భారతీయ మామిడి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Mango
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
Division:
Angiospermae
(unranked):
Order:
Family:
Genus:
Species:
M. indica
Binomial name
Mangifera indica
110 సంవత్సరాల పురాతన మామిడి చెట్టు గోపాల్గంజ్, బంగ్లాదేశ్

భారతీయ మామిడి యొక్క వృక్ష శాస్త్రీయ నామం మ్యాంగిఫీరా ఇండికా. అనాకార్డియాసియా కుటుంబానికి చెందిన మామిడి జాతి రకాలలో ఇది ఒకటి. భారతదేశం అడవులలోను, సాగు ప్రాంతాలలో కనిపించే ఈ రకాలు ప్రపంచంలోని ఇతర ఉష్ణ ప్రాంతాలకు పరిచయం చేయబడింది. ప్రపంచంలోని అతిపెద్ద పండ్ల వృక్షం ఇది. ఈ చెట్టు వంద అడుగుల ఎత్తు పెరిగే సామర్థ్యం కలిగి ఉంది. ఛాతి ఎత్తు వద్ద దీని చుట్టుకొలత సగటున పన్నెండు అడుగుల నుంచి పద్నాలుగు అడుగులు ఉంటుంది. కొన్నిసార్లు దీని చుట్టుకొలత ఇరవై అడుగులకు చేరుకుంటుంది. ఈ మామిడి జాతులను నాలుగువేల సంవత్సరముల క్రితం నుంచే పెంచుతున్నట్లుగా తెలుస్తుంది. భారతదేశం నుండి తూర్పు ఆసియాకు క్రీ.పూ 400 నుంచి 500 సంవత్సరముల మధ్య ఈ జాతులు తీసుకురావడం జరిగింది. తరువాత 15వ శతాబ్దంలో ఫిలిప్పీన్స్ కు ఆ తరువాత 16వ శతాబ్దంలో పోర్చుగీస్ వారి ద్వారా ఆఫ్రికా, బ్రెజిల్ కు తీసుకురావడం జరిగింది. 1753లో లిన్నేయస్ చేత సైన్స్ కోసం ఈ జాతులు వర్ణించబడ్డాయి. మామిడి భారతదేశం, ఫిలిప్పీన్స్, పాకిస్తాన్ యొక్క జాతీయ పండు. క్రీస్తుశకం 4వ శతాబ్దంలో సంస్కృత కవి కాళిదాసు తను రచించిన పాటలలో ఈ మామిడిని గురించి వివరించాడు. దీని కంటే ముందు క్రీస్తుపూర్వం 3వ శతాబ్దంలో అలెగ్జాండర్ ఈ పండును రుచి చూసినట్లుగా భావిస్తున్నారు. తరువాత చైనా తీర్థయాత్రికుడు హ్యూయన్ త్సాంగ్ క్రీస్తుశకం 7వ శతాబ్దంలో ఈ మామిడి పండును రుచి చూసినట్లుగా భావిస్తున్నారు. తరువాత 16 వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ బీహార్ లోని దర్భాంగాలో లక్ష మామిడి చెట్లను నాటించాడు. ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని లాఖీ బాగ్ గా పిలుస్తారు.

ఔషధ లక్షణాలు[మార్చు]

Mango, moist Brazilian tropics

Mangiferin (a pharmacologically active flavonoid, a natural xanthone C-glycoside) is extracted from Mango at high concentrations from the young leaves (172 g/kg), bark (107 g/kg), and from old leaves (94 g/kg). n shows an exceptionally strong antioxidant capacity. It has a number of pharmacological actions and possible health benefits. These include antidiabetic, antioxidant, antifungal, antimicrobal, antiinflamatory, antiviral, hepatoprotective, hypoglycemic, anti-allergic and anticancer activity.. Along with Salacia it is being investigated for its possible anti-obesity action. In ayurveda, one of its uses is clearing digestion and acidity due to pitta (heat), sometimes with other mild sours and shatavari (Asparagus racemosus) and guduchi (Tinospora cordifolia).

వెలుపలి లింకులు[మార్చు]