రా
Raw లేదా రిసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (RAW or Research and Analysis Wing) భారత గూఢచార సంస్థ.
ఏర్పాటు[మార్చు]
1962 లో జరిగిన భారత-చైనా యుద్ధం, 1965న జరిగిన భారత-పాకిస్థాన్ యుద్ధం తరువాత విదేశాలపై గట్టి నిఘా ఉంచుటకు ఒక సంస్థ అవసరం ఏర్పడింది. అప్పుడు సెప్టెంబర్ 1968 లో 'రా' ను ఇంటలిజెన్స్ బ్యూరో నుంచి వేరుగా ఒక సంస్థగా ఏర్పాటుచేసారు. ఇంటలిజన్స్ బ్యూరో అప్పటికి భారత దేశం లోపల వెలుపల నిఘా కార్యక్రమములను చూసేది. 'రా' ముఖ్యకార్యాలయము లోధిరోడ్, ఢిల్లీలో ఉంది.
ఇంటలిజెన్స్ బ్యూరో బ్రిటీష్ ప్రభుత్వం చే ఏర్పాటుచేయబడింది. అయితే భారత దేశానికి స్వతంత్రం వచ్చిన తరువాత సంజీవిపిళ్ళై డైరక్టర్ గా బాధ్యతలు తీసుకొనిన తరువాత అనుభవజ్ఞులయిన గూఢచారుల కొరత బాగా కనబడింది. 1962 భారత-చైనా,1965 భారత-పాకిస్తాన్ యుద్ధాలలో ఇంటలిజెన్స్ బ్యూరో వైఫల్యం బాగా కనబడింది.
1966 తరువాత ప్రత్యేక విదశీ నిఘా సంస్థ ప్రారంభంకై గట్టి చర్యలు తీసుకొనబడ్డాయి. 1968 లో ఇందిరా గాంధీ హయాములో ఇటువంటి సంస్థ అవసరం బాగా వచ్చింది. ఆర్.ఎన్.కావ్ అప్పటికి ఇంటలిజెన్స్ బ్యూరో డిప్యూటి డైరెక్టర్. ఆయన ప్రధానికి ఇటువంటి సంస్థకు గల బ్లూప్రింట్ ను ఇచ్చాడు. అప్పుడు 'రా' ఏర్పడి, అతనే 'రా' కు చీఫ్ గా నియమించబడ్డాడు.
రా కార్యకలాపాలు[మార్చు]
రాకు ప్రత్యేకంగా విదేశాలపై నిఘా పెట్టే బాధ్యతను అప్పజెప్పారు. జాయింట్ ఇంటలిజెన్స్ సంస్థ - రా, ఇంటలిజెన్స్ బ్యూరో, రక్షణ ఇంటలిజెన్స్ సంస్థల మధ్య సంబంధాలను పర్యవేక్షిస్తుంటుంది. కాని జాతీయ రక్షణ సంస్థ ఏర్పాటు తరువాత జాయింట్ ఇంటలిజెన్స్ సంస్థ దానిలో విలీనం అయ్యింది. రా ఒక ప్రత్యేకమైన హోదా ఉన్న సంస్థ. అది ఏజెన్సి కాదు ఒక "వింగ్". కేంద్ర కేబినెట్ లో ఒక భాగం. రా పార్లమెంటుకు సమాధానం చెప్పనవసరం లేదు. సమాచార హక్కు శాసనం నుంచి దానికి మినహాయింపు ఉంది.
ప్రస్తుతం రా గూఢచారులు ప్రతీ పెద్ద ఎంబసి, హైకమిషన్ లోనూ ఉన్నారు. ఇప్పటికి రాకు సుమారు 10000 మంది గూఢచారులు కేవలం పాకిస్తాన్ లోనే ఉన్నారు. రాకు ఆర్క్-వైమానిక (ARC-Aviation Reasearch Centre) నిఘా వ్యవస్థ కూడా ఉంది. ఈ వ్యవస్థలో అత్యాధునిక విమానాలను హెలికాప్టర్లను ఉపయోగిస్తున్నారు.
రా ముఖ్య ఉద్ధేశ్యాలు[మార్చు]
- పొరుగు దేశాలయొక్క రాజకీయ, రక్షణ అభివృద్ధిని- భారత దేశ రక్షణ, విదేశీ వ్యవహారలను ప్రభావితం చేయగల వాటిపై నిఘా ఉంచుతుంది.
- పాకిస్తాన్‌కు రక్షణ దిగుమతులు ఎక్కువగా వెళ్ళకుండా చూడటం. (ముఖ్యంగా యూరప్, అమెరికా, చైనాల నుండి)
- ప్రపంచ ప్రజల భావాన్ని భారత్ కి అనుకూలంగా మార్చటం.
- కౌంటెర్ ఇంతలిజెన్స్: శతృ దేశాల నిఘా వర్గాలపై కూడా రా నిఘా పెడుతుంది. ఇది రా తాలూకా రెండో అతిపెద్ద పని.
రా గూఢచారులు బహుళజాతి సంస్థల్లో, వార్తా సంస్థల్లో పనిచేస్తూ తమ పని తాము కానించుకొంటూ ఉంటారు. రా ఇతర దేశపు నిఘా సంస్థలతో కూడా సత్సంబంధాలు ఉంచుకొంటుంది. రష్యా ఎఫ్.అస్.బి, ఖాడ్, ద అఫ్ఘన్ ఏజెన్సి, మొస్సాద్ (ఇజ్రాయిల్), సి.ఐ.ఏ., ఎం.ఐ.6, వంటి సంస్థలతో సంబంధాలు ఉంచుకుంటుంది. ముఖ్యంగా పాకిస్తాన్ అణుకార్యక్రమాలగూర్చి ఈ సంబంధాలు ఉంచుతుంది. రా మూడో దేశం ద్వారా కూడా సమాచారం సంపాదిస్తుంటుంది, ఆ దేశాల ద్వారా తన కార్యక్రమాలను సాగిస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, యునైటెడ్ కింగ్‌డమ్, హాంగ్‌కాంగ్, మయన్మార్, సింగపూర్ వాటిలో కొన్ని.
రా డైరెక్టర్లు[మార్చు]
క్రమ సంఖ్య. | డైరెక్టరు | నుండి | వరకు | పని కాలంలో ముఖ్య ఆంశాలు |
---|---|---|---|---|
01 | ఆర్.ఎన్.కావొ | 1968 | 1977 | RAW, ARC అరంభ డైరెక్టరు • బంగ్లాదేశ్ విమోచనా యుద్ధం • ఆపురేషన్ స్మైలింగ్ బుద్ధా |
02 | ఎన్.సంతూక్ | 1977 | 1983 | RRC, ETS ఆరంభ డైరెక్టరు |
03 | గిరీష్ చంద్ర సక్సేనా | 1983 | 1986 | అ.సం.రా., సోవియట్ యూనియన్, చైనా, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, సౌదీ అరేబియా వంటి దేశాల గూఢచారి విభాగాలతో ఇచ్చిపుచ్చుకొనే వ్యవహారాలు • 'కనిష్క' విమానం బాంబింగ్ ఉదంతం |
04 | ఎ.కె.వర్మ | 1986 | 1989 | |
05 | జి.ఎస్.బాజ్‌పాయి | 1989 | 1991 | విద్రోహ వ్యతిరేక కార్యక్రమాలు |
06 | ఎన్.నరసింహన్ | 1991 | 1993 | ఆపురేషన్ చాళుక్య |
07 | జె.ఎస్.బేడి | 1993 | 1994 | 1993 ముంబై పేలుళ్ళు • చైనా, పాకిస్తాన్ వ్యవహారాలపైనా, తీవ్రవాద వ్యతిరేక కార్యాలపైనా నిపుణుడు. |
08 | ఎ.ఎస్.స్యాలి | 1994 | 1996 | ఆర్థిక నేరాలపై పెరిగిన నిఘా • సంస్థలో క్రొత్త ఉద్యోగులను చేర్చుకోవడం, శిక్షణనివ్వడం పై ప్రత్యేక శ్రద్ధ. |
09 | రంజన్ రాయ్ | 1996 | 1997 | ఫార్ఖొర్ అయిర్ బేస్ చర్చలు |
10 | అరవింద్ దేవె | 1997 | 1999 | కార్గిల్ యుద్ధం • ఆపురేషన్ శక్తి |
11 | విక్రమ్ సూద్ | 1999 | 2003 | IC 814 హైజాకర్లతో చర్చలు • National Technical Facilities Organisation స్థాపన |
12 | సి.డి.సహాయ్ | 2003 | 2005 | ఆపురేషన్ లీచ్ • ARC పునర్వవస్థికరణ • ఢిల్లీ లోఢీ రోడ్‌లో RAW కేంద్ర కార్యాలయం ఏర్పాటు. |
13 | పి.కె.హెచ్.తారకన్ | 2005 | 2007 | Nuclear Command Authority (India) ఆరంభం |
14 | అశోక్ చతుర్వేది | 2007 | 2012 | 2007 సంఝౌతా ఎక్స్‌ప్రెస్ బాంబు పేలుళ్ళు పరిశోధన |
15 | ఎస్ కె త్రిపాటి | 2012 | (ప్రస్తుత డైరెక్టరు) |