కెట్టి
కెట్టి கேத்தி | |
---|---|
village | |
Coordinates: 11°24′N 76°42′E / 11.40°N 76.70°E | |
దేశం | India |
రాష్ట్రం | తమిళనాడు |
జిల్లా | The Nilgiris |
భాషలు | |
• అధికారిక | తమిళం, బడగా |
Time zone | UTC+5:30 (ఐ.ఎస్.టి) |
పిన్ | 643 215 |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | 0423 |
Vehicle registration | TN 43 |
Website | kettivillage.now.sh footnotes = |
కెట్టి అనేది దక్షిణ భారతదేశంలోని తమిళనాడు లో ఉన్న ఒక చిన్న పట్టణం.ఇక్కడే అదే పేరుతో (కెట్టి) పెద్దదైన లోయ ప్రాంతం ఉంది. ఇది నీలగిరి జిల్లాలోని కూనూర్ తాలూకాకు చెందిన రెవెన్యూ గ్రామం. ఇదే ప్రాంతంలో అప్పర్ కెట్టి అని మరొక గ్రామం ఉంది. యెళ్ళనహళ్ళిగా పిలిచే ఇదంతా ప్రధాన కూనూర్ లో ఉన్న ఊటీ రహదారి ప్రాంతం.
పట్టణం
[మార్చు]జనాభాలో ఎక్కువమంది కాయకష్టం చేసుకునే కూలీలు. వ్యవసాయం,పశువుల పెంపకం, తాపీ పని...ఎక్కువమంది చేసేది ఈ పనులే. వీటితో పాటు కొందరు చుట్టుపక్కల పారిశ్రామిక సంస్థలైన నీడిల్ ఇండస్ట్రీస్, మష్రూమ్ ఫ్యాక్టరీ, అంబికా టీ ఫ్యాక్టరీ, పలాడా బస్ స్టాప్ దగ్గరి మినీ ఫ్లవర్ గార్డెన్, వివిధ విద్యాసంస్థలలో ఉద్యోగాలు చేస్తుంటారు. (వీటిలో సీఎస్ఐ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, లైడ్ లా మెమోరియల్ స్కూల్, సీఎస్ఐ మిడిల్ స్కూల్ వంటివి ఉన్నాయి) .
లోయ
[మార్చు]ఇక్కడి పెద్దది, చివరిదీ అయిన లోయ ఊటీ-కూనూర్ రహదారిలో ఉంటుంది. ఈ లోయ ప్రాంతం ఇటీవలి సంవత్సరాలలో బాగా అభివృద్ధి చెందింది.ఈ కారణంగానే, ఇక్కడ ఉండాల్సిన జంతుజాలం తగ్గుతూ వస్తోంది.
సంస్కృతి
[మార్చు]ఇక్కడ ఉండే ప్రజలు ఎక్కువగా బడగా, తమిళ ప్రాంతీయులు. వీరంతా తమిళనాడు ఇతర ప్రాంతాలతో పాటు కేరళ, కర్ణాటక, శ్రీలంక నుంచి వలస వచ్చినవారు. ఇక్కడివారు మాట్లాడే ప్రధాన భాషలు బడగా, తమిళం. చాలామందికి ఆంగ్లం, మలయాళం, కన్నడ భాషలూ అర్థమవుతాయి. ఇక్కడి వారంతా ఎక్కువగా పాటించేది హిందూ మతం .
సౌలభ్యం
[మార్చు]కెట్టి ప్రాంతాన్ని రైలు లేదా రహదారి మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఇక్కడ ఉన్న పర్వత రైలు ప్రాంతాన్ని యునెస్కో ఇటీవల భారత జాతీయ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది.ఇది చెన్నై - కోయంబత్తూర్ - మెట్టుపాళ్యం నీలగిరి ఎక్స్‌ప్రెస్‌కు అనుసంధానించేది. నీలగిరి పర్వతాల వద్ద మెట్టుపాళ్యం స్టేషన్ నుంచి కెట్టి రైల్వే స్టేషన్ వరకు ప్రయాణించవచ్చు.[1][2]
జనాభా
[మార్చు]ఇటీవలి పరిణామాలు
[మార్చు]గత దశాబ్దంలో ఈ ప్రాంతం గణనీయంగా అభివృద్ధి చెందింది. ఎన్నో విధాల పెరుగుదలను చూసింది. దీనికి కారణం చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఇక్కడ సిఎస్ఐ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ స్థాపించి ఉండటం.
సౌకర్యాలు
[మార్చు]మొత్తం లోయలోని అన్నిపట్టణాలు, గ్రామాలకు పలు సేవలు అందుతున్నాయి. సమీపంలోని సంతూర్ పట్టణంలో తపాలా కార్యాలయం ఉంది.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కెట్టి లోయ శాఖను నిర్వహిస్తోంది, ఇది సీఎఎస్ఐ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ సమీపంలో ఉంది.
విద్యాసంస్థలు
[మార్చు]- కెట్టిలో ఉన్న లైడ్ లా మెమోరియల్ స్కూల్, జూనియర్ కళాశాల
- సీఎస్ఐ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్
2009 వరదలు
[మార్చు]వాయుగుండం కారణంగా కెట్టిలో 2009 నవంబర్ 8న 82 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది.
ఇది కూడా చూడు
[మార్చు]- లవ్‌డేల్ (ఇండియా)
- యెళ్ళనహళ్ళి, ఊటీ
మూలాలు
[మార్చు]- ↑ "patrika.com/coimbatore-2-channel2/three-trains-reached-at-ooty-station-simultaneously-4808309/". Kumar Jeevendra. Pathrika coimbatore. Retrieved 8 July 2019.
- ↑ "Ooty-Ketti Train service". Prathiksha Ramkumar. The Times of India. Retrieved 2 June 2018.