వికీపీడియా:మీకు తెలుసా? భండారము/పాత విశేషాలు 9

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
2017 సంవత్సరంలో వివిధ వారాలలో "మీకు తెలుసా!" వాక్యాలు

01 • 02 • 03 • 04 • 05 • 06 • 07 • 08 • 09 • 10 • 11 • 12 • 13 • 14 • 15 • 16 • 17 • 18 • 19 • 20 • 21 • 22 • 23 • 24 • 25 • 26
27 • 28 • 29 • 30 • 31 • 32 • 33 • 34 • 35 • 36 • 37 • 38 • 39 • 40 • 41 • 42 • 43 • 44 • 45 • 46 • 47 • 48 • 49 • 50 • 51 • 52

01 వ వారం[మార్చు]

 • ...రామ్ ప్రసాద్ బిస్మిల్ ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడిన ప్రముఖ కవి అనీ!
 • ...టిటికాకా సరస్సు దక్షిణ అమెరికాలో అతిపెద్ద సరస్సు అనీ!
 • ...దంగల్ సినిమా ప్రముఖ కుస్తీ వీరుడు మహవీర్ సింగ్ ఫొగాట్ జీవితం ఆధారంగా నిర్మించారనీ!
 • ...ప్రముఖ రచయిత కొంపెల్ల విశ్వం ఐ. ఎ. ఎస్ ఆఫీసరుగా పనిచేశాడనీ!
 • ...ప్రముఖ గాయకుడు గంగాధర శాస్త్రి భగవద్గీత ఫౌండేషన్ స్థాపించి దానిని విశ్వవ్యాప్తం చేయడానికి కృషి చేస్తున్నాడనీ!

02 వ వారం[మార్చు]

03 వ వారం[మార్చు]

04 వ వారం[మార్చు]

 • ...సాలుమరద తిమ్మక్క రహదారుల వెంబడి అనేక చెట్లు నాటి జాతీయ పౌర పురస్కారాన్ని అందుకుందనీ!
 • ...వేదాంతదేశికులు (1268-1369)ను అపర రామానాజుచార్యుడిగా భావిస్తారనీ!
 • ...16వ శతాబ్దంలో మంగుళూరును పరిపాలించిన రాణి అబ్బక్క భారతదేశాన్ని పోర్చుగీసు దాడులను నాలుగు దశాబ్దాలపాటు నిలువరించిందనీ!
 • ...కేతిగాడు తోలుబొమ్మలాటలో ఒక ముఖ్యమైన పాత్ర అనీ!
 • ...మౌల్వి అహ్మదుల్లా షా 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న యోధుడనీ!

05 వ వారం[మార్చు]

06 వ వారం[మార్చు]

 • ...సిమ్లా ఒప్పందం భారత్ పాకిస్థాన్ ల మద్య 1972లో ఏర్పడ్డ శాంతి ఒప్పందమనీ!
 • ...పరనా నది దక్షిణ అమెరికాలో అమెజాన్ నది తర్వాత రెండో అత్యంత పొడవైన నది అనీ!
 • ...ముంతాజ్ షేక్ మహిళా హక్కులకై పోరాటం సాగించినందుకుగాను డాటర్ ఆఫ్ మహారాష్ట్ర అనే బిరుదు పొందిందనీ!

07 వ వారం[మార్చు]

08 వ వారం[మార్చు]

09 వ వారం[మార్చు]

BBC 100 Women and Wikipedia freebies.jpg
 • ...టెన్నిస్ క్రీడకు ప్రఖ్యాతి గాంచినఆస్ట్రేలియన్ ఓపెన్ నాలుగు గ్రాండ్ స్లామ్ పోటీల్లో ఒకటనీ...
 • ...1962 భారత పార్లమెంటు ఎన్నికల్లో కూచ్ బీహార్ నియోజకవర్గం నుంచి గాయత్రీదేవి సాధించిన మెజారిటీ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో నమోదు ఐందనీ..
 • ...అంతర్జాతీయ స్థాయిలో 21వ శతాబ్ది మహిళల విజయాలను ప్రస్తుతించే 100 బిబిసి మహిళలు అన్న జాబితా ప్రారంభించేందుకు 2012 నిర్భయ ఘటన స్ఫూర్తి రగిలించిందనీ...

10 వ వారం[మార్చు]

Padmini.jpg
 • ...క్రోమైల్ క్లోరైడ్ ఆవిరులను పీల్చడం వలన క్యాన్సరు వచ్చే ప్రమాదం పొంచివున్నది...
 • ...వామాచారాన్ని పాటించేవాళ్ళు వారాహి దేవిని రాత్రిళ్ళు పూజిస్తారని...
 • ...తన సొంత ప్రొడక్షన్ సంస్థ ఇందిరా ప్రొడక్షన్స్ ద్వారా ఘట్టమనేని మంజుల సినిమా నిర్మాణం చేస్తున్నారని...
 • ...విశ్వనగరం ఆశ్రమం గుంటూరు - చిలకలూరిపేట మధ్యగల చినకొండ్రుపాడు గ్రామ పరిధిలో 18 ఎకరాల సువిశాల ప్రాంతంలో విస్తరించి ఉందని...
 • ...పద్మిని (నటి) (కుడివైపు చిత్రంలో) మరియు ఈమె సోదరీమణులు లలిత, రాగిణి ముగ్గురూ కలిసి ట్రావన్‌కోర్ సిస్టర్స్గా ప్రసిద్ధి చెందారని...

11 వ వారం[మార్చు]

Tracy Caldwell Dyson in Cupola ISS.jpg

12 వ వారం[మార్చు]

Cr2o3 gruener farbstoff.jpg

13 వ వారం[మార్చు]

Caribbean Trumpet Tree (Tabebuia aurea) in Hyderabad W IMG 7091.jpg

14 వ వారం[మార్చు]

Trichobatrachus robustus.JPG
 • ... శరీరమంతా జుత్తుతో చూడటానికి విచిత్రంగా ఉండే కప్ప హేరీ ఫ్రాగ్‌ అనీ! (పక్క చిత్రంలో)
 • ... సూర్యదేవర రామచంద్ర రావు ప్లేగు వ్యాధి బారిన పడ్డ సూరత్ నగరాన్ని దేశంలో రెండో పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దాడనీ!
 • ... తెలుగు నాటకాలలో పురుష పాత్రలను ధరించిన మొట్టమొదటి నటీమణి అబ్బూరి కమలాదేవి అనీ!
 • ... భారతీయ అత్యున్నత సాహిత్య పురస్కారంగా వాసికెక్కిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తొలి తెలుగు రచయిత్రి ఇల్లిందల సరస్వతీదేవి అనీ! ఈ అవార్డు ఆమె వ్రాసిన స్వర్ణకమలాలు కథా సంకలనానికి లభించిందనీ!

15 వ వారం[మార్చు]

Mouse-deer Singapore Zoo 2012.JPG
 • ...గుండ్రని దేహంతో చిన్న చిన్న కాళ్లతో ఉన్న అంతరించి పోతున్న జింక మౌస్‌ డీర్‌ అనీ! (పక్క చిత్రంలో)
 • ...ఆంధ్రప్రదేశ్ కు చెందిన రేవంత్ భారతదేశంలో ప్రముఖ రియాలిటీ షో ఇండియన్ ఐడల్ -9 విజేతగా నిలిచాడనీ!

16 వ వారం[మార్చు]

17 వ వారం[మార్చు]

18 వ వారం[మార్చు]

Har Gobind Khorana.jpg
 • ...షర్మిలా ఠాగూర్ రవీంద్రనాథ్ ఠాగూర్ కు దూరపు బంధువు అనీ!
 • ...12 వ శతాబ్దానికి చెందిన నాగమ్మ దేశంలో తొలి మహిళా మంత్రి అనీ!
 • ...హరగోవింద్ ఖొరానా మొదటిసారిగా కృత్రిమ జీన్ సృష్టించి జెనెటిక్ ఇంజనీరింగ్ అనే కొత్త అధ్యాయానికి తెర లేపాడనీ!(చిత్రంలో)
 • ...జ్యోతి నృత్యం కర్నూలు జిల్లాలోని ప్రాచీన దేవతయైన చౌడమ్మ దగ్గర ప్రదర్శిస్తారనీ!
 • ...వెంట్రిలాక్విజం అనేది నోరు మెదపకుండా మాట్లాడగలిగే ఒక కళ అనీ!

19 వ వారం[మార్చు]

Aluminium-4.jpg
 • ...వంటపాత్రల తయారీకి అల్యూమినియం లోహం వాడడం ఆరోగ్యానికి హానికరమనీ!(చిత్రంలో)
 • ...ప్రపంచంలో అత్యల్ప జనసాంద్రత గల ప్రాంతాల్లో నమీబియా రెండవదనీ!
 • ...ఈమెయిలు చిరునామాలో కనిపించే "@" గుర్తును మొట్టమొదటిసారిగా వాడింది రాయ్ టామ్లిసన్ అనీ!
 • ...37 సంవత్సరాల సర్వీసులో నిజాయితీగా వ్యవహరించిన పోలీసు అధికారి సుల్ఖాన్ సింగ్ అనీ!
 • ...శ్రీకాకుళం గిరిజనోద్యమంలో ప్రముఖ నాయకుడు ఆదిభట్ల కైలాసం అనీ!

20 వ వారం[మార్చు]

ଜଗନ୍ନାଥ ମନ୍ଦିର, ହାଇଦ୍ରାବାଦ.jpg
 • ...పూరి లో నెలకొని ఉన్న ఆలయానికి ప్రతిరూపంగా హైదరాబాదులో జగన్నాథ దేవాలయం నిర్మింబడినదనీ!
 • ... సినీనటుడు చంద్రమోహన్ భార్య జలంధర ప్రఖ్యాత రచయిత్రి అనీ!
 • ...శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఉపాధ్యాయులు వెంపటాపు సత్యం గిరిజనోద్యమంలో కీలక పాత్ర పోషించారనీ!
 • ...తెలంగాణ నీటి పారుదల రంగ నిపుణుడు ఆర్. విద్యాసాగ‌ర్‌రావు అనీ!
 • ...దక్షిణ భారత దేశంలో తొలి సారిగా మూకీ చిత్రం "కీచక వధ" నిర్మించిన ఘనుడు ఆర్. నటరాజ మొదలియార్ అనీ!

21 వ వారం[మార్చు]

Jagannath Temple baripada 4.jpg
 • ...రధాయాత్రలో సుభద్ర రథాన్ని స్త్రీలు లాగే ఆచారం ఉన్న ఆలయం ఒడిశాలోని జగన్నాథ దేవాలయం అనీ!
 • ...కళ్లద్దాలను దూరం చేయడానికి ఎన్నో రకాల చికిత్సలను అందుబాటులోకి తెచ్చిన వైద్యుడు కాసు ప్రసాదరెడ్డి అనీ!
 • ... ప్రముఖ నటి సిల్క్ స్మిత ను వెండితెరకు పరిచయం చేసినవారు విను చక్రవర్తి అనీ!
 • ..."ఇంగ్లీషుకు తల్లి తెలుగు" అనే పుస్తకం రాసినది హాస్యబ్రహ్మ శంకరనారాయణ అనీ!
 • ...ప్రముఖ వైద్యులు డాక్టర్ గాలి బాలసుందర రావు ఇంట్లో జరిగే రాజకీయ సమావేశాలకు తిలక్ క్రమం తప్పకుండా హాజరయ్యేవారనీ!

22 వ వారం[మార్చు]

Kristallstruktur Bortrioxid.png
 • ...బోరో సిలికేట్ గ్లాసు ఉత్పత్తిలో ముఖ్య రసాయనం బొరాన్ ట్రైఆక్సైడ్ అనీ!(చిత్రంలో నిర్మాణం)
 • ... కేవలం కెమేరాతో ట్రిక్‌వర్క్‌ తో ప్రచంచ తెలుగు ప్రేక్షకులందర్నీ అబ్బురమనిపించిన పాట వివాహ భోజనంబు అనీ!
 • ...మధ్య తరగతి స్త్రీలలో కలిగే మార్పులను, వారి లైంగిక భావనలను తన నటన ద్వారా చర్చించిన నటి స్మితా పాటిల్ అనీ!
 • ...కుటుంబ నియంత్రణ క్షేత్రంలో విశేష కృషిచేసిన సంఘసేవకురాలు శకుంతలా పరాంజపే అనీ!
 • ...శ్రీకాకుళంలో నాగావళి నది కొత్త బ్రిడ్జి నుండి జాతీయ రహదారి వరకు ప్రముఖుల విగ్రహాల ఏర్పాటులో దూసి ధర్మారావు కృషి ఉన్నదనీ!

23 వ వారం[మార్చు]

Anuradha Paudwal at BIG FM Marathi Awards.jpg

24 వ వారం[మార్చు]

 • ....భూమికి సమీపంగా ఏప్రిల్ 19 , 2017 న వచ్చిన ఆస్టరాయిడ్ (గ్రహశకలం) 2014 JO25 అనీ!
 • ...అతి తక్కువ వ్యర్థపదార్థాల "విటమిన్ డి" ఆధారిత మందులు తయారుచేసిన వైద్యపరిశోధకుడు జి.సత్యనారాయణ రెడ్డి అనీ!
 • ...పిన్నమనేని వెంకటేశ్వరరావు గారి కుటుంబం ప్రతీయేటా "డాక్టర్ పిన్నమనేని అండ్ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ పురస్కారం" అందిస్తున్నదనీ!
 • ...1949లో తొలి సారిగా సినిమాలలో ద్విపాత్రాభినయనాన్ని చిత్రీకరించిన సినిమాటోగ్రాఫర్ కమల్ ఘోష్ అనీ!
 • ...దేశంలో ఎక్కడా లేని విధంగా నది పక్కన రిజర్వాయర్‌ నిర్మాణానికి నాంది పలికిన వంశధార ప్రాజెక్టు రూపకర్త సి.ఆర్.ఎం.పట్నాయక్ అనీ!

25 వ వారం[మార్చు]

 • ... నేత్రవైద్యంలో నేత్రాలను పరీక్షించుటకు "మోనోయర్ ఛార్టు" ను ఆవిష్కరించినవారు ఫెర్డినాండ్ మోనోయర్ అనీ!
 • ...ఢిల్లీ హైకోర్టు కు మొదటి మహిళా న్యాయమూర్తి లీలా సేథ్ అనీ!
 • ...డెన్నిస్ టిటో అంతరిక్షంలో ప్రయాణించిన మొట్టమొదటి పర్యాటకుడనీ!
 • ...ముర్రే నది ఆస్ట్రేలియాలోకెల్లా అతిపెద్ద నది అనీ!

26 వ వారం[మార్చు]

 • ...దృష్టి దోషం ఉన్నవారి యొక్క దోషాన్ని పరిశీలించడానికి నేత్రవైద్యులు మోనోయర్ ఛార్టు ఉపయోగిస్తారనీ!
 • ... సత్యనారాయణ గోయెంకా విపస్సన ధ్యాన పద్ధతుల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచాడనీ!
 • ... ప్రజాప్రయోజన వ్యాజ్యం అనే విధానాన్ని ప్రవేశ పెట్టిన న్యాయమూర్తి పి.ఎన్. భగవతి అనీ!

27 వ వారం[మార్చు]

28 వ వారం[మార్చు]

 • ...ప్రమాణవార్తిక వైదిక ధర్మాలను వ్యతిరేకించిన ప్రముఖ బౌద్ధ గ్రంథమనీ!
 • ...హైదరాబాదుకు చెందిన మెర్సీ మార్గరెట్ రాసిన మాటల మడుగు అనే కవిత్వానికి కేంద్రసాహిత్య యువ పురస్కారం లభించిందనీ!
 • ...చిందు ఎల్లమ్మ ప్రాచీన కళ అయిన చిందు భాగవతంలో కృషి చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిందనీ!
 • ... కుట్టి పద్మిని తమిళనాడు రాష్ట్రం నుండి జాతీయ ఉత్తమ నటి పురస్కారం పొందిన తొలి అమ్మాయి అనీ!
 • ... ఆంధ్రమహిళ అనే పత్రిక ద్వారా మహిళాభ్యుదయానికి విశేష కృషి చేసిన మహిళ కంచర్ల సుగుణమణి అనీ!

29 వ వారం[మార్చు]

 • ...మరీచి బ్రహ్మ మానసపుత్రుల్లో ఒకడనీ!
 • ... భారతదేశంలో అతి ప్రాచీన నలంద విశ్వవిద్యాలయపు మొట్టమొదటి కులపతి ధర్మపాలుడు అనీ!
 • ...వినోద్ మెహతా ఔట్ లుక్ లాంటి అనేక ప్రముఖ పత్రికల వ్యవస్థాపకుడనీ!
 • ...జమ్ము కాశ్మీర్ లోని శ్రీనగర్ నీటిలో తేలియాడే ఇళ్ళకు ప్రసిద్ధి అనీ!
 • ...నికరాగ్వా మధ్య అమెరికాలో అతిపెద్ద దేశమనీ!

30 వ వారం[మార్చు]

31 వ వారం[మార్చు]

 • ... కాశ్మీర్ ను పరిపాలించిన రాజుల్లో లలితాదిత్య ముక్తాపీడుడు పరిపాలనా కాలం స్వర్ణయుగంగా భావిస్తారనీ!
 • ... గణిత శాస్త్రపు నోబెల్ బహుమతిగా అభివర్ణించే ఫీల్డ్స్ పతకాన్ని అందుకున్న తొలి మహిళ మరియం మిర్జాఖనీ అనీ!
 • ... నందకరాజ్యం తొలి తెలుగు సాంఘిక పద్యనాటకంగా గుర్తింపు పొందిందనీ!
 • ... పాకిస్థాన్ కు చెందిన జలాంతర్గామి పి.ఎన్.ఎస్. ఘాజీ కూల్చివేత భారత నావిక దళ విజయాల్లో చెప్పుకోదగ్గ విజయమనీ!

32 వ వారం[మార్చు]

 • ... పుష్ప మిత్ర భార్గవ హైదరాబాదులోని ప్రతిష్టాత్మక సంస్థ అయిన సెంటర్ ఫర్ మాలెక్యులార్ బయాలజీ వ్యవస్థాపకులనీ!
 • ... భారత మాజీ ప్రధాని పి. వి. నరసింహారావు ఆంధ్రప్రదేశ్ నాట్య సంఘం సంస్థకు రెండవ అధ్యక్షుడిగా వ్యవహరించారనీ!
 • ... నాగమల్లి పుష్పాన్ని వైద్య శాస్త్రంలో పాముకాటు చికిత్సలో ఉపయోగిస్తారనీ!
 • ... కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ నటించిన ఏకైక కన్నడేతర చిత్రం కాళహస్తి మహాత్మ్యం అనీ!

33 వ వారం[మార్చు]

 • ... వాస్కోడగామా సముద్రమార్గం ద్వారా భారతదేశం చేరుకున్న తొలి యూరోపు యాత్రికుడనీ!
 • ... హైదరాబాదులోని ఖైరతాబాదు లో ప్రతి యేటా ఘనంగా నిర్వహించే వినాయక చవితి ఉత్సవాలు 1954 నుంచి ప్రారంభమయ్యాయనీ!
 • ... మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారి అయిన సత్య నాదెళ్ళ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పూర్వ విద్యార్థి అనీ!
 • ... రామనారాయణ తర్కరత్న రాసిన కులీన కుల సర్వస్వ అనే నాటకం బెంగాలో భాషలో తొలి స్వతంత్ర నాటకంగా గుర్తించబడిందనీ!

34 వ వారం[మార్చు]

 • ... శ్వేతనాగు సౌందర్య నటించిన ఆఖరి చిత్రాల్లో ఒకటనీ!
 • ... విక్రమ్‌ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం ఇస్రో కేంద్రాలన్నింటిలోకి అతి పెద్దదనీ!
 • ... ఖుదీరాం బోస్ ఆంగ్లేయులపై తిరగబడి బాంబు దాడి చేసిన వీరులలో అతి పిన్నవయస్కుడనీ!
 • ... ప్రాచీన భారతీయ న్యాయశాస్త్ర గ్రంథాలలో ప్రముఖంగా పేర్కొనబడే న్యాయవార్తిక అనే గ్రంథకర్త ఉద్యోతకారుడు అనీ!
 • ... గుజరాత్ లోని ధోలావీరా, ప్రాచీన భారతదేశపు సింధు నాగరికతకు సంబంధించిన అతిపెద్ద క్షేత్రాల్లో ఒకటనీ!

35 వ వారం[మార్చు]

 • ... బెంగళూరులో ప్రముఖ పర్యాటక స్థలమైన కబ్బన్ పార్కును ప్రారంభించింది రిచర్డ్ సాంకే అనీ!
 • ... సూళ్లూరుపేట ను పూర్వం శుభగిరి అని పిలిచేవారనీ!
 • ...భూకంప కేంద్రం సముద్రము నందు సంభవించినపుడు సముద్ర గర్భము విచ్ఛిన్నమయినందు వలన సునామీ ఏర్పడుతుందనీ!

36 వ వారం[మార్చు]

 • ... హరియాణాకు చెందిన వివాదాస్పద డేరా బాబా సంస్థ 2003-2015 మధ్యలో 19 గిన్నిస్ రికార్డులు నెలకొల్పిందనీ!
 • ... తెలుగులో మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ నవల విహంగ యానం అనీ, దానిని వ్రాసింది టేకుమళ్ళ రాజగోపాలరావు అనీ!
 • .... అరచేయంత పరిమాణంలో ఉండే సాలెపురుగు డొలొమెడెస్‌ బ్రియాన్‌ గ్రీనె అనీ... నీటి ఉపరితలంపై, అలలపై స్వారీ చేస్తూ... తన మధ్య కాళ్ల జతతో ఈదుతూ పరుగులు తీస్తుందనీ!

37 వ వారం[మార్చు]

 • ... మేఘాలయ రాష్ట్రంలోని మాసిన్రామ్ గ్రామంలో ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో ఒకటనీ!
 • ... తెలుగు సినీ దర్శకుడు సి. వి. రెడ్డి 2017 సంవత్సరానికి గాను భారతదేశపు ఆస్కార్ జ్యూరీ కి ఎంపికయ్యాడనీ!
 • ... ప్రముఖ సాఫ్టువేర్ సంస్థ అడోబీ సిస్టమ్స్ సి. ఇ. ఓ శంతను నారాయణ్ హైదరాబాదులో పుట్టి పెరిగాడనీ!

38 వ వారం[మార్చు]

 • ..."ఇందూరు ఖజురహో" గా పిలువబడే ప్రసిద్ధ ఆలయం ఖిల్లా రామాలయం అనీ!
 • ... బీహార్ లో అశోకుని కాలానికి చెందిన బరాబర్ గుహలు భారతదేశంలో అత్యంత ప్రాచీనమైన రాతిగుహలనీ!
 • ... ఆపరేషన్ జిబ్రాల్టర్ పాకిస్తాన్ కాశ్మీర్ ను భారతదేశం నుంచి వేరుచేయడానికి వేసిన ఒక విఫల ప్రయోగం అనీ!

39 వ వారం[మార్చు]

 • ... పతంజలి ఆయుర్వేద సంస్థ అతి తక్కువ కాలంలోనే ప్రభావశీలమైన సంస్థల జాబితాలో దిగ్గజాలైన గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి సంస్థల సరసన స్థానం సంపాదించుకున్నదనీ!
 • ... ఆంధ్రప్రదేశ్ లోని పిఠాపురంలో గల పురుహూతికా క్షేత్రం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటనీ!
 • ... ప్రవాసీ భారతీయ సమ్మాన్ విదేశాల్లో ఉంటున్న భారతీయులకు వివిధ రంగాల్లో చేసిన కృషికి భారత ప్రభుత్వం ఇచ్చే పురస్కారం అనీ!
 • ... దక్షిణ భారతదేశ చరిత్ర గురించి కె.ఎ.నీలకంఠ శాస్త్రి రాసిన గ్రంథాలు ప్రామాణిక గ్రంథాలుగా పరిగణిస్తారనీ!

40 వ వారం[మార్చు]

 • ... హైదరాబాదు ఆల్విన్ 1942 లో నిజాంకు చెందిన హైదరాబాదు రాష్ట్రప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థ అనీ!
 • ... పరాగ్వే అనే పేరు ఆ దేశంలో ప్రవహిస్తున్న పెరుగ్వే అనే పేరు నుంచి ఏర్పడిందనీ!

41 వ వారం[మార్చు]

 • ...బలరాజ్ మధోక్ భారతీయ జనతా పార్టీ అనుసరిస్తున్న సైద్ధాంతిక మూలాలకు కారణమైన భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడనీ!
 • ...వేనాడు దర్గా ఆసియాలోనే అతిపెద్ద సమాధిగా గుర్తింపు పొందిందనీ!

42 వ వారం[మార్చు]

Aruna Miller.jpg
 • అమెరికాలోని మేరీలాండ్ విధాన సభకు ఎన్నికైన తొలి భారతీయ అమెరికన్ మహిళ అరుణ మిల్లర్ అనీ!
 • భారతదేశంలోని ప్రతిష్టాత్మక టిటికె బ్రాండు వ్యవస్థాపకుడు టి.టి.కృష్ణమాచారి అనీ!
 • ఉత్తమ ప్రామాణిక చరిత్ర రచనగా నిలిచిన "ఆంధ్రుల చరిత్ర" రచయిత బి. ఎస్. ఎల్. హనుమంత రావు అనీ!
 • పేద కక్షిదారులు, పేద న్యాయ విద్యార్ధులకు సహాయం చేయటంకోసం స్థాపించబడినది అల్లాడి ట్రస్టు అనీ!
 • ఈశ్వరుడు యమునిచేత పూజించబడిన ప్రదేశంలో వెలసిన ఆలయం యమేశ్వరాలయం అనీ!

43 వ వారం[మార్చు]

Muktesvara deula.jpg

44 వ వారం[మార్చు]

 • ...కుముద్‌బెన్ జోషీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పనిచేసిన రెండో మహిళా గవర్నర్ అనీ!
 • ...ధౌళిగిరి అనే ప్రదేశంలో అశోక చక్రవర్తి యుద్ధ విముఖుడైనట్లు భావిస్తారనీ!
 • ... ఆంగ్ల సాహిత్యంలో టి.ఎస్‌. ఎలియట్‌ ను ఆధునిక కవితా ఉద్యమానికి మార్గదర్శకుడిగా పరిగణిస్తారనీ!

45 వ వారం[మార్చు]

 • ...మొనాకో ప్రపంచ దేశాల్లో రెండో అతి చిన్న దేశమనీ!
 • ...లాక్టోబాసిల్లస్ అనే బ్యాక్టీరియా మానవ శరీరంలో కొన్ని హానికారక బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుందనీ!
 • ...టోక్యో స్కైట్రీ జపాన్ లో అత్యంత ఎత్తైన నిర్మాణంగా పేరుగాంచిందనీ!

46 వ వారం[మార్చు]

Metrolinea4.jpg
 • ఆరుట్ల బుగ్గ రామలింగేశ్వర ఆలయం వద్ద కార్తీక పౌర్ణమి నుంచి 15 రోజులు పూజలు, వనభోజనాలు, వ్రతాలతో "ఆరుట్ల బుగ్గ జాతర" చేస్తారనీ!
 • కన్నడ చలన చిత్ర భీష్ముడిగా పేరొందినవారు జి.వి.అయ్యర్ అనీ!
 • దక్షిణ అమెరికా ఖండంలో అత్యంత స్థిరమైన, సంపన్న దేశాల్లో చిలీ ఒకటి అనీ!

47 వ వారం[మార్చు]

Astasambhu Siva Temple-I.jpg

48 వ వారం[మార్చు]

Hathigumpha.JPG
 • అత్యంత ప్రముఖుడైన కళింగ రాజు ఖారవేలుడి గురించి లభ్యమౌతున్న సమాచారం ప్రధానంగా హాథీగుంఫా శాసనంలో దొరుకుతోందనీ!
 • చందూలాల్ మాధవ్‌లాల్ త్రివేది తూర్పు పంజాబ్, పంజాబ్, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తొలి గవర్నర్‌గా పనిచేశారనీ!
 • మైసూర్ విశ్వవిద్యాలయం మొట్టమొదటి ఉపకులపతి, కన్నడ సాహిత్య పరిషత్ వ్యవస్థాపకుడు అయిన హెచ్.వి.నంజుండయ్య మాతృభాష తెలుగు అనీ!

49 వ వారం[మార్చు]

Leninpeace.jpg
 • స్టాలిన్ పేరిట ఉన్న శాంతి బహుమతి డీస్టాలినైజేషన్లో భాగంగా లెనిన్ పేరుకు మార్చి అంతవరకూ అందుకున్నవారిని బహుమతి వెనక్కి ఇచ్చి కొత్త పేరుతో తీసుకొమ్మన్నారనీ! (లెనిన్ శాంతి బహుమతి)
 • శుక్రుడు సౌరమండలంలోని గ్రహాల్లోకెల్లా అత్యంత వేడియైన మరియు ప్రకాశవంతమైన గ్రహమనీ!
 • సోను నిగమ్ బాలీవుడ్ గాయకుల్లో అత్యధిక పారితోషికం తీసుకునే గాయకుల్లో ఒకడనీ!

50 వ వారం[మార్చు]

 • రెండు వేర్వేరు శాస్త్రీయ విభాగాల్లో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి వ్యక్తి మేరీ క్యూరీ అనీ!
 • అనసూయా సారాభాయ్ భారతీయ అంతరిక్ష కార్యక్రమ పితామహుడిగా భావించే విక్రం సారాభాయ్ కి మేనత్త అనీ!
 • పెంచికల బసిరెడ్డి కడప జిల్లా పరిషత్ తొలి అధ్యక్షుడనీ!

51 వ వారం[మార్చు]

 • పెరిన్ కాప్టెన్ పద్మశ్రీ పురస్కారాలు అందుకున్న తొలివారిలో ఒకరనీ!
 • ఎన్.డి.కృష్ణారావు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో అత్యంత స్వల్పకాలం పదవీ బాధ్యతలు నిర్వహించిన ప్రధాన న్యాయమూర్తి అనీ!
 • తెలంగాణా రాష్ట్రానికి చెందిన రష్మీ ఠాకూర్ 2016 లో మిస్ ఇండియా ప్లానెట్ అవార్డు గెలుచుకున్నదనీ!
 • భారతదేశంలో మొట్టమొదటి కార్మిక ఉద్యమాన్ని ప్రారంభించింది జి.ఎస్.అరండేల్ అనీ!
 • భారతదేశం ఆయుధాల తయారీలో స్వయంసమృద్ధి సాధించడానికి పుణె లో ఆయుధ పరిశోధన అభివృద్ధి సంస్థ అనే పరిశోధనాశాలను ప్రారంభించారనీ!

52 వ వారం[మార్చు]

 • ...మీ శ్రేయోభిలాషి చిత్రం 2007 లో ఉత్తమ చిత్రంగా నంది పురస్కారం అందుకున్నదనీ!
 • ...తెలుగు వాడైన రెంటాల వెంకట సుబ్బారావు షేక్స్పియర్ నాటకాలకు వ్యాఖ్యానాలు రాశాడనీ!
 • ... భారతీయ శాస్త్రవేత్త అయిన సత్యేంద్రనాథ్ బోస్ పేరు మీద ఇటీవల కనుగొన్న పదార్థ మూలకణాలకు హిగ్గ్స్ బోసన్ అని పేరు పెట్టారనీ!
 • ... ప్రముఖ దర్శకుడు కె. రాఘవేంద్రరావు కుమారుడైన కె. ప్రకాష్ నీతో అనే సినిమాతో వెండితెరకు పరిచయమయ్యాడనీ!
 • ...ప్రముఖ సంగీత విద్వాంసుడు వీణ కుప్పయ్యర్ త్యాగరాజుకు ప్రియశిష్యుడనీ!