రవీందర్ కౌశిక్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

రవీందర్ కౌశిక్ (1952–1999) ప్రముఖ భారతీయ రహస్య ఏజెంటు. ఆయన మాజీ రా ఏజెంటు. పాకిస్థాన్ సైన్యానికి అనుకోకుండా దొరికిపోయి జైలుశిక్ష అనుభవించి జైలులో మరణించాడు[1][2][3][4][5].ఇతనిని బ్లాక్ టైగర్ అని పిలుస్తారు.

జీవిత విశేషాలు[మార్చు]

రవీందర్ 1952 ఏప్రిల్ 11కర్నాల్, హర్యానాలో జన్మించారు. ఆయనకు నాటకాలలో ప్రవేశం ఉండేది. తన 23 వ ఏటనే ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ RAW లో చేరారు. ఆ రోజులలో పాకిస్తాన్కు "అండర్ కవర్"గా వెళ్ళడానికి ఎవరూ ముందుకు రాని సమయంలో నేను వెళ్ళతాను అని ముందుకు వచ్చాడు[1].

పాకిస్థాన్ లో[మార్చు]

పాకిస్థాన్ వెళ్ళడం కోసం ఉర్ధూ నేర్చుకున్నాడు, మతం మార్చుకున్నాడు, వారి మతవిద్యను కూడా నేర్చుకొని అహమ్మద్ షాకీర్ అనే పేరుతొ 1975 లో పాకిస్థాన్ వెళ్ళాడు[6][7]. పాకిస్థాన్ కు అనుమానం రాకుండా ఉండటానికి ముందుగా కరాచి యూనివర్శిటీలో LLB పూర్తిచేసి తరువాత పెద్ద హోదాలో పాకిస్తాన్ ఆర్మీలో చేరాడు[4]. ఇస్లాం మతం తీసుకున్నాడు.[8] స్థానికంగా ఉండే అమానత్ ను వివాహమాడాడు. 1979 నుండి 1983 వ సంవత్సరం వరకు అత్యంత విలువైన సమాచారాన్ని RAW, భారతీయ సైనిక దళాలకు పంపించేవాడు[5]. పాకిస్థాన్ దొంగ దెబ్బ తీయలనుకున్న ప్రతిసారి ముందగ సమాచారం ఇచ్చి కాపాడేవాడు. కాని దురదృష్ట వశాతూ మసిహ అనే మరొక సీక్రెట్ ఏజెంట్ చేసిన తప్పు వలన రవీందర్ పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోయాడు.

మరణం[మార్చు]

అప్పటి నుండి 16 సంవత్సరాలు ఇండియా రహస్యాలు చెప్పమని తీవ్రంగా హింసించారు. అయినప్పటికీ గొప్ప దేశభక్తుడైన ఈ వీరుడు ఒక్క రహస్యం కూడా బయట పెట్టలేదట. మన భారత ప్రభుత్వం ఎప్పటికైనా కాపాడుతుందని ఎదురు చూసి చూసి చివరికి క్షయ వ్యాధి సోకి 1999 జూలై 26 న మరణించారు[3]. అతనిని జైలు వెనుక భాగంలోనే ఖననం చేసారు[1]. ఇతనికి స్వయానా ఇందిరా గాంధీనే బ్లాక్ టైగర్ అని బిరుదునిచ్చింది.

ఆయన వ్రాసిన ఉత్తరాలలో ఒకదానిలో ఈ విధంగా వ్రాసారు,

"Kya Bharat jaise bade desh ke liye kurbani dene waalon ko yahi milta hai?" (Is this the reward a person gets for sacrificing his life for a great nation like India?)[3]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 1.2 "India's forgotten spy - Agent's family fights an impossible battle". Retrieved 17 Aug 2012.
  2. "Ek Tha Tiger: Not Salman Khan, meet the real Indian Tiger!". Retrieved 17 Aug 2012.
  3. 3.0 3.1 3.2 "Ek Tha Black Tiger: Real life tale of a true patriot". Retrieved 17 Aug 2012.
  4. 4.0 4.1 "Late spy's kin fight for reel life credit". Retrieved 17 Aug 2012.
  5. 5.0 5.1 "Story of a RAW agent spent his life in Pakistan". Archived from the original on 27 జూన్ 2015. Retrieved 10 Jun 2015. Check date values in: |archive-date= (help)
  6. "Salman Khan's new movie in controversy again". Archived from the original on 2013-01-03. Retrieved 17 Aug 2012.
  7. "Dead RAW agent's nephew takes Salman's Ek Tha Tiger producers to court". Retrieved 17 Aug 2012.
  8. "The real life behind a 2002 spy thriller". Hindustan Times. 6 December 2009. Archived from the original on 18 మే 2015. Retrieved 15 May 2015. Check date values in: |archive-date= (help)

ఇతర లింకులు[మార్చు]