Jump to content

పార్వతి లోయ

అక్షాంశ రేఖాంశాలు: 31°59′32.47″N 77°28′54.36″E / 31.9923528°N 77.4817667°E / 31.9923528; 77.4817667
వికీపీడియా నుండి
పార్వతి లోయ
పార్వతి
Parvati Valley
Tosh in Monsoon season, Parvati Valley
భౌగాళికం
రకంనదీ లోయ
భూగోళ శాస్త్ర అంశాలు
ప్రదేశంHimachal Pradesh in India
పట్టణ లేదా నగర కేంద్రంకసోల్
అక్షాంశ,రేఖాంశాలు31°59′32.47″N 77°28′54.36″E / 31.9923528°N 77.4817667°E / 31.9923528; 77.4817667
నదీ ప్రాంతంపార్వతి నది

పార్వతి లోయ ఉత్తర భారత రాష్ట్రమైన హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. పార్వతి నది బియాస్ నదితో గల సంగమం నుంచి, పార్వతి లోయ తూర్పు వైపు ఉంటుంది. ఇది కులు జిల్లా, భుంటార్ పట్టణం నుంచి నిటారుగా ఉన్న లోయ ద్వారా వెళుతుంది.

అవలోకనం

[మార్చు]
పార్వతి లోయ ప్రాంతంలోని నక్తాన్ గ్రామం
రుద్ర-నాగ్ జలపాతం. ఇది పవి త్రమైన, ఆధ్యాత్మిక ప్రదేశం
తుండా భుజ్ గ్రామంలో ఉన్న అందమైన, బహిరంగ గడ్డి మైదానం

పర్యాటక ప్రదేశం కసోల్ సమీపంలో మలానా గ్రామం ఉంది. ఇక్కడి నుంచి రహదారి మార్గంలో సిక్కు, హిందూ మతాలవారి పుణ్యక్షేత్ర పట్టణం మణికరన్ ఉంటుంది. ఇది పుల్గా నిర్మాణ స్థలం వద్ద ఆగిపోతుంది. పార్వతి హైడల్ ప్రాజెక్ట్, ఒక విద్యుత్ జలాశయం ఇక్కడ కనిపిస్తాయి. పుల్గా నుంచి ఉన్న దారి రుద్ర-నాగ్ జలపాతం ప్రాంతం వద్ద ఒక ఆలయానికి, చిన్న ధాబాకు చేరుకుంటుంది, జలపాతం దాటి ఉండే కాలిబాట దట్టమైన అడవుల ద్వారా ఖీర్గంగా ఆధ్యాత్మిక ప్రదేశానికి చేరుతుంది. ఇక్కడ పరమ శివుడు ధ్యానం చేసినట్లు చెబుతారు.ఈ పరిసరాల్లోని వేడి నీటి బుగ్గలను హిందూ, సిక్కు యాత్రికులు నమ్ముతారు. ఆ పవిత్ర నీటిలో పలు వైద్య లక్షణాలు ఉండి ఉంటాయని చాలామంది భావిస్తారు.

ఖీర్గంగా నుంచి తుండా భుజ్ గ్రామం వరకు పార్వతి లోయ ఉంది. అక్కడ ఎత్తు పెరిగే కొద్దీ, దట్టమైన శంఖాకార అడవి కనిపిస్తుంది. ఇది బండరాళ్లతో ఉన్న మైదానం వైపు మార్గం చూపుతుంది. వివిధ ఉపనదులు ప్రధాన పార్వతి నదిలో కలుస్తాయి. పలు జలపాతాలు నిటారుగా ఉన్న లోయకు ఇరు వైపులా ఉన్నాయి. అవి ప్రకృతి అందాలను పర్యాటకుల కళ్లకు చూపుతుంటాయి.

ఠాకూర్ కువాన్ గ్రామంలోని పార్వ తి లోయ పార్వతి నదికి ఉపనది అయిన డిబిబోక్రీ నల్ నది లోయను కలుస్తుంది, ఈశాన్య దిశలో దిబిబోక్రీ హిమానీ నదం, డిబిబోక్రీ పిరమిడ్ పర్వత శిఖరం (6400 మీటర్లు) ఉంటాయి.ఈ ప్రాంతంలోని పువ్వులు, పర్వత ప్రదేశ పంటలు మెరుపుతో గోచరిస్తుంటాయి. పార్వతి లోయ క్రమంగా పాండుపుల్ గ్రామానికి చేరుకుంటుంది, ఇక్కడ రెండు సహజ, రాతి వంతెనలున్నాయి. ఇవి పార్వతి నది, దక్షిణ ఉపనదిని దాటాయి.పురాణాల ప్రకారం, ఈ వంతెనలు పాండవుల బలం కారణంగా ఏర్పాటయ్యాయి.

పాండుపుల్ నుంచి ఎగువ పార్వతి లోయ మరింత విస్తృతంగా ఉంది. లోయ ఒడి విశాలమైన, ఎత్తైన మైదానం ద్వారా పార్వతి నదికి మూలమైన మాంటలై సరస్సు (4100 మీటర్లు ) పవిత్ర స్థలానికి విస్తరించింది. ఆ సరస్సు నుంచి తూర్పున కొనసాగితే, పిన్ పార్వతి మార్గం (5319 మీటర్లు) పార్క్కి చేరవచ్చు. అలాగే హిమాచల్ ప్రదేశ్ లోని లాహుల్, స్పితి జిల్లాలోని ముధ్ గ్రామానికి వె ళ్ళే అవకాశం కూడా ఉంది. [1]

పార్వతి లోయకు సుందరమైన పర్వతారోహణ (ట్రెక్కింగ్) మార్గాలున్నాయి. ఇది పర్వతారోహకులు, పర్యాటకులు ఎంతగానో ఎదురుచూసే ఒక గమ్యస్థానంగా చెప్పవచ్చు.

గ్యాలరీ

[మార్చు]
ఖీర్ గంగా అడవులు

ప్రస్తావనలు

[మార్చు]

 * Sanan, Deepak; Swadi, Dhanu (2002). Exploring Kinnaur and Spiti in the Trans-Himalaya. Indus Publishing Company. ISBN 81-7387-131-0. (second edition)

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2021-12-21. Retrieved 2021-03-23.