లోయ
స్వరూపం
లోయ ఎత్తైన కొండల మధ్యన ఉండే లోతైన ప్రదేశము. బాగా లోతైన లోయను గండి (కాన్యన్ లేదా గోర్జీ) అంటారు. ఇవి ఎక్కువగా U లేదా V ఆకారంలో ఉంటాయి. చాలా వరకు లోయలు నదుల ప్రవాహం వలన గాని గ్లాసియర్ల మూలంగా ఏర్పడతాయి.
వివిధ రకాల లోయలు
[మార్చు]లోయ ఏర్పడిన విధానాన్ని బట్టి వీటిలో అనేక రకాలున్నాయి. వాటిలో కొన్ని:
- నది ప్రవహించే లోయ
- వెడల్పైన చదునైన లోయ. అందులో నది ప్రవహిస్తూంటుంది
- కొండలు గుట్టల మధ్య ఉండే చిన్నపాటి లోయ
- లోతైన, సన్నటి, చదునైన అడుగుతో ఉండే లోయ.
- కోత వల్ల ఏర్పడే లోయ
- భూగర్భంలో ఏర్పడే పరిమాణాల వల్ల ఏర్పడే లోయలు
- పొడి లోయ - నీటి కోత వల్ల ఏర్పడని లోయలు
- రెండూ సమాంతర పర్వత శ్రేణుల మధ్య ఏర్పడే పొడవాటి లోయ.
కాన్యన్లు, గండ్లు, చీలికలు మొదలైనవాటిని లోయలుగా పరిగణించరు.
ప్రపంచంలో ప్రముఖ లోయలు
[మార్చు]- కాలిఫోర్నియా మధ్య లోయ, (అమెరికా)
- రాగి కాన్యన్
- డెన్యుబ్ లోయ, (యురపు), Iron Gate)
- మృత్యు లోయ, (అమెరికా)
- గ్రాండ్ కాన్యన్, (అమెరికా)
- గొప్ప గ్లెన్ (స్కాట్లాండ్)
- గొప్ప రిఫ్ట్ లోయ (from Jordan to the Red Sea and Lake Victoria)
- ఇండస్ లోయ, (ఇండియా-పాకిస్థాన్)
- లోయిర్ లోయ, (ఫ్రాన్స్)
- నాపా కౌంటీ, (అమెరికా)
- నైలు లోయ (ఈజిప్టు)
- ఒకనాగన్ లోయ (కెనడా)
- ఒవెన్స్ లోయ (కాలిఫోర్నియా)
- పన్షీర్ లోయ
- రైన్ లోయ, (ఫ్రాన్స్)
- రోన్ లోయ, (ఫ్రాన్స్)
- రియో గ్రాండ్ లోయ, (అమెరికా)
- షెనన్డో లోయ (అమెరికా)
- సొనొమా లోయ, కాలిఫోర్నియా, అమెరికా
- రాజుల లోయ (ఈజిప్టు)
- సూర్య లోయ (అమెరికా)
- సాన్ ఫెర్నాండొ లోయ (అమెరికా)
- సాంతా క్లారా లోయ లేదా "సిలికాన్ లోయ" (అమెరికా)
- దక్షిణ వేల్స్ లోయలు (వేల్స్)
- మెక్సికో లోయ (మెక్సికో),
భారతదేశంలో ప్రముఖ లోయలు
[మార్చు]Look up లోయ in Wiktionary, the free dictionary.
- నిశ్శబ్ద లోయ, కేరళ
- కాశ్మీరు లోయ
- పుష్పాల లోయ
- గండికోట, పెన్నా నది లోయ
- అరకు లోయ