Jump to content

ఒలింపిక్ క్రీడలలో భారతదేశం

వికీపీడియా నుండి
1936 బెర్లిన్ ఒలింపిక్స్‌లో ఫైనల్లో జర్మనీని 8-1 తో ఓడించి స్వర్ణం సాధించిన భారత జట్టు

భారతదేశం తొలి సారిగా 1900 ఒలింపిక్ క్రీడలలో ప్రాతినిధ్యం వహించింది. ఆ ఒలింపిక్ క్రీడలలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రీడాకారుడు నార్మన్ ప్రిచార్డ్. అథ్లెటిక్ క్రీడాకారుడైన ప్రిచర్డ్ ఆ ఒలింపిక్స్‌లో 2 పతకాలు సాధించాడు. 1920లో తొలిసారి భారత్ జట్టును ఒలింపిక్ క్రీడలకు పంపినది. అప్పటి నుంచి ప్రతి వేసవి ఒలింపిక్ క్రీడలలో భారత్ ప్రాతినిధ్యం వహిస్తోంది. 1964 నుంచి భారత్ పలు పర్యాయాలు శీతాకాలపు ఒలింపిక్ క్రీడలలో కూడా పాల్గొన్నది.

ఇప్పటివరకు భారత్ క్రీడాకారులు ఒలింపిక్ క్రీడలలో 26 పతకాలు సాధించిపెట్టారు. అందులో అత్యధికంగా మైదాన హాకీలో సాధించినవే. 1928, 1980 మధ్యలో భారత హాకీ జట్టు 12 ఒలింపిక్ క్రీడలలో 11 పతకాలు సాధించి రికార్డు స్థాపించింది. అందులో 1928 నుంచి 1956 వరకు వరుసగా 6 సార్లు స్వర్ణాన్ని సాధించడం విశేషం. మొత్తంపై ఒలింపిక్ క్రీడలలో భారత్ 9 స్వర్ణ పతకాలను సాధించగా అందులో 8 స్వర్ణాలు జాతీయ క్రీడ అయిన హాకీలో కాగా మరో స్వర్ణపతకం 2008 బీజింగ్ ఒలింపిక్ క్రీడలలో షూటింగ్‌లో 10మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో అభినవ్ బింద్రా సాధించాడు.

భారత ఒలింపిక్ క్రీడల వ్యవహారాలను పర్యవేక్షించే భారత ఒలింపిక్ అసోసియేషన్ను 1927లో స్థాపించారు.

పతక విజేతలు

[మార్చు]
పతకం పేరు ఒలింపిక్స్ క్రీడ ఈవెంట్
రజత పతకంనార్మన్ ప్రిచార్డ్1900 పారిస్అథ్లెటిక్స్పురుషుల 200 మీటర్ల పరుగు
రజత పతకంనార్మన్ ప్రిచార్డ్1900 పారిస్అథ్లెటిక్స్పురుషుల 200 మీటర్ల హార్డిల్స్
స్వర్ణ పతకంజాతీయ జట్టు1928 ఆంస్టర్‌డాంమైదాన హాకీపురుషుల విభాగం
స్వర్ణ పతకంజాతీయ జట్టు1932 లాస్ ఏంజిల్స్మైదాన హాకీపురుషుల విభాగం
స్వర్ణ పతకంజాతీయ జట్టు1936 బెర్లిన్మైదాన హాకీపురుషుల విభాగం
స్వర్ణ పతకంజాతీయ జట్టు1948 లండన్మైదాన హాకీపురుషుల విభాగం
స్వర్ణ పతకంజాతీయ జట్టు1952 హెల్సింకీమైదాన హాకీపురుషుల విభాగం
కాంస్య పతకంకె.డి.జాదవ్1952 హెల్సింకీరెజ్లింగ్పురుషుల ప్ఫీస్టయిల్ బాంటమ్ వెయిట్
స్వర్ణ పతకంజాతీయ జట్టు1956 మెల్బోర్న్మైదాన హాకీపురుషుల విభాగం
రజత పతకంజాతీయ జట్టు1960 రోంమైదాన హాకీపురుషుల విభాగం
స్వర్ణ పతకంజాతీయ జట్టు1964 టోక్యోమైదాన హాకీపురుషుల విభాగం
కాంస్య పతకంజాతీయ జట్టు1968 మెక్సికోమైదాన హాకీపురుషుల విభాగం
కాంస్య పతకంజాతీయ జట్టు1972 మ్యూనిచ్మైదాన హాకీపురుషుల విభాగం
స్వర్ణ పతకంజాతీయ జట్టు1980 మాస్కోమైదాన హాకీపురుషుల విభాగం
కాంస్య పతకంలియాండర్ పేస్1996 అట్లాంటాటెన్నిస్పురుషుల సింగిల్స్
కాంస్య పతకంకరణం మల్లేశ్వరి2000 సిడ్నీవెయిట్ లిఫ్టింగ్మహిళల 69 kg
రజత పతకంరాజ్యవర్థన్ సింగ్ రాథోర్2004 ఎథెన్స్షూటింగ్పురుషుల డబుల్స్ ట్రాప్
స్వర్ణ పతకంఅభినవ్ బింద్రా2008 బీజింగ్షూటింగ్పురుషుల 10 మీటర్ల అయిర్ రైఫిల్
కాంస్య పతకంసుశీల్ కుమార్2008 బీజింగ్రెజ్లింగ్పురుషుల ఫ్రీస్టైల్ 66 కిలోల విభాగం
కాంస్య పతకంవిజేందర్ కుమార్2008 బీజింగ్బాక్సింగ్మిడిల్ వెయిట్ 75 కిలోల విభాగం
కాంస్య పతకంగగన్ నారంగ్2012 లండన్షూటింగ్పురుషుల 10మీ ఎయిర్ రైఫిల్
రజత పతకంవిజయ్ కుమార్2012 లండన్షూటింగ్పురుషుల 25మీ ఫైర్ పిస్టల్
కాంస్య పతకంసైనా నెహ్వాల్2012 లండన్బ్యాడ్మింటన్మహిళల్ సింగిల్స్
కాంస్య పతకంమేరీ కోమ్2012 లండన్బాక్సింగ్మహిళల ఫ్లైవెయిట్

రజత పతకం సుశీల్ కుమార్ 2012 లండన్ రెజ్లింగ్ పురుషుల ఫ్రీస్టైల్ 66 కిలోల విభాగం

కాంస్య పతకం యొగెశ్వర్ దత్ 2012 లండన్ లండన్ పురుషుల ఫ్రీస్టైల్ 60 కిలోల విభాగం

క్రీడల వారీగా భారత్ సాధించిన పతకాలు

[మార్చు]
క్రీడస్వర్ణ పతకాలురజత పతకాలుకాంస్య పతకాలుమొత్తం పతకాలు
మైదాన హాకీ81211
అథ్లెటిక్స్0205
షూటింగ్1219
రెజ్లింగ్00303
వెయిట్ లిఫ్టింగ్0011
టెన్నిస్0011
బాక్సింగ్0022
బ్యాడ్మింటన్0112
Total961126

ఒలింపిక్ క్రీడల వారీగా భారత్‌కు పతకాలు

[మార్చు]
సంవత్సరం, వేదికస్వర్ణరజతకాంస్యమొత్తం
1900 పారిస్0202
1904 సెయింట్ లూయీస్పాల్గొనలేదు
1908 లండన్పాల్గొనలేదు
1912 స్టాక్‌హోంపాల్గొనలేదు
1920 ఆంట్‌వెర్ఫ్0000
1924 పారిస్0000
1928 ఆంస్టర్‌డాం1001
1932 లాస్ ఏంజిల్స్1001
1936 బెర్లిన్1001
1948 లండన్1001
1952 హెల్సింకీ1012
1956 మెల్బోర్న్1001
1960 రోం0101
1964 టోక్యో1001
1968 మెక్సికో సిటీ0011
1972 మ్యూనిచ్0011
1976 మాంట్రియల్0000
1980 మాస్కో1001
1984 లాస్ ఏంజిల్స్0000
1988 సియోల్0000
1992 బార్సిలోనా0000
1996 అట్లాంటా0011
2000 సిడ్నీ0011
2004 ఎథెన్స్0101
2008 బీజింగ్1023
2012 లండన్0246
మొత్తం961126

ఇవి కూడా చూడండి

[మార్చు]