రాజారాం బాప్కర్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రాజారాం బాప్కర్ మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన అమద్ నగర్ జిల్లాలోని ఉపాధ్యాయుడు. ఈయన తన గ్రామ ప్రజల శ్రేయస్సు కోసం 57 సంవత్సరాల పాటు శ్రమించి 7 కొండలను తవ్వి 40 కిలోమీటర్ల రోడ్డు మార్గాన్ని నిర్మించాడు.[1] [2] ఈయనను స్థానికులు బాప్కర్ గురూజీ గా వ్యవహరిస్తారు.

జీవిత విశేషాలు

[మార్చు]

ఈయన మహారాష్ట్ర లోని అహ్మద్ నగర్ జిల్లాకు చెందినవాడు. ఈయన స్వగ్రామం "గుండెగాన్". ఆ కాలంలో ఆయన మోదీ భాషలో ఏడోతరగతి వరకు చదువుకున్నాడు.[3] ఈయన ఎప్పడూ తెల్లచొక్కాధరించి పైజామా వేసుకొని ,తల మీద చిన్నటోపి పెట్టుకుట్టాడు. 1957 నంచి 1991 వరకు జిల్లా పరిపరిషత్ స్కూల్లో పాఠశాల ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తించాడు. అయితే ఆయన సొంత గ్రామం గుండెగాన్‌ నుంచి ఇతర గ్రామాలకు వెళ్లాలంటే సరైన మార్గం ఉండేది కాదు. చివరికి కాలినడకన వెళ్లడానికి కూడా కుదిరేదికాదు. దీంతో రాజారాం తమ గ్రామం నుంచి ఇతర గ్రామాలకు వెళ్లడానికి రోడ్డు వేయించాలని పలుమార్లు ప్రభుత్వ అధికారులను కోరిన వారు పట్టించుకోలేదు. దీంతో ఇక లాభం లేదనుకొని స్వయంగా రాజారామే రోడ్డు పనికి పూనుకున్నాడు. ఇలా 57 సంవత్సరాల పాటు శ్రమించాడు. 7 కొండలను తవ్వాడు 40 కిలోమీటర్ల రోడ్డు మార్గం నిర్మించాడు. రాజారాం సంక్పలాన్ని, పట్టుదలను చూసి స్థానికులు అవాక్కయ్యారు. 1968 లో ఈ దారిలో ఒక సైకిల్‌ పోవడానికి కూడా వీలు లేకుండా ఉండేది కానీ ప్రస్తుతం ఈ రోడ్‌లో పెద్ద వాహనాలు కూడా వెళుతున్నాయి. ఈ రోడ్డు నిర్మాణానికి ఒక పైసా కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. తాను కూడబెట్టన డబ్బు, రిటైర్మెంట్‌ సొమ్మును ఖర్చు పెట్టి రహదారిని నిర్మించారాయన. 1997 వరకు ఈ రోడ్డు నిర్మాణాన్ని పూర్తిచేసారు.[4]

మూలాలు

[మార్చు]
  1. "57 ఏళ్లు శ్రమించి 40 కిలో మీటర్ల మార్గాన్ని నిర్మించిన 'మౌంటైన్ మ్యాన్' 08/24/15 6:08 PM". Archived from the original on 2015-10-17. Retrieved 2016-01-26.
  2. "40-km long roads in 57 years: Meet Maharashtra's Mountain Man". rediff.com. 24 August 2015. Retrieved 26 January 2016.
  3. ఇతను మహారాష్ట్ర 'మౌంటైన్‌ మ్యాన్‌'
  4. "మహా" లోనూ మాంఝీ లాంటి వీరుడు[permanent dead link]

ఇతర లింకులు

[మార్చు]