ఆండ్రీ అగస్సీ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Andre Agassi
Andre Agassi Indian Wells 2006.jpg
ప్రఖ్యాతిగాంచిన పేరు The Punisher[1]
దేశం United States
నివాసం Las Vegas, Nevada, USA
పుట్టిన రోజు (1970-04-29) 1970 ఏప్రిల్ 29 (వయస్సు: 49  సంవత్సరాలు)
జన్మ స్థలం Las Vegas, Nevada, USA
ఎత్తు 1.80 m (5 ft 11 in)
బరువు 80 kg (180 lb)
Turned Pro 1986
Retired September 3, 2006
Plays Right-handed; two-handed backhand
Career Prize Money US$31,152,975
Singles
కరియర్ రికార్డ్: 870–274 (76.05%)
Career titles: 68 including 60 listed by the ATP
అత్యున్నత ర్యాంకింగ్: No. 1 (April 10, 1995)
గ్రాండ్‌స్లామ్ ఫలితాలు
Australian Open W (1995, 2000, 2001, 2003)
French Open W (1999)
Wimbledon W (1992)
U.S. Open W (1994, 1999)
Doubles
Career record: 40–42
Career titles: 1
Highest ranking: No. 123 (August 17, 1992)
Olympic medal record
ప్రాతినిధ్యం వహించిన దేశము  United States
Men's tennis
స్వర్ణము 1996 Atlanta Singles

ఆండ్రీ కిర్క్ అగస్సీ (Andre Agassi) (pronounced /ˈɑːndreɪ ˈæɡəsi/; జననం ఏప్రిల్ 29, 1970) ఒక రిటైరైన (విరమణ పొందిన), ఇరాన్ సంతతికి చెందిన అమెరికన్ ప్రొఫెషనల్ టెన్నిస్ క్రీడాకారుడు మరియు మాజీ ప్రపంచ నెంబర్‌వన్. విమర్శకులు మరియు తోటి క్రీడాకారులు అతడిని చరిత్రలో అత్యంత గొప్ప టెన్నిస్ ఆటగాళ్లలో ఒకడిగా పరిగణిస్తున్నారు,[2][3][4] క్రీడా చరిత్రలో సర్వీస్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే నైపుణ్యం ఉన్న అత్యుత్తమ క్రీడాకారుడిగా పిలువబడుతున్నాడు.[2][5][6][7]

సింగిల్స్ టెన్నిస్ చరిత్రలో కెరీర్ గోల్డెన్ స్లామ్ సాధించిన ఏకైక పురుషుడిగా, రాడ్ లావెర్, డాన్ బుడ్జ్, ఫ్రెడ్ పెర్రీ, రాయ్ ఎమెర్సన్ మరియు రోజర్ ఫెదరర్‌లతోపాటు కెరీర్ గ్రాండ్ స్లామ్ సాధించిన ఆరుగురు క్రీడాకారుల్లో ఒకడిగా-ఓపెన్ శకం ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఘనత సాధించిన ముగ్గురు ఆటగాళ్లలో (లావెర్ మరియు ఫెదరర్‌లతోపాటు) ఒకడిగా గుర్తింపు పొందాడు.[8] అతను పదహారుసార్లు గ్రాండ్ స్లామ్ ఫైనల్ మ్యాచ్‌ల్లోకి ప్రవేశించాడు, వీటిలో ఎనిమిది గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టోర్నమెంట్‌లలో టైటిళ్లు గెలుచుకున్నాడు, పురుష క్రీడాకారుల అత్యధిక గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టోర్నమెంట్ విజయాల్లో ఉమ్మడిగా ఐదో స్థానంలో ఉన్న అగస్సీ సింగిల్స్‌లో ఒక ఒలింపిక్ బంగారు పతకం కూడా కైవసం చేసుకున్నాడు. గ్రాండ్ స్లామ్ మరియు ఒలింపిక్ సింగిల్స్ టైటిళ్లతోపాటు, అతను పదిహేడు ATP మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్ టైటిళ్లు గెలుపొందాడు, ఈ సాధన 2004 నుంచి 2010 వరకు ఒక రికార్డుగా ఉంది. అతను 1990 ATP టూర్ వరల్డ్ ఛాంపియన్‌షిప్స్ గెలుచుకున్నాడు, 1990 మరియు 1992 సంవత్సరాల్లో విజేతగా నిలిచిన డేవిస్ కప్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు.[9]

వెనుకవైపు రెండు ఉబ్బిన వెన్నుపూసల కారణంగా వచ్చిన నడుమునొప్పి, అంటే స్పాన్‌డైలోలిస్తెసిస్ (వెన్నుపూస స్థానభ్రంశం) మరియు నాడికి అడ్డుతగిలే విధంగా ఒక ఎముక వాపు వలన ఏర్పడిన సమస్యలతో అగస్సీ US ఓపెన్ మూడో రౌండు మ్యాచ్‌లో పరాజయం తరువాత, సెప్టెంబరు 3, 2006న ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించాడు. అతను ఆండ్రీ అగస్సీ ఛారిటబుల్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు,[10] దక్షిణ నెవాడాలో ఈ సంస్థ బాలల సంక్షేమం కోసం $60 మిలియన్లకుపైగా నిధులు సేకరించింది.[11] 2001లో, ఈ ఫౌండేషన్ లాస్ వెగాస్‌లో ఆండ్రీ అగస్సీ కాలేజ్ ప్రిపరేటరీ అకాడమీ అనే పేరుతో పేద బాలల కోసం ఒక K-12 పబ్లిక్ ఛార్టర్ స్కూల్‌ను ప్రారంభించింది.[12] అతను క్రీడా జీవితానికి దూరమవడాన్ని BBC "క్రీడాచరిత్రలో ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రఖ్యాతిగాంచిన గొప్ప ఆటగాడి నిష్క్రమణగా వర్ణించింది",[4] స్వేచ్ఛా వస్త్రధారణ మరియు ప్రవర్తనలతోపాటు, క్రీడా ప్రదర్శనలు అగస్సీని క్రీడా చరిత్రలో అత్యంత ప్రజాకర్షణగల క్రీడాకారుల్లో ఒకడిగా నిలబెట్టాయి, 1990వ దశకంలో టెన్నిస్‌కు ఆదరణను పునరుద్ధరించడంలో సాయపడిన క్రీడాకారుడిగా కూడా అతను మన్ననలు అందుకున్నాడు.[2][4][13] అతను తన తోటి మాజీ ప్రొఫెషనన్ టెన్నిస్ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్‌ను వివాహం చేసుకున్నాడు.

1970–1985: ప్రారంభ జీవితం[మార్చు]

నెవాడాలోని లాస్ వెగాస్ నగరంలో అగస్సీ జన్మించాడు, అతని తల్లిదండ్రులు ఎలిజబెత్ "బెట్టీ" అగస్సీ (నీ డుడ్లీ)- ఇమ్మాన్యువల్ "మైక్" అఘస్సియన్.[14] అతని తండ్రి అర్మేనియన్ మరియు అసిరియన్ సంతతికి చెందిన ఒక ఇరాన్ జాతీయుడు[15][16][17][18] అమెరికా సంయుక్త రాష్ట్రాలకు వలసరాక ముందు అగస్సీ తండ్రి 1948 మరియు 1952 ఒలింపిక్ క్రీడల్లో ఇరాన్‌కు ప్రాతినిధ్యం వహించాడు.[19] ఆండ్రీ అగస్సీ తల్లి బెట్టీ ఒక రొమ్ము క్యాన్సర్ బాధితురాలు.

మైక్ అగస్సీ దౌర్జన్య ప్రవర్తన ద్వారా వార్తాల్లో నిలిచాడు, అతను మ్యాచ్‌లకు సుత్తిని తీసుకెళ్లినట్లు, అగస్సీ పాయింట్ కోల్పోయినప్పుడు అసంతృప్తిని వెళ్లగక్కేందుకు రక్షణ వలయాలను సుత్తితో కొట్టేవాడని ఆరోపణలు వచ్చాయి. అతని తండ్రి కొన్నిసార్లు అధికారులతో కూడా వాగ్వివాదానికి దిగేవాడు, దీనితో పలుమార్లు మైదానం నుంచి బహిష్కరించబడ్డాడు. 13 ఏళ్ల వయస్సులో, ఆండ్రీని ఫ్లోరిడాలోని నిక్ బోలెట్టిరీకి చెందిన టెన్నిస్ అకాడమీకి పంపించారు.[19] తన తండ్రి ఆర్థిక స్తోమత అంతంతమాత్రంగా ఉండటంతో, అతను అక్కడ 3 నెలలు మాత్రమే శిక్షణ పొందేందుకు వెళ్లాడు. అయితే, పది నిమిషాలపాటు అగస్సీ టెన్నిస్ క్రీడా ప్రదర్శన చూసిన తరువాత, బెల్లెటిరీ అతని తండ్రి మైక్‌ను పిలిచి: మీరిచ్చిన చెక్‌ను వెనక్కు తీసుకోమని చెప్పాడు. అతడికి ఇక్కడ ఉచితంగా శిక్షణ ఇస్తామని, తాను చూసిన వారందరి కంటే అగస్సీలో ఎక్కువ సహజ ప్రతిభ ఉందని చెప్పాడు.[20]

అంతర్జాతీయ టెన్నిస్ క్రీడా జీవితచరిత్ర[మార్చు]

1986–1993[మార్చు]

అతను 16 ఏళ్ల వయస్సులో ప్రొఫెషనల్ టెన్నిస్‌లోకి అడుగుపెట్టాడు, అగస్సీ కాలిఫోర్నియాలోని లా క్వింటాలో మొట్టమొదటి టోర్నమెంట్ ఆడాడు. మొదటి మ్యాచ్‌లో అతను 6–4, 6–2 తేడాతో జాన్ ఆస్టిన్‌పై విజయం సాధించాడు, అయితే రెండో మ్యాచ్‌లో మాట్స్ విలాండర్ 6–1, 6–1తో అతడిని ఓడించాడు. ఏడాది ముగిసే సమయానికి, అగస్సీ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 91వ స్థానాన్ని దక్కించుకున్నాడు.[21] 1987లో ఇటాపారికాలో జరిగిన సుల్ అమెరికన్ ఓపెన్ టోర్నమెంట్‌లో అగస్సీ తన మొట్టమొదటి ఉన్నత-స్థాయి సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.[19] అతను ఈ ఏడాదిని 25వ ప్రపంచ ర్యాంకుతో ముగించాడు.[19] 1988లో అతను మరో ఆరు అదనపు టోర్నమెంట్‌లలో విజయం సాధించాడు, (అవి మెంఫిస్, U.S. మెన్స్ క్లే కోర్ట్ ఛాంపియన్‌షిప్స్, ఫారెస్ట్ హిల్స్ WCT, స్టుట్‌గార్ట్ అవుట్‌డోర్, వోల్వో ఇంటర్నేషనల్ మరియు లివింగ్‌స్టోన్ ఓపెన్),[19] మరియు, ఆ ఏడాది డిసెంబరునాటికి, 43 టోర్నమెంట్‌ల్లో మాత్రమే పాల్గొని క్రీడా నగదు బహుమతి రూపంలో US$2 మిలియన్లు పొందిన క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు, క్రీడా చరిత్రలో ఇంత వేగంగా ఈ స్థాయిలో నగదు బహుమతిని మరే ఇతర క్రీడాకారుడు సాధించలేదు.[ఉల్లేఖన అవసరం] ఏడాది ముగిసే సమయానికి అతను ప్రపంచ ర్యాంకులలో 3వ స్థానంలో ఉన్నాడు, ఆ సమయంలో రెండో స్థానంలో ఇవాన్ లెండల్ మరియు మొదటి స్థానంలో మాట్స్ విలాండర్ ఉన్నారు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ మరియు టెన్నిస్ మేగజైన్‌లు 1988లో బాగా వృద్ధి సాధించిన ఆటగాడిగా అగస్సీని గుర్తించాయి.[19]

తన క్రీడా జీవితంలో మొదటి ఎనిమిది సంవత్సరాలపాటు ఆస్ట్రేలియా ఓపెన్‌లో (తరువాత ఇది అతనికి బాగా కలిసొచ్చిన గ్రాండ్ స్లామ్ టోర్నీగా మారింది) ఆడకపోవడం గమనార్హం, అగస్సీ 1988 నుంచి 1990 వరకు వింబుల్డన్‌లో కూడా ఆడలేదు, ఈ టోర్నమెంట్ యొక్క సంప్రదాయవాదం, ముఖ్యంగా ఈ టోర్నీలో ఆడే సమయంలో ఆటగాళ్లు తెలుపు రంగు వస్త్రాలు ధరించాలనే నిబంధన కారణంగా తాను దీనిలో పాల్గొనాలనుకోవడం లేదని అగస్సీ బహిరంగంగా ప్రకటించాడు.

టూర్‌లో బలమైన ప్రదర్శనలతో అగస్సీ చాలా త్వరగానే ఒక భవిష్యత్ గ్రాండ్ స్లామ్ ఛాంపియన్‌గా అవతరించాడు. కౌమార దశలో ఉన్నప్పుడే, అతను 1988లో ఫ్రెంచ్ ఓపెన్ మరియు US ఓపెన్ రెండు టోర్నమెంట్‌ల సెమీ-ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు, 1989లో తిరిగి US ఓపెన్ సెమీఫైనల్స్‌లోకి ప్రవేశించాడు. అయితే 1990వ దశకంలో కూడా అతను టైటిళ్లను తృటిలో చేజార్చుకోవడం కొనసాగింది. 1990 ఫ్రెంచ్ ఓపెన్‌లో అతను తొలిసారి గ్రాండ్ స్లామ్ ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు, అయితే ఫైనల్ మ్యాచ్‌లో ఆండ్రెజ్ గోమెజ్‌కు నాలుగు సెట్‌లు చేజార్చుకొని పరాజయం చవిచూశాడు. ఇదే ఏడాది అతను US ఓపెన్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ బోరిస్ బెకెర్‌ను ఓడించి తన కెరీర్‌లో రెండో గ్రాండ్ స్లామ్ ఫైనల్‌కు చేరుకున్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో అతని ప్రత్యర్థి పీట్ సంప్రాస్; ఒక ఏడాది క్రితం, అగస్సీ 6-2, 6-1తో సంప్రాస్‌పై విజయం సాధించాడు, ఈ సందర్భంగా తన కోచ్‌తో మాట్లాడుతూ, ఈ మ్యాచ్‌లో సంప్రాస్‌పై విజయంపట్ల పెదవి విరిచాడు, ఎందుకంటే దీనిలో అతను ఒక ప్రొఫెషనల్ ఆటగాడిగా ఆడలేదన్నాడు. అగస్సీని US ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో 6–4, 6–3, 6–2 తేడాతో సంప్రాస్ ఓడించాడు.[19] ఈ ఇద్దరు అమెరికా ఆటగాళ్ల మధ్య పోటీ కారణంగా టెన్నిస్‌లో మిగిలిన దశాబ్దకాలంలో వీరిరువురు తలపడే మ్యాచ్‌లు బాగా ఉత్కంఠభరితంగా సాగేవి. 1990లో, అగస్సీ అమెరికా సంయుక్త రాష్ట్రాలు గత ఎనిమిది ఏళ్లలో మొదటిసారి డేవిస్ కప్ కైవసం చేసుకోవడంలో సాయపడ్డాడు, అంతేకాకుండా ఫైనల్‌లో వింబుల్డన్ ఛాంపియన్ స్టీఫాన్ ఎడ్‌బెర్గ్‌ను ఓడించి తన మొదటి టెన్నిస్ మాస్టర్స్ కప్ గెలుచుకున్నాడు.

1991లో, అగస్సీ వరుసగా రెండో ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు, ఈసారి ఫైనల్‌లో బోలెట్టిరీ అకాడమీలో తన సహచర ఆటగాడు జిమ్ కొరియర్‌తో అతను తలపడ్డాడు. ఐదు సెట్‌లపాటు సాగిన ఫైనల్ మ్యాచ్‌లో కొరియర్ విజేతగా నిలిచాడు. అగస్సీ 1991లో వింబుల్డన్ టోర్నమెంట్‌లో ఆడాలని నిర్ణయించుకున్నాడు, అతను ధరించే దుస్తులపై ఈ సందర్భంగా ప్రసార మాధ్యమాల్లో కొన్నివారాలపాటు పెద్దఎత్తున ప్రచారం జరిగింది. అతను చివరకు తొలి రౌండ్‌లో పూర్తిగా తెలుపు రంగు దుస్తులు ధరించి పాల్గొన్నాడు. ఈ టోర్నీలో అతను క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకున్నాడు, ఈ దశలో డేవిడ్ వీటన్ అతడిని ఐదు సెట్‌లలో ఓడించాడు.

గతంలో ఫ్రెంచ్ ఓపెన్ లేదా US ఓపెన్ టోర్నమెంట్‌ల్లో మెరుగైన ప్రదర్శనలు కనబర్చినప్పటికీ, అతనికి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ విజయం మాత్రమే వింబుల్డన్ టోర్నమెంట్‌లోనే దక్కింది. 1992లో, అతను ఫైనల్ మ్యాచ్‌లో గోరాన్ ఇవానీసెవిక్‌ను ఓడించి వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ కైవసం చేసుకున్నాడు.[19] ఈ టైటిల్ విజయ క్రమంలో, అతను ఇద్దరు మాజీ వింబుల్డన్ ఛాంపియన్‌లు బోరిస్ బెకెర్ మరియు జాన్ మెక్‌ఎన్రోలపై విజయం సాధించాడు. బేస్‌లైన్ వద్ద ఆడే మరే ఇతర ఆటగాడు వింబుల్డన్‌లో టైటిల్ గెలుచుకోలదు, తరువాత పదేళ్లకు లీటన్ హెవిట్ కూడా ఈ ఘనత దక్కించుకున్నాడు. అగస్సీ 1992లో BBC ఓవర్‌సీస్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్‌గా గుర్తించబడ్డాడు. 1992లో డేవిస్ కప్ గెలుచుకున్న అమెరికా సంయక్త రాష్ట్రాల జట్టులో కూడా అగస్సీ మరోసారి ఆడాడు. మూడేళ్లలో అమెరికాకు ఇది రెండో డేవిస్ కప్ టైటిల్ కావడం గమనార్హం.

1993లో అగస్సీ తన కెరీర్‌‍లో తొలి డబుల్స్ టైటిల్ గెలుచుకున్నాడు, పెటర్ కోర్డాతో కలిసి అతను సిన్సినాటీ మాస్టర్స్ డబుల్స్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. గాయాలు కారణంగా ఆ ఏడాది ప్రారంభంలో ఎక్కువ టోర్నమెంట్‌లకు అగస్సీ దూరమయ్యాడు. వింబుల్డన్ టైటిల్‌ను నిలబెట్టుకునే క్రమంలో క్వార్టర్ ఫైనల్స్ దశకు చేరుకున్న అగస్సీ, ఇక్కడ మాత్రం ఐదు సెట్లలో ఆ ఏడాది టోర్నీ ఛాంపియన్ మరియు ప్రపంచ నెంబర్‌వన్ ఆటగాడు పీట్ సంప్రాస్ చేతిలో పరాజయం పాలయ్యాడు. US ఓపెన్ తొలి రౌండు మ్యాచ్‌లో థామస్ ఎన్‌క్విస్ట్ చేతిలో పరాజయంపాలైన అగస్సీ, ఆ ఏడాదిలో మణికట్టుకు శస్త్రచికిత్స చేయించుకున్నాడు.

1994–1997[మార్చు]

కొత్త కోచ్ బ్రాడ్ గిల్బెర్ట్ బాధ్యతలు స్వీకరించిన తరువాత, అగస్సీ ఆటలో మరింత వ్యూహాత్మక, స్థిరమైన విధానాన్ని అనుసరించడం మొదలుపెట్టాడు, ఈ పద్ధతి అతను తిరిగి పుంజుకునేందుకు తోడ్పడింది. 1994 సీజన్‌ను పేలవంగా ప్రారంభించిన అగస్సీ ఫ్రెంచ్ ఓపెన్ మరియు వింబుల్డన్ టోర్నమెంట్‌ల మొదటి వారంలోనే ఇంటిముఖం పట్టాడు. అయితే, అగస్సీ హార్డ్ కోర్ట్ సీజన్‌లో పుంజుకొని, కెనడియన్ ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. 1994 US ఓపెన్‌లో కూడా అతని జోరు కొనసాగింది, స్వదేశీ ఆటగాడు మైకెల్ ఛాంగ్‌ను ఐదు సెట్లపాటు సాగిన నాలుగో రౌండు మ్యాచ్‌లో ఓడించిన అగస్సీ ఫైనల్‌లో మైకెల్ స్టిచ్‌ను ఓడించి US ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు, తద్వారా ఒక అన్‌సీడెడ్ ఆటగాడిగా ఈ టోర్నీలో అడుగుపెట్టి టైటిల్ గెలుచుకున్న మొట్టమొదటి క్రీడాకారుడిగా రికార్డు సృష్టించాడు.[19]

1995లో, అగస్సీ గుండు చేయించుకొని, తన పాత రూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. అతను 1995 ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో పాల్గొన్నాడు (అతను టోర్నీలో పాల్గొనడం ఇదే తొలిసారి), నాలుగు సెట్‌ల ఫైనల్ మ్యాచ్‌లో సంప్రాస్‌ను ఓడించి ఈ టైటిల్‌ను అగస్సీ చేజిక్కించుకున్నాడు.[19] 1995లో అగస్సీ మరియు సంప్రాస్‌లు ఐదు టోర్నమెంట్‌ల ఫైనల్ మ్యాచ్‌ల్లో తలపడ్డారు, ఈ టోర్నమెంట్‌లన్నీ హార్డ్‌కోర్టుల్లోనే జరిగాయి, వీటిలో అగస్సీ మూడింటిలో విజయం సాధించాడు. 1995లో అగస్సీ మూడు మాస్టర్ సిరీస్ టోర్నమెంట్‌ల్లో విజయం సాధించాడు (అవి సిన్సినాటీ, కీ బీస్కైన్, మరియు కెనడియన్ ఓపెన్) మరియు మొత్తంమీద ఏడు టైటిళ్లు గెలుచుకున్నాడు.[19] వేసవి హార్డ్‌కోర్ట్ సర్క్యూట్‌లో అతను వరుసగా 26 మ్యాచ్‌ల్లో విజయం సాధించడం ద్వారా తన క్రీడాజీవితంలో ఉత్తమ ప్రదర్శన కనబర్చాడు, US ఓపెన్ ఫైనల్ మ్యాచ్‌లో అతడిని సంప్రాస్ ఓడించడంతో ఈ వరుస విజయ పరంపర నిలిచిపోయింది.

ఏప్రిల్ 1995లో అగస్సీ మొట్టమొదటిసారి ప్రపంచ నెంబర్‌వన్ ర్యాంకును దక్కించుకున్నాడు. నవంబరు వరకు, అంటే మొత్తం 30 వారాలపాటు నెంబర్‌వన్ ర్యాంకులో అతను కొనసాగాడు. విజయాలు/పరాజయాల రికార్డుపరంగా, 1995 అగస్సీ క్రీడాజీవితంలో అత్యుత్తమ ఏడాది. ఈ సంవత్సరంలో అతను 73 మ్యాచ్‌లు ఆడి 9 మ్యాచ్‌లలోనే పరాజయం చవిచూశాడు. అగస్సీ డేవిస్ కప్ గెలుచుకున్న అమెరికా సంయుక్త రాష్ట్రాల జట్టులో మరోసారి కీలక ఆటగాడి పాత్ర పోషించాడు - ఇది అగస్సీ కెరీర్‌లో మూడో మరియు చివరి డేవిస్ కప్ టైటిల్ కావడం గమనార్హం.

1996 అగస్సీకి పెద్దగా కలిసిరాలేదు, ఈ ఏడాది అతను ఒక్క గ్రాండ్ స్లామ్ ఫైనల్‌కు కూడా చేరుకోలేదు. ఫ్రెంచ్ ఓపెన్ మరియు వింబుల్డన్ టోర్నమెంట్‌లలో అతను వరుసగా క్రిస్ వుడ్‌రఫ్ మరియు డగ్ ఫ్లెచ్ చేతిలో ప్రారంభ రౌండుల్లోనే పరాజయాలు చవిచూశాడు, ఆస్ట్రేలియా మరియు US ఓపెన్ టోర్నమెంట్‌ల సెమీ ఫైనల్ మ్యాచ్‌ల్లో అతను ఛాంగ్ చేతిలో వరుస సెట్లలో పరాజయం పాలయ్యాడు. ఆ సమయంలో అగస్సీ తన పరాజయాలకు మైదానంలో బలంగా గాలి వీస్తుండటం కారణమని ఆరోపించాడు, అయితే తరువాత తన జీవితచరిత్రలో తాను ఈ మ్యాచ్‌లో కావాలని (ఉద్దేశపూర్వకంగా) పరాజయం పాలైనట్లు, ఫైనల్‌కు వెళితే అక్కడ బోరిస్ బెకెర్‌తో పోటీ తనకు చికాకు పుట్టిస్తుందని అప్పుడు భావించానని పేర్కొన్నాడు. అట్లాంటాలో జరిగిన ఒలింపిక్ క్రీడల్లో పురుషుల సింగిల్స్‌లో బంగారు పతకం గెలుచుకోవడం ద్వారా అగస్సీ తిరిగి పుంజుకున్నాడు, అతను ఒలంపిక్స్ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్‌కు చెందిన సెర్గీ బ్రూక్వెరాను 6–2, 6–3, 6–1తో ఓడించి బంగారు పతకం కైవసం చేసుకున్నాడు.[19] సిన్సినాటీ మరియు కీ బిస్కైన్ టోర్నమెంట్ టైటిళ్లను నిలబెట్టుకోవడంలో కూడా అగస్సీ విజయవంతమయ్యాడు.

1997 అగస్సీ క్రీడాజీవితంలో అత్యంత పేలవమైన ఏడాదిగా నిలిచింది. మణికట్టు గాయం తిరగబెట్టడంతో, అతను ఈ ఏడాది 24 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఆ సమయంలో తాను ఒక స్నేహితుడి విజ్ఞప్తిపై క్రిస్టల్ మెథాంఫెటామిన్‌ను ఉపయోగించడం మొదలుపెట్టానని అగస్సీ తరువాత అంగీకరించాడు.[22] అతను ATP మాదకద్రవ్య పరీక్షలో విఫలమయ్యాడు, అయితే తరువాత పానీయంలో తన స్నేహితుడు అభ్యంతరకర పదార్థాలను కలిపాడని పేర్కొంటూ ఒక లేఖ రాశాడు. దీనితో ATP విఫలమైన మాదకద్రవ్య పరీక్షను ఒక హెచ్చరికగా మార్చి, అతడికి ఉపశమనం కలిగించింది. తాను మాదకద్రవ్యాలు ఉపయోగించినట్లు అంగీకరిస్తూ లేఖ రాయడం అబద్ధమని చెప్పాడు.[23] తరువాత వెంటనే ఈ మందు వాడకాన్ని విడిచిపెట్టాడు. ఎటువంటి ప్రధాన టైటిళ్లను గెలుచుకోకపోవడంతో, 1997 నవంబరు 10నాటికి అతను ప్రపంచ ర్యాంకుల్లో 141వ స్థానానికి పడిపోయాడు.[19]

1998–2003[మార్చు]

సర్వ్ చేస్తున్న అగస్సీ

1998లో, అగస్సీ కఠినమైన శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నాడు, ఛాలెంజర్ సిరీస్ టోర్నమెంట్‌లలో (ప్రపంచ ర్యాంకుల్లో మొదటి 50 స్థానాలకు దిగువన ఉన్న ప్రొఫెషనల్ ఆటగాళ్లు ఆడే టోర్నీలు) పాల్గొనడం ద్వారా అతను తన ర్యాంకును మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టాడు. ఈ కాలంలో అతను కొన్ని క్లాసిక్ మ్యాచ్‌లు కూడా ఆడాడు, ముఖ్యంగా తన ప్రత్యర్థి పీట్ సంప్రాస్ మరియు మరో ప్రధాన ఆస్ట్రేలియా ఆటగాడు ప్యాట్రిక్ రాఫ్టెర్‌లతో తలపడ్డాడు.

1998లో, అగస్సీ ఐదు టైటిళ్లు గెలుచుకోవడం ద్వారా ఏడాది ప్రారంభంలో ప్రపంచ ర్యాంకుల్లో 122వ స్థానంలో ఉన్న అతను సీజన్ ముగిసే సమయానికి 6వ స్థానానికి వచ్చాడు, ఒకే ఏడాది తన ర్యాంకును భారీ స్థాయిలో మెరుగుపరుచుకొని టాప్ 10లో అడుగుపెట్టిన ఆటగాడిగా అరుదైన గుర్తింపు పొందాడు.[24] ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీలో, ATP ఆటగాడు టామీ హాస్ చేతిలో పరాజయం పాలై రెండో రౌండు నుంచి నిష్క్రమించాడు. పది ఫైనల్ మ్యాచ్‌‍లు ఆడి ఐదు టైటిళ్లు గెలుచుకున్న అతను, మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్, కీ బిస్కైన్‌లో రన్నరప్‌గా నిలిచాడు, ఈ టోర్నీ ఫైనల్‌లో మార్సెలో రియోస్ చేతిలో పరాజయం చవిచూశాడు, అగస్సీపై ఈ విజయంతో మార్సెలో రియోస్ ప్రపంచ నెంబర్‌వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు.

1999లో అగస్సీ చరిత్ర పుస్తకాల్లోకి ఎక్కాడు, ఐదు సెట్‌లపాటు సాగిన ఫ్రెంచ్ ఓపెన్ ఫైనల్‌లో అతను రెండు సెట్‌లు వెనుకబడినప్పటికీ పుంజుకొని ఆండ్రీ మెద్వెడెవ్‌పై విజయం సాధించాడు, తద్వారా కెరీర్‌లో నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న ఐదో ఆటగాడిగా అతను గుర్తింపు పొందాడు (అప్పటికీ రాడ్ లావెర్, ఫ్రెడ్ పెర్రీ, రాయ్ ఎమెర్సన్ మరియు డాన్ బుడ్జ్‌లు ఈ ఘనత సాధించారు-అగస్సీ నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న ఐదో ఆటగాడుకాగా, రోజెర్ ఫెదరర్ ఆరో ఆటగాడిగా ఈ జాబితాలో చేరాడు). ఈ విజయంతో క్రీడాచరిత్రలో మూడు వేర్వేరు కోర్టుల్లో (మట్టి (క్లే), గడ్డి (గ్రాస్) మరియు గట్టి (హార్డ్) కోర్టులు) నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకున్న మొట్టమొదటి ఆటగాడిగా (మొత్తం ఇద్దరు ఆటగాళ్లు మాత్రమే ఈ ఘనత సాధించారు, తరువాత రోజెర్ ఫెదరర్ కూడా మూడు కోర్టుల్లో టైటిళ్లు గెలుచుకున్నాడు) అగస్సీ గుర్తింపు పొందాడు, మిగిలిన నలుగురు ఆటగాళ్లు తమ గ్రాండ్ స్లామ్ టైటిళ్లను మట్టి మరియు గడ్డి కోర్టుల్లో మాత్రమే గెలుచుకున్నారు. మొత్తం నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు మరియు ఒక ఒలింపిక్ బంగారు పతకం కలిసివుండే కెరీర్ గోల్డెన్ స్లామ్ గెలుచుకున్న మొట్టమొదటి ఆటగాడిగా కూడా అగస్సీ రికార్డు సృష్టించాడు.

అగస్సీ తరువాత 1999 ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు, వింబుల్డన్‌లో కూడా పైనల్‌కు చేరుకున్నప్పటికీ, ఈ మ్యాచ్‌లో సంప్రాస్ చేతిలో వరుస సెట్లలో పరాజయం చవిచూశాడు.[19] వింబుల్డన్ పరాజయం నుంచి US ఓపెన్ టైటిల్ గెలుచుకోవడం ద్వారా అతను తిరిగి పుంజుకున్నాడు, ఐదు సెట్‌లపాటు సాగిన ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో టాడ్ మార్టిన్‌పై విజయం సాధించాడు. అగస్సీ 1999 సీజన్‌ను ప్రపంచ నెంబర్‌వన్ ర్యాంకుతో ముగించాడు, తద్వారా వరుసగా ఆరు సీజన్‌లను నెంబర్‌వన్‌గా ముగించిన సంప్రాస్ యొక్క రికార్డుకు (1993–1998) అతను ముగింపు పలికాడు.[19] అగస్సీ నెంబర్‌వన్ స్థానంలో ముగించిన ఏడాది ఇదొక్కటే కావడం గమనార్హం.

రెండో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా అగస్సీ తన తరువాత ఏడాదిని ప్రారంభించాడు, ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో యెవ్‌జెనీ కాఫెల్నికోవ్‌ను నాలుగు సెట్లలో, ఐదు సెట్‌లపాటు సాగిన సెమీస్ మ్యాచ్‌లో సంప్రాస్‌ను ఓడించాడు.[19] దీని ద్వారా 1969లో రాడ్ లావెర్ వరుసగా నాలుగు గ్రాండ్ ‌స్లామ్ ఫైనల్ మ్యాచ్‌లకు చేరుకొని సృష్టించిన రికార్డును సమం చేసిన మొట్టమొదటి ఆటగాడిగా అతను గుర్తింపు పొందాడు.[25] ఆ సమయంలో, లావెర్ తరువాత నాలుగు గ్రాండ్ స్లామ్‌లలో మూడింటిలో విజయం సాధించిన నాలుగో ఆటగాడిగా అగస్సీ గుర్తింపు పొందాడు, ఈ సందర్భంలో అతను వింబుల్డన్ టైటిల్‌ను మాత్రమే చేజార్చుకున్నాడు.[26]

2000 సంవత్సరంలో కూడా అగస్సీ వింబుల్డన్ సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు, అయితే ఐదు సెట్‌లలో జరిగిన ఈ మ్యాచ్‌లో అతను రాఫ్టర్ చేతిలో పరాజయం చవిచూశాడు, వింబుల్డన్ చరిత్రలో దీనిని అనేక మంది ఒక అత్యుత్తమ మ్యాచ్‌గా పరిగణిస్తున్నారు.[27] లిస్బాన్లో జరిగిన ప్రారంభ టెన్నిస్ మాస్టర్స్ కప్‌లో అగస్సీ సెమీ ఫైనల్‌లో 6–3, 6–3తో రష్యాకు చెందిన మారత్ సఫిన్‌ను ఓడించి ఫైనల్‌లోకి అడుగుపెట్టాడు, దీంతో టెన్నిస్ చరిత్రలో ప్రపంచ నెంబర్‌వన్ ర్యాంకు దక్కించుకున్న అతిచిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించే అవకాశం సఫిన్‌కు దూరమైంది. ఫైనల్ మ్యాచ్‌లో గుస్తావ్ క్యుర్టెన్ చేతిలో అగస్సీ పరాజయం చవిచూశాడు, దీనితో క్యుర్టెన్ సీజన్ ముగింపులో ప్రపంచ నెంబర్‌వన్ ర్యాంకు దక్కించుకున్నాడు.

ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను నిలబెట్టుకోవడం ద్వారా అగస్సీ 2001 సీజన్‌ను విజయవంతంగా ప్రారంభించాడు, ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో ఆర్నాడ్ క్లెమెంట్‌పై మూడు వరుస సెట్లలో విజయం సాధించాడు.[19] ఈ క్రమంలో, అతను ప్రత్యర్థి అభిమానులతో కిక్కిరిసిన కోర్టులో రాఫ్టెర్‌ను (7–5, 2–6, 6–7, 6–2, 6–3) ఓడించాడు, ఆస్ట్రేలియాకు చెందిన రాఫ్టర్‌కు ఇదే చివరి ఆస్ట్రేలియన్ ఓపెన్ కావడంతో ఈ మ్యాచ్‌కు భారీస్థాయిలో అభిమానులు హాజరయ్యారు. వింబుల్డన్‌లో, వారు సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మళ్లీ తలపడ్డారు, ఇక్కడ అగస్సీ మరో మ్యాచ్‌ను తృటిలో రాఫ్టెర్‌కు చేజార్చుకున్నాడు, ఈ మ్యాచ్ ఐదో సెట్‌లో 8–6తో రాఫ్టెర్ విజయం దక్కించుకున్నాడు. US ఓపెన్ క్వార్టర్ ఫైనల్స్‌లో, అగస్సీ 3 గంటల, 33 నిమిషాలపాటు సాగిన సుదీర్ఘ మ్యాచ్‌లో[28] సంప్రాస్‌పై 6–7 (7), 7–6 (7), 7–6 (2), 7–6 (5)తో పరాజయం చవిచూశాడు,[29] ఈ 48వ మ్యాచ్‌లో సర్వ్‌ను ఇద్దరూ బ్రేక్ చేయలేకపోయారు. ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, అగస్సీ 2001 సీజన్‌ను ప్రపంచ ర్యాంకుల్లో మూడో స్థానంతో ముగించాడు, మూడు వేర్వేరు దశబ్దాల్లో మొదటి 10 ర్యాంకుల్లో ఏడాదిని ముగించిన ఒకేఒక్క క్రీడాకారుడిగా అతను అరుదైన గుర్తింపు పొందాడు[30] (1980వ దశకం - 1988లో ప్రపంచ ర్యాంకుల్లో 3వ స్థానం మరియు 1989లో 7వ స్థానం; 1990వ దశకం - 1990లో 4వ స్థానం, 1991లో 10వ స్థానం, 1992లో 9వ స్థానం, 1994 మరియు 1995లో 2వ స్థానం, 1996లో 8వ స్థానం, 1998లో 6వ స్థానం మరియు 1999లో 1వ స్థానం; 2000వ దశకం - 2000లో 6వ స్థానం, 2001లో 2వ స్థానం, 2003లో 4వ స్థానం, 2004లో 8వ స్థానం, 2005లో 7వ స్థానం). 1984లో ప్రపంచ ర్యాంకుల్లో 2వ స్థానంతో ముగించిన 32 ఏళ్ల కానర్స్ తరువాత, మొదటి మూడు స్థానాల్లో ఏడాదిని ముగించిన అతిపెద్ద వయస్కుడిగా (31) అతను రికార్డు సృష్టించాడు.[24]

2002 ప్రారంభంలో అగస్సీకి నిరాశ ఎదురైంది, గాయం కారణంగా ఆస్ట్రేలియా ఓపెన్‌కు దూరమయ్యాడు, దీనికి ముందు రెండు సంవత్సరాల్లో అతను ఈ టోర్నీ టైటిల్‌ను గెలుచుకున్నాడు. అగస్సీ మరియు సంప్రాస్ మధ్య చివరి మ్యాచ్‌గా ఈ ఏడాది US ఓపెన్ ఫైనల్ గుర్తిండిపోయింది, ఈ మ్యాచ్‌లో సంప్రాస్ నాలుగు సెట్లలో విజయం సాధించాడు, దీంతో వీరిద్దరూ తలపడిన మ్యాచ్‌ల్లో (34) సంప్రాస్ ఆధిక్యం 20–14కు పెరిగింది. ఈ మ్యాచ్ సంప్రాస్ క్రీడాజీవితంలో చివరి మ్యాచ్‌గా నిలిచిపోయింది. US ఓపెన్ ఫైనల్‌లోకి అడుగుపెట్టడం, కీ బిస్కైన్, రోమ్, మాడ్రిడ్ నగరాల్లో జరిగిన మాస్టర్ సిరీస్ విజయాలు అతడికి ప్రపంచ ర్యాంకుల్లో 2వ స్థానం కల్పించాయి, ప్రపంచ నెంబర్ 2 ర్యాంకులో ఉన్న అతిపెద్ద వయస్కుడిగా అతనికి గుర్తింపు లభించింది, ఆ సమయంలో అతని వయస్సు 32 సంవత్సరాల 8 నెలలు.[24]

2003 ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ ద్వారా అగస్సీ తన క్రీడాజీవితంలో ఎనిమిదో (మరియు ఫైనల్) గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకున్నాడు, ఈ టోర్నీ ఫైనల్‌లో అతను రైనెర్ షుట్లెర్‌పై వరుస సెట్లలో విజయం సాధించాడు. మార్చిలో, అతను తన కెరీర్‌లో ఆరో మరియు వరుసగా మూడో కీ బిస్కైన్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు, తన భార్య స్టెఫీ గ్రాఫ్ ఈ టోర్నీలో ఐదుసార్లు టైటిల్ గెలుచుకొని సృష్టించిన రికార్డును ఈ సందర్భంగా అగస్సీ అధిగమించాడు. ఫైనల్ మ్యాచ్ ఈ టోర్నీలో అతని 18వ వరుస విజయం కావడం గమనార్హం, 1993-1995 మధ్యకాలంలో పీట్ సంప్రాస్ సృష్టించిన వరుసగా 17 మ్యాచ్ విజయాల రికార్డును అగస్సీ ఈ సందర్భంగా బద్దలుకొట్టాడు. (అగస్సీ వరుస విజయాల పరంపర 20 వరకు కొనసాగింది, ఈ టోర్నీ 2004 పోటీల్లో మొదటి రెండు మ్యాచ్‌ల్లో అతను విజయం సాధించాడు, తరువాత అతని విజయపరంపర ఆగస్టిన్ కాలెరీ చేతిలో పరాజయంతో నిలిచిపోయింది.) ఈ విజయంతో, ఈ టోర్నీ టైటిల్ గెలుచుకున్న అతిపిన్న వయస్కుడిగా (19) అప్పటికే రికార్డు సృష్టించిన అగస్సీ అతిపెద్ద వయస్కుడి (32) రికార్డును సొంతం చేసుకున్నాడు. ఏప్రిల్ 28, 2003న, క్వీన్స్ క్లబ్ ఛాంపియన్‌షిప్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో జేయివర్ మాలిస్సేపై విజయంతో అతను ప్రపంచ నెంబర్‌వన్ ర్యాంకును తిరిగి దక్కించుకున్నాడు, ATP ర్యాంకులు ఇవ్వడం మొదలుపెట్టిన 33 సంవత్సరాల 13 రోజుల చరిత్రలో ప్రపంచ నెంబర్‌వన్ ర్యాంకు పొందిన అతిపెద్ద వయస్కుడిగా అతను రికార్డు సృష్టించాడు. అతను ప్రపంచ నెంబర్‌వన్ ర్యాంకులో రెండు వారాలపాటు కొనసాగాడు, తరువాత లీటన్ హెవిట్ మే 12, 2003న ఈ ర్యాంకును స్వాధీనం చేసుకున్నాడు. అగస్సీ తరువాత జూన్ 16, 2003న తిరిగి ప్రపంచ నెంబర్‌వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు, అతను ఆపై 12 వారాలపాటు, సెప్టెంబరు 7, 2003 వరకు ఈ ర్యాంకులో కొనసాగాడు. తన క్రీడాజీవితంలో, అగస్సీ మొత్తంమీద ప్రపంచ నెంబర్‌వన్ ర్యాంకును 101 వారాలపాటు తన వద్ద నిలుపుకున్నాడు.[31] అనేక టోర్నీలకు గాయాలు కారణంగా దూరమవడంతో అగస్సీ ర్యాంకు పడిపోయింది. అతను US ఓపెన్ సెమీ ఫైనల్ దశకు చేరుకున్నప్పటికీ, ఇక్కడ జువాన్ కార్లోస్ ఫెరెరో చేతిలో పరాజయం పాలయ్యాడు, ఈ పరాజయంతో ప్రపంచ నెంబర్‌వన్ ర్యాంకును కూడా ఫెరెరోకు సమర్పించుకున్నాడు. సంవత్సరాంతపు టెన్నిస్ మాస్టర్ కప్‌లో అగస్సీ ఫైనల్ మ్యాచ్‌లో ఫెదరర్ చేతిలో పరాజయం పాలయ్యాడు, ఈ ఏడాదిని అతను ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 4వ స్థానంతో ముగించాడు. 33 ఏళ్ల వయస్సులో, కానర్స్ తరువాత మొదటి ఐదు ర్యాంకుల్లో ఉన్న అతి పెద్ద వయస్కుడిగా అతను గుర్తింపు పొందాడు, కానర్స్ 35 ఏళ్ల వయస్సులో 1984లో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 4వ స్థానంలో ఉన్నాడు.[24]

2004—2006[మార్చు]

2004లో అగస్సీ మాస్టర్స్ సిరీస్, సిన్సినాటీ టైటిల్‌ను గెలుచుకున్నాడు, దీంతో అతనికి కెరీర్‌లో 59వ ప్రధాన టైటిల్ లభించింది, అంతేకాకుండా ఇది రికార్డు స్థాయిలో 17వ ATP మాస్టర్ సిరీస్ టైటిల్‌గా నిలిచింది, మాంటే కార్లో మరియు హంబర్గ్ టైటిళ్లు-మినహా, తొమ్మిది ATP మాస్టర్స్ టోర్నమెంట్‌లలో ఏడు టోర్నీల టైటిళ్లను అతను గెలుచుకున్నాడు. 34 ఏళ్ల వయస్సులో, సిన్సినాటీలో (1899లో టోర్నీ ప్రారంభమైనప్పటి నుంచి) సింగిల్స్ ఛాంపియన్‌గా నిలిచిన రెండో-అతిపెద్ద వయస్కుడిగా అతను గుర్తింపు పొందాడు, 35 ఏళ్ల వయస్సులో 1970లో ఈ టైటిల్ గెలుచుకున్న కెన్ రోజ్‌వాల్ అతిపెద్ద వయస్కుల జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు. ఈ ఏడాదిని అతను ప్రపంచ ర్యాంకుల్లో 8వ స్థానంతో ముగించాడు, తద్వారా 1988 సీజన్‌ను ప్రపంచ ర్యాంకుల్లో ఏడో స్థానంతో ముగించిన 36 ఏళ్ల కానర్స్ తరువాత మొదటి పది ర్యాంకుల్లో నిలిచి ఏడాదిని పూర్తి చేసిన అతిపెద్ద వయస్కుడిగా అతను గుర్తింపు పొందాడు.[24] లాస్ ఏంజిల్స్‌లో జరిగిన కంట్రీవైడ్ క్లాసిక్ టోర్నీలో అలెక్స్ బోగోమోలోవ్‌పై విజయంతో ఓపెన్ శకంలో 800 విజయాలు సాధించిన ఆరో క్రీడాకారుడిగా అగస్సీ నిలిచాడు.

ఆస్ట్రేలియా ఓపెన్ క్వార్టర్ ఫైనల్‌లో ఫెదరర్ చేతిలో పరాజయంతో అగస్సీ 2005 సీజన్‌ను ప్రారంభించాడు. అగస్సీ తరువాత పలు టోర్నీల్లో చివరి దశల వరకు పోరాడాడు, అయితే తరువాత గాయం కారణంగా అనేక టోర్నీలకు దూరమయ్యాడు. ఫ్రెంచ్ ఓపెన్ మొదటి రౌండులో అతను జార్కో నీమినెన్ చేతిలో పరాజయం చవిచూశాడు. తరువాత లాస్ ఏంజిల్స్‌లో నాలుగో టైటిల్‌ను గెలుచుకోవడంతోపాటు, రోజర్స్ కప్ ఫైనల్‌కు చేరుకున్నాడు, ఈ ఫైనల్ మ్యాచ్‌లో ప్రపంచ ర్యాంకుల్లో రెండో స్థానంలో ఉన్న రఫెల్ నాదల్ చేతిలో పరాజయం పాలయ్యాడు. అగస్సీ 2005 US ఓపెన్ ఫైనల్‌కు చేరుకోవడం ఒక అసంభవమైన ప్రదర్శనగా పరిగణించబడుతుంది. వరుస సెట్లలో రాజ్వాన్ సాబౌ మరియు ఐవో కార్లోవిక్, నాలుగు సెట్‌లలో థామస్ బెర్డిక్‌లను ఓడించిన తరువాత ఫైనల్‌కు చేరుకునేందుకు అగస్సీ మూడు వరుస ఐదు సెట్‌ల మ్యాచ్‌ల్లోక కూడా విజయాలు సాధించాడు. ఈ మ్యాచ్‌లలో ముఖ్యమైనది జేమ్స్ బ్లేక్‌పై క్వార్టర్ ఫైనల్ విజయం, ఈ మ్యాచ్‌లో అతను మొదటి రెండు సెట్‌లలో వెనుకబడి, తరువాత మూడు సెట్‌లలో పుంజుకున్నాడు, చివరకు 3–6, 3–6, 6–3, 6–3, 7–6 (6) స్కోరుతో విజయం సాధించాడు. అతని మిగిలిన ఐదు సెట్‌ల విజయాలను నాలుగో రౌండులో జేవియర్ మాలిస్సే మరియు సెమీ ఫైనల్‌లో రాబీ జినెప్రీలపై సాధించాడు. వరుసగా రెండో ఏడాది ఈ టైటిల్ పోటీలో ఉన్న మరియు గత రెండేళ్లలో ఆరో గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలుచుకోవడంపై కన్నేసిన ఫెదరర్‌తో ఫైనల్‌లో అగస్సీ తలపడ్డాడు. అగస్సీపై నాలుగు సెట్లలో ఫెదరర్ విజయం సాధించాడు, అయితే ఈ మ్యాచ్‌లో అగస్సీ అతడిని భయపెట్టాడు, అగస్సీ మొదటి రెండు సెట్‌లను చీల్చిన తరువాత మూడో సెట్‌లో ముందజ వేసి ప్రత్యర్థికి చెమటలు పట్టించాడు.

2005 షాంఘై టెన్నిస్ మాస్టర్స్ కప్‌కు ముందు, అగస్సీకి ఒక రాకెట్‌బాల్ ప్రమాదంలో చీలమండ గాయమైంది, పలు స్నాయువులు దెబ్బతిన్నాయి. కొన్నివారాలపాటు అతడు నడవలేకపోయాడు. అయినప్పటికీ అతను ఈ టోర్నీలో ఆడాడు, మూడో సీడ్‌గా బరిలో దిగిన అగస్సీ మొదటి రౌండ్ రాబిన్ మ్యాచ్‌లో నికోలాయ్ డేవిడెంకోతో తలపడ్డాడు. అగస్సీ కదలికలో వేగం తగ్గడం స్పష్టంగా కనిపించింది, ముఖ్యంగా సర్వ్ బ్యాక్‌హ్యాండ్ రిటర్న్‌లో పేలవంగా కనిపించాడు, ఈ మ్యాచ్‌లో వరుస సెట్‌లో పరాజయం చవిచూశాడు. తరువాత అతను టోర్నీ నుంచి తప్పుకున్నాడు.

2005 సీజన్‌ను అగస్సీ ప్రపంచ ర్యాంకుల్లో 7వ స్థానంతో ముగించాడు, మొదటి 10 ర్యాంకుల్లో ఏడాదిని ముగించడం ఇది అతనికి వరుసగా 16వసారి కావడం గమనార్హం, సంవత్సరాంతపు టాప్ 10 ర్యాంకుల్లో ఎక్కువసార్లు నిలిచిన ఆటగాడిగా కానర్స్ రికార్డును అగస్సీ ఈ సందర్భంగా సమం చేశాడు. 2005లో అగస్సీ నైక్‌ను 17 ఏళ్ల తరువాత విడిచిపెట్టాడు, ఆపై అడిడాస్‌తో ఒప్పందంపై సంతకం చేశాడు.[32] తన స్వచ్ఛంద సంస్థలకు విరాళం ఇవ్వడానికి నైక్ నిరాకరించడంతో అగస్సీ ఈ సంస్థతో తెగతెంపులు చేసుకునేందుకు ప్రధాన కారణం, అయితే అడిడాస్ స్వచ్ఛంద సంస్థలకు నిధులు అందించేందుకు ముందుకొచ్చింది.

2006 సీజన్‌ను అగస్సీ పేలవంగా ప్రారంభించాడు. చీలమండ గాయం నుంచి ఇప్పటికీ పూర్తిగా కోలుకోకపోవడం మరియు వెన్ను మరియు కాలి నొప్పితో బాధపడుతుండటం మరియు మ్యాచ్‌లు ఆడే అవకాశం లేకపోవడం వలన ఈ పరిస్థితి ఏర్పడింది. చీలమండ గాయంతో అతను ఆస్ట్రేలియన్ ఓపెన్ నుంచి వైదొలిగాడు, వెన్నునొప్పి మరియు ఇతర నొప్పులు అతడు అనేక ఇతర టోర్నీలకు కూడా దూరమయ్యేందుకు కారణమయ్యాయి, దీంతో చివరకు ఫ్రెంచ్ ఓపెన్‌తోపాటు మట్టి కోర్టుల సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. దీంతో అతని ర్యాంకు చివరిసారి టాప్ 10 బయటకు పడిపోయింది.

గ్రాస్ కోర్టు సీజన్‌లోకి అడుగుపెట్టిన అగస్సీ, ఒక సన్నాహక టోర్నమెంట్‌లో ఆడాడు, తరువాత వింబుల్డన్ టోర్నీలో పాల్గొన్నాడు. ఈ టోర్నీలో ప్రపంచ నెంబర్‌ 2 ఆటగాడు (మరియు ఆ ఏడాది టైటిల్ విజేత) రఫెల్ నాదల్ చేతిలో మూడో రౌండులో అగస్సీ 7–6 (5), 6–2, 6–4 తేడాతో పరాజయం చవిచూశాడు. ఈ సందర్భంగా సంప్రదాయానికి విరుద్ధంగా, మ్యాచ్ తరువాత పరాజయం పాలైన ఆటగాడి, అగస్సీ, వద్ద ఇంటర్వ్యూ తీసుకున్నారు.[33] వింబుల్డన్‌లో అగస్సీ ఆ ఏడాది US ఓపెన్ తరువాత ప్రొఫెషనల్ టెన్నిస్ నుంచి వైదొలగానుకుంటున్నట్లు తన ప్రణాళికలను బయటపెట్టాడు.

వేసవి హార్డ్‌కోర్ట్ సీజన్‌లో అగస్సీ రెండో టోర్నమెంట్‌లలో మాత్రమే పాల్గొన్నాడు, వీటిలో లాస్ ఏంజిల్స్‌లో జరిగిన కంట్రీసైడ్ క్లాసిక్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ వరకు చేరుకున్నాడు, ఈ దశలో చిలీ ఆటగాడు ఫెర్నాండో గోంజలెజ్ చేతిలో 6–4, 3–6, 7–5 తేడాతో పరాజయం పాలయ్యాడు. దీని ఫలితంగా, అతను US ఓపెన్‌లో అన్‌సీడెడ్ ఆటగాడిగా బరిలో దిగాడు.

తన చివరి US ఓపెన్‌లో అగస్సీ ప్రారంభం నాటకీయంగా మారింది. తీవ్రమైన వెన్నునొప్పి కారణంగా, అగస్సీ ప్రతి మ్యాచ్ ముగిసిన తరువాత బాధనివారక ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆండ్రీ పావెల్‌పై కష్టమైన నాలుగు-సెట్ల విజయం తరువాత అగస్సీ రెండో రౌండులో 2006 ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్‌కు మరియు వింబుల్డన్ సెమీ ఫైనల్‌కు చేరుకున్న ఎనిమిదో సీడ్ మార్కస్ బాగ్దాటిస్‌తో తలపడ్డాడు. బాగ్దాటిస్ తుది సెట్‌లో కండరాల నొప్పితో బాధపడటంతో అగస్సీ ఈ మ్యాచ్‌లో 6–4, 6–4, 3–6, 5–7, 7–5తో విజయం సాధించాడు. తన చివరి మ్యాచ్‌లో అగస్సీ 112వ ర్యాంకులో ఉన్న జర్మనీ ఆటగాడు బెంజమిన్ బెకెర్ చేతిలో నాలుగు సెట్లలో పరాజయం చవిచూశాడు. మ్యాచ్ తరువాత మైదానంలో ప్రేక్షకులు ఎనిమిది నిమిషాలు నిలబడి అగస్సీకి వీడ్కోలు పలికారు, అతను ఈ సందర్భంగా చిరస్మరణీయ విరమణ ప్రసంగం చేశాడు.

ఆదాయాలు[మార్చు]

అగస్సీ తన కెరీర్‌లో నగదు బహుమతి రూపంలో US$ 30 మిలియన్లకుపైగా ఆదాయాన్ని ఆర్జించాడు, ఫెదరర్ మరియు సంప్రాస్‌ల తరువాత ఈ రకమైన ఆదాయార్జనలో అతను మూడో స్థానంలో ఉన్నాడు. వ్యాపార సంస్థలతో ఒప్పందాల ద్వారా తన క్రీడా జీవితంలో ఏడాదికి US $25 మిలియన్లకుపైగా ఆదాయాన్ని ఆర్జించాడు, ఆ సమయంలో అన్ని క్రీడల్లో అత్యధిక ఆదాయార్జన గల ఆటగాళ్లలో నాలుగో స్థానంలో ఉన్నాడు.[ఉల్లేఖన అవసరం]

విరమణ తరువాత[మార్చు]

2006 US ఓపెన్ తరువాత రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచి అగస్సీ అనేక వరుస ఛారిటీ టోర్నమెంట్‌లలో పాల్గొన్నాడు, తన సొంత ఛారిటీ పనులను చూసుకోవడం కొనసాగించాడు. సెప్టెంబరు 5, 2007న, US ఓపెన్‌లో ఆండీ రాడిక్/రోజెర్ ఫెదరర్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు ఆశ్చర్యకరంగా అగస్సీ అతిథి వ్యాఖ్యతగా వ్యవహరించాడు. తన భార్య స్టెఫీ గ్రాఫ్‌తో కలిసి అతను వింబుల్డన్‌లో టిమ్ హెన్మాన్ మరియు కిమ్ క్లిజ్‌స్టెర్స్‌లపై ఒక ప్రదర్శన మ్యాచ్ ఆడాడు. 2009 వేసవిలో ఫిలడెల్ఫియా ఫ్రీడమ్స్ తరపున వరల్డ్ టీమ్ టెన్నిస్ ఆడాడు,[34] మొదటిసారి అవుట్‌బ్యాక్ ఛాంపియన్స్ సిరీస్ కూడా ఆడాడు. అరిజోనాలోని సర్‌ఫ్రేజ్‌లో జరిగిన క్యాన్సర్ ట్రీట్‌మెంట్ సెంటర్స్ ఆఫ్ అమెరికా టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్‌లో అగస్సీ ఆడాడు, ఈ టోర్నీ ఫైనల్‌కు చేరుకున్న అగస్సీ, చివరి మ్యాచ్‌లో టోర్నీ ఛాంపియన్ టాడ్ మార్టిన్ చేతిలో పరాజయం పాలయ్యాడు, ఈ మ్యాచ్ విజయంతో మార్టిన్ తన కెరీర్‌లో నాలుగో అవుట్‌బ్యాక్ ఛాంపియన్స్ సిరీస్ టైటిల్ పొందాడు.[35] ఫైనల్‌కు చేరుకునే క్రమంలో, అగస్సీ క్వార్టర్ ఫైనల్‌‍లో మైకెల్ పెర్న్‌ఫోర్స్ మరియు సెమీ ఫైనల్‌లో వైన్ ఫెరీరాలను ఓడించాడు. అయితే, ఈ టోర్నీలో తాను పూర్తి-కాల ప్రాతిపదికన ఆడబోనని అతను స్పష్టం చేశాడు, తన సుదీర్ఘకాల స్నేహితుడు జిమ్ కొరియర్ కోసం తాను ఇప్పుడు ఈ టోర్నీ ఆడానని చెప్పాడు.[36] హైతీ పునర్నిర్మాణం కోసం ఆండ్రీ ఇతర అగ్రశ్రేణి క్రీడాకారులు సంప్రాస్, ఫెదరర్ మరియు నాదల్‌లతో కలిసి ఒక ఛారిటీ టోర్నమెంట్ ఆడాడు. మ్యాచ్ సందర్భంగా, అగస్సీ మరియు సంప్రాస్ మధ్య కొంత వాగ్యుద్ధం జరిగింది. అగస్సీ యొక్క పావురం-కాళ్ల నడకను సంప్రాస్ అపహాస్యం చేశాడు, అగస్సీ దీనికి బదులుగా సంప్రాస్‌ను చవుకబారు (సంప్రాస్‌కు ఉన్న టిప్‌లు ఇచ్చే అలవాట్లను సూచిస్తూ) వ్యక్తిగా పిలిచాడు. సంప్రాస్ మరియు ఫెదరర్ ఈ మ్యాచ్‌లో రెండు సెట్లలో విజయం సాధించారు. చివరకు, అగస్సీ మరియు సంప్రాస్ సర్దుబాటు చేసుకున్నారు.

2011 ప్రారంభంలో, అగస్సీ తైవాన్‌లో మారత్ సఫిన్‌తో కలిసి వరుసగా ప్రదర్శన మ్యాచ్‌లు ఆడనున్నాడు. వారు జనవరి 6, 2011న తైపీ ఎరీనాలో మరియు జనవరి 8, 2011న కావోషంగ్ ఎరీనాలో ఆడనున్నారు.

ఆట శైలి[మార్చు]

మూస:Refimprovesect క్రీడా జీవితపు ప్రారంభంలో, అగస్సీ చివరి పాయింట్లు చాలా త్వరగా సాధించేందుకు ప్రయత్నించేవాడు, లోతైన, గట్టి షాట్‌లతో బలహీనమైన రిటర్న్‌లకు ప్రత్యర్థిని ప్రేరేపించడం మరియు తరువాత ఒక అసాధారణ కోణం నుంచి విన్నర్‌ను ఆడేవాడు. సర్వ్ రిటర్న్, బేస్‌లేన్ ఆట, ఊహ అతని ఆటలో అత్యుత్తమ అంశాలుగా చెప్పవచ్చు, 1992లో ఈ లక్షణాలు అతడికి వింబుల్డన్ టైటిల్‌ను సాధించిపెట్టాయి. అరుదైన సందర్భంలో, అతను నెట్ వద్ద ఆడతాడు, గాలిలో బంతిని తీసుకోవడం మరియు విన్నర్ కోసం ఒక స్వింగింగ్ వోలీ కొట్టడమంటే అతనికి ఇష్టం.

అగస్సీ బంతిని ముందుగా తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచడం కొనసాగిస్తాడు, లైన్‌పై స్మోకింగ్ బ్యాక్‌హ్యాండ్ వంటి స్వింగింగ్ డీప్ యాంగిల్స్‌కు అతను పెట్టింది పేరు. కోర్టు వెనుకవైపు నుంచి ఆటను నియంత్రించడం అతను బలం. పెరుగుతున్న వయస్సులో అగస్సీకి అతని తండ్రి మరియు నిక్ బోలెట్టీరి ఈ విధంగా శిక్షణ ఇచ్చారు. బలమైన సర్వ్, నెట్ వద్ద ఆట లేదా వోలియింగ్ విషయంలో అతనెన్నడూ నైపుణ్యం గల ఆటగాడిగా గుర్తించబడలేదు.[37] ఒక పాయింట్ యొక్క నియంత్రణలో, అగస్సీ తరచుగా ఒక విన్నర్ కోసం అవకాశం కల్పిస్తాడు, దోషాలను తగ్గించేందుకు మరియు ప్రత్యర్థిని బాగా పరిగెత్తించేందుకు కొద్దిగా ఎక్కువగా సంప్రదాయ షాట్‌లు కొడతాడు. పాయింట్ తరువాత పాయింట్ చుట్టూ ఆటగాళ్లను పరిగెత్తించే ప్రవృత్తి కారణంగా, అతనికి "ది పనిషర్" అనే మారుపేరు వచ్చింది.[1]

అగస్సీకి సర్వ్ ఎన్నడూ తన ఆట బలంగా లేదు, అయితే తన క్రీడా జీవితం సాగేకొద్ది దానిని మెరుగుపరుచుకున్నాడు, బాధ్యతాయుతమైన సర్వ్ నుంచి కొంచెం మెరుగైన సర్వ్ వరకు అభివృద్ధి చెందాడు. తన ప్రత్యర్థిని కోర్టు బయటకు పంపేందుకు డ్యూస్ సర్వీస్ బాక్స్‌లో అతను తరచుగా హార్డ్ స్లైస్ సర్వ్‌ను ఉపయోగిస్తాడు, తరువాత ప్రత్యర్థి నిలబడివున్న ప్రదేశానికి వ్యతిరేక మూలకు షాట్ కొడతాడు. ఒక మొదటి ఫ్లాట్ సర్వ్‌ను కొట్టే సమయంలో అగస్సీ యొక్క సర్వ్ వేగం తరచుగా 110 mph (177 km/h) నుంచి 125 mph (201 km/h) వరకు ఉంటుంది. అయితే అతని రెండో సర్వ్ సాధారణంగా 80ల మధ్యలో ఉంటుంది. రెండో సర్వ్ కోసం అతను ఒక భారీ కిక్ సర్వ్‌పై ఆధారపడతాడు.

వ్యక్తిగత మరియు కుటుంబ జీవితం[మార్చు]

అగస్సీ ఏప్రిల్ 19, 1997న నటి బ్రూక్ షీల్డ్స్‌ను వివాహం చేసుకున్నాడు. ఫిబ్రవరి 1998లో, వారు తమపై తప్పుడు మరియు ఊహాకల్పిత ప్రకటనలను ప్రచురించిందనే ఆరోపణలతో ది నేషనల్ ఎంక్వైరర్‌ పై కేసు పెట్టారు, అయితే ఈ కేసు కొట్టివేయబడింది. ఈ జంట తరువాత విడాకుల కోసం దరఖాస్తు చేసింది, వీరికి ఏప్రిల్ 9, 1999లో విడాకులు మంజూరు అయ్యాయి.

1999 ఫ్రెంచ్ ఓపెన్ వద్ద, అగస్సీ మరియు స్టెఫీ గ్రాఫ్ ఆశ్చర్యకరరీతిలో ఛాంపియన్‌లుగా నిలిచారు, ఎందుకంటే అగస్సీ 1995 నుంచి మరియు ఆమె 1996 నుంచి ఒక్క గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను కూడా గెలుచుకోలేదు. విజేతల సమావేశంలో, వారిద్దరూ రెండోసారి ఒకరినొకరు కలుసుకున్నారు. తరువాత కొద్దికాలానికే, వారు కలిసి తిరగడం మొదలుపెట్టారు. జులైలో ఇద్దరూ వింబుల్డన్ ఫైనల్‌కు చేరుకున్న తరువాత గ్రాఫ్ రిటైర్మెంట్ ప్రకటించింది. అక్టోబరు 22, 2001లో వారిద్దరూ వివాహం చేసుకున్నారు.[38] వారి కుమారుడు జాడెన్ గిల్ నాలుగు రోజుల తరువాత అక్టోబరు 26న జన్మించాడు. వారి కుమార్తె జాజ్ ఎల్ అక్టోబరు 3, 2003న జన్మించింది. ఈ జంట లాస్ వెగాస్ ప్రాంతంలో నివసిస్తుంది, వీరికి పలు విడిది గృహాలు కూడా ఉన్నాయి.

అగస్సీ పెద్ద సోదరి రీటా టెన్నిస్ ఆటగాడు పాంచో గోంజలెస్‌ను వివాహం చేసుకుంది. 1995లో, గోంజలెస్ లాస్ వెగాస్‌లో మరణించినప్పుడు, అంత్యక్రియలకు అగస్సీ అండగా నిలిచాడు. సుదీర్ఘ-కాల శిక్షకుడు గిల్ రెయెస్‌ను అగస్సీ యొక్క అత్యంత సన్నిహిత మిత్రుల్లో ఒకడిగా చెప్పవచ్చు; కొందరు అతడిని అగస్సీకి తండ్రి-సమానుడిగా వర్ణిస్తారు.[39][40] ఆండ్రీ అగస్సీ మరో సోదరి టామీ తన తల్లి బెట్టీ మాదిరిగానే రొమ్ము క్యాన్సర్‌తో పోరాడిన బాధితురాలు.

డిసెంబరు 2008లో, అగస్సీ బాల్య స్నేహితుడు మరియు మాజీ వ్యాపార మేనేజర్ పెర్రీ రోజెర్స్ తనకు గ్రాఫ్ $50,000 నిర్వహణ రుసుములు ఇవ్వలేదని కేసు పెట్టాడు.[41][42]

అగస్సీ యొక్క స్వీయచరిత్ర ఓపెన్ (జే. ఆర్. మోహ్రింజెర్[43] సాయంతో రాయబడింది) నవంబరు 2009లో ప్రచురితమైంది. దీనిలో, అగస్సీ తనకు ఒకప్పుడు తలపై పొదలాగా ఉండే జట్టు వాస్తవానికి విగ్ అని మరియు తాను 19997లో మెథాంఫెటామిన్ వాడటం మరియు డ్రగ్ పరీక్షల్లో దొరికిపోవడాన్ని అంగీకరించాడు,[22][44][45]. తరువాతి నిజం బయటపెట్టడానికి స్పందనగా రోజర్ ఫెదరర్ మాట్లాడుతూ తనకు ఈ నిజం విభ్రాంతి మరియు నిరాశ కలిగించిందని చెప్పాడు,[46] అగస్సీని అనర్హుడిగా ప్రకటించి ఉండాల్సిందని సెర్గెజ్ బుగ్బా అభిప్రాయపడ్డాడు.[47] CBSకు ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో అగస్సీ దానిని సమర్థించుకున్నాడు, తనను అర్థం చేసుకోవాలని కోరాడు, నాకు జీవితంలో సాయం అవసరమైన రోజులు అవని చెప్పాడు.[48] తనపై స్థిరంగా ఉండిపోయిన ఒత్తిడి కారణంగా, ఆడినన్ని రోజులపాటు తాను టెన్నిస్‌ను ద్వేషించానని వెల్లడించాడు. పీట్ సంప్రాస్ "రోబో" అయివుంటాడని పేర్కొన్నాడు.[49][50] ఈ పుస్తకం న్యూయార్క్ టైమ్స్ ఉత్తమ విక్రయ జాబితాలో #1 స్థానానికి చేరుకుంది[51] మరియు మద్దతు ఇచ్చే సమీక్షలు పొందింది.[52]

రాజకీయాలు[మార్చు]

అగస్సీ ఒక నమోదిత డెమొక్రాట్[53] మరియు డెమొక్రాట్ అభ్యర్థులకు $100,000పైగా విరాళం ఇచ్చాడు.[54]

దాతృత్వం[మార్చు]

అగస్సీ అనేక ఛారిటీ సంస్థల్లో పాల్గొన్నాడు మరియు ఆండ్రీ అగస్సీ ఛారిటబుల్ అసోసియేషన్‌ను 1994లో స్థాపించాడు, ఇది లాస్ వెగాస్ యువ బాలలకు సాయం చేస్తుంది. పేద బాలలకు సాయం చేసేందుకు చేపట్టిన ప్రయత్నాలకు గుర్తుగా అగస్సీకి 1995లో ATP ఆర్థూర్ యాష్ హ్యూమానిటేరియన్ అవార్డు లభించింది. ప్రొఫెషనల్ టెన్నిస్‌లో ఛారిటీ మరియు సామాజిక కార్యక్రమాల్లో ఎక్కువ ప్రమేయం ఉన్న క్రీడాకారుడిగా అతను పరిగణించబడుతున్నాడు. అతని తరం క్రీడాకారుల్లో ఛారిటీల ద్వారా ఎక్కువగా సేవ చేస్తున్న వ్యక్తిగా అగస్సీ గుర్తింపు పొందాడు, లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న గుర్తింపు కలిగివున్నాడు.[55]

తమలో క్రీడా సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు బాలలకు ఆండ్రీ అగస్సీ ఛారీటీలు సాయపడుతున్నాయి. అతని బాలుర మరియు బాలికల క్లబ్‌లో ఏడాదివ్యాప్తంగా 2,000 బాలలు శిక్షణ పొందుతున్నారు, అంతేకాకుండా ఒక ప్రపంచ శ్రేణి జూనియర్ టెన్నిస్ జట్టుకు మద్దతు ఇస్తుంది. దీనిలో ఒక బాస్కెట్‌బాల్ శిక్షణా కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది (దీని పేరు అగస్సీ స్టార్స్), ఇక్కడ ఒక కఠినమైన వ్యవస్థలో వివిధ అకాడమీలు మరియు క్రీడలు ప్రోత్సహించబడుతున్నాయి.

2001లో అగస్సీ తన పేరుమీదగా ఆండ్రీ అగస్సీ కాలేజ్ ప్రిపరేటరీ అకాడమీ[56] ని లాస్ వెగాస్‌లో ప్రారంభించాడు, ఈ ప్రాంతంలో పేద బాలలకు ఇది ఉచిత-బోధన అందించే ఛార్టర్ పాఠశాలగా నిర్వహించబడుతుంది. 2009లో, ఈ పాఠశాలలో గ్రాడ్యుయేషన్ తరగతి 100 శాతం ఉత్తీర్ణత రేటు మరియు 100 కళాశాల అర్హత రేటు కలిగివుంది[ఉల్లేఖన అవసరం]. ఇతర బాలల-సంబంధ కార్యక్రమాలకు అగస్సీ తన యొక్క ఆండ్రీ అగస్సీ ఛారిటబుల్ ఫౌండేషన్ ద్వారా మద్దతు ఇస్తున్నాడు, వేధింపులకు గురైన మరియు నిర్లక్ష్యం చేయబడిన బాలలకు చైల్డ్ హెవెన్ పేరుతో ఒక నివాస కేంద్రాన్ని క్లార్క్ కౌంటీలో నిర్వహించబడుతుంది. 1997లో చైల్డ్ హెవెన్‌కు ఆరు-తరగతి గదుల భవనానికి అగస్సీ నిధులు సమకూర్చాడు, ఇప్పుడు దీని పేరు అగస్సీ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్. ఆండ్రీ అగస్సీ కాటేజ్ ఫర్ మెడికల్లీ ఫ్రాజిల్ చిల్డ్రన్ యొక్క భవన నిర్మాణానికి సాయం చేసేందుకు అతని ఫౌండేషన్ $720,000 నిధులు అందించింది. ఈ కేంద్రం డిసెంబరు 2001లో ప్రారంభమైంది, ఆర్థికంగా వెనుకబడిన లేదా వికలాంగ బాలలు మరియు అంటురోగాల బారినపడిన పిల్లలకు ఇది వసతి కల్పిస్తుంది. దీనిలో సుమారుగా 20 పడకలు ఉంటాయి, కొత్త పర్యావరణంలో బాలకు సౌకర్యవంతంగా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు మరియు ప్రత్యేక శ్రద్ధ కల్పించబడుతున్నాయి[ఉల్లేఖన అవసరం]

2007లో, అగస్సీ, ముహమ్మద్ అలీ, లాన్స్ ఆర్మ్‌స్ట్రాంగ్, వారిక్ డున్, జెఫ్ గోర్డాన్, మియా హామ్, టోనీ హాక్, ఆండ్రియా జెగెర్, జాకీ జోయ్నెర్-కెర్సీ, మేరియో లెమీయక్స్, అలోంజో మౌర్నింగ్ మరియు కాల్ రిప్కెన్, జూనియర్ ఛారిటీ అథ్లెట్స్ ఫర్ హోప్‌ను స్థాపించారు,[57] ప్రొఫెషనల్ అథ్లెట్లు సేవా కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మరియు అథ్లెట్లుకాని మిలియన్ల మంది పౌరుల్లో స్ఫూర్తి నింపేందుకు మరియు సమాజానికి మద్దతు ఇచ్చేందుకు సాయపడుతుంది.

గుర్తింపు[మార్చు]

టెన్నిస్ మేగజైన్ అతడిని 1965 నుంచి 2005 వరకు పురుషుల్లో ఏడో అత్యుత్తమ ఆటగాడిగా-మరియు మొత్తమీద 12వ అత్యుత్తమ ఆటగాడిగా గుర్తించింది.[9]

రికార్డులు[మార్చు]

గ్రాండ్ స్లామ్ సంవత్సరాలు సాధించిన రికార్డు అనుబంధ ఆటగాడు
వింబుల్డన్
U.S. ఓపెన్
ఆస్ట్రేలియన్ ఓపెన్
ఒలింపిక్స్
ఫ్రెంచ్ ఓపెన్
1992
1994
1995
1996
1999
కెరీర్ గోల్డెన్ స్లామ్ ఏకైక వ్యక్తి
వింబుల్డన్
U.S. ఓపెన్
ఆస్ట్రేలియన్ ఓపెన్
ఫ్రెంచ్ ఓపెన్
1992
1994
1995
1999
కెరీర్ గ్రాండ్ స్లామ్ రాడ్ లావెర్
రోజెర్ ఫెదరర్
ఆస్ట్రేలియన్ ఓపెన్ 1995–2003 మొత్తంమీద 4 విజయాలు రోజర్ ఫెదరర్
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2000-04 26 వరుస మ్యాచ్ విజయాలు ఏకైక వ్యక్తి
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2000-03 4 ఏళ్లలో 3 విజయాలు రోజర్ ఫెదరర్
ఆస్ట్రేలియన్ ఓపెన్ 2000-01 వరుసగా 2 టైటిళ్లు కెన్ రోజ్‌వాల్
గ్యులెర్మో విలాస్
జోహాన్ క్రియెక్
మాట్స్ విలాండెర్
స్టెఫాన్ ఎడ్‌బెర్గ్
ఐవాన్ లెండల్
జిమ్ కొరియర్
రోజర్ ఫెదరర్

ఇతర రికార్డులు:

ATP వరల్డ్ టూర్ మాస్టర్స్ 1000 (మాజీ ATP మాస్టర్స్ సిరీస్) టైటిళ్లు: 17 (నాదల్ తరువాతి స్థానంలో ఉన్నాడు: 18)

ATP ప్రవేశ ర్యాంకింగ్స్‌లో అతిపెద్ద వయస్కుడైన అగ్రశ్రేణి ర్యాంకు క్రీడాకారుడు: 33 సంవత్సరాల 4 నెలలు

క్రీడాజీవితపు గణాంకాలు[మార్చు]

వీటిని కూడా చూడండి[మార్చు]

Lua error in package.lua at line 80: module 'Module:Portal/images/t' not found.

సూచనలు[మార్చు]

 1. 1.0 1.1 "The Career of Andre Agassi". igotennis.com. 2009-03-15. Retrieved 2009-06-17. Cite web requires |website= (help)
 2. 2.0 2.1 2.2 "టెన్నిస్ లవ్ ఎఫైర్ విత్ అగస్సీ కమ్స్ టు ఎన్ ఎండ్" CBC స్పోర్ట్స్. సేకరణ తేదీ మే 15, 2010.
 3. "గ్రాండ్-స్లామ్డ్". ది డైలీ టెలీగ్రాఫ్. సేకరణ తేదీ మే 15, 2010.
 4. 4.0 4.1 4.2 "స్టార్స్ పే ట్రిబ్యూట్ టు అగస్సీ". BBC. సేకరణ తేదీ మే 15, 2010.
 5. "రీడ్స్ షాట్‌మేకర్స్: మెన్స్ రిటర్న్ ఆఫ్ సర్వ్". యాహూ స్పోర్ట్స్. సేకరణ తేదీ మే 15, 2010.
 6. "అడ్జెక్టివ్స్ టాంగ్లెడ్ ఇన్ ది నెట్". న్యూయార్క్ టైమ్స్ . సేకరణ తేదీ మే 15, 2010.
 7. "సంప్రాస్, అగస్సీ హావ్ జస్ట్ బిగన్ టు ఫైట్" లాస్ ఏంజిల్స్ టైమ్స్ . సేకరణ తేదీ మే 15, 2010.
 8. లాస్ ఏంజిల్స్ టైమ్స్ కవరేజ్
 9. 9.0 9.1 Tennis.com: "40 గ్రేటెస్ట్ ప్లేయర్స్ ఆఫ్ ది టెన్నిస్ ఎరా"
 10. [1]
 11. "Tribute to a legend: Andre Agassi Charitable Foundation". ATP Tour, Inc. Retrieved 2007-02-15. Cite web requires |website= (help)
 12. "Homepage of". Andre Agassi Preparatory Academy. Retrieved 2007-02-15. Cite web requires |website= (help)
 13. ది ఇండిపెండెంట్: "డోంట్ వాక్ అవేగ, ఆండ్రీ"
 14. "Andre Agassi Biography". Netglimpse.com. Retrieved 2007-08-14. Cite web requires |website= (help)
 15. http://books.google.com/books?id=5R1y1nvcWccC&pg=PA278&lpg=PA278&dq=andre+aghassi+Armenian+-wikipedia.org&source=bl&ots=MiSYlmHbHG&sig=wMd8xu9J8iOQyv_RuVwJvaJWiyc&hl=en&sa=X&oi=book_result&resnum=48&ct=result
 16. http://www.persianmirror.com/culture/famous/bios/andreagassi.cfm
 17. http://www.zindamagazine.com/html/archives/1995/zn082895.html
 18. http://www.peopleandprofiles.com/ProfilesDet-28/Andre+Agassi.html?profile_id=127
 19. 19.00 19.01 19.02 19.03 19.04 19.05 19.06 19.07 19.08 19.09 19.10 19.11 19.12 19.13 19.14 19.15 19.16 Jensen, Jeffry (2002) [1992]. Dawson, Dawn P (సంపాదకుడు.). Great Athletes. 1 (Revised సంపాదకులు.). Salem Press. pp. 17–19. ISBN 1-58765-008-8.
 20. "Coming Into Focus". Gary Smith for Sports Illustrated. Retrieved 2007-02-15. Cite web requires |website= (help)
 21. "http://www.tennis28.com/rankings/history/agassi.html". Tennis28. Retrieved 2009-06-12. Cite web requires |website= (help); External link in |title= (help)
 22. 22.0 22.1 http://sports.espn.go.com/sports/tennis/news/story?id=4600027
 23. "Agassi admits use of crystal meth". BBC News. October 28, 2009. Retrieved March 30, 2010.
 24. 24.0 24.1 24.2 24.3 24.4 ఆండ్రీ అగస్సీ ప్లేయర్ ప్రొఫైల్
 25. రోజర్ ఫెదరర్ ఈ సాధనను పునరావృతం చేశాడు, అతను 2005–2007 మధ్యకాలంలో వరుసగా పది గ్రాండ్‌స్లామ్ టోర్నీల ఫైనల్స్‌లో ఆడాడు.
 26. పీట్ సంప్రాస్ 1993 వింబుల్డన్, 1993 US ఓపెన్, మరియు 1994 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లను వరుసగా గెలుచుకున్నాడు. జిమ్మీ కానర్స్ 1974లో మూడు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు గెలుచుకున్నాడు, అయితే ఆ సమయంలో అన్నీ గడ్డి కోర్టులు మాత్రమే ఉన్నాయి. మాట్స్ విలాండెర్ 1988లో అన్ని టైటిళ్లను గెలుచుకున్నప్పటికీ వింబుల్డన్‌ను సొంతం చేసుకోలేకపోయాడు, ఈ ఏడాదిని అతను ప్రపంచ నెంబర్‌వన్ స్థానంతో ముగించాడు. ఫెదరర్ తరువాత ఈ ఘనతను పునరావృతం చేశాడు, ఫ్రెంచ్ ఓపెన్ మినహా 2004 చివరినాటికి ఫ్రెంచ్ ఓపెన్ మినహా. 2006 మరియు 2007లో దీనిని కొనసాగించాడు. రఫెల్ నాదల్ 2008లో ఫ్రెంచ్ ఓపెన్ గెలుచుకున్నాడు, 2008 వింబుల్డన్, మరియు 2009 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిళ్లు గెలుచుకున్నాడు.
 27. "Classic Matches: Rafter v Agassi". BBC Sport. 2004-05-31. Retrieved 2007-10-25. Cite news requires |newspaper= (help)
 28. బిలీవ్ ది హైప్
 29. అన్‌బ్రేకబుల్
 30. [2]
 31. వీక్స్ ఎట్ నెంబర్‌వన్
 32. ESPN - అగస్సీ సైన్స్ అడిడాస్ ఆఫ్టర్ లాంగ్-టర్మ్ డీల్ విత్ నైక్ - టెన్నిస్
 33. "Upsetting day: Agassi, then Roddick ousted". Associated Press. NBC Sports. 2006-06-01. Retrieved 2007-10-27.
 34. ఆండ్రీ అగస్సీ విల్ ప్లే WTT SI.com, మార్చి 1, 2009
 35. [3]
 36. [4]
 37. ఓపెన్: ఆండ్రీ అగస్సీ హార్పెర్‌కొల్లిన్స్ 2009
 38. ఆండ్రీ అగస్సీ అండ్ స్టెఫీ గ్రాఫ్ వెడ్
 39. ఫాదర్ న్యూ బెస్ట్
 40. పీటర్ బోడో బ్లాగ్: పాపా గిల్
 41. Alliance Sports Management v. Stephanie Graf Las Vegas Sun . Accessed 23 October 2009
 42. "Ex-manager for Agassi sues Graf" Las Vegas Review-Journal 7 December 2008. Accessed 23 October 2009
 43. "అగస్సీ బాస్క్ ఇన్ హిజ్ ఓన్ స్పాట్‌లైట్" బై జానెట్ మేలిన్ న్యూయార్క్ టైమ్స్ నవంబరు 8, 2009 సేకరణ తేదీ డిసెంబరు 11, 2009
 44. http://www.nydailynews.com/sports/more_sports/2009/10/27/2009-10-27_agassi.html
 45. http://www.nbcwashington.com/news/sports/NATL-Andre-Agassi-Admits-to-Using-Crystal-Meth-66510482.html
 46. [5]
 47. http://sport.repubblica.it/news/sport/tennis-doping-bubka-agassi-dovrebbe-essere-punito/3730891
 48. http://www.sportmediaset.mediaset.it/altrisport/articoli/articolo27870.shtml
 49. http://sports.yahoo.com/ten/news?slug=ap-sampras-agassibook&prov=ap&type=lgns
 50. Jeffries, Stuart (2009-10-29). "Why did Andre Agassi hate tennis?". London: guardian.co.uk. Retrieved 2010-01-25. Cite news requires |newspaper= (help)
 51. "Hardcover Nonfiction". The New York Times. November 29, 2009. Retrieved March 30, 2010.
 52. http://latimesblogs.latimes.com/jacketcopy/2009/11/book-reviews-agassi-mayle-mourlevat-palin.html
 53. హాలీవుడ్, స్పోర్ట్స్ సెలెబ్రిటీస్ నాట్ ఆన్ సేమ్ డొనేషన్ పేజ్
 54. ఆండ్రీ అగస్సీస్ ఫెడరల్ క్యాంపైన్ కాంట్రిబ్యూషన్ రిపోర్ట్
 55. స్పోర్ట్స్‌మ్యాన్/పర్సన్ ఆఫ్ ది ఇయర్
 56. [6]
 57. [7]

మరింత చదవడానికి[మార్చు]

 • Agassi, Mike; Cobello, Dominic; Welsh, Kate (2004). The Agassi Story. Toronto: ECW Press. ISBN 1-55022-656-8.CS1 maint: multiple names: authors list (link)
 • ఓపెన్ ఆండ్రీ అగస్సీ హార్బర్‌కొల్లిన్స్ 2009

వీడియో[మార్చు]

 • వింబుల్డన్ 2000 సెమీ ఫైనల్ - అగస్సీ వర్సెస్ రాఫ్టెర్ (2003) పాత్రలు: ఆండ్రీ అగస్సీ, ప్యాట్రిక్ రాఫ్టెర్; స్టాండింగ్ రూమ్ ఓన్లీ, DVD విడుదల తేదీ: ఆగస్టు 16, 2005, నిడివి: 213 నిమిషాలు, ASIN: B000A343QY.
 • ఛార్లీ రోజ్ విత్ ఆండ్రీ అగస్సీ (మే 7, 2001) ఛార్లీ రోజ్, ఇంక్., DVD విడుదల తేదీ: ఆగస్టు 15, 2006, నిడివి: 57 నిమిషాలు, ASIN: B000HBL6VO.
 • వింబుల్డన్ రికార్డ్ బ్రేకర్స్ (2005) పాత్రలు: ఆండ్రీ అగస్సీ, బోరిస్ బెకెర్; స్టాండింగ్ రూమ్ ఓన్లీ, DVD విడుదల తేదీ: ఆగస్టు 16, 2005, నిడివి: 52 నిమిషాలు, ASIN: B000A3XYYQ.

వీడియో గేమ్స్[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

మూస:Wikinewspar

మూస:Andre Agassi start boxes