | 1 | 1 | N/A | N/A |
A = టోర్నమెంటులో పాల్గొనలేడు
WR = విజయాల శాతం
NH = నిర్వహించలేదు
LQ = అర్హత డ్రాలో ఓటమి.
మూలాలు[మార్చు]
- ↑ "Federer sets record as number one" (in English). CNN. 2007.
{{cite web}}
: CS1 maint: unrecognized language (link) - ↑ * "Roddick: Federer might be greatest ever". The Associated Press. 2005-07-03. Retrieved 2007-03-02.
- "Federer inspires comparisons to all-time greats". The Associated Press. 2004-09-12. Archived from the original on 2004-09-15. Retrieved 2007-03-02.
- "4-In-A-Row For Federer". The Associated Press. 2006-07-09. Archived from the original on 2007-03-11. Retrieved 2007-03-02.
- Sarkar, Pritha (2005-07-04). "Greatness beckons Federer". Reuters. Retrieved 2007-03-02.
- Collins, Bud (2005-07-03). "Federer Simply In a League of His Own". MSNBC Website. MSNBC.COM. Retrieved 2007-04-09.
- "Jack Kramer: Federer is the best I have ever seen". The Observer. 2007-06-24. Retrieved 2007-07-15.
- BBC.co.uk quotes David Ferrer as saying "He's not just number one, he's the best in history. He has 16 Grand Slams and I'm sure he'll get the record [which is at 14]. He can do it all. He serves very well, he has a very good forehand and backhand. He has no weak points." — "Supreme. Owais destroys Ferrer". BBC.co.uk. 2007-11-18. Retrieved 2007-11-18.
- ↑ "Profile". rogerfederer.com. Archived from the original on 2007-07-11. Retrieved 2007-07-19.
- ↑ Federer, Roger (September 2004). "Fanletter September 2004" (PDF). Archived from the original (PDF) on 2009-09-26. Retrieved 2007-06-30.
- ↑ "Life as a Junior". Archived from the original on 2007-03-31. Retrieved 2007-06-20.
- ↑ Niebuhr, Keith. "America's love affair with Federer lies ahead". St. Petersburg Times. Retrieved 2007-06-21.
- ↑ "Safin stuns Federer in epic semi". BBC Sport/Tennis. 2005-01-27. Retrieved 2007-06-21.
- ↑ "Bjorn Borg-Tennis Hall of Fame". Archived from the original on 2007-02-27. Retrieved 2007-06-21.