Jump to content

గ్రాండ్ కేనియన్

వికీపీడియా నుండి
హర్మిట్స్ రెస్ట్ నుండి కనిపిస్తున్న గ్రాండ్ కేనియన్ మధ్యగా ప్రవహిస్తున్న కొలరాడోనదీ దృశ్యం

గ్రాండ్ కేనియన్ కొలరాడో నది ప్రవాహము వెంట ఏర్పడిన పదునైన ఏటవాలుగా ఉండే కొండచరియల వరసగా ఉండే ప్రాంతం. ఇది అమెరికాలోని ఆరిజోనా రాష్ట్రంలో కొలరాడో నదీతీరానికి ఇరువైపులా ఉపస్థితమై ఉన్న పర్యాటక ఆకర్షిత ప్రదేశం. దీనిలో అత్యధిక భాగం అమెరికాలో 15వ శ్రేణిలో ఉన్న గ్రాండ్ కేనియన్ నేషనల్ పార్క్‌లో ఉంది. ప్రెసిడేంట్ తియోడోర్ రూజ్‌వెల్ట్ ఈ ప్రదేశాన్ని సంరక్షిత ప్రాంతంగా చేయడంలో ప్రధానపాత్ర వహించారు. ఆయన స్వయంగా ఈ ప్రాంతానికి వేటనిమిత్తం అనేక పర్యాయాలు వెళ్ళి ఇక్కడి ప్రకృతి రమణీయతను ఆస్వాదించి ఆనందం అనుభవించాడు. ప్రకృతి సహజసిద్ధమైన వింతగా గుర్తించబడింది. గ్రాండ్ కేనియన్ కొండచరియలు 277 మైళ్ళ పొడవు (446 కిలోమీటర్లు), 18 మైళ్ళ వెడల్పు (29 కిలోమీటర్లు), 1 మైలు లోతు (6, 000 నుండి 18, 000) విస్తరించి ఉన్నాయి. కొలరాడో పీఠభూమి ఎత్తు పెరిగిన కారణంగా కొలరాడోనది దాని ఉపనదులు సుమారు 2 బిలియన్ల సంవత్సరాల భౌగోళిక చరిత్ర కలిగిన గ్రాండ్ కేనియన్ కోడచరియలను చీల్చుకుంటూ కాలువలుగా ప్రవహిస్తుంది. ఈ ప్రత్యేక భౌగోళిక మార్పులు జరిగిన కాలము గురించి భౌగోళిక శాస్త్రజ్ఞుల మధ్య అభిప్రాయ భేదాలు కలిగిన చర్చలు కొనసాగుతున్నాయి. నూతన సాక్ష్యాధారలను అనుసరించి కొలరాడోనది ఈ కొండచరియల నుండి 17 మిలియన్ సంవత్సరాల నుండి ప్రవహిస్తుందని ఊహించబడుతుంది. అప్పటి నుండి నదీ ప్రవాహములో మార్పులు జరిగిన కారణంగా ఇక్కడి భూమి ఊచకోతకు గురైన కారణంగా ప్రస్తుతము కనిపిస్తున్న గ్రాండ్ కేనియన్ కొండచరియల దృశ్యాలు ఏర్పడ్డాయి. వేలసంవత్సరాల నుండి ఈ ప్రాంతాన్ని స్థానిక మెరికన్ జాతులు ఈ ప్రదేశాన్ని తమ నివాసముగా ఉపయోగించుకున్నారు. ది ప్యూబ్లో పీపుల్స్ గ్రాండ్ కేనియన్ (హోపి భాషలో ఒంగ్తుప్‌క్వ) పవిత్ర స్థలంగా భావించి ఇక్కడకు తీర్ధయాత్రలు సాగించారు. గ్రాండ్ కేనియన్ కొండచరియలను ప్ర ప్రథమముగా చూసిన యురేపియన్ పేరు గార్షియా లోపెజ్ డి కార్డెనాస్ . అయన 1540లో స్పెయిన్ దేశం నుండి ఇక్కడకు వచ్చిన స్పెయిన్ పౌరుడు.

భౌగోళికము

[మార్చు]
గ్రాండ్ కేనియన్ ఉపగ్రహ చిత్రం
గ్రాండ్ కేనియన్ దాని పరిసరప్రాంతాల భౌగోళిక చిత్రం

గ్రాండ్ కేనియన్ కొండచరియలు కొలరాడో పీఠభూమిలో ప్రాంతంలో ఉన్న కొండ పగులు. పుర్రతన జీవినశైలి, పురాతన భౌగోళిక పరిస్థితులలో ఎత్తుగా పెరిగిన ప్రాకృతిక అతిశయము. ఇది నేపాలులో ఉన్న ఖాళి గండకి ఖోంఛ్ లా ఇది లోతైన కొండచరియ కాదు. ఆస్ట్రేలియాలో ఉన్న కేపర్టీ వెల్లీ లా అతి పెద్ద వెడల్పైనది కాదు. కేపర్టీ వెల్లీ 0.6 మైలు లేక 1 కిలోమీటర్ వెడల్పు కలిగి గ్రాండ్ కేనియన్ కంటే పొడవైనది. ఏది ఏమైనప్పటికీ దాని గొప్ప ఆకారము, అసమానమైన చిత్రమైన వర్ణములతో కూడిన ఆకారాలకు ప్రసిద్ధి. గ్రాండ్ కేనియన్ దాని చిక్కని పొరలతో కూడిన అతి పురాతన రాళ్ళుకూర్పు, సంరక్షించబడుతున్న గోడలలో అందంగా ఏర్పడిన రాళ్ళకూర్పు అందాల చేత గుర్తింపును పొందింది. ఉత్తర అమెరికా భౌగోళిక చరిత్రలో గ్రాండ్ కేనియన్ అత్యంత పురాతనచరిత్ర కలిగినది. కొండలు ఏరడిన సందర్భములో భూభాగము పైకిలేచి కొలరాడో పీఠభూమి ఏర్పడినది. గొప్ప ఎత్తైన భౌగోళిక పరిస్థితి కారణంగాకొలరడో నదీ జలాలు కొంత ఆవిరి అయినా అవి కొండచరియల అద్భుత దృశ్యాలను మరగున పరిచేటంతగా ఉండదు. కొలరాడో నది ఉత్తర భాగాన సుమారు 1, 000 నుండి 1, 300ఎత్తుకలిగి ఉన్న కైబాబ్ ప్లాట్యూ కంటే గ్రాండ్ కేనియన్ కొండచరియలు తక్కువ ఎత్తులో ఉంటాయి. నార్త్ రిమ్ (అవి ఎక్కువ హిమము, వర్షపాతము కలిగినది) నుండి వస్తున్న ప్రవాహము చాలా వరకు గ్రాండ్ కేనియన్ పైపు ప్రవహిస్తుంది. కొలరాడో నదీ జలాలు దాదాపు గ్రాండ్ కేనియన్ వైపు ప్రవహిస్తున్న తరుణంలో ఉత్తరభాగంలో లోతుగా, పొండవుగా ప్రవహించే ఉపనదీ కాలువలు ఉత్తరభాగాన్ని ఎత్తుగా చేసి దక్షిణంలో ఉన్న గ్రాండ్ కేనియన్ కొండచరియలను కరిగించి కొంత ఎత్తు తగ్గించాయి. నార్త్ రిమ్ ఉష్ణోగ్రతలు సౌత్ రిమ్ ఉష్ణోగ్రతలకంటే తక్కువగా ఉంటుంది. వేసవి మాసాలాలో అత్యధిక వర్షపాతాలు రెండు రిమ్స్‌లోను ఉంటుంది. ప్రధాన రహదారి గుండా ఉత్తర తీరం చేరడానికి శీతాకాలాలలో తక్కువగా ఉంటాయి. కొన్ని దార్లు శీతాకాలంలో మూసివేయబడడమే ఇందుకు కారణము. ఉత్తర తీరము నుండి చూసే దృశ్యాలు గ్రాండ్ కేనియన్ సౌందర్యాన్ని దక్షిణ తీరంకంటే అధికంగా చూపిస్తుంది.

భూగర్భస్థితి

[మార్చు]
గ్రాండ్ కేనియన్ భూగర్భ స్థితిని సూచించే శాస్త్రీయ చిత్రం
సమీపకాలంలో సరికొత్త ఆకారాలను ప్రదర్శిస్తూ మరి కొంత వెడల్పైన గ్రాండ్ కేనియన్

కొలరాడో నది డెల్టా (ఇందులో గ్రాండ్ కేనియన్ ఒక భాగం ) గత 40, 000 మిలియన్ సంవత్సరాల కాలం నుండి అభివృద్ధి చెందిందని అంచనా. సమీపకాలంలో గ్రాండ్ కేనియన్ పరిశోధనలు గ్రాండ్ కేనియన్ 17, 000 మిలియన్ సంవత్సరాల ముందు నుండి రూపుదిద్దుకోవడం ఆరంభం అయిందని ఊహించబడుతుంది. ముందు అంచనా ప్రకారము గ్రాండ్ కేనియన్ వయసు 5 నుండి 6 మిలియన్ సంవత్సరాలుగా ఉంటుందని అంచనా. గ్రాండ్ కేనియన్‌లోపల ఉన్న 9 గుహాకుడ్యాలలో కనిపించిన కాల్షియేట్ నిలువల అధారితంగా యురేనియమ్-లీడ్ ఉపయోగించి గ్రాండ్ కేనియన్ వయసును నిర్ధారించినట్లు 2008లో సైన్స్ జర్నల్‌లో ప్రచురించారు. ఈ విషయంలో వివిధ చర్చలు ఉన్నాయి. ఈ భూఊచకోత ఫలితంగా భూమిలో జరిగిన పూర్తిగా జరిగిన భూఊచకోతకు గ్రాండ్ కేనియన్ ఒక సజీవసాక్ష్యంగా నిలిచింది. గ్రాండ్ కేనియన్ ప్రధాన దృశ్యాలు 2 మిలియన్ సంవత్సరాల విష్ణుచిస్ట నుండి ఉన్నాయని అంచనా. తీరంలో 230 మిలియన్సంవత్సరాల నుండి అంతర్భాగములో ఉన్న కైబాబ్ లైమ్‌స్టోన్ అతి వేగంగా నదీజలాలు కరిగించడము వలన ఇవి ఏర్పడ్డాయని భావించబడుతుంది. 500 మిలియన్ సంవత్సరాల వయసు కలిగిన లోతట్టు భాగాలలో 1 మియన్ సంవత్సరాల క్రితం నుండి సమాంతర పొరలు కలిగిన ఈ భూభాగంలో పగులు ఏర్పడుతున్నట్లు ఊహించబడుతుంది. భూఊచకోతవలన ఏర్పడిన పూడిక రెండు విడతలుగా ఏర్పడిన నిలువలు ఒక విడతగా జరిగినట్లు భూఊచకోత జరిగినట్లు ఈ పూడికలు తెలియజేస్తున్నాయి. వెచ్చని సముద్రతీరాల వెంట పలువిధ ఆకారాలు ఏర్పడ్డాయి. ఉత్తర అమెరిక సముద్రతీరాలవెంబడి సముద్రపు నీటి మడుగుల తీరం వెంట ఇటువంటి ఆకారాలను చూడవచ్చు. ఎయిలోనియన్ (వాయుప్రభావితం) గా ఏర్పడిన శాండ్ డ్యూన్ (ఇసుకప్రభావితం) మైన కొకొనినొ శాండ్ స్టోన్ కొండచరియలు, సముద్రముతో సంబంధం లేని కొన్ని సుపాయి గ్రూప్ రకానికి చెందిన ప్రాంతాలు గ్రాండ్ కేనియన్‌ తరహా ఉఉచకోతకు గురికాకుండా ప్రత్యేకముగా నిలిచాయి. అత్యధిక లోతైన ఈ సమాంతరపొరలు కలిగిన కొండచరియలు (అధికంగా సముద్రమట్టానికి తక్కువ నుండే ఆరంభం అయినవి) 5, 000 నుండి 10, 000 అడుగులు (1500 నుండి 3000 మీటర్లు) ఉంటుంది. 65 మిలియన్ సంవత్సరాలకు మునుపే (ఉత్తర అమెరికాలో కొండలు రూపు దిద్దుకుంటున్న సమయము) కొలరాడో పీఠభూమి ఎత్తు పెరగడం ఆరంభమైనట్లు ఊహించబడుతుంది. ఈ పెరిగిన ఎత్తు కారణంగా కొలరాడో నది దాని ఉపనదుల ప్రవాహం మరింత వేగవంతం అయ్యాయి. ఐస్ ఏజ్ (హిమ యుగము) లో ఉన్న వాతావరణ ప్రభావంగా కొలరాడో నదిలో జలాలు అధికతరం అయ్యాయి. పూర్వీక కొలరాడో నది ఈ కారణంగా ప్రవాహవేగాన్ని లోతునూ అధికము చేయడం కాక ఉపనదులుగా చీలి అనేక కాలువలుగా ప్రవహించసాగింది. కొలరాడో నది (లేక దాని పూర్వీక నది) రూపము లోమట్టము 5.3 మిలియన్ సంవత్సరాలకు పూర్వమే తనరూపమును మార్చుకుంది. ఎప్పుడైతే గల్ఫ్ ఆఫ్ కలిఫోర్నియా తెరవబడి అలాగే కొలరాడోనది లోతు అధికము చేయబడినదో అది ఊచకోతను అధికము చేయడమే కాక గ్రాండ్ కేనియన్‌ను ఖండిస్తూ 1.2 మిలియన్ సంవత్సరాలకు పూర్వమే ఆరంభం అయింది. 3 మిలియన్లు -1 లక్ష సంవత్సరాల మధ్యకాలంలో బద్ధలైన అగ్నిపర్వతాల కారణంగా పోగైన బూడిద, లావా ఈ ప్రదేశాన్ని కప్పి కొలరాడో నదీ ప్రవాహాన్ని పూర్తిగా అడ్డగించింది. గ్రాండ్ కేనియన్ కొండచరియలలో ఇవి అతి తక్కువ వయసు కలిగినవి.

మానవచరిత్ర

[మార్చు]
ఎన్ పి యస్ దక్షిణ తీరాన ఉన్న గ్రాండ్ కేనియన్ దృశ్యాలు
నాన్కోవీప్ క్రీక్ వద్ద ఉన్న స్థానిక ప్యుబ్లోయియన్ గ్రానరీలు
ఉత్తర తీరాన ఉన్న ఈగిల్ పాయింట్ వద్ద ఉన్న ఈగిల్ రాక్ ఆకారము కారణంగా నామకరణము చేయబడింది. హౌలపాయీ ఇండియన్లు దీనిని పవిత్ర క్షేత్రముగా భావించారు

అమెరికాలోని ప్రస్తుత ఫోర్‌కార్నర్స్ ప్రదేశములోని కేంద్రములో స్థానిక అమెరికన్లు అయిన పురాతన ప్యూబ్లో ప్రజల సంస్కృతి ఇక్కడే విలసిల్లింది. గ్రాండ్ కేనియన్ ప్రదేశములో ప్రథమముగా నివసించించిన వారు పురాతన ప్యూబ్లో ప్రజలే. పూరావస్తుశాస్త్రజ్ఞులు ఈ సంస్కృతీ సమూహాలను అనసాజీ అని పేర్కొంటున్నా ఆధునిక ప్యూబ్లోయన్ ప్రజలను మాత్రం అలా పేర్కొనడం లేదు. నవాజీలో అనసాజీ అంటే పురాతనులు లేక పురాతన శత్రువు. పూరావస్తుశాస్త్రజ్ఞులు ఈ సంస్కృతి ఆవిష్కృత సమయము గురించి పురావస్తుశాస్త్రజ్ఞుల మధ్య ఇప్పటికీ వివాదాలు జరుగుతున్నాయి. తెర్మినాలజీ అధారిత పికోస్ క్లాసిఫికేషన్ (పురాతన ప్యూబ్లో సంస్కృతిలో ఒక భాగము) సూచనలను అనుసరించి ఈ సంస్కృతి వయసు క్రీ.పూ 1200 సంవత్సరాలని అంచనా. పురాతత్వశాస్త్రజ్ఞులు బాస్కెట్ ఎరా 2ను రూపొందించినప్పుడు ఈ విషయము నిర్ధారింపబడింది. ప్యూబ్లోయన్ ప్రజలే కాక అనేక విధములైన సంస్కృతులు కలిగిన ప్రజలు గ్రాండ్ కేనియన్ ప్రాంతంలో నివసించారు. సా.శ. 500-1200 మధ్యకాలములో గ్రాండ్ కేనియన్ పడమటి భాగంలో కొహొనినా ప్రజలు నివసించారు. కొహోనినా అనే వారు ప్రస్తుతము ఇక్కడ నివసిస్తున్న యుమన్, హవాసుపీ, వలాపి ప్రజలకు పూర్వీకులు. గ్రాండ్ కేనియన్‌కు అగ్నేయముగా లిటిల్ కొలరాడో , ది సాల్ట్ రివర్ మధ్య ఉన్న భూభాగాన్ని సునాగువా సాంస్కృతిక ప్రజలు ఆక్రమించుకుని ఇక్కడ నివాసాలు ఏర్పరుచుకున్నారు. సుమారు సా.శ. 500- 1425 సంవత్సరముల నివసించిన సినాగువా ప్రజలే పలు హోపీక్లాన్స్ ప్రజలకు పూర్వీకులుగా భావించబడింది. 16వ శతాబ్దములో ఇక్కడకు యురోపియన్ల ప్రవేశముతో నూతన సంస్కృతులు ఆవిర్భవించాయి. పైన్ క్లాడ్ వెంట 100 మైళ్ళ (160 కిలో మీటర్లు) పొడవున హౌలాపాయి సమూహాలు దక్షిణ గ్రాండ్ కేనియన్ ప్రాంతంలో నివసించారు. కాంటరాక్ట్ కానియన్ సమీపములో సా.శ. 1200 సమయములో హవాసుపాయి సమూహాలు. ఈ ప్రాంతంలో ప్రస్తుత డేలావేర్ ఆక్రమించుకుని నివసించారు. ప్రస్తుత దక్షిణ ఉటాహ్, ఉత్తర అరిజోనా ప్రాంతంలో ది సదరన్ పైయూట్స్ సమూహ ప్రజలు నివసించారు. శాన్‌ఫ్రాన్సిస్కో పీక్స్ తూర్పు తీరాల వెంట నలుదిశలా ది వవాజో లేక డైన్ ప్రజలు విశాలమైన ప్రదేశంలో నివసించారు. భూగర్భశాస్తర్జ్ఞులు, భాషావేత్తలు సాక్ష్యాధారంగా కెనడా లోని గ్రేట్ స్లేవ్ లేక్ ప్రాంతంలో నివసించిన అతబాస్కన్ సమూహాల నుండి విడిపడి సా.శ. 1000 సమయములో వచ్చిన వారే ఈ నవాజో ప్రజలని అంచనా.

యురేపియన్ల రాక, ఒప్పందము

[మార్చు]

1540 సెప్టెంబరు మాసంలో స్పెయిన్ దేశం నుండి కాన్‌క్విటేడర్ ఫ్రాన్సిస్కో వజ్క్విజ్ డి కొరొనాడో అనతి మీద నావికుడైన గార్షియా లోపెజ్ డి కార్డెనాస్ కొంత మంది స్పెయిన్ సైనికులను వెంటబెట్టుకుని కొంతమంది హోపి మార్గదర్శకుల సహాయంతో ఊహాజనితమైన సెవెన్ చిటీస్ ఆఫ్ సిబోలా అనే ప్రదేశాన్ని శోదిస్తూ గ్రాండ్ కేనియన్ దక్షిణ తీరాన ఉన్న మొరాన్ ఎడారి ప్రదేశంలో ప్రయాణించారు. వీరిలో పబ్లొ డి మెల్గ్రోసా, జుయాన్ గ్యాలరీస్ మరియొక సైనికుడితో మూడవ వంతు కేనియన్ ప్రయాణంలోనే వెనుతిరిగారు. అధికమైన నీటి ప్రవాహము వలన వారు వెనుతిరగమని వత్తిడి పెరిగే వరకు వారి ప్రయాణము కొనసాగించారు. వారి నివేదికలో గ్రాండ్ కేనియన్ లోని కొన్నిరాళ్ళు దిగ్రేట్ టవర్ సెవిల్లె కంటే పెద్దవని పేర్కొనబడింది. పరిశీలనలో తేలినదేమంటే హోపీ మార్గదర్శకులు వారు గ్రాండ్ కేనియన్ భూమార్గాలు తెలుసుకునే వరకు వారిని నది వైపు తీసుకు వెళ్ళ లేమని తెలిపారని వెల్లడైంది. తరువాతి రెండు వందల సంవత్సరాల వరకు ఈ ప్రాంతాలకు ఏ యురేపియన్ దేశస్తుడు రాలేదు. 1776లో ఫాదర్స్ ఫ్రాన్‌సిస్కో అటాన్సియొ డోమిన్‌క్విజ్, సిల్వెస్టే వెల్జ్ డి ఎస్కలాంటే అనే ఇద్దరు మతబోధకులు కొంత మంది స్పెయిన్ సైనికులతో శోధిస్తూ దక్షిణ ఉటాహ్ను చేరుకుని గ్రాండ్ కేనియన్ ఉత్తర తీరాల వెంట గ్లెన్, మార్బుల్ కేనియన్ వెంట శాంటా ఫె నుండి కలిఫోర్నియా వరకు మార్గాన్వేషణ కొనసాగించారు. చివరకు వారు కనిపెట్టిన అడ్డదారి ప్రస్తుతం లేక్ పౌల్ కింద ఉంది. అలాగే ఫ్రాన్‌సిస్కో గార్సెస్, ఫ్రాన్సికన్ మిషనరీ హవాసుపాయీ ప్రాంతంలో ఒక వారము ఉండి స్థానిక అమెరికన్లను క్రిస్టియన్ మతానికి మార్చడానికి విఫల ప్రయత్నము చేసారు. అతడు కేనియన్‌ను "చాలా లోతైనది" అని వర్ణించారు.

అమెరికన్ శోధకులు

[మార్చు]
మార్బుల్ కేనియన్

1826లో ఒహియో పాటియా (ఒక మర్‌మాన్ మిషనరీ) ఇక్కడకు కొందరు అమెరికన్ ప్రర్వతారోహకులతో వచ్చాడు. ఒకవేళ గ్రాండ్ కేనియన్ వద్దకు చేరిన తరువాత యురేయన్ ఇతడే కావచ్చు. జాకబ్ హామ్‌బ్లిన్ 1850లో బ్రిగ్‌హామ్ చేత సులువుగా నదిని దాట కలిగిన మార్గాలు కనుగొనే నిమిత్తం గ్రాండ్ కేనియన్‌కు పంపబడ్డాడు. ఆయన ఇక్కడి స్థానిక అమెరికన్లు, శ్వేతజాతీయ ఒప్పందదారులతో మంచి సంబంధాలు ఏర్పరచుకొని 158లో నదిని దాటడానికి లీస్‌ఫెర్రీ, పియర్స్ ఫెర్రీ (తరువాత దీని పేరు హరిషన్ ఫెర్రీగా మారింది) లను నడుపుతున్న ప్రాంతాలను నదిని దాటడానికి ఫెర్రీల నడపడానికి అనువైన ప్రదేశంగా ప్రతిపాదించాడు. ఆయన తన రెండవ పరిశోధనా యాత్ర సాగించే ముందు జాన్ వెస్లీ పావెల్‌కు సలహాదారుడిగా పనిచేసారు. ఆయన పావెల్, స్థానిక అమెరికన్ల మధ్య దౌత్యం జరిపాడు. 1857లో ఎడ్వర్డ్ ఫిట్జెరాల్డ్ బీల్ ఆధ్వర్యంలో ఫోర్ట్ డిఫెన్స్ నుండి కొలరాడో నది వరకు ఒక వేగన్ మార్గము నిర్మించడానికి పరిశోధన సాగింది. ఆయన గ్రాండ్ కేనియన్ దక్షిణతీరంలో కొకొనినో పీఠభూమిలో నీటి నిలువలను కనుగొనడానికి జరిగిన పరిశోధనా చిన్న బృందానికి నాయకత్వం వహించాడు. ప్రస్తుత నేషనల్ కేనియన్ ప్రాంతానికి సెప్టెంబరు 9న చేరుకుని హమ్‌ఫ్రే స్టాసీ తన జర్నల్‌లో " నాలుగువేల లోతైన అద్భుత కేనియన్"గా వర్ణించారు. ఆయన బృందంలోని వారు కూడా దానిని అంగీకరిస్తూ " ఆయన ఇంతకు ముందు దీనితో సమానమైన కుతూహాలాన్ని కలిగించే ప్రకృతి సహజ సంపదను చూడలేదని అభివర్ణించారు". 1857లో యు.ఎస్ వార్ డిపార్ట్‌మెంట్ లెఫ్టినెంట్ జోసెఫ్ ఇవ్స్ ను కలిఫోర్నియా గల్ఫ్ నుండి ఓడ మార్గాన్ని సాగించడానికి వీలైన మర్గాన్వేషణ చేయమని అడిగింది. తరువాత రెండు మాసాలకు ఎక్స్‌ప్లోరర్ అనే స్టెమ్ వీలర్ స్టీమ్ బోటులో 350 మైళ్ళు (560) కిలోమీటర్లు ప్రయాసతో కూడిన నౌకాయానానంతరం వారి బృందం బ్లాక్ కేనియన్ను చేరుకుంది. ఈ ఎక్స్‌ప్లోరర్ బోటు ఒక రాతిని గుద్దుకుని పగిలి పోవడంతో దానిని అక్కడే వదిలి వేసారు. ఇవ్స్ తన బృందానిని తూర్పు కేనియన్ దిశగా నడిపించాడు. డైమండ్ క్రీక్ డ్రైనేజ్, దక్షిణ తీరాన తూర్పు దిశగా ప్రయాణించిన మొదటి యురేపియన్లు వారే అయి ఉంటారు. ఆయన సెనేట్‌కు పంపిన తన కొలరాడో రివర్ ఆఫ్ ది వెస్ట్ నివేదికలో " ఒకరిద్దరు ట్రాపర్స్ కెనాన్ చూడడానికి మార్గనిర్ధేశం చేసారు" అని వెల్లడించాడు. శాన్‌ఫ్రాన్సిస్కో హెరాల్డ్ తన ధారావాహికలో 1853లో కేఫ్టేన్ జోసెఫ్ కు ఈ గౌరవాన్ని అందించారు. ఆయన తన మేనల్లుడైన జేమ్స్ టి వాకర్, 6 మంది బృందంతో కొలరాడో నదిలో ప్రయాణించి కొలరాడో నది వర్జిన్ నదితో క్లుసుకునే ప్రదేశానికి చేరుకుని తన ప్రయాణాన్ని తూర్పుదిశగా అరిజోనా వరకు గ్రాండ్ కేనియన్ గుండా కొనసాగించి తరువాత ఆ మార్గంలో చిన్న చిన్న శోధనా యాత్రలను సాగించాడు. వాకర్ మోకీ ఇండియన్లను (తరువాత హోపీ అని శ్వేతజాతీయుల చేత పిలువబడ్డారు) కలవాలన్న కోరికను వెలిబుచ్చాడు. వారితో వాకర్‌కు ముందున్న స్వల్ప పరిచయము కలిగించిన కుతూహలము వలన ఆయన వారితో మంచిపరిచయాన్ని పెంచుకోవాలని అనుకున్నాడు. రిపోర్టర్ హెరాల్డ్ ఈ విషయము " ఆయన ఈ నూతన సమూహాలను కలుసుకున్న ఒకేఒక శ్వేతజాతీయుడు "అని పేర్కొన్నాడు.

  • గ్రాండ్ కేనియన్‌ను భూగర్భశాస్త్రజ్ఞుడు జాన్ స్టాంగ్ న్యూబెర్రీ మొదటిసారిగా సందర్శించాడు.
  • 1869లో గ్రాండ్ కేనియన్ దిగువప్రాంతాలకు మొదటిసారిగా మేజర్ జాన్ వెస్లీ పవెల్ నాయకత్వంలో ఒక బృందం శోధనాయాత్ర కొనసాగింది.
  • పవెల్ గ్రాండ్ కేనియన్, కొలరాడో నదిని పరిశోధించడానికి 9మంది మనుష్యులను, నాలుగు బోట్లను, పది మాసాలకు సరిపడా ఆహారపదార్ధాలను

తీసుకుని వయోమింగ్‌లో ఉన్న గ్రీన్ రివర్ నుండి మే 24న ప్రయాణం ఆరంభించాడు. ఈ బృందం ఈ మర్గములో దిగువగా పయనించి గ్రీన్ రివర్ కొలరాడో న్దిలో సంగమించే ప్రాంతం (ప్రస్తుతం అది మోబ్, ఉటాహ్)వరకు చేరుకుని తమ యాత్ర ముగించాడు. ఈ యాత్ర అనేక ధృడమైన ఓడల ద్వారా 1869 ఆగస్ట్ 13న పూర్తి అయింది.

  • 1869లో ఫ్రాంక్ ఎమ్ బ్రౌన్ కొలరాడో నది వెంట ఒక రైలు మార్గాన్ని నిర్మాణం చెయ్యాలను అనుకున్నాడు. ఆయన ఆయన చీఫ్ ఇంజనీర్ రోబర్ట్ బ్ర్యూస్టర్ స్టాంటన్ 14 మంది బృందంగా గ్రాండ్ కేనియన్ గుండా బలహీనంగా రూపకల్పన చేయబడిన సిడార్ వుడ్ ఓడలలో ప్రాణించి ప్రమాదవశాన ఒక్కరు కూడా మిగలకుండా మార్బుల్ కేనియన్సమీపంలో మునిగి పోయాడు. తరువాత స్టాంటన్ కొత్త బోట్లను తయారు చేసి కొలరాడో నుండి గల్ఫ్ ఆఫ్ కొలరాడో వరకు శోధనాయాత్ర సాగించాడు. 1908లో గ్రాండ్ కేనియన్ నేషనల్ మోన్యుమెంట్‌గా గుర్తించబడి 1919 నుండి నేషనల్ పార్క్‌గా మారింది.

సమీపము, ఈ ప్రదేశంలోని ఒప్పందదారులు

[మార్చు]
  • మైనర్ కేప్టన్ జాన్ హెన్స్, విలియమ్ వి.బాస్, లూయిస్ బౌచర్ " ది హెర్మిట్ ", సెత్ టేనర్, చార్లెస్ స్పెన్సర్, డాక్టర్ జేమ్స్ మూనీ .
  • లెస్ ఫెర్రీ జాన్ డాయ్‌లే లీ, ఎమ్మా లీ ఫ్రెంఛ్ (జాన్ లీ యొక్క 19 భార్యలలో 17వ భార్య), జె ఎస్ ఎమ్మిట్, చార్లెస్ స్పెన్సర్.
  • గ్రాండ్ కేనియన్ విలేజ్: రాల్ఫ్ హెచ్ కెమరూన్.

ఫెడరల్ ప్రోటెక్షన్

[మార్చు]

1903లో యు ఎస్ ప్రెసిడేంట్ దియోడర్ రూజ్‌వెల్ట్ గాండ్ కేనియన్‌ను సందర్శించాడు. ఆయన ఇలాంటి ప్రకృతిసహజ సంపదలని కాపాడాడానికి అత్యత్సుసాహం కనబరచి 1906 నవంబరు 28 నాటికి గ్రాండ్ కేనియన్ గేమ్ ప్రిజర్వేటివ్ను స్థాపించాడు. జంతువులు మేయడము తగ్గినా కొండసింహాలు (మౌంటెన్ లైన్స్), గ్రద్ధలు, తోడేళ్ళ వంటి వేట జంతువులను మాత్రము సమూలంగా ఏరివేయబడ్డాయి. రూజ్‌వెల్ట్ గ్రాండ్ కేనియన్‌కు ఆనుకుని ఉన్న అడవులను కలిపి 1908 జనవరి 11 నాటికి 'యు ఎస్ నేషనల్ మోన్యుమెంట్ ప్రిజర్వ్‌కు రూపకల్పన చేసాడు. భూమి, గనుల యజమానులు దీనిని వ్యతిరేకిస్తూ ఈ ప్రయత్నాలను అడ్డగించి మోన్యుమెంటును ప్రతిపాదనలో పునరాలోచన సాగించి 11 సంవత్సరాల అనంతరం యు ఎస్ నేషనల్ పార్క్‌గా ఆవిర్భవించింది. 1919 ఫిబ్రవరి 26న ప్రెసిడేంట్ వుడ్‌రా విల్సన్ చివరిగా ప్రస్తుత గ్రండ్ కేనియన్ నేషనల్ పార్క్ను స్థాపింస్తూ చేసిన కాంగ్రస్ తీర్మానము మీద సంతకము చేసారు. ఇది యు ఎస్ నేషనల్ పార్కుల్లో 17వ స్థానములో ఉంది. ఫెడరల్ గవర్నమెంట్ నిర్వాహకులు ఈ పార్క్ సహజ సంపదను కాపాడడానికి అనేక సవాళ్ళను ఎదుర్కొన్నారు. సమీపకాలంలో తిరిగి పరిచయమౌతున్న అత్యంత ప్రమాదకారి అయిన కలిఫోర్నియా డేగల దాడులు కూడా ఈ సవాళ్ళలో ఒకటి. విమానాల ప్రయాణాల మూలంగా కలిగే శబ్ధకాలుష్యం, పార్క్ సరిహద్దులలో ఉన్న వివిధ కొండజాతుల మధ్య చెలరేగుతున్న జల వివాదాలు, ఫారెస్ట్ ఫైర్ మేనేజ్‌మెంట్ నుండి కూడా సవాళ్ళను ఎదుర్కొంటున్నారు. గ్రాండ్ కేనియన్ ప్రస్తుత సూపరింటెండెంట్ స్టెవ్ మార్టిన్ . ఆయన 2007 ఫిబ్రవరి 5న సూరింటెండెంట్ గా బాధ్యతలను చేపట్టాడు. ఈ బాధ్యతలను చేపట్టడానికి ముందు ఆయన డివ్యూటీ డైరెక్టర్ మరి ఇతర నేషనల్ పార్కులకు సూరరింటెండెంట్ గా పనిచేసాడు. వాటిలో డెనలి, గ్రాండ్ టెటన్ నేషనల్ పార్కులు కూడా ఉన్నాయి. ఫెడరల్ అధికారులు గ్రాండ్ కేనియన్ పరిసరవాతావరణాన్ని కాపాడడానికి గ్రాండ్ కేనియలో వరద నీటి ప్రవాహము పంపాలని అనుకుని చేసిన ప్రయత్నములో 1963లో గ్లెన్ కేనియన్ ను డామ్ నిర్మాణము చేపట్టారు. ఆ తరువాత గ్రాండ్ కేనియన్ కేనియన్ ఎకో సిస్టంలో శాశ్వత మార్పులు సంభవించాయి. అప్పడు వారు 2008 మార్చి 5 నాటికి గ్రాండ్ కేనియన్ ఎకోసిస్టాన్ని పునరుద్ధరించగలమని అంచనా వేసారు. 2003, 2008 మధ్య కాలములో గ్రాండ్ కేనియన్ పరిసరప్రాంతంలో గనుల తవ్వకానికి అనుమతి కోరబడింది. యురేనియమ్ నిలువలను వెలికి తీయడం వాటిలో ఒకటి. 2009 వరకు గనుల తవ్వకము ఆపివేయబడింది. యు ఎస్ ఇంటీరియర్ సెక్రెటరీ కెన్ సలాజర్ గనుల తవ్వకాల కారణంగా పరిసరాల కలిగే మార్పుల కారణంగా 1 మిలియన్ ఎకరాల్లో (4000 ఎకరాలు) ఈ అనుమతులను తత్కాలికంగా నిలిపివేసాడు. విమర్శకులు ఒకసారి ఇక్కడ గనుల తవ్వకాలు జరిగితే ఆ కారణంగా యురేనియమ్ కొలరాడో జలాలలో కలసి జలాలను కలుషితం చేసినట్లఎతే 16 మిలియన్ ప్రజలు బాధించబడతారని తమ అందోళన వ్యక్తము చేసారు.

సౌత్ రిమ్ బిల్డింగ్స్ (దక్షిణ తీరం నిర్మాణాలు)

[మార్చు]
డిసర్ట్ వ్యూ వాచ్ టవర్
లోకోమోటివ్ రైలు

గ్రాండ్ కేనియన్‌ విలేజ్‌కు కనుచూపు మేరలో దక్షిణతీరం వెంట పలు చారిక్త్రక నిర్మాణాలు చోటుచేసుకున్నాయి. అవి వరుసగా

  • బక్కీ ఓ'నెల్ కేబిన్ నిర్మాణము 1890లో విలియమ్ ఓవెన్ "బక్కీ" "ఓ" నెయిల్ అతడు సమీపముగా రాగి నిల్వల కొరకు ఒక గదిని నిర్మించాడు. అతడికి గనుల తవ్వకందారుగా, న్యాయాధికారిగా, రాజకీయవాదిగా, రచయితగా, పర్యాటక మార్గదర్శకుడుగా పలు వ్యాపకాలు ఉన్నాయి.

అతడు నిర్మించిన గదులు వరుసగా మిక్కిలి పొడవైన నిర్మాణముగా దక్షిణ తీరం వెంట నిర్మింపబడి ఉండడమే కాక అవి ఇప్పుడు అతిథిగృహాలుగా కూడా ఉపయోగపడుతున్నాయి.

  • ఎల్స్‌వర్త్, ఎమరీకోబ్ సహోదరుల చేత నిర్మించబడిన కోబ్ శ్టూడియో 1940లో నిర్మించబడింది. వారు బ్రైట్ ఏంజిల్ ట్రైల్ వద్ద తిరుగుతూ పర్యాటకుల ఛాయాచిత్రాలను తీయడం తమ జీవనోపాధిగా ఎంచుకుని పనిచేసారు. 1911లో కోబ్ సహోదరులు వారు సాగించిన ప్రయాణాన్ని గ్రీన్6నది, కొలరాడో నది వరకు సాగించి దానిని చిత్రీకరించారు. ఎమరీ కోబ్ ఈ చిత్రాన్ని 1976 వరకు తమ స్టూడియోలో ప్రదర్శించాడు. ఆయన 1976లో తన 95వ ఏట మరణించిన తరువాత ఈ భవనము కళాప్రదర్శన, పురావస్తుప్రదర్శన శాలగా సేవలు అందిస్తుంది.
  • దక్షిణతీరములో 1905లో నిర్మించిన ఎల్ టవర్ హోటెల్ దక్షిణతీరంలోని అత్యాధునిక సౌకార్యాలున్న ఖరీదైన వసతిగృహము. దీనిని చార్లెస్ విట్‌లెస్‌లీ రూపకల్పన చేసారు. ఒక గిఫ్ట్ షాపు ఒక రెస్టారెంట్ కలిగి ఉన్న ఈ హోటెల్ నాగు అంతస్తులను కలిగి ఉంది.
  • 1905లో మేరీ జాన్ కోల్టర్ చేత హోపీ హౌస్ నిర్మాణం జరిగింది. ఈ నిర్మాణము పురాతన హోపీ ఒప్పందం ఓరైబి ఆధారంగా జరిగింది. ఇది తూర్పు అరిజోనా లోని తర్డ్ మెస్సా మెస్సాలో ఉంది. ఇది దక్షిణ తీరంలో హోపీ ఇండియన్ల నివాసంగా ఉండి పర్యాటకులకు కళాత్మకమైన, చేతితో చేసిన వస్తువిక్రయాలను చేస్తుంది.
  • హోపీ హౌస్కు పక్కనే వర్కాంప్స్ హౌస్ ను 1905లో జాన్ వర్కాంప్ చేత నిర్మించబడింది. ఆయన కళాత్మ వస్తువులు, చేతితో చేసిన వస్తువులు, సావనీర్లను విక్రయిస్తుండే వాడు. 2008 వరకు ఇది వారి సంతతి చేత నడపబడి 2008 నవంబరు నుండి గ్రాండ్ కేనియన్ పల్లె ప్రజల చరిత్రని వివరించే పర్యాటక కేంద్రముగా తిరిగి ప్రారంభించబడింది.
  • గ్రాండ్ కేనియన్ రైల్వే డిపార్ట్‌మెంట్ 1909లో నిర్మించబడి రెండు విభాగాలుగా పనిచేస్తుంది. ఒకటి గార్డేన్ చాపెల్ రెండవది పార్క్ సర్వీస్ కొరకు రీజనల్ హిశ్టారియన్. ఈ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో మూడు చెక్కలతో నిర్మించబడిన నిర్మాణసైలి కలిగిన స్టేషన్లను కలిగి ఉంది. అరిజోనా లోని విలియమ్స్ నుండి గ్రాండ్ కేనియన్ వరకు ఈ రైళ్ళు నడపబడుతుంటాయి. ఈ డిపార్ట్‌మెంటే గ్రాండ్ కేనియన్ రైల్వే నార్తన్ టెర్మినల్.
  • 1914లో లుక్‌ఔట్ స్టూడియో నిర్మించబడింది. ఇది మేరీ కోల్టర్ రూపకల్పన చేసిన మరియొక నిర్మాణము. ఛాయాచిత్రాలు, పుస్తకాలు, సావనీర్లు, రాళ్ళు, శిలాజాల ఇక్కడ విక్రయిస్తుంటారు.
  • 1932లో డిసర్ట్ వ్యూ వాచ్‌టవర్ నిర్మించబడింది. మేరీ కోల్టర్ రూపకల్పన చేసిన మరియొక ఉత్తమనిర్మాణం. ఇది దక్షిణ తీరంలో గ్రాండ్ కేనియన్ విలేజ్కు 27 (43 కిలోమీటర్లు) మైళ్ళ దూరంలో ఉంది. ఈ భవనము 740 అడుగుల ఎత్తైన ప్రదేశం మీద ఉపస్థితమై ఉంటుంది. ఇది అనసాజీ నిర్మాణాలను పోలి ఉన్న బృహత్తర నిర్మాణాము వాటి కంటే అతి పెద్దది.
  • 1935లో ఫ్రెడ్ హెర్రీ చేత కొయ్యలు, రాళ్ళను కలిపి బ్రైట్ ఏంజిల్ లాడ్జ్ నిర్మించబడింది. మేరీ కోల్టర్ ఈ వసతి గృహాన్ని రూపకల్పన జరిగింది. ఈ వసతి గృహములో ఫ్రెడ్ హెర్రీని గౌరవిస్తూ ఒక చిన్న పురావస్తు ప్రదర్శన శాల ఉంది. ఆయన గ్రాండ్ కేనియన్ ప్రాబల్యాన్ని పెంచడంలో ప్రధానపాత్ర వహించాడు. చారిత్రక గదిలో ఉన్న ఫైర్ ప్లేస్ దక్షిణతీరాన ఉన్న రాళ్ళతో గ్రాండ్ కేనియన్ కుడ్యాలను పోలి నిర్మించబడింది.

వాతావరణము

[మార్చు]
2007 ఏప్రిల్ మాసంలో యవాపాయి కేంద్రం వద్ద వాయు కాలుష్యం కార్ణంగా ఏర్పడిన బ్రౌన్ క్లౌడ్
గ్రాండ్ కేనియన్ హిమపాతము

గ్రాండ్ కేనియన్ ఉన్న కొండల ఎత్తులలో ఉన్న హెచ్చుతగ్గుల కారణంగా ఇక్కడి వివిధమైన వతావరణాలు ఉంటాయి. తీరాలవెంట ఉన్న అడవుల ఎత్తు శీతాకాలంలో హిమపాతాన్ని అందుకోవడానికి అనువైనవిగా ఉన్నాయి. కాని కొలరాడో నది పరివాహ ప్రాంతంలోని ఇరుకైన దారులలో వాతావరణం అరిజోనాలోని టస్కన్, ఇతర లోతట్టు ప్రాంతంతో పోలి ఉంటుంది. గ్రాండ్ కేనియన్ వాతావరణం సాధారణంగా ఆరినట్లు ఉంటుంది. కాని చిరుఝల్లు, వాన, మంచువాన, మంచు, వడగళ్ళు, మంచురాళ్ళు వంటి పలువిధములైన పాతములు సంవత్సరంలో శీతాకాలంలోను వేసవి, ముగిసేసమయంలోను రెండు పర్యాయములు ఉంటాయి. ఈశాన్యంలో సరాసరి ప్రిసిపిటేషన్ (వివిధములైన పాతములు) 16 అంగుళాలు (35 సెంటీ మీటర్లు) దీఅనిలో హిమపాతము 60 అంగుళాలు (132 సెంటీ మీటర్లు) . ఎత్తైన ఉత్తర తీరాలలో మాయిస్చర్ 27 అంగుళాలు (59 సెంటీ మీటర్లు) ఉంటుంది. హిమపాతము 144 అంగుళాలు (317 సెంటీ మీటర్లు) . గ్రాండ్ కేనియన్ సుదూరప్రాంతాలలో కొలరాడో నది 2, 500 అడుగులు (762 మీటర్లు) దిగువప్రాంతంలో వర్షము కేవలము 8 అంగుళాలు ఉంటుంది. హిమపాతము అరుదుగా ఉంటుంది. ఉత్తర తీరం దక్షిణ తీరం వాతావరణంలో తేడాలు ఎక్కువగా ఉంటాయి. ఇరుకైన కొలరడోనది ప్రవాహ ప్రాంతంలో ఉష్ణోగ్రత 100 దిగ్రీల ఫారెన్‌హీట్ (38 డిగ్రీల సెంటీ గ్రేడ్) వరకు ఉంటుంది. అలాగే శీతాకాలపు ఉష్ణోగ్రతలు 0 కంటే తక్కువగా (17 డిగ్రీల ఫారెన్‌హీట్ వరకు) పడిపోతుంది. పర్యాటకులనుఈ విపరీత వాతావరణ మార్పులు ఆశ్చర్యానికి గురిచేస్తాయి. గ్రాండ్ కేనియన్ ఎత్తైన భూభాగంలో ఈ విపరీత వాతావరణం కారణంగా డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తరుగుదల), సన్‌బర్న్ (చర్మము కమలుట), హైపోదర్మియా వంటి ఆరోగ్యసమస్యలకు గురిఊఉతుంటారు. ఈ వాతావరణ పరిస్థితులు కేనియన్ పరిశోధకులను కొంత అడ్డగిస్తాయి. అలాగే కూడా శీతాకాలపు చలిగాలులు, వేసవికాలపు వేడి పరిస్థితులు పర్యాటకుల రాకకు ఆటంకం కలిగిస్తాయి. పర్యాటక కేంద్రాలు, గేట్ల వద్ద పార్క్ సర్వీసు బోర్డుల ద్వారా వాతావరణ సూచనలు ఎంచుమించుగా తెలియచేయబడినా కేనియన్ అధిరోహకులు కచ్చితమైన మైన వాతావరణము తెలుసుకోవడానికి ఎన్ఒఎఎ, నేషనల్ వెదర్ సర్వీసులతో సంప్రదిస్తుంటారు. 1903లో దక్షిణ తీరంలో నేషనల్ వెదర్ సర్వీసు కోపరేటివ్ స్టేషను ఆరంభించింది. 1974 జూన్ 26న దక్షిణతీరంలో నమోదైన అత్యధిక ఉష్ణోగ్రత 105 డిగ్రీల ఫారెన్‌హీట్.

వాయు కాలుష్యము

[మార్చు]

నవాజో పవర్ స్టేషనులో కాల్చబడుతున్న బొగ్గు కారణంగా గ్రాండ్ కేనియన్ పరిసరాలను వాయు కాలుష్యం సమస్య బాధిస్తుంది. 1991 అరిజోనా లోని పేజ్ వద్ద వాయుకాలుష్యాన్ని నిరోధించే ఏర్పాట్లు చేసుకొనడానికి నవాజో పవర్ స్టేషను తో ఒక ఒప్పందం కుదుర్చుకొన్నారు.

బయోలజీ, ఎకాలజీ

[మార్చు]

మొక్కలు

[మార్చు]

గ్రాండ్ కేనియన్‌లో 1, 737 వస్కులర్ జాతికి చెందిన మొక్కలు ఉన్నాయి. ఫంగై (పరాన్నభుక్కులు) 167 జాతులు, 64 నాచు (మోస్) జాతులు, 195 జాతుల లికెన్ జాతులకు చెందిన చెట్లు ఉన్నాయి. ఈ జాతులన్నీ ఉత్తర తీరంలో 8, 000 అడుగుల ఎత్తైన భూభాగంలో ఉంటాయి. గ్రాండ్ కేనియన్ 12 జాతుల స్థానిక చెట్లు గ్రాండ్ కేనియన్ తప్ప మరెక్కడా కనిపించవని సగర్వంగా చుప్తుంది. ఇవి పార్క ప్రాంతంలో తొభైశాంతం ఉండగాన్యజాతి మొక్కలు మాత్రం కేవలం 10% మాత్రమే ఉన్నాయి. ఇక్కడ ఉండే 63 జాతుల మొక్కలకు యు ఎస్ ఫిష్, వన్యప్రాణి సర్వీస్ గుర్తింపు లభించింది. గ్రాండ్ కేనియన్ పడమటి భాగంలో మొజేవ్ డిసర్ట్ ప్రభావం అధికంగా కనిపిస్తుంది. గ్రాండ్ కేనియన్ తూర్పుభాగాలలో సొనొరన్ డిసర్ట్ మొక్కలతో నిండి ఉంటుంది. పాండరోసా, పిన్‌యాన్ పైన్ అడవులు రెండు తీరాలలో పెరుగుతుంటాయి. సహజమైన నీటితడి నిరంతరం గ్రాండ్ కేనియన్ గోడలలో స్రవిస్తున్న కారణంగా కుడ్యాలలో మాత్రమే జీవించే 11% శాతం మొక్కలు గ్రాండ్ కేనియన్ గోడలలో చూడవచ్చు. గ్రాండ్ కేనియన్ పొడవునా తూర్పు, పడమ తీరాలను కలుపుతూ కొన్ని దార్లు కలిగి ఉంది. టాసిల్ - ఇయర్డ్ స్క్వైర్ల్ వంటి ప్రాణులకు గ్రాండ్ కేనియన్ ఒక వంతెనగా ఉపయోగపడుతుంది. ఏటవాలు భూములు తమ ఆకారం కారణంగా వివిధరకాల మొక్కలు పెరగడానికి కారణం ఔతుంది. ఉత్తరాభి ముఖంగా ఉండే భూములు సూర్యరస్మిలో మూడవ భాగాన్ని గ్రహించడం వలన ఎతైన భూములలో పెరిగే మొక్కలు అక్కడ ఉంటాయి. దక్షిణాభిముఖంగా ఉండే భూములలో పూర్తి సూర్యరశ్మి పడుతున్న కారణంగా సొనారమ్ డిసర్ట్ ప్రాంతంలో కనిపించే మొక్కలను అక్కడ చూడవచ్చు.

జంతువులు

[మార్చు]

గ్రాండ్ కేనియన్ ప్రాంతంలో 34 రకాల క్షీరదాలను చూడవచ్చు. వాటిలో 15 రోడెంట్ జాతికి చెందినవి 8 గబ్బిలజాతికి చెందినవి.

జీవనపరిస్థితులు, సమూహాలు

[మార్చు]

పార్క్‌లో పలురకాల ప్రధాన పరస్పరాశ్రయ పరిస్థితులు ఉన్నాయి. దీని సహజ జీవశాస్త్ర వైవిధ్యం ఇక్కడ ఉన్న ఏడు జీవనసంస్కృతులు ఐదు నాలుగు ఇతర ఉత్తర అమెరికాలోని ఎడారి జీవనసంస్కృతుల వలన కలుగుతుంది. ఐదు జీవనసంస్కృతులు వరుసగా లోవర్ సొనారన్, అప్పర్ సొనారన్, ట్రాన్‌సిషన్, కెనడియన్, హుడ్సొనియన్. ఇది మెక్సికో నుండి కెనడా ప్రయాణంతో సమానము. భూమి యొక్క ఎత్తులలో ఉండే తేడాల వలన వాతావరణ పరిస్థితులలో కలిగే తేడాలు వైవిధ్యత కలిగిన జీవనసంస్కృతులు, సమూహాలు గ్రాండ్ కేనియన్, దాని సమీప పరిసరాలలో వెల్లి విరియడానికి దోహదమైంది. గ్రాండ్ కేనియన్ నేషనల్ పార్క్ 129 జాతుల వృక్షజాతులు అంతటా ఆవరించి ఉన్నాయి. ఇక్కడి మొక్కలు వాతావరణ, భౌగోళిక, భూతత్వ పరిస్థితుల ప్రభావానికి లోనై ఉంటాయి.

లోవర్ సొనొరన్(దిగువప్రాంత జీవజాలం)

[మార్చు]
గ్రాండ్ కేనియన్ వద్ద పెద్ద కొమ్ముల ఏవ్ 2008

కొలరాడో నది తీరాల వెంట 3, 500 అడుగుల ఎత్తులో ఉన్న జీవన సంస్కృతిని లోవర్ సొనారమ్ అంటారు. పలువిధాల మొక్కలు, నదీతీర సహజ వృక్షజాతులు ఉంటాయి. కయోట్‌విల్లో, ఎరోవీట్, సీప్ విల్లో, వెస్ట్రన్ హనీ మెస్‌క్విట్, క్యాట్ క్లా అకాషియా, ఎక్సోటిక్ టామరిస్క్ (సాల్ట్ సెడార్) జాతులు ముందు నుండి అధిక్యత కలిగి ఉన్నాయి. జాలువారే పూతోటలు (హేంగింగ్ గార్డేన్స్), చిత్తడి నేలలు, వసంతకాలపు మొక్కలు పుష్పించే కాలంలో అరుదైన మొక్కలను కలిగి ఉంటాయి. తెల్లని పూలు పూచే రెడ్‌బడ్, స్ట్రీమ్ ఆర్చిడ్, మెక్‌డగ్లాస్ ఫ్లేవరియా వంటి మొక్కలు వాటిలో కొన్ని. సాధారణంగా నదీతీర వృక్షశ్రేణి (రిపారియన్) లో కనిపించే కేన్‌యాన్ ట్రీ ఫ్రాగ్, రెడ్ - స్పాటెడ్ టోడ్, వుడ్ హౌసెస్ రాకీ మౌంటెన్ టోడ్. లెప్పర్డ్ ఫ్రాగ్ కొలరాడో నదీతీరాలలో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఇవి కొలరాడో నదీ తీరాలలో కొన్ని ప్రదేశాలలో మాత్రమే జీవించి ఉన్నట్లు భావించబడుతుంది. గ్రాండ్ కేనియన్ నేషనల్ పార్క్ కొలరాడో నది, దాని ఉపనదుల జలాలలో 33 క్రస్టేసియాన్ జాతులను కనిపెట్టారు. వీటిలో 16 జూప్‌లాన్‌క్టన్ కణజాలం కలిగిఉన్నాయి. 48 పక్షి జాతులు మాత్రం కొలరాడో నది వెంట తమ గూళ్ళు నిర్మించుకుని నివసిస్తున్నాయి. మిగిలినవి కొలరాడో నదిని వలస సమయానికి మాత్రం ఉపయోగిస్తున్నాయి. రివర్ ఒట్టర్ 20వ శతాబ్దంలోనే గ్రాండ్ కేనియన్ నేషనల్ పార్క్‌ నుండి కనిపించకుండా పోయాయి. మస్‌క్రాట్స్ పూర్తిగా అరుదైయ్యాయి. బీవర్స్ ఆహారంకొరకు విల్లో చెట్లను కత్తిరించడం, కాటన్ వుడ్, పొదలల మీద అధారపడడంతో నదీతీర వృక్షశ్రేణి పచ్చదనం దెబ్బతింటోది. ఇతర రోడెంట్ ( నిరంతరం దంతాలు పెరిగే జంతువులు) 'ఏంటిలోప్ ఉడతలు, పాకెట్ మైస్ ఇవి అహ్హారం కొరకు చెట్లు, జంతువుల మీద అధారపడతాయి. ఇవి ఆహారం కొరకు పలు మొక్కలను ఆశ్రయిస్తాయి. గ్రాండ్ కేనియన్ గబ్బిలాలు ఎత్తైన ప్రదేశాలలో నివసిస్తూ కొలరాడో నది అధారిత కుట్టే పురుగుల మీద అధారపడి జీవిస్తున్నాయి. కొయోట్, రింగ్ టెయిల్, స్పాటేడ్ షన్క్ వంటి జంతువులు ఇన్వర్టిబ్రేట్స్ (వెన్నెముక లేని జంతువులు), రోడెంట్ (నిరంతరరం పైదంతాలు పెరిగే జంతువులు), రెపిటైల్స్ మీద ఆహారం కొరకు అధారపడి జీవిస్తున్నాయి. రేకాన్, వీసెల్స్, బాబ్‌కేట్స్, పర్వత సింహాలు కనిపించినా అవి చలా అరుదుగానే కనిపిస్తాయి. మౌల్ డీర్ (ఒక జాతి జింక), ఎడారి పెద్దకొమ్ముల గొర్రెలు తరచూ కొలరాడో నదీ తీరాలలో కనిపిస్తుంటాయి. 1980లో 500 రియల్ బర్రోస్ (ఒకజాతి గాడిద) లను కొలరాడో తీరాల నుండి తరలించిన తరువాత పెద్దకొమ్ముల గొర్రెల సంఖ్య తిరిగి వృద్ధిచెందినా సాధారణంగా మౌల్ దీర్లు మాత్రం నిదీతీరానికి శాశ్వత నివాసులు కారు. అవి తగినంత ఆహారం లభించనప్పుడు మాత్రమే కిందికి దిగి వస్తుంటాయి. కొలరాడోనది మీద సధారణంగా కనిపించే కుట్టే కీటకాలు మిడ్జెస్, కడ్డీఫ్లయ్, మేఫ్లై, స్టోన్ ఫ్లై, బ్లాక్ ఫ్లై, మైట్స్, బీటిల్స్ (తుమ్మెద), సీతాకోక చిలుకలు, మోత్స్, ఎర్రచీమలు. పలువిధాలైన సాలెపురుగులు, పలురకాల తేళ్ళు వీటిలో బార్క్ తేళ్ళు, ఎడారి తేళ్ళు నదీతీరవృక్షశ్రేణిలో నివసిస్తుంటాయి. నీటి మొలస్క్ జాతికి చెందిన 11 భూ మొలస్క్ జాతికి చెందిన 26 జాతులను గ్రాండ్ కేనియన్ నేషనల్ పార్క్ పరిసరాలలో చూడవచ్చు. గ్రాండ్ కేనియన్ నేషనల్ పార్క్ పరిసరాలలో 47 జాతుల సరీశృపాలను చూడవచ్చు. వీటిలో 10 జాతులకు చెందినవి పాకేజంతువులు పాములు కూడా వాటిలో ఒకటి. పైభాగంలో ఉన్న నదీతీర భూములలో పాకేజంతువుల సాంద్రత ఎక్కువ. గ్రాండ్ కేనియలో అత్యధిక సంఖ్యలో ఉన్న సరీశృపాలు గిలా మాన్‌స్టర్స్, చుక్‌వాలాస్. పార్క్ పరిసరాలలో 6 రేటిల్‌స్నేక్స్ జాతులు ఉన్నట్లు నమోదు అయింది. నిదికి ఎగువ భూములలో ఉత్తర అమెరికాకు చెందిన ఎడారి మొక్కల జాతుల పెరుగుతుంటాయి. వెచ్చని ఎడారి ప్రాంతంలో పెరిగే జాతులైన క్రియోసోట్, వైట్‌బర్సేజ్, బ్రిటిల్ బుష్, కేట్‌క్లా అకాసియా, ఒకోటిలో, మరియోలా, వెస్టర్న్ హనీ మెస్క్విట్, ఫోర్‌వింగ్ సాజ్ట్ బుష్, బిగ్‌సేజ్ బ్రష్, బ్లాక్ బ్రష్, రబ్బర్ రాబిట్ బ్రష్ లాంటివి ఈ జాతులలో పెరుగుతుంటాయి. వుడ్‌లాండ్ జాతికి చెందిన మమ్మలియన్ ఫ్యూనా 50 జాతులు జీవించి ఉన్నాయి. వీటిలో అధికం రోడెంట్స్, గబ్బిలాలు. పార్క్‌లో ఉండే ఐదు వుడ్‌డార్ట్ జాతులలో మూడు ఎడారి వృక్ష జాతికి చెందినవి. కొలరాడో నదీ జలాల సమీపంలో మాత్రమే కనిపించే వెస్ట్రన్ బెండెడ్ జెకొ తప్ప మిగిలిన సరీశృపాలు అన్నీ ఎగువన ఉన్న నదీతీరాలపైనే ఉన్నాయి అయినా సంఖ్య మాత్రం తక్కువే. డిసర్ట్ గోఫర్ టార్టాయిస్ పార్క్ పడమటి భాగంలో నివసిస్తున్న ఇవి క్షీణదశలో ఉన్నాయి. సాధారణ కుట్టే కీటకాలు కొన్ని 2, 000 అడుగుల ఎత్తైన భూములలో అరంజ్ పెప్పర్ వేస్పర్స్, హనీబీస్, బ్లాక్ ఫ్లైస్, టరంటులా హాక్స్, స్టిన్క్ బగ్స్, బీటిల్స్, నల్లచీమలు, మొనార్చ్, స్వాలో టెయిల్ బటర్ ఫ్లైస్ మొదలైనవి జీవిస్తున్నాయి. సాల్ప్‌గిడ్స్, వుడ్‌స్పైడర్స్, గార్డెన్ స్పైడర్స్, బ్లాక్ విడో స్పైడర్స్, ట్రాంటులాస్ ఎగువభూములలోని ఎడారి భూమిలో కనుగొన్నారు.

అప్పర్ సొనొరన్, ట్రాన్సిషన్

[మార్చు]
2008 మార్బుల్ కేనియన్ వద్ద ఉన్న నవాజో వంతెన నుండి తీసిన ఛాయా చిత్రంలో ఎగురుతున్న ఒక కలిఫోర్నియా కారిడార్

కేనియన్ దక్షిణ తీర ఎగువన 3, 500 నుండి 7, 000 వరకు ఉన్న ఎగువ కేనియన్ లోపలి సొనోరన్ జంతుజాలం, పక్షుల మొదలైన జీవమండలం కలిగి ఉంటుంది. ఈ ప్రదేశం బ్లాక్‌బ్రష్, సేజ్‌బ్రష్, పిన్‌యాన్-జూనిపర్ చెట్ల ఆధిక్యం కలిగి ఉంటుంది. 3, 500 ఎగువ నుండి 4, 000 వరకు ఎగువ సొనారమ్‌లో ఉండే మొజవే ఎడారి డిసర్ట్ స్క్రబ్ జాతి మొక్కలు ఉటాహ్ అటవే, నేరో లీఫ్, ప్రొసొపిస్, క్రమేరియా, క్యాట్‌క్లా, అనేక ఎడారి జాతి మొక్కలు ఉంటాయి.

ఎగువ భూములలో, లోపలి కొండ గుట్టలలో ప్రధానంగా సుమారు 30 జాతుల పక్షులు గుడ్లను పెట్టి పొదిగి జీవనం సాగిస్తుంటాయి. వాస్తవంగా మొత్తం సొనారమ్‌, మొహావే ఎడారిలో 43 జాతులు కనిపిస్తున్నాయి. విస్తారంగా గబ్బిలాలు, స్విఫ్ట్‌లు (ఒకజాతి పక్షి) నదుల మీద ఆధారపడి ఉండే పక్షులు పెరిగ్రైన్ పక్షులకు విస్తారమైన ఆహారాన్ని అందిస్తున్నాయి. తగిన గూళ్ళు కేనియన్ గోడలలో విస్తారంగా కనిపిస్తుంటాయి. అంతరించి పోతున్న కలిఫోర్నియా కాండర్స్ ను తిరిగి అరిజోనా వైపున్న కొలరాడో మైదానాలలో ప్రవేశపెట్టారు. తూర్పు తీర ఉద్యానవనంలో వాటి సంరక్షణా కేంద్రంగా ఉంది.

కొనిఫర్ (సూది మొన వృక్షాలు) అడవులు 52 జాతుల క్షీరదజాతులకు ఆశ్రయం కల్పిస్తున్నాయి. పందికొక్కులు, చుంచు ఎలుకలు, ఎర్రని ఉడుతలు, కైబాబ్ ఉడుతలు, అబర్ట్ ఉడుతలు, నల్ల ఎలుగుబంట్లు, మూల్ జింకలు, కణితలు మొదలైన క్షీరదాలు ఎగువ కైబాబ్ మైదానంలో కనిపిస్తున్నాయి.

ఎడారి స్క్రబ్ (డిసర్ట్ స్క్రబ్) ఎగువన 6, 200 అడుగుల ఎత్తున పిన్‌యాన్ పైన్ అడవులు, ఏకదళబీజ వృక్షాల అడవులలో సేజ్‌బ్రష్, స్నేక్‌బ్రష్, మర్‌మన్ టీ, ఉటాహ్ కిత్తిలి, అరటి, నేరో లీఫ్, వింటర్ ఫ్యాట్, ఇండియన్ రైస్ గ్రాస్, డ్రాప్‌సీడ్, నీడిల్‌గ్రాస్ వంటి వృక్షజాతులు ఉన్నాయి. ఇక్కడ అనేక రకాల పాములు, పాకే జంతువులు ఉన్నాయి. వీటిలో మౌంటెన్ షార్ట్ - హార్న్‌డ్ లిజార్డ్ ప్రత్యేకంగా విస్తారంగా ఉన్నాయి. ఇవి పినాన్-జూనిపర్, పాండరోస పైన్ అడవులలో ఉన్నాయి.

పాండరోసా పైన్ అడవులు సాధారణంగా గ్రాండ్ కేనియన్ ఉత్తర, దక్షిణ తీరాల వెంట ఉన్న 6, 500 నుండి 8, 200 అడుగుల ఎగువ భూములలో పెరుగుతుంటాయి. దక్షిణ తీరంలో మౌల్ జింకలు, బూడిదవర్ణ నక్కలు, పెద్ద కొమ్ముల గొర్రెలు, రాతి ఉడుతలు, పిన్‌యాన్ పైన్, ఉటాహ్ జూనిఫర్ వంటి వృక్షజాతులు ఉన్నాయి. ఇవి కాక గామ్‌బెల్ ఓక్, న్యూ మెక్సికో ల్యూకస్ట్, మౌంటెన్ మహోగనీ, ఎల్డర్ బెర్రీ, క్రీపింగ్ మహోనియా, ఫెస్క్యూ మొదలైనవి ఈ అడవులలో గుర్తించబడ్డాయి. ఉటాహ్ టైగర్ సాలమండర్, గ్రేట్ బేసిన్ స్పేడ్‌ఫూట్ టోడ్ ఈ రెండు జాతుల ఉభయచరాలు ప్రధానంగా కప్పలు ఈ అడవులలో సాధారణంగా కనిపిస్తుంటాయి. కోనిఫెరోస్ అడవులలో సుమారు 90 జాతుల పక్షులు గుడ్లను పొదిగి జీవనము సాగిస్తున్నాయి. వీటిలో ఎండాకాలం నివసించే జాతులు 56. వీటిలో 15 జాతులు నియోట్రాపికల్ వలస జాతులుగా గుర్తించారు.

కెనిడియన్, హడ్సనియన్

[మార్చు]

గ్రాండ్ కేనియన్ 8, 200 నుండి 9, 000 అడుగుల ఎగువ భూములలో ఉత్తర కేనియన్ తీరంలో కైబాబ్ మైదానంలోబ్ని కెనెడియన్ జీవమండలంగా భావించబడుతుంది. స్ప్రస్-ఫిర్ అడవులలో ఎంగిల్మన్ స్ప్రస్, బ్లూ స్ప్రస్, డగ్లాస్ ఫిర్, వైట్ ఫిర్, అస్పెన్, మౌంటెన్ యాష్ వంటి వృక్షాలతో గ్రౌండ్ సెల్స్, యారో, పలు జాతుల గడ్డి మొక్కలు ఉంటాయి. కాన్‌క్విఫాయిల్, ల్యూపిన్స్, సెడ్జెస్, అస్టర్స్ వంటివి ఈ పర్వత వాతావరణంలో పెరుగుతున్నాయి. పర్వత సింహాలు, కైబాబ్ ఉడతలు, సాళువ డేగల వంటి జంతుజాలం ఇక్కడ దర్శనం ఇస్తుంటాయి.

గ్రాండ్ కేనియన్ ఉత్తర తీరప్రాంతాలలో అరుదుగా కనిపించేవి అయిన హడ్సనియన్ పర్వత పచ్చిక బయళ్ళు, సుబల్‌పైన్ జాతులు ఉత్తర కేనియన్ తీరంలో మాత్రమే ఉన్నాయి. రెండు వైపులా పలు గడ్డి జాతులు కనిపిస్తాయి. వీటిలో కొన్ని జాతులు బ్లాక్ గ్రమా, బిగ్‌గల్లెటా, ఇండియన్‌రైస్ గ్రాస్, త్రీ వాన్స్ మొదలైనవి. అత్యంత తడిగా ఉండే భూములు సెడ్జెస్, ఫోర్‌బ్స్ పెరగడానికి సహకరిస్తాయి.

గ్రాండ్ కేనియన్ పర్యాటకరంగం

[మార్చు]

గ్రాండ్ కేనియన్ ప్రంపంచ ప్రసిద్ధిచెందిన ప్రకృతి ఆకర్షణలలో ప్రధానమైనది. ఇది ఒక సంవత్సరానికి 50, 00, 000 మందిని ఆకర్షిస్తుంది. అమెరికా అంటటి నుండి 83% ప్రజలు గ్రాండ్ కేనియన్ సందర్శించడానికి విచ్చేస్తుంటారు. కలిఫోర్నియా నుండి 12%, ఆరిజోనా నుండి 8.9%, టెక్సస్ నుండి 4.8%, ఫ్లోరిడా నుండి 3.4%, న్యూయార్క్ నుండి 3.2% పర్యాటకులు వస్తుంటారు. 17% పర్యాటకులు విదేశీ పర్యాటకులు వస్తుంటారు. వీటిలో అధికంగా పర్యాటకులు వచ్చే అత్యంత ప్రాముఖ్యత కలిగిన దేశాలు యునైటెడ్ కింగ్‌డమ్ నుండి 3.8% కెనడా నుండి 3.5%, జపాన్ నుండి 2.1%, జర్మనీ నుండి 1.9%, నెదర్లాండ్స్ నుండి 1.2%.

పర్యాటక ఆకర్షణలు

[మార్చు]

గ్రాండ్ కేనియన్ దక్షిణ తీరాలలో 2, 100 నుండి 7, 000 అడుగుల ఎత్తు వరకు సాధారణంగా పర్యాటకుల కొరకు తెప్పలలో ప్రయాణం, కొండలను ఎక్కడం, హెలి కాఫ్టర్ ప్రయాణం, పరుగెత్తడం వంటి పర్యాటనలు ప్రబలమైనవి. 2010 అక్టోబరు ఉత్తర తీరం అల్ట్రా మారథాన్ క్రీడలకు ఆతిధ్యం ఇచ్చింది. దిగ్రాండ్ అల్ట్రా మారథాన్ పరుగు పందాల దూరం 78 మైళ్ళు (126 కిలోమీటర్లు) సమయం 24 గంటలు. కొండచరియలు న్దికి ఎగువ భాగం నుండి కాలినడకన ప్రయాణం చేయడానికి, బోటింగ్ లేక తెప్పలలో ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంటాయి. ఒకే రోజులో తెప్పలలో దిగువకు ప్రయాణించి తిరిగి వెళ్ళడానికి పార్క అధికారులు దూరం, నిటారుగా రాళ్ళమయమైన కొండ మార్గాలు, ఎత్తు పల్లాలలో మార్పులు, కేంద్ర స్థానం నుండి వచ్చేఉష్ణ వాతావరణ వాయువుల వలన కలిగే ప్రమదాలను దృష్టిలో పెట్టుకుని అనుమతించరు. తీరం నుండి తీరం వరకు సాగే పర్యటనల వలన కలిగే ప్రమాదాల నుండి కాపాడడానికి విడుదల బృందాల అవసరం ఉంటుంది. అయినప్పటికీ ప్రతి సంవత్సరం అనుభమున్న పర్యాటకులు కొన్ని వందల మంది ఇటువంటి పర్యాటనలకు అనుమతించబడి తమ ప్రయాణాన్ని విజయవంతంగా ముగిస్తుంటారు.

గ్రాండ్ కేనియన్ ఉత్తర దక్షిణ తీరాల వెంబడి క్యాంపింగ్ మైదానాలు ఏర్పాటు చేయడానికి చాలా కట్టుబాట్లు ఉంటాయి. అలాగే రిజర్వేషన్లకు పెద్ద స్థాయిలో సిఫారసులు కావలి. ప్రత్యేకంగా రద్దీ ఎక్కువగా ఉండే దక్షిణ తీరాలలో అధికమైన సిఫారసు కావాలి. ఉత్తర తీరంలో కైబాబ్ నేషనల్ పార్క్ నిర్వహణలో చాలా ప్రదేశాలలో అధికంగా క్యాపింగ్ ప్రదేశాలు లభ్యమౌతాయి. అయినా శీతాకాలంలో కురిసే హిమపాతాలు ఇతర వాతావరణ ప్రతికూలతల కారణంగా ర్హదార్లు మూసి వేస్తుంటారని గమినించవలసిన అవసరం ఉంది. రాత్రివేళతో కలిసి క్యాంపింగ్ చేయడానికి బ్యాక్ కౌంటీ అధికారుల అనుమతి అవసరం. గ్రాండ్ కేనియన్ ప్రతి సంవత్సరం 30, 000 క్యాంపింగ్ అభ్యర్ధనలను అందుకుంటుంది. అయినా పార్క్ 13, 000 అభ్యర్థులను మాత్రమే అనుమతిస్తుంది. మిహిలిన వాటిని నిరాకరిస్తుంది. ఈ రిజర్వేషన్లు సీజన్ ప్రారంభం కావడానికి నాలుగు మాసాల నుండి అభ్యర్థించ వలసి ఉంటుంది.

పర్యాటకులు నీటారుగా ఉండే కేనియన్ చూడడానికి లాస్ వెగాస్, ఫీనిక్స్, లాస్ ఏంజలెస్, గ్రాండ్ కేనియన్ (దక్షిణతీరానికి ఏడు మైళ్ళ దూరంలో ఉంది) నుండి హెలికాఫ్టర్లు, విమానాలలో ఎక్కి అకాశవీక్షణం చేస్తుంటారు. 1990లో జరిగిన్ అనేక ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని 1500 అండుగుల కంటే దుగువన విమానాలు ఎగరడానికి అనుమతి లభించడం లేదు. మావరిక్ హెలికాఫ్టర్స్ నిర్వహించే టూర్లలో హెలికాఫ్టర్లు 3, 500 ఎగువన హౌలపాయి ఇండియన్ టెర్రిటరీలో దిగడమే విమానాలను దింపి గ్రాండు కేనియన్ చూసే అవకాశం కలిగిస్తాయి. 1984లో గ్రాండ్ కేనియన్ అడుగు దృశ్యాలను చిత్రీకరించిన వీడియో దృశ్యాలే ఇప్పడు లభిస్తున్న ఆఖరి విహంగ వీక్షణ దృశ్యాలు. ఏది ఏమైనప్పటికీ కొన్ని హెలికాఫ్టర్లు హవాసుపాయి, హైలాపాయి ఇండియన్ రిజర్వేషన్ ప్రాంతాలలో దిగాయి (ఇవి గ్రాండ కేనియన్ సరిహద్దు వెలుపలి ప్రాంతాలు) . ఇటీవలి కాలంలో ది హౌలా పాయి గిరిజనులు గ్లాసుతో నిర్మించిన గ్రాండ్ కేనియన్ స్కైవాక్‌ ను తెరిచారు. అయినా ఇది మిశ్రమమైన ఫలితాలను ఇచ్చాయి. గ్లాస్ బ్రిడ్జ్‌ను చూడడానికి దిగువకు 10 మైళ్ళు (16 కిలోమీటర్లు) ధూళిదూసరితమైన దారిలో ప్రయాణించాలి. ఇది చూడడానికి రిజర్వేషన్ ఫీజు, తూఋ ప్యాకేజు స్కైవాక్ ప్రవేశ రుసుము కలసి కనీసం 85 అమెరికన్ డాలర్లు ఖర్చు ఔతుంది. అంతే కాక ఏకారణం చేత అయినా అవి కింద పడితే గ్లాస్ బ్రిడ్జి దెబ్బ తింటున్నదన్న కారణం వలన కెమేరాలు వంటి స్వంత పరికరాలు వెంట తీసుకొని పోకూడదన్న షరతు ఉంది. దక్షిణ తీరాన ఉన్న గ్రాండ్‌కేనియన్ గ్రామం నుండి ఈ గ్లాస్ బ్రిడ్జ్ 24 మైళ్ళు (39 కిలోమీటర్లు) దూరంలో ఉంది.

దృశ్యకేంద్రాలు

[మార్చు]
గువానో పాయింట్ - గ్రాండు కేనియన్ పశ్చిమ తీరాన పర్యాటకుల వీక్షార్ధము ఏర్పాటు చేయబడిన ముఖ్య కేంద్రం

దక్షిణ తీరంలో ప్రధానమైన వీక్షణాకేంద్రం లిపాన్. ఇది గ్రాండ్ కేనియన్ గ్రామానికి తూర్పున డిసర్ట్ వ్యూ డైవ్ పక్కన ఉంది. గ్రాండ్ కేనియన్ బసులను ఇక్కడ పర్యాటకులు ఇక్కడ నుండి గ్రాండ్ కేనియన్ దృశ్యాలను తిలకించడానికి నిలుపుతుంటారు. ఈ పార్కింగ్ ప్రదేశం నుండి కొంచం దూరం నడచి కేనియన్ దృశ్యాలను చూసి ఆనందించ వచ్చు. లిపిన్ కేంద్రం నుండి విస్తారమైన దృశ్యాలను చూడ వచ్చు.

పశ్చిమ దిక్కు నుండి దిగువన ఉన్న నది విహంగవీక్షణం

కొలరాడో నదికి 3, 000 ఎగువన ఉన్న టోరోవీప్ నుండి దక్షిణ తీరం నుండి 50 కిలోమీటర్ల దువకు ప్రవహిస్తున్న నదీ ప్రవాహాన్ని వీక్షించవచ్చు. గ్రాండ్ కేనియన్ స్కై వాక్ నుండి 70 కిలోమీటర్ల దిగువకు ప్రవహిస్తున్న నదిని వీక్షించ వచ్చు. ఈ ప్రదేశం యునైటెడ్ స్టేట్స్ నుండి దూరంగా ప్రదేశాలలో ఇది ఒకటి. గ్రాండ్ కేనియన్ చేరుకోవాలంటే సెయింట్ జార్జ్, ఉటాహ్, కొలరాడో నగరంలో ఉన్న పైప్ స్ట్రింగ్ నేషనల్ మోన్యుమెంట్ నుండి సుదీర్ఘమైన దూళిదూసరితమైన మార్గాలలో ప్రయాణించి చేరుకోవాలి. పార్క్ నిర్వాహకులు ఈ ప్రదేశాన్ని అతి తక్కువ అభివృద్ధి, నిర్వహణలతో పార్క్ ప్రాచీనతను కాపాడుతున్నారు.

గ్రాండ్ కేనియన్ ప్రమాదాలు

[మార్చు]

1870 నుండి గ్రాండ్ కేనియన్లో 600 మరణాలు సంభవించాయి. వీటిలో కొన్ని అత్యాసక్తి పరులైన ఛాయాగ్రకుల వలన సంభవించాయి, మరి కొన్ని విమానాలు కేనియన్‌కు గుద్దుకోవడం వలన సంభవించాయి, మరి కొన్ని మరణాలు కొలరాడో నదిలో మునుగి పోవడం వలన సంభవించాయి. కొండలను ఎక్కేవారు చాలా మంది వారి శక్తిని అధికంగా అంచనా వేసుకోవడం కారణంగా శరీరంలో నీరు తగ్గి పోవడం అయోమయంలో పడడం వలన ప్రమాదాలలో పడుతుంటారు. అయినా వీరిని న్ర్వాహకులు రక్షిస్తుంటారు. పార్క్ నిర్వాహకులు ఆకర్షణీయంగా బలిష్టమైన యువకుడి చిత్రాన్ని వేసి " ప్రతి సంవత్సరం కేనియన్‌లో వందల మందిని కాపాడుతుంటాము. చాలా మంది ఈయనలా ఉంటారు " అని ప్రకటన ఉంచారు. అధిక విశ్వాసంతో వచ్చే పర్యాటకులను కొంత అధైర్యపరిచి విపత్తులను నివారించే ప్రయత్నం చేస్తున్నారు. కిందకు పడి మరణించిన వారు 53, ప్రతికూల వాతావరణం కారణంగా గుండె నొప్పి, నిర్జలీకరణ (డీహైడ్రేషన్), ఉష్ణోగ్రతలు అధికంగా పడి పోవడం వలన జరిగాయి, వరదలలోమునిగిన వారు 7, కొలరాడో మునిగిన మరణించిన వారు 79, హెలికాఫ్టర్, విమాన ప్రమాదాలలో మరణించిన వారు 242 (వీరిలో 1956 కి ముందు మరణించిన వారు 128 మంది), చాపల్యము వలన చేసే పొరపాట్లు పిడుగుపాటు వలన, రాళ్ళు పడడం వలన సంభవించిన మరణాలు 25, అత్మహత్యల కారణంగా 48, కుటుంఅ కలహాల కారణంగా 23.

1956 వాయు ప్రమాదము

[మార్చు]

1956 గ్రాండ్ కేనియన్ చరిత్రలో దారుణమైన వాయు ప్రమాదాలు సంభవించాయి.


1956 జూన్ 30 ఊదయం యునైటెడ్ ఎయిర్ లైన్స్ డౌగ్లాస్ డిసి-7 లాస్ ఏంజలెస్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన మూడు నిషాలలో, మరొకటి ఈస్ట్ బౌండ్ ట్రాన్స్ కాంటినెంటల్ ఫ్లైట్స్ బయలు దేరాయి. సుమారు 90 నిముషాల అనంతరం అవి రెండు కేనియన్ పైభాగాన ఒక దానితో ఒకటి ఢీకొన్నాయి. రెండు విమానాలు వాయు మర్గాన్ని సరిగా నిర్దేశించలేక పోవడమే ఇందుకు కారణం.

ఢీకొట్టుకున్న రెండు విమానాలు కేనియన్ తూర్పు భాగంలో కొలరాడో లిటిల్ కొలరాడో సంగమ ప్రదేశంలో పడ్డాయి. ఈ దుర్ఘటన కారణంగా రెండు విమానాల సిబ్బందితో సహా 128 మంది మరణించారు.

ఖాళీచేయుట

[మార్చు]

సుపాయీకి ఎగువన ఉన్న రెడ్‌లాండ్స్ వంతెనలో అధిక వర్షపాతం కారణంగా ఏర్పడిన పగులు కారణంగా 2008 ఆగస్టు 17-18 తేదీలలో గ్రాండ్ కేనియన్ పర్యాటకులను సుపాయీ (కేనియన్ మధ్య భాగం) నివాసితులను సుపాయీ నుండి ఖాళీ చేయించారు. ఖాళీ చేయించిన వారిని పీచ్ స్ప్రింగ్, ఆరిజోనాలకు తీసుకు వెళ్ళారు.

ఇవి కూడా చూడండి

[మార్చు]
గ్రాండ్ వ్యూ పాయింట్
  • కోలా కేనియన్, పెరు
  • కొటాహూయాసి కేనియన్, పెరు
  • గ్రాండ్ కేనియన్ పార్క్
  • గ్రాండ్ కేనియన్ సూట్
  • గ్రాండ్ కేనియన్ అల్ట్రా మారథాన్
  • జాకబ్ లేక్, ఆరిజోనా
  • కొలరాడో నది ప్రవాహ విశేషాల జాబితా
  • గ్రాండ్ కేనియన్ నేషనల్ పార్క్ కొండ మర్గాల జాబితా.

బయటి లింకులు

[మార్చు]
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.