Jump to content

గాలేరు నగరి సుజల స్రవంతి

వికీపీడియా నుండి
నగరిలో కాలువ

గాలేరు నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లోని కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టు. [1]

కాలువ మార్గంలో ఉన్న గ్రామాలు, పట్టణాలకు తాగునీటి సౌకర్యాన్ని అందించడమే కాకుండా, రెండు దశల్లో 265,000 ఎకరాలు (1,070 కి.మీ2) సాగునీరు అందించాలని భావించారు. ప్రధాన కాలువ, గండికోట, వామికొండ, సర్వరాజసాగర్ జలాశయాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. [2] [3]

శ్రీశైలం జలాశయం ముందు వైపు నుంచి శ్రీశైలం కుడికాలువ (ఎస్‌ఆర్‌బీసీ) వ్యవస్థ ద్వారా 40 టీఎంసీల కృష్ణానది మిగులు వరద జలాలను గోరకల్లు జలాశయం వరకు తీసుకుని, ఆ తర్వాత స్వతంత్ర వరద కాలువ ద్వారా తొమ్మిది నిల్వ జలాశయాలను నింపేందుకు ఉద్దేశించిన పథకం ఇది. రబీ సీజన్‌లో సాగునీటి అవసరాల కోసం ఈ నీటిని ఉద్దేశించారు.

ప్రాజెక్టు నిర్మాణం 2005 లోనే ప్రారంభమైనప్పటికీ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి నికర జలాల్లోంచి కేటాయింపులు జరగలేదని, ఆ నీటిని కేటాయించాలని రాయలసీమ ప్రాంత ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

మూలాలు

[మార్చు]
  1. "YSR warns people against voting back TDP to power". The Hindu. 2009-04-20. Archived from the original on 2009-04-23.
  2. "Patriotic fervour marks Republic Day". The Hindu. 2009-01-27. Archived from the original on 2009-01-29.
  3. "CPI wants Galeru Nagari works expedited". The Hindu. 2007-04-20. Archived from the original on 2007-12-04.