జిమ్ కార్బెట్
| జిం కార్బెట్ CIE VD | |
|---|---|
ఈ ఫోటోని 1907 సమయంలో, మొట్టమొదటిసారి మనుషులను తినే చంపావత్ పులి గురించి విన్నప్పుడు దిగారు.[1] | |
| జననం | ఎడ్వర్డ్ జేమ్స్ కార్బెట్ 1875 జూలై 25 నైనిటాల్, ఆగ్నేయ భారత్ ప్రావిన్స్, బ్రిటీష్ ఇండియా |
| మరణం | 1955 ఏప్రిల్ 19 (వయసు: 79) న్యేరి, కెన్యా |
| విశ్రాంతి ప్రదేశం | సెయింట్ పీటర్స్ ఆంగ్లికన్ చర్చ్, న్యేరి, కెన్యా |
| జాతీయత | బ్రిటిష్ |
| వృత్తి | మూస:వేటగాడు |
ఎడ్వర్డ్ జేమ్స్ కార్బెట్ CIE VD (25 జూలై 1875-19 ఏప్రిల్ 1955) ఆంగ్లో-ఇండియన్ వేటగాడు, రచయిత. బ్రిటీష్ పరిపాలన సమయంలో ఉత్తరభారతదేశంలో ఎందరో మనుషులను చంపి తిన్న మ్యానీటర్ పులులను, చిరుతలను వేటాడాడు జిమ్. వేటల్లో తన అనుభవాలను మ్యానీటర్స్ ఆఫ్ కుమావూన్ పేరుతో రాసిన పుస్తకాన్ని 1944లో ప్రచురించాడు. ఆ పుస్తకం అప్పట్లో బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. ఇతర ప్రాంతాల్లో జిమ్ రచయితగా చాలా ప్రసిద్ధి చెందాడు. తరువాతి కాలంలో జంతు పరిరక్షణా ఉద్యమకారునిగా మారి, ఎన్నో జంతు జాతులను అంతరించిపోకుండా కాపాడాడు.
నైనిటాల్ లో జన్మించిన జిమ్, భారతదేశంలోని ఎన్నో అడవుల్లో తిరిగాడు. అతను చిన్ననాటి నుండే మంచి వేటగాడు. మొట్టమొదటిసారి ఒక మ్యానీటర్ పులిని 1907లో వేటాడాడు జిమ్. ఆ తరువాత నాలుగు దశాబ్ధాల పాటు అలాంటి పులులు, చిరుతలను ఎన్నిటినో వేటాడి, ఎందరో ప్రజల ప్రాణాలు కాపాడాడు. కొన్ని వందలమంది మనుషులను చంపిన చంపావత్ మేనీటర్, రుద్రప్రయాగ్ మేనీటర్ చిరుత, పనార్ మేనీటర్ చిరుత వంటి జంతువులు అతని చేతిలోనే అంతమయ్యాయి. తన ఈ వేట అనుభవాలను గురించి మేనీటర్స్ ఆఫ్ కుమావూన్ అనే పుస్తకం రాశాడు జిమ్. ఆ పుస్తకం చాలాకాలం పాటు అంతర్జాతీయ స్థాయిలో బెస్ట్ సెల్లర్ గా నిలిచింది. ఈ పుస్తకం 1948లో హాలీవుడ్ లో సినిమాగా కూడా వచ్చింది. ఈ పుస్తకం తరువాత తన మిగిలిన వేట అనుభావలను మరిన్ని పుస్తకాలుగా ప్రచురించాడు జిమ్.
భారతదేశంలోని అడవుల్లో సరదా కోసం, ప్రతిష్ట కోసం కొందరు చేసే వేట వలన ఎన్నో జంతువులు అంతరించిపోయాయని జిమ్ బాధపడేవాడు. వేట బదులు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని ప్రోత్సహించేవాడు. 1934లో భారతదేశంలోనే మొట్టమొదటి వైల్డ్ లైఫ్ రిజర్వ్ ను తయారు చేసినవారిలో ముఖ్యుడు జిమ్. అతను చనిపోయిన తరువాత జిమ్ జ్ఞాపకార్ధం ఆ రిజర్వ్ కు జిమ్ కార్బెట్ జాతీయ వనం అని పేరు మార్చారు. ఇండోచైనీస్ జాతికి చెందిన పులికి ఉండే సైంటిఫిక్ పేరు(ద్వినామం)ను జిమ్ గౌరవార్ధం పేంథెరా టైగరిస్ కార్బెట్టీ అని మార్చారు.
సూచనలు
[మార్చు]- ↑ Huckelbridge 2019, Photo Section.
మూలాలు
[మార్చు]- Booth, Martin (1986). Carpet Sahib: A Life of Jim Corbett. Constable. ISBN 978-0-0946-7400-4.
- Corbett, Jim (1959). Man-Eaters of Kumaon. London: Oxford University Press.
- Corbett, Jim (1954). The Man-Eating Leopard of Rudraprayag. Mumbai: Oxford University Press.
- Corbett, Jim (1994). The Temple Tiger and More Man-Eaters of Kumaon. Mumbai: Oxford University Press.
- Huckelbridge, Dane (2019). No Beast So Fierce: The Terrifying True Story of the Champawat Tiger. New York City: William Morrow and Company. ISBN 978-0-0626-7884-3.
- Mandala, Vijaya Ramadas. "The Raj and the Paradoxes of Wildlife Conservation: British Attitudes and Experiences".
- Mandala, Vijaya Ramadas (2018). "Hunters-Turned-Conservationists: Jim Corbett and Colonel Burton". Shooting a Tiger: Big-Game Hunting and Conservation in Colonial India. Delhi: Oxford University Press. pp. 325–372. doi:10.1093/oso/9780199489381.003.0007.
- Singh, Rameshwer. "Many Personas of Jim Corbett".