కొలరాడో నది

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొలరాడో నదీ ప్రవాహ పటము.

కొలరాడో నది అమెరికా, మెక్సికో దేశాలలో పశ్చిమ దిక్కుగా ప్రవహించే ప్రధానమైన నది. దీని పొడవు 2,330 కి.మీ. అమెరికాలోని 7 రాష్ట్రాలు, మెక్సికోలోని రెండు రాష్ట్రాలు దీని పరీవాహక ప్రాంతంలో ఉన్నాయి. ఇది రాకీ పర్వతాలలో జన్మించి, నైఋతి దిశగా ప్రవహిస్తుంది. కొలరాడో పీఠభూమి గుండా, గ్రాండ్ కాన్యన్ గూండా ప్రవహించి, అరిజోనా-నెవాడా సరిహద్దు లోని మీడ్ సరస్సులో ప్రవేశిస్తుంది. అక్కడనుండి దక్షిణంగా ప్రవహించి, సరిహద్దు దాటి మెక్సికో లోకి ప్రవేశిస్తుంది. మెక్సికోలో డెల్టాను ఏర్పరుస్తుంది. గల్ఫ్ ఆఫ్ కాలిఫోర్నియాలో సముద్రంలో కలిసిపోతుంది. దీని పరీవాహక ప్రాంత విస్తీర్ణం 6,40,000 చ.కి.మీ.

కొలరాడో నది 4 కోట్ల మంది ప్రజలకు జీవనాధారం.[1] నదిపైన, దాని ఉపనదుల పైనా అనేక ఆనకట్టలు కట్టి నీటి సాగుకూ, తాగునీటికీ మళ్ళించారు.[2][3] కొలరాడో నది ప్రపంచంలో అత్యధికంగా నియత్రించబడిన నదుల్లో ఒకటి. అత్యంత వివాదాస్పమైనది కూడా. నది లోని ప్రతీ నీటి బొట్టూ వినియోగంలో ఉంది. అమెరికా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలూ అనేక ఆనకట్టలను నిర్మించాయి. ఈ అనకట్టల్లో అత్యధికం 1910, 1970 ల మధ్య నిర్మించారు. వీటన్నిటి లోకీ కీలకమైన హూవర్ డ్యామ్ 1935 లో పూర్తైంది. నదిలోని నీటి వినియోగం ఎంతలా ఉందంటే, చివరి 160 కి.మీ. దూరం పాటు నది ఎండి పోయింది. 1960 ల తరువాత నది సముద్రాన్ని చాలా అరుదుగా చేరింది.[2][4][5]

కొలరాడో నది ప్రవాహ క్రమంలో అనేక గండ్లను (కాన్యన్లు) ఏర్పరచింది. అరిజోనా రాష్ట్రం లోని గ్రాండ్ కాన్యన్ వాటిలో ఒకటి.

ఉపనదులు[మార్చు]

కొలరాడో నదికి 25 ఉపనదులున్నాయి. వీటిలో గ్రీన్ రివర్ అతి పెద్దది. గిలా రెండవ స్థానంలో ఉంటుంది. గన్నిసన్, సాన్ జువాన్ లు ఇతర ప్రధానమైన ఉపనదులు

మూలాలు[మార్చు]

  1. "The Compact and Lees Ferry". Colorado River Streamflow: A Paleo Perspective. Western Water Assessment. Archived from the original on April 29, 2012. CS1 maint: discouraged parameter (link)
  2. 2.0 2.1 Waterman, Jonathan (February 15, 2012). "Where the Colorado Runs Dry". The New York Times. Retrieved October 14, 2014. CS1 maint: discouraged parameter (link)
  3. "Imperial Valley". 1995. Unknown parameter |encyclopedia= ignored (help)
  4. Diaz, Henry F.; Anderson, Craig A. (November 28, 2003). "Precipitation Trends and Water Consumption in the Southwestern United States". Impact of Climate Change and Land Use in the Southwestern United States. U.S. Geological Survey. Archived from the original on March 9, 2012. CS1 maint: discouraged parameter (link)
  5. Postel, Sandra (May 19, 2014). "A Sacred Reunion: The Colorado River Returns to the Sea". National Geographic. Retrieved May 19, 2014. CS1 maint: discouraged parameter (link)