కొలిన్ కౌడ్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Colin Cowdrey
Cricket ball at Epping Foresters Cricket Club.jpg
Colin Cowdrey in 1950, the year he captained Tonbridge School and made his first-class debut for Kent.
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు Michael Colin Cowdrey, Baron Cowdrey of Tonbridge
జననం (1932-12-24)1932 డిసెంబరు 24
Ootacamund, Madras Presidency, British India
మరణం 2000 డిసెంబరు 4(2000-12-04) (వయస్సు 67)
Littlehampton, West Sussex, England, UK
బ్యాటింగ్ శైలి Right-handed
బౌలింగ్ శైలి Right-arm leg spin
పాత్ర Top Order Batsman
అంతర్జాతీయ సమాచారం
జాతీయ జట్టు England
టెస్టు అరంగ్రేటం(cap 379) 26 November 1954 v Australia
చివరి టెస్టు 13 February 1975 v Australia
Only ODI (cap 2) 5 January 1971 v Australia
దేశవాళీ జట్టు సమాచారం
సంవత్సరాలు జట్టు
1950–1976 Kent
1952–1975 MCC
1952–1954 Oxford University
కెరీర్ గణాంకాలు
పోటీ Test ODI FC LA
మ్యాచ్‌లు 114 1 692 87
సాధించిన పరుగులు 7624 1 42719 1978
బ్యాటింగ్ సగటు 44.06 1.00 42.89 29.52
100s/50s 22/38 0/0 107/231 3/12
ఉత్తమ స్కోరు 182 1 307 116
బాల్స్ వేసినవి 119 4876 59
వికెట్లు 0 65 3
బౌలింగ్ సగటు 51.21 14.33
ఇన్నింగ్స్ లో 5 వికెట్లు 0
మ్యాచ్ లో 10 వికెట్లు 0 n/a
ఉత్తమ బౌలింగ్ 4/22 1/0
క్యాచులు/స్టంపింగులు 120/– 0/– 638/– 38/–
Source: Cricinfo, 4 December 2000

1932, డిసెంబర్ 24న భారత్ లోని ఉదగమండలంలో జన్మించిన కొలిన్ కౌడ్రి (Colin Cowdrey) ఇంగ్లాండుకు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు. 1954 నుంచి 1975 వరకు ఇంగ్లాండు జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కౌడ్రి 114 టెస్టులు, ఒక వన్డే ఆడినాడు. 692 ఫస్ట్ క్లాస్ క్రికెట్ పోటిలను కూడా ఆడి 107 సెంచరీలతో 42719 పరుగులు చేశాడు. తన క్రీడాజీవిత కాలంలో 6 సార్లు ఆస్ట్రేలియా పర్యటించి ఆ ఘనత వహించిన రెండో ఇంగ్లాండు క్రికెటర్‌గా అవతరించాడు.[1] 2000, డిసెంబర్ 4న 67 సంవత్సరాల వయస్సులో గుండెపోటుతో మరణించాడు.

టెస్ట్ క్రికెట్ గణాంకాలు[మార్చు]

1954 నవంబర్లో తొలిసారిగా ఆస్ట్రేలియాపై టెస్ట్ క్రికెట్ ఆరంగేట్రం చేసిన కొలిన్ కౌడ్రి 1975 ఫిబ్రవరి వరకు 114 టెస్టులు ఆడి 44.06 సగటుతొ 7624 పరుగులు చేశాడు. అందులో 22 సెంచరీలు, 38 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో అతని అత్యధిక స్కోరు 182 పరుగులు. ఫీల్డర్‌గా 120 క్యాచ్‌లు అందుకున్నాడు.

వన్డే క్రికెట్ గణాంకాలు[మార్చు]

కౌడ్రి తన క్రీడాజీవిత కాలంలో ఒకే ఒక్క వన్డే పోటీ ఆడినాడు. 1971, జనవరి 5న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో ఒక్క పరుగులు మాత్రమే చేశాడు.

ఫస్ట్ క్లాస్ పోటీలు[మార్చు]

692 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడిన కొలిన్ కౌడ్రి 42.89 సగటుతో 42719 పరుగులు చేశాడు. అందులో 107 సెంచరీలు, 231 అర్థసెంచరీలు ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో అతని అత్యధిక స్కోరు 307 పరుగులు. ఫస్ట్ క్లాస్‌లో 65 వికెట్లను కూడా సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 22 పరుగులకు 4 వికెట్లు.

అవార్డులు, గుర్తింపులు[మార్చు]

  • 1972: CBE అవార్డు లభించింది.
  • 1992: నైట్‌హుడ్ అవార్డు లభించింది.
  • 1997: బ్రిటన్ ప్రతినిధుల సభకు (హౌస్ ఆఫ్ లార్డ్స్) నియమించబడ్డాడు.

బయటి లింకులు[మార్చు]

  1. http://content-uk.cricinfo.com/wisdenalmanack/content/story/154334.html Cricinfo