జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్
![]() | ఈ వ్యాసం పూర్తిగానో, పాక్షికంగానో గూగుల్ అనువాద వ్యాసాల ప్రాజెక్టు (2009-2011) ద్వారా గూగుల్ అనువాదఉపకరణాల నాణ్యతను పెంచడంలో భాగంగా కొన్నిపరిమితులతో ఆంగ్ల వికీవ్యాసంనుండి మానవ అనువాదకులు అనువదించారు. అందుచేత ఇందులోని వాక్య నిర్మాణాలు, పదాల ఎంపిక కాస్త కృత్రిమంగా ఉండే అవకాశం ఉంది. అనువాదాన్ని వీలైనంతగా సహజంగా తీర్చిదిద్ది, ఈ మూసను తొలగించి చర్చా పేజీలో {{వికీప్రాజెక్టు_గూగుల్_అనువాదవ్యాసాలు-మెరుగుపరచిన}} చేర్చండి. |
?Jim Corbett National Park Uttarakhand • భారతదేశం | |
IUCN Category II (National Park) | |
అక్షాంశరేఖాంశాలు: 29°32′00″N 78°56′7″E / 29.53333°N 78.93528°ECoordinates: 29°32′00″N 78°56′7″E / 29.53333°N 78.93528°E | |
కాలాంశం | భాప్రాకా (గ్రీ.కా+5:30) |
విస్తీర్ణం • ఎత్తు |
521 కి.మీ² (201 చ.మై) • 1,210 మీ (3,970 అడుగులు) |
వాతావరణం • అవపాతం ఉష్ణోగ్రత • వేసవికాలం • శీతాకాలం |
• 2,800 mm (110.2 in) • 32.5 °సె (91 °ఫా) • 14.5 °సె (58 °ఫా) |
సమీప నగరం | Ramnagar |
జిల్లా(లు) | Nainital జిల్లా |
Established | 1936 |
Visitation | 50,000 (1999) 70,000 expected in 2010 [1] |
Governing body | Project Tiger, Government of Uttarakhand, Wildlife Warden, Corbett National Park |
వెబ్‌సైటు: www.corbettnationalpark.in |
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ -దీని స్థాపనలో ముఖ్యపాత్రను పోషించిన సంరక్షకుడిగా మారిన వేటగాడు జిమ్ కార్బెట్ పేరుతో వెలిసింది-భారతదేశంలోని పురాతన జాతీయ పార్క్.[2] ఈ ఉద్యానవనం హాయిలే నేషనల్ పార్క్‌లో 1936లో స్థాపించబడింది. ఉత్తరఖాండ్‌లోని నైనిటాల్ జిల్లాలో ఉన్న ఈ ఉద్యానవనం నశించిపోతున్న భారతదేశపు బెంగాయాదృచ్ఛిక పేజీలీ పులికి ఒక సంరక్షక ప్రాంతంగా వ్యవహరించబడుతుంది, ఇది ఒక భారతీయ వన్యప్రాణుల సంరక్షణ చొరవ ప్రాజెక్ట్ టైగర్ యొక్క ప్రధాన అంశం సురక్షిత మనుగడగా చెప్పవచ్చు.[2]
ఈ ఉద్యానవనం ఉప-హిమాలయాల తోరణ భౌగోళిక మరియు పర్యావరణ లక్షణాలను కలిగి ఉంది.[3] ఒక పర్యావరణ పర్యటన గమ్యంగా, [4] ఇది 488 వేర్వేరు జాతుల వృక్షాలు మరియు పలు వైవిధ్యమైన జంతు జాలాన్ని కలిగి ఉంది.[5][6] ఇతర సమస్యల్లో పర్యాటకుల కార్యాచరణల్లో పెరుగుదల ఉద్యానవనంలో పర్యావరణ సమతుల్యతకు ఒక హానికరమైన సవాలుగా నిలిచింది.[7]
కార్బెట్ చాలాకాలంగా పర్యాటకులు మరియు వన్యప్రాణులను ఇష్టపడేవారికి ఒక ప్రత్యేకమైన ప్రాంతంగా ఉంది. పర్యాటక కార్యకలాపాలు కార్బెట్ టైగర్ రిజెర్వ్‌లోని కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే అనుమతించబడ్డాయి దీని వలన ప్రజలు దీని అత్యద్భుతమైన భూభాగం మరియు దాని వైవిధ్యమైన వన్యప్రాణులను చూడటానికి అవకాశాన్ని పొందుతారు. ఇటీవల సంవత్సరాల్లో, దీనిని సందర్శించే ప్రజల సంఖ్య నాటకీయంగా పెరిగిపోయింది. ప్రస్తుతం, ప్రతి సీజన్‌లోనూ భారతదేశం మరియు ఇతర దేశాల నుండి ఈ ఉద్యానవనాన్ని సందర్శించడానికి 70,000 కంటే ఎక్కువమంది సందర్శకులు విచ్చేస్తున్నారు.
జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది సాహసాలను ఇష్టపడే మరియు వన్యప్రాణుల సాహస ప్రియులకు ఒక స్వర్గంగా చెప్పవచ్చు. కార్బెట్ నేషనల్ పార్క్ 520.8 km2 ప్రాంతంలో కొండలు, నదీ తోరణాలు, చిత్తడి నేలలు, గడ్డి నేలలు మరియు పెద్ద సరస్సుతో విస్తరించి ఉన్న భారతదేశంలోని మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం. ఇది సముద్ర తీరానికి 1,300 అడుగుల నుండి 4,000 అడుగుల ఎత్తులో ఉంది. కార్బెట్ నేషనల్ పార్క్‌లో శీతాకాలంలో రాత్రివేళల్లో చల్లగా ఉంటుంది కాని ఆ సమయంలో పగటి వేళలు చాలా ప్రకాశవంతంగా మరియు వేడిగా ఉంటాయి. ఇక్కడ జూలై నుండి సెప్టెంబరు వరకు వర్షాలు పడతాయి.
దట్టమైన ఆర్ద్ర ఆకులురాల్చే అడవి ప్రధానంగా సాల్, హాల్డు, పిపాల్, రోహిణీ మరియు మామిడి చెట్లను కలిగి ఉంది మరియు ఈ చెట్లు సుమారు ఉద్యానవనంలోని 73 శాతాన్ని ఆవిరించి ఉన్నాయి. ఈ భూభాగంలోని 10 శాతం గడ్డి భూములు ఉన్నాయి. ఈ ప్రాంతం 110 వృక్ష జాతులు, 50 క్షీరద జాతులు, 580 పక్షి జాతులు మరియు 25 సరీసృప జాతులకు నివాసంగా ఉంది. నశించిపోతున్న భారతదేశపు బెంగాల్ పులి ఇక్కడ రక్షించబడుతుంది. ఈ అభయారణ్యం ముందుగా ప్రాజెక్ట్ టైగర్ కార్యక్రమం ఆధారంగా ఉద్భవించింది.
విషయ సూచిక
చరిత్ర[మార్చు]
ఉద్యానవనంలోని కొన్ని ప్రాంతాలు అధికారికంగా టెహ్రీ గార్వాల్‌లోని ప్రిన్సెల్ రాష్ట్రంలో భాగంగా ఉన్నాయి.[8] రోహిల్లా ఆక్రమణదారులకు గురి కాకుండా ప్రాంతాన్ని రక్షించడానికి అరణ్యాలు నిర్మూలించబడ్డాయి.[8] టెహ్రీలోని రాజు అతని సామ్రాజ్యం నుండి గుర్ఖాలను తరిమికొట్టడానికి అందించిన సహాయానికి ప్రతిఫలంగా అధికారికంగా అతని ప్రిన్సెల్ రాష్ట్రంలోని ఒక భాగాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇచ్చాడు.[8] టెరాయి నుండి ఒక జాతి బోక్సాలు ఈ ప్రాంతంలో నివాసం ఏర్పర్చుకున్నారు మరియు సేద్యాన్ని ప్రారంభించారు, కాని ప్రారంభ 1860ల్లో, వారు బ్రిటీష్ అధికారం అమలులో ఖాళీ చేశారు.[8] బ్రిటీష్ అటవీ శాఖ భూభాగంపై నియంత్రణ పొందింది మరియు సేద్యాన్ని మరియు పశువుల కొట్టాల నిర్వహణను నిషేధించారు.[9] బ్రిటీష్ పరిపాలన 1907లో ఒక గేమ్ రిజర్వ్‌ను ఏర్పాటు చేయడానికి సంకల్పించింది[9] మరియు 1936లో 323.75 kమీ2 (125.00 sq mi) ఆవరణలో హైలే నేషనల్ పార్క్ అనే పేరుతో ఒక రిజర్వ్ ప్రాంతాన్ని స్థాపించింది.[10] ఈ రక్షిత ప్రాంతానికి 1954-55లో రాంగంగా నేషనల్ పార్క్ అని పేరు మార్చారు మరియు మళ్లీ 1955-56లో కార్బెట్ నేషనల్ పార్క్ అని పేరు మార్చారు.[10] కొత్త పేరును ఈ ఉద్యానవనాన్ని స్థాపించడానికి ప్రాంతీయ ప్రభుత్వాన్ని ఒప్పించడానికి అతని అధికారాన్ని ఉపయోదించి ఒక రిజర్వ్ ప్రాంతాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించిన ప్రముఖ రచయిత మరియు వన్యప్రాణుల సంరక్షకుడు జిమ్ కార్బెట్ స్మారకార్థంగా పెట్టబడింది.[11]
ఈ ప్రాంతంలో వేటాడటం నిషేధించబడింది, కాని వంట చెరకు కోసం చెట్ల నరకడం అనుమతించబడింది.[11] రిజర్వ్ స్థాపించబడిన కొంతకాలం తర్వాత, దాని పరిసర ప్రాంతాల్లో క్షీరదాలు, సరీసృపాలు మరియు పక్షులను చంపడం మరియు బంధించడాన్ని నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేయబడ్డాయి.[11] ఈ ఉద్యానవనం 1930ల్లో ఎన్నికైన పరిపాలన ఆధ్వర్యంలో బాగా అభివృద్ధి చెందింది.[12] కాని రెండవ ప్రపంచ యుద్ధంలో, ఇది అధికస్థాయిలో వేట మరియు చెట్ల నరకవేతతో బాగా క్షీణించింది.[12] ఆ సమయంలో రిజర్వ్‌లోని ప్రాంతం విస్తరించింది-797.72 kమీ2 (308.00 sq mi)ను ఒక అదనపు ప్రాంతం వలె 1991లో కార్బెట్ టైగర్ రిజర్వ్‌కు జోడించారు.[10] 1991 చేర్పుల్లో మొత్తం కళాగార్ అటవీ విభాగం, కళాగార్ విభాగంలో భాగం వలె సోనానడీ వన్యప్రాణుల అభయారణ్యంలోని 301.18 kమీ2 (116.29 sq mi) ప్రాంతం జోడించబడింది.[10] దీనిని 1974లో ఒక గాఢవాంఛగల మరియు బాగా ప్రసిద్ధి చెందిన వన్యప్రాణుల సంరక్షక ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ టైగర్‌ను ప్రారంభించడానికి సరైన ప్రాంతంగా భావించారు.[13] ఈ సంరక్షక ప్రాంతం నైనిటాల్ జిల్లాలోని దాని ప్రధాన కార్యలయాల నుండి నిర్వహించబడుతుంది.[9]
కార్బెట్ నేషనల్ పార్క్ అనేది వారి టెరాయి ఆర్క్ ల్యాండ్‌స్కేప్ ప్రోగ్రామీ క్రింద వరల్డ్ వన్యప్రాణి ఫండ్‌చే నిర్వహించబడుతున్న పదమూడు సంరక్షిత ప్రాంతాలలో ఒకటి.[14] ఈ ప్రోగ్రామ్ వన్యప్రాణుల వలసను అనుమతించడానికి నేపాల్ మరియు భారతదేశంలోని 13 సంరక్షక ప్రాంతాలను అనుసంధానించడానికి అడవి ప్రాంతాలను పునరుద్ధరించడం ద్వారా ఐదు భూమిపై ప్రధానమైన జాతుల్లో మూడు పులి, ఆసియా ఏనుగు మరియు ప్రముఖ ఒక కొమ్ము గల ఖడ్గమృగాలు రక్షణను లక్ష్యంగా చేసుకుంది.[14]
భౌగోళిక స్థితి[మార్చు]
ఈ ఉద్యానవనం 29°25' నుండి 29°39'N అక్షాంశాలు మరియు 78°44' నుండి 79°07'E రేఖాంశాల మధ్య ఉంది.[8] ఈ ప్రాంతం యొక్క సగటు ఎత్తు 360 m (1,181 ft) మరియు 1,040 m (3,412 ft) మధ్య ఉంటుంది.[3] ఇది పలు కొండకనుమలు, పర్వతపంక్తులు, చిన్న ప్రవాహాలు మరియు వేర్వేరు కారకాలు మరియు వాలు స్థితులతో చిన్న పీఠభూములను కలిగి ఉంది.[3] ఈ ఉద్యానవనం రాంగంగ్ నదిచే ఏర్పడిన పాట్లీ డన్ లోయను ఆవిరించి ఉంది. ఇది ఎగువ గంగా మైదానాల ఆర్ద్ర ఆకులురాల్చే అరణ్యాలలో మరియు హిమాలయ ఉపఉష్ణమండలీయ దేవదారుచెట్ల అరణ్యాలు పర్యావరణ ప్రాంతాలలో భాగాలను రక్షిస్తుంది. ఇది ఒక ఆర్ద్ర ఉపఉష్ణమండలీయ మరియు ఉన్నతప్రాంత వాతావరణాన్ని కలిగి ఉంది.
ప్రధాన ప్రాంతం 520 చద�kilo��పు మీటరుs (200 sq mi) మరియు అదనపు ప్రాంతం 797.72 చద�kilo��పు మీటరుs (308.00 sq mi)తో కలిపి రిజర్వ్‌లోని ప్రస్తుత ప్రాంతం 1,318.54 చద�kilo��పు మీటరుs (509.09 sq mi). ప్రధాన ప్రాంతం జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ప్రాంతాన్ని ఏర్పరుస్తుంది, అదనపు ప్రాంతం సంరక్షక అరణ్యాలు (496.54 చద�kilo��పు మీటరుs (191.72 sq mi)) అలాగే సోనానడీ వన్యప్రాణుల అభయారణ్యాన్ని కలిగి ఉంది (301.18 చద�kilo��పు మీటరుs (116.29 sq mi)).
ఉత్తరాన లెసెర్ హిమాలయం మరియు దక్షిణన సివాలిక్‌ల మధ్య పాక్షికంగా ఒక లోయ పొడవున ఉన్న సంరక్షక ప్రాంతం ఉప-హిమాలయ తోరణ నిర్మాణాన్ని కలిగి ఉంది.[3] ఎగువ ప్రాంతం రాళ్లు సివాలిక్ ప్రాంతం యొక్క ఆధారాన్ని ఏర్పరస్తున్నాయి మరియు కఠిన మట్టిరాళ్లు విస్తృత పర్వతపంక్తులను ఏర్పరస్తున్నాయి.[3] రేఖాంశ లోయల లక్షణాలతో భౌగోళిక శాస్త్రం ప్రకారం డూన్స్ లేదా ఇసుకదిబ్బ లను ప్రాంతాల మధ్య సన్నని టెక్టానిక్ మండలాల పొడవున ఏర్పడ్డాయి.[3] లింక్ శీర్షిక
శీతోష్ణస్థితి[మార్చు]
ఉద్యానవనంలోని వాతావరణం భారతదేశంలోని అధిక ఇతర సంరక్షక ప్రాంతాలతో పోల్చినప్పుడు తక్కువ ఉష్ణోగ్రత ఉంటుంది.[15] శీతాకాలంలో ఉష్ణోగ్రత 5 °C (41 °F) నుండి 30 °C (86 °F)కు మారవచ్చు మరియు కొన్ని ఉదయాలు మంచుతో ఉండవచ్చు.[15] వేసవి ఉష్ణోగ్రతలు సాధారణంగా 40 °C (104 °F) కంటే ఎక్కువ కావు.[15] వర్షపాతం పొడి వాతావరణంలో తక్కువస్థాయి నుండి రుతుపవనాల సమయంలో భారీగా ఉంటుంది.[2]
వృక్ష జాతులు[మార్చు]
ఈ ఉద్యానవనంలో మొత్తంగా 488 వేర్వేరు వృక్ష జాతులు ఉన్నట్లు నమోదు అయ్యాయి.[5] సంరక్షక ప్రాంతంలోని వృక్ష సముదాయం సాల్ అరణ్యాల్లోని ప్రాంతల్లో అధికంగా మరియు అనాజెయిసుస్ -అకాసియా కాటెచు అరణ్యాల్లో అల్పంగాను ఉన్నాయి.[16] సాల్ ఆధారిత ప్రాంతాల్లో ఎక్కువగా ఆవరించి ఉన్న మొత్తం వృక్ష సముదాయంలో కలప వృక్ష సముదాయం ఎక్కువగా ఉంది.[16] మొక్క మరియు విత్తనాల దశల్లో ఆరోగ్యకరమైన పునరుత్పత్తి మాలోటస్ ఫిలిపెన్సిస్, జామ మరియు డియోస్పేరోస్ టోమెంటోసా ల్లో కనిపిస్తుంది, సాల్ అరణ్యాల్లో మొక్క మరియు విత్తనాల పునరుత్పత్తి చాలా బలహీనంగా ఉంది.[16]
జంతుజాలం[మార్చు]
585 కంటే ఎక్కువ స్థానిక మరియు వలస పక్షుల జాతులు వర్గీకరించబడ్డాయి, వీటిలో ఫించం గల సర్పిలాకార గద్ద, పుష్పం వంటి తల కలిగిన రామచిలుకలు మరియు అన్ని ప్రాంతీయ పక్షులకు పూర్విక జాతి ఎర్రని అటవీపక్షి ఉన్నాయి.[6] 33 సరీసృప జాతులు, ఏడు యాంఫిబియాన్ జాతులు, ఏడు మత్స జాతులు మరియు 37 తూనీగ జాతులు కూడా నమోదు చేయబడ్డాయి.[8]
అధిక సంఖ్యలో ఉన్నప్పటికీ బెంగాల్ పులులు సంరక్షక ప్రాంతాల్లోని సమృద్ధిగా ఉన్నట్లు మభ్యపెట్టడానికి అంత సులభంగా కనిపించవు.[2] దట్టమైన అడవి, రాంగంగా నది మరియు సమృద్ధిగా ఉన్న ఎర వంటి అంశాలు ఈ సంరక్షక ప్రాంతాన్ని పులలకు ఒక ఉత్తమమైన నివాసస్థలంగా మార్చింది, ఇవి అవకాశ భక్షకులు మరియు పలు జంతుజాతులను వేటాడతాయి.[17] ఉద్యానవనంలోని పులులు ఆహారం కోసం ఎద్దు అలాగే ఏనుగు వంటి అతిపెద్ద జంతువులను కూడా చంపుతాయని పేరు గాంచాయి.[6] పులులు ఆహార కొరత వంటి అరుదైన సందర్భాల్లో మాత్రమే అతిపెద్ద జంతువులను వేటాడతాయి.[6] ఎర కొరత ఉన్నప్పుడు కొన్నిసార్లు గృహస్థ జంతువులపై పులులు దాడి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.[6]
చిరుతపులులను కొండ ప్రాంతాల్లో చూడవచ్చు కాని దిగువ భూభాగ అరణాల్లో కూడా ఊహించవచ్చు.[6] ఉద్యానవనంలోని చిన్న జంతువుల్లో అడవి పిల్లి, చేపలను తినే పిల్లి మరియు చిరుత పిల్లి వంటివి ఉన్నాయి.[6] ఇతర క్షీరదాల్లో నాలుగు రకాల లేళ్లు (బార్కింగ్, సాంబార్, హోగ్, బ్లాక్ బక్ మరియు చిటాల్), స్లోత్ మరియు హిమాలయ నల్లని ఎలుగుబంట్లు, భారతీయ ఉదారంగు ముంగీస, ఒట్టర్‌లు, పసుపు గెడ్డం గల మార్టెన్‌లు, ఘోరాల్ (మేక-లేడి వంటి జంతువు, భారతీయ పాంగోలిన్స్ మరియు లాంగుర్ మరియు రెసస్ కోతులు ఉన్నాయి.[17] రాత్రివేళలో గుడ్లగూబలు మరియు నైట్‌జార్‌లను చూడవచ్చు.[6]
వేసవికాలంలో, ఏనుగులను వందలకొలది మందల్లో చూడవచ్చు.[6] సంరక్షక ప్రాంతంలో కనిపించే భారతీయ కొండచిలువ చాలా ప్రమాదకరమైన జంతువుగా చెప్పవచ్చు, ఇది ఒక చిటాల్ లేడిని చంపగలదు.[6] నిర్బంధ పెంపక కార్యక్రమాలచే విలుపత్త నుండి రక్షించబడిన స్థానిక మొసళ్లను చివరికి రాంగంగా నదిలోకి విడిచిపెట్టారు.[6]
జీవావరణ పర్యటన[మార్చు]
వన్యప్రాణుల రక్షణ ప్రధాన అంశం అయినప్పటికీ, సంరక్షక ప్రాంతం నిర్వాహకులు జీవావరణ పర్యటనను కూడా ప్రోత్సహించారు.[10] 1993లో, వాతావరణ గైడ్‌లకు శిక్షణ కోసం సహజ చరిత్ర, సందర్శకుల నిర్వహణ మరియు ఉద్యానవన అంతర్వేశనం వంటి అంశాలు గల ఒక శిక్షణా కోర్సును పరిచయం చేశారు.[10] రెండవ కోర్సును 1995లో ప్రారంభించారు, ఈ సంవత్సరంలో ఇదే పని కోసం మరికొంతమంది గైడ్‌లను నియమించారు.[10] దీని కారణంగా గతంలో సందర్శకులకు మార్గదర్శకం వహించే సంరక్షక ప్రాంత సిబ్బందికి అంతరాయం లేకుండా నిర్వహణ కార్యక్రమాలను నిర్వహించడానికి వీలు చిక్కింది.[10] అదనంగా, భారత ప్రభుత్వం ఉద్యానవనం రక్షించబడుతున్నప్పుడు, స్థానిక పౌరులు లాభాలు పొందడానికి కార్బెట్ నేషనల్ పార్క్ మరియు గార్వాల్ ప్రాంతాల్లో జీవావరణ పర్యటనకు వర్క్‌షాప్‌లను నిర్వహించింది.[10]
భారతీయ సందర్శకులకు వేసవి కాలం (ఏప్రిల్-జూన్) ఉద్యానవనాన్ని సందర్శించడానికి సరైన సమయంగా సూచించిన తివారీ & జోషీ (1997) విదేశీ పర్యాటకులకు శీతాకాలపు నెలలు (నవంబరు-జనవరి) ను సిఫార్సు చేస్తుంది.[18] రిలే & రిలే (2005) ప్రకారం: "ఒక పులిని చూడటానికి పొడి వాతావరణం-ఏప్రిల్ నుండి మధ్య జూన్-సమయంలో సందర్శించడం మంచింది మరియు మావిటులు మరియు ఏనుగులను చూడటానికి ఏ సమయంలోనైనా సందర్శించవచ్చు."[6]
1991నాటికీ, కార్బెట్ నేషనల్ పార్క్ 15 నవంబరు మరియు 15 జూన్‌ల మధ్య ప్రధాన పర్యాటక సీజన్‌ల్లో 45,215 సందర్శకులను తీసుకుని వచ్చే 3237 పర్యాటక వాహనాలకు ఆతిధ్యమిచ్చింది.[4] పర్యాటకుల రద్దీ సహజ పర్యావరణ వ్యవస్థపై స్పష్టమైన ఒత్తిడికి కారణమైంది.[4] పర్యాటకుల ఒత్తిడి కారణంగా మట్టి ఎక్కువగా తొక్కబడి వృక్ష జాతుల్లో తరుగుదలకు కారణమైంది మరియు ఇది మట్టి ఆర్ద్రత క్షీణించడానికి కూడా కారణమైంది.[4] పర్యాటకులు వంట కోసం ఇంధన కలపను ఎక్కువగా ఉపయోగించారు.[4] ఈ ఆందోళనకు కారణం ఈ ఇంధన కలపను సమీప అరణ్యాలు నుండి సంపాదించారు, ఇది ఉద్యానవనంలోని అటవీ పర్యావరణ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడికి దారి తీసింది.[4] ఇంకా, పర్యాటకులు అరవడం, చెత్తాచెదారం వేయడం ద్వారా సమస్యలను సృష్టించారు మరియు సహజ వాతావరణంలో అలజడులను కారణమయ్యారు.[19]
2007లో, యువ ప్రకృతి ప్రియుడు మరియు ఫోటోగ్రాఫర్ - కహినీ గోష్ మెహ్తా - కార్బెట్ నేషనల్ పార్క్‌లో ఆరోగ్యవంతమైన పర్యటనను ప్రోత్సహించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మరియు కార్బెట్‌లో మొట్టమొదటి సమగ్ర ప్రయాణాన్ని నిర్వహించాడు. వైల్డ్ సాగా ఆఫ్ కార్బెట్ శీర్షికతో వచ్చిన చలన చిత్రం సంరక్షణ ప్రయత్నాల్లో పర్యాటకులు ఏ విధంగా వారి పరిధిలో సహాయపడాలో అనే అంశాన్ని ప్రదర్శంచింది. ఈ చలన చిత్రంలో సీనియర్ ఉద్యానవన అధికారులు, సహజ మార్గదర్శకులు మరియు ప్రకృతి ప్రియులు నుండి చిట్కాలతో సహా ఒక పర్యాటకుడు ఉద్యానవనానికి సందర్శించడానికి ముందు అవసరమైన మొత్తం సమాచారాన్ని పొందుపర్చారు. పర్యాటకులు ఈ చలన చిత్రం యొక్క ఒక DVD నకలును బాంబే నేచురల్ హిస్టరీ సొసైటీ (BNHS) నుండి పొందవచ్చు.
ఇతర ఆకర్షణలు[మార్చు]
ఢికాలా: ఇది కార్బెట్‌లోని పాట్లీ డన్ లోయ చివరిలో ఉన్న పేరు గాంచిన గమ్యంగా చెప్పవచ్చు. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక విశ్రాంతి గృహం ఉంది. కందా పర్వతపంక్తులు ఆధారాన్ని ఏర్పాటు చేశాయి మరియు ఢికాలా నుండి, లోయ యొక్క అత్యద్భుతమైన ప్రకృతి వీక్షణను ఆస్వాదించవచ్చు.
గార్జియా ఆలయం: ఇది కోసీ నదీతీరాన, రాంనగర్ పట్టణం నుండి సుమారు 14 కిమీల దూరంలో ఉంది. కార్తీక పూర్ణిమ నాడు, ఒక జాతర నిర్వహించబడుతుంది. ఈ ఆలయంలో గార్జియా దేవి పూజలు అందుకుంటుంది.
రాణిఖెట్: ఇది ఉత్తరాంచల్‌లోని అల్మోరా నగరంలో ఉన్న అందమైన పర్వత ప్రాంతాల్లో ఒకటి. పర్యాటకులు ఈ స్థలం నుండి భారతీయ హిమాలయాల యొక్క అద్భుతమైన వీక్షణలను ఆస్వాదించవచ్చు. ఈ పర్వత ప్రాంతంలో డిసెంబరు నుండి ఫిబ్రవరి వరకు భారీ హిమపాతం ఉంటుంది.
ఏనుగు సవారీ: ఈ గంభీరమైన జంతువుపై సవారీ కార్బెట్ నేషనల్ పార్క్‌లోని ప్రధాన ఆకర్షణల్లో ఒకటి. ఒక ఏనుగుపై మహారాజు వలె కూర్చుని, పులులు లేదా అడవి ఏనుగుల మందలను చూడటానికి పచ్చికబయళ్లు మరియు అరణ్యాల్లోకి ప్రవేశిస్తారు. రోజు రెండుసార్లు, ఏనుగు సవారీ ఏర్పాటు చేయబడుతుంది, ఇది ఢికాలా నుండి ఉదయాన మరియు మధ్యాహ్న సమయాల్లో ప్రారంభమవుతుంది.
మజిలీలు:
పర్యాటకులు ఉద్యానవనంలో నడవడానికి అనుమతించబడరు, కాని ఒక గైడ్‌తో మాత్రమే ఉద్యానవనంలో సుదూర ప్రయాణాలకు వెళ్లడానికి అనుమతించబడతారు. ఈ ప్రాంతం శీతాకాలంలో చాలా చల్లగా ఉంటుంది, కనుక శీతాకాల సీజన్‌లో ప్రయాణించే పర్యాటకులు అవసరమైన వస్తువులను తీసుకుని పోవాలి.
కలాగార్ డ్యామ్: ఈ ఆనకట్ట జిమ్ కార్బెట్ అభయారణ్యానికి నైరుతిలో ఉంది. ఇది పక్షులను చూడటానికి ఉత్తమ స్థలాల్లో ఒకటి. శీతాకాలంలో పలు వలస పక్షులు ఇక్కడకి చేరుకుంటాయి.
ప్రాంతం[మార్చు]
కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాంచల్, నైనిటాల్ జిల్లాలో రాంనగర్‌లో ఉంది.
ప్రాంతం: 521 కిమీ2
మార్గం: రాంనగర్ పట్టణం కార్బెట్ టైగర్ రిజర్వ్ ముఖ్యకార్యాలయంగా పనిచేస్తుంది. ఢిల్లీ నుండి రాంనగర్ నుండి రాత్రిపూట రైలు అందుబాటులో ఉన్నాయి. అలాగే, వారణాసి నుండి లక్నో ద్వారా రాంనగర్‌కు రైళ్లు ఉన్నాయి. రాంనగర్‌కు చేరుకున్న తర్వాత, ఉద్యానవనం మరియు ఢికాలాకు చేరుకోవడానికి ఒక టాక్సీని అద్దెకు తీసుకోవచ్చు.
లక్నో, నైనిటాల్, రాణిఖెట్, హరిద్వార్, డెహ్రాడూన్ మరియు న్యూఢిల్లీ నుండి రాంనగర్‌కు రోడ్డు సౌకర్యం ఉంది. రాంనగర్ చేరుకోవడానికి ఢిల్లీ నుండి (295 కిమీ) గాజ్రౌలా, మోరాదాబాద్, కాశీపూర్ ద్వారా ప్రయాణం చేయవచ్చు. న్యూఢిల్లీ నుండి రాంనగర్‌కు నేరుగా ఒక రైలు ఉంది. ప్రత్యామ్నాయంగా, హాల్డ్వాని/కాశీపూర్/కద్గోడామ్ వచ్చి, తర్వాత రోడ్డు ద్వారా రాంనగర్‌కు చేరుకోవచ్చు.
సందర్శనకు సరైన సమయం: నవంబరు మధ్యకాలం నుండి జూన్ మధ్యకాలం వరకు.
సవాళ్లు[మార్చు]
గతం[మార్చు]
సంరక్షక ప్రాంత చరిత్రలో ఒక పెద్ద సంఘటన కాలాగార్ నది వద్ద ఒక ఆనకట్ట నిర్మించిన తర్వాత మరియు ప్రధాన దిగువ నదీప్రవాహ ప్రాంతంలోని 80 kమీ2 (31 sq mi) యొక్క విలీనం చేసిన తర్వాత సంభవించింది.[10] ఈ పరిణామాలు తంపర లేడి యొక్క స్థానిక నిర్మూలన నుండి హాగ్ లేడి సంఖ్య భారీగా క్షీణించడం వంటి అంశాలకు కారణమయ్యాయి.[10] ఆనకట్ట భూభాగం నీటిలో మునిగిపోవడం వలన ఏర్పడిన కారణంగా కూడా జలచర జంతు సమూహాల పెరుగుదలకు కారణమైంది మరియు ఇంకా శీతాకాల వలస జీవులకు ఒక నివాసస్థలంగా మారింది.[10]
దక్షిణ సరిహద్దులో ఉన్న రెండు గ్రామాలు 1990-93ల్లో ఫిరోజ్‌పూర్-మాన్‌పుర్‌కు ప్రాంతంలోని రాంనగర్-కాశీపూర్ హైవీ మీదకు మార్చబడ్డాయి; ఖాళీ చేయబడిన ప్రాంతాలను అదనపు మండలాలు వలె మార్చబడ్డాయి.[20] ఈ గ్రామాల్లోని కుటుంబాలు ముఖ్యంగా అటవీ ఉత్పత్తులపై ఆధారపడి ఉన్నాయి.[20] కాలం గడిచేకొద్ది, ఈ ప్రాంతాల్లో పర్యావరణ పునరుద్ధణకు సంకేతాలు కనిపించాయి.[20] ఔషధ వృక్ష సముదాయాలు తర్వాత, ద్రాక్షతీగలు, పొదలు, గడ్డి మరియు చిన్న మొక్కలు పెరగడం ప్రారంభమైంది, చివరికి సహజ అరణ్యంగా రూపాంతరం చెందింది.[20] ఖాళీ చేయబడిన సేద్యపు మైదానాల్లో గడ్డి మొలకెత్తడం ప్రారంభమైనట్లు గుర్తించారు మరియు సమీప అటవీ ప్రాంతాలు పూర్వస్థితిని పొందడం ప్రారంభమైంది.[20] 1999-2002నాటికీ, ఈ అదనపు మండలాల్లో పలు వృక్ష జాతులు అభివృద్ధి అయ్యాయి.[20] కొత్తగా పెరిగిన విస్తారిత పచ్చిక బయళ్లు గడ్డి తినే జంతువులను ప్రధానంగా లేళ్లు మరియు ఏనుగులను ఆకర్షిస్తున్నాయి, ఇవి నెమ్మిదిగా ఈ ప్రాంతాలను నివాస స్థలాలుగా మార్చుకున్నాయి మరియు రుతుపవనాల సమయంలో పూర్తిగా అక్కడే ఉంటాయి.[20]
1988-89లో 109 వేటాడిన కేసులు నమోదు అయ్యాయి.[21] ఈ సంఖ్య 1997-98లో 12 కేసులకు తగ్గింది.[10]
1985లో, ఒక బ్రిటీష్ పక్షి శాస్త్రజ్ఞుడు మరియు పక్షుల పరిశోధక పర్యాటక మార్గదర్శకుడు డేవిడ్ హంట్ ఉద్యానవనంలోని ఒక పులిచే హతమయ్యాడు.
ప్రస్తుతం[మార్చు]
సంరక్షక ప్రాంతంలోని నివాస స్థలాలు అసాధారణ కలుపు మొక్కలు లాంటానా, పర్థెనియమ్ మరియు కాసియా వంటి దాడి చేసే జాతులు నుండి ప్రమాదానికి గురవతున్నాయి.[10] చెట్లు మరియు పచ్చిక వంటి సహజ వనరులు స్థానిక జనాభాచే క్షీణిస్తున్నాయి, 74 కుటుంబాలచే సుమారు 13.62 ha (0.05 sq mi) యొక్క అతిక్రమణ నమోదు చేయబడింది.[10]
ఉద్యానవనం చుట్టూ ఉన్న గ్రామాలు కనీసం 15-20 సంవత్సరాలు ముందు ఏర్పడ్డాయి మరియు ఇటీవల కాలంలో నూతన గ్రామాలు ఏమీ నమోదు కాలేదు.[22] పెరుగుతున్న జనాభా పెంపుదల శాతం మరియు 1 km (0.62 mi) నుండి 2 km (1.24 mi)లో ఉద్యానవనంలో జనాభా సాంద్రతలు సంరక్షక ప్రాంతపు నిర్వాకులకు కొన్ని సవాళ్లను విసిరాయి.[22] పులులు మరియు చిరుతపులులు పశువులను చంపిన సంఘటనలు కొన్ని సందర్భాల్లో స్థానిక జనాభాచే ప్రతీకార చర్యలకు దారి తీశాయి.[10] భారత ప్రభుత్వం సంరక్షక ప్రాంతంలోని దక్షిణ సరిహద్దులో ఒక 12 km (7.5 mi) రాతి గోడను నిర్మించేందుకు అంగీకరించింది, ఇది వ్యవసాయ భూములు గుండా సాగింది.[10]
2008 ఏప్రిల్‌లో, నేషనల్ కన్జర్వేషన్ టైగర్ అథారిటీ (NCTA) ఈ ఉద్యానవనంలో భద్రతా వ్యవస్థ బలహీనమైందని మరియు వేటగాళ్లు ప్రవేశించారని తీవ్రంగా ఆరోపించింది. సలహాదారులు మరియు పర్యవేక్షకులు సందర్శించిన సమయాల్లో మినహా ముందు పేర్కొన్న విధానంలో వన్య ప్రాణులను పర్యవేక్షణను అనుసరించడం లేదు. అలాగే పులులకు సంబంధించి నెలసరి పర్యవేక్షక భూభాగ నివేదిక 2006 నాటి నుండి అందించడం లేదు. NTCA ఈ విధంగా పేర్కొంది, "ఒక ప్రమాణ పద్ధతిలో నిరంతర పర్యవేక్షక ప్రోటోకాల్ లేకపోవడం వలన, వేటగాళ్లు లక్ష్యంగా చేసుకున్న ప్రాంతంలో అనుచిత కార్యక్రమాలను అంచనా వేయడానికి మరియు వాటిని పర్యవేక్షించడం అసాధ్యం." సుప్రీం కోర్టు ఆదేశానికి వ్యతిరేకంగా ఉద్యానవనంలో ఒక సిమెంట్ రహదారి నిర్మించబడింది. ఈ రహదారి కలాగార్ మరియు రాంనగర్ మధ్య ఒక రహదారిగా మారింది. ఈ రహదారిపై స్థిరంగా పెరుగుతున్న వాహన రద్దీ జిర్నా, కోటిరాయు మరియు ఢారా వంటి కీలకమైన ప్రాంతుల్లో వన్యప్రాణుల సంచారానికి ఆటంకాన్ని ఏర్పరుస్తున్నాయి. ఇంకా, ఉద్యానవనంలో సుమారు 5 చదరపు కిలోమీటర్లు (1.9 చ.మై) స్థలాన్ని ఆక్రమించే కలాగార్ నీటిపారుదల కాలనీ ఒక 2007 సుప్రీం కోర్టు ఆదేశం ఉన్నప్పటికీ ఇంకా ఖాళీ చేయాల్సి ఉంది.[23]
వీటిని కూడా చూడండి[మార్చు]
- వీకీపీడియాలో భారత వన్యప్రాణుల పోర్టల్
- ఇండోమాల్యా ఎకోజోన్
- అంతరించిపోతున్న జాతులు
- రుద్రప్రయాగ చిరుతపులి
- చంపావత్ పులి
- రాజాజీ నేషనల్ పార్క్
- కుమాన్‌లో నరమాంస జంతువులు మరియు ఇతర నైనిటాల్‌కు సాహిత్య సూచనలు
గమనికలు[మార్చు]
- ↑ Bitapi C. Sinha, Manisha Thapliyal and Kaustubh Moghe. "An Assessment of Tourism in Corbett National Park". Wildlife Institute of India. Retrieved 2007-10-12. Cite web requires
|website=
(help)CS1 maint: uses authors parameter (link) - ↑ 2.0 2.1 2.2 2.3 రిలే & రిలే 2005: 208
- ↑ 3.0 3.1 3.2 3.3 3.4 3.5 తివారీ & జోషీ 1997: 210
- ↑ 4.0 4.1 4.2 4.3 4.4 4.5 తివారీ & జోషీ 1997: 309
- ↑ 5.0 5.1 పాంట్ 1976
- ↑ 6.00 6.01 6.02 6.03 6.04 6.05 6.06 6.07 6.08 6.09 6.10 6.11 రిలే & రిలే 2005: 210
- ↑ తివారీ & జోషీ 1997: 309-311
- ↑ 8.0 8.1 8.2 8.3 8.4 8.5 UNEP 2003
- ↑ 9.0 9.1 9.2 తివారీ & జోషీ 1997: 208
- ↑ 10.00 10.01 10.02 10.03 10.04 10.05 10.06 10.07 10.08 10.09 10.10 10.11 10.12 10.13 10.14 10.15 10.16 కార్బెట్ నేషనల్ పార్క్ (ప్రాజెక్ట్ టైగర్ డైరెక్టరేట్)
- ↑ 11.0 11.1 11.2 రంగరాజన్ 2006: 72
- ↑ 12.0 12.1 రంగరాజన్ 2006: 78
- ↑ తివారీ & జోషీ 1997: 108
- ↑ 14.0 14.1 డ్రేటన్ 2004
- ↑ 15.0 15.1 15.2 ఉదహరింపు పొరపాటు: సరైన
<ref>
కాదు;Tiwari8
అనే పేరుగల ref లకు పాఠ్యమేమీ ఇవ్వలేదు - ↑ 16.0 16.1 16.2 సింగ్ మొదలైన వారు 1995
- ↑ 17.0 17.1 రిలే & రిలే 2005: 208-210
- ↑ తివారీ & జోషీ 1997: 298
- ↑ తివారీ & జోషీ 1997: 311
- ↑ 20.0 20.1 20.2 20.3 20.4 20.5 20.6 రావు 2004
- ↑ తివారీ & జోషీ 1997: 269
- ↑ 22.0 22.1 తివారీ & జోషీ 1997: 263
- ↑ ది పైనార్
సూచికలు[మార్చు]
- Riley, Laura (2005). Nature's Strongholds: The World's Great Wildlife Reserves. Princeton University Press. ISBN 0691122199. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (help)
- Singh, Ashok. "Analysis of woody vegetation of Corbett National Park, India". Springer Netherlands. Volume 120 (Number 1 / September, 1995): 69–79. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (help) - Tiwari, P. C. (Editor) (1997). Wildlife in the Himalayan Foothills: Conservation and Management. Indus Publishing Company. ISBN 8173870667. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (help); Unknown parameter|month=
ignored (help)CS1 maint: extra text: authors list (link)
- "Corbett National Park (Project Tiger Directorate)". Project Tiger Directorate, Ministry of Environment, Government of India. Retrieved 2007-10-13. Cite web requires
|website=
(help) - Rangarajan, M. (2006). India's Wildlife History: an Introduction. Orient Longman. ISBN 8178241404.
- UNEP (2003). "World Database on Protected Areas, India, Corbett National Park". UNEP WCMC. Retrieved 2007-10-13. Cite web requires
|website=
(help) - Drayton, F. (2004). "Terai Arc Landscape in India" (PDF). World Wide Fund for Nature. Retrieved 2007-10-13. Cite web requires
|website=
(help) - పాంట్, P.C. (1976). ఉత్తర ప్రదేశ్‌లోని కార్బెట్ నేషనల్ పార్క్‌లో చెట్లు. బొంబాయి నేచురల్ హిస్టరీ సొసైటీ యొక్క జర్నలి 73:287-295.
- Rao, R.S.P. "Secondary succession in the buffer zone of Corbett Tiger Reserve, Uttaranchal". Current Science (Indian Academy of Sciences). Volume 87 (No. 4, 25 August 2004.).
- The Pioneer (May 18, 2008). "Trouble in Paradise". The Pioneer. CMYK Printech Ltd. Retrieved 2009-03-30.
మరింత చదవడానికి[మార్చు]
- Corbett, Jim (1985). Man-Eaters of Kumaon. Buccaneer Books, Inc. ISBN 9780899665740. Unknown parameter
|month=
ignored (help)
- Corbett, Jim (2004). Oxford India Illustrated Corbett. Oxford University Press, USA. ISBN 9780195668742. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (help); Unknown parameter|month=
ignored (help)
బాహ్య లింకులు[మార్చు]
- ఆశ్చర్యకరమైన కార్బెట్ నేషనల్ పార్క్ ఒక ప్రకృతి ప్రియుల పూర్వ సంస్కృతి - "ది ఫ్రీడమ్ ఆఫ్ ది ఫారెస్టెస్"
- కార్బెట్ నేషనల్ పార్క్ అధికారిక వెబ్సైట్
- ప్రాజెక్ట్ టైగర్ డైరెక్టరేట్ అందించిన ఉద్యానవన రేఖా చిత్రం, పర్యావరణ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
- కార్బెట్ నేషనల్ పార్క్
- నైనిటాల్ జిల్లా (కార్బెట్ పార్క్). నేషనల్ ఇన్ఫార్మాటిక్స్ సెంటర్ ఆఫ్ ఇండియా.
- "కార్బెట్ నేషనల్ పార్క్," మైక్రోసాఫ్ట్ ఎంకార్టా ఆన్లైన్ ఎన్సైక్లోపీడియా 2007. (ఆర్కైవెడ్ 2009-10-31)
- "కార్బెట్ నేషనల్ పార్క్." ఎన్సైక్లోపీడియా బ్రిటానికా. 2007. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఆన్లైన్. 12 అక్టోబర్ 2007.
- కార్బెట్ నేషనల్ పార్క్ సమాచారం మరియు చిత్రాలు
- మూలాల లోపాలున్న పేజీలు
- CS1 errors: missing periodical
- CS1 maint: uses authors parameter
- గూగుల్ అనువాద వ్యాసాలు
- IUCN Category II
- తెగిపోయిన ఫైలులింకులు గల పేజీలు
- CS1: long volume value
- CS1 maint: extra text: authors list
- టైగర్ రిజర్వ్స్ ఆఫ్ ఇండియా
- నైనిటాల్
- నేషనల్ పార్క్స్ ఆఫ్ ఉత్తరఖాండ్
- 1936లో స్థాపించబడిన సంరక్షక ప్రాంతాలు