ప్రపంచంలోనే ఎత్తైన థర్మామీటర్
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
ప్రపంచంలోనే ఎత్తైన థర్మామీటర్ | |
---|---|
సాధారణ సమాచారం | |
స్థితి | పూర్తయింది |
రకం | సంకేతం |
ప్రదేశం | 72157 బేకర్ బౌలేవార్డ్ బేకర్, కాలిఫోర్నియా యునైటెడ్ స్టేట్స్ |
భౌగోళికాంశాలు | 35°15′59″N 116°04′22″W / 35.26644°N 116.07275°W |
పూర్తి చేయబడినది | 1991 |
పునరుద్ధరించారు | 2014 |
వ్యయం | $700,000 |
పునరుద్ధరణ ఖర్చు | $150,000 |
యజమాని | హీర్రోన్ కుటుంబం |
ఎత్తు | 134 అడుగులు (41 మీ.) |
రూపకల్పన, నిర్మాణం | |
ప్రధాన కాంట్రాక్టర్ | యంగ్ ఎలక్ట్రిక్ సైన్ కంపెనీ |
వరల్డ్స్ టాలెస్ట్ థర్మామీటర్ అనేది ప్రపంచంలోనే ఎత్తైన థర్మామీటర్ స్థాపించిన బేకర్, కాలిఫోర్నియా, యునైటెడ్ స్టేట్స్ లోని ఒక ముఖ్యమైన ప్రదేశం. ఇది ఒక ఎలక్ట్రిక్ సంకేతం ఇది ఇక్కడకు సమీపంలోని డెత్ వ్యాలీలో 1913 జూలై 10 న రికార్డైన 134 డిగ్రీల ఫారన్హీట్ (57 డిగ్రీల సెల్సియస్) రికార్డును గుర్తుకు తెస్తుంది.
ఈ సంకేతం బరువు 76,812 పౌండ్లు (34,841 కేజీలు), ఇది 125 క్యూబిక్ గజముల (96 క్యూబిక్ మీటర్లు) కాంక్రీటుతో కలిసి ఉంది. ఇది 134 అడుగుల (41 మీటర్లు) పొడవు ఉంటుంది, 134 °F (57 °C) గరిష్ఠ ఉష్ణోగ్రతను ప్రదర్శించే సామర్థ్యాన్ని కలిగి ఉంది, ఈ రెండూ దీనిలో రికార్డు ఉష్ణోగ్రతకు సూచనగా ఉన్నాయి.[1]
చరిత్ర
[మార్చు]ఇది 1991 లో ఒక స్థానిక బేకర్ వ్యాపారవేత్త అయిన విల్లిస్ హీర్రోన్ కొరకు సాల్ట్ లేక్ సిటీ, ఉటాకు చెందిన యంగ్ ఎలక్ట్రిక్ సైన్ కంపెనీ చే నిర్మించబడింది, విల్లిస్ హీర్రోన్ తన బన్ బాయ్ రెస్టారెంట్ పక్కన ఈ థర్మామీటర్ నిర్మించడానికి $700,000 ఖర్చు చేశాడు. దీని ఎత్తు - 134 అడుగులు - ఇది ఇక్కడకు సమీపంలోని డెత్ వ్యాలీలో 1913 జూలై 10 న రికార్డైన 134 డిగ్రీల ఫారన్హీట్ (57 డిగ్రీల సెల్సియస్) రికార్డును గుర్తుకు తెచ్చే గౌరవ సూచికగా నిర్మించబడింది.
మూలాలు
[మార్చు]- ↑ Benson, Lee (6 January 2003). "Hot spot is a cool pit stop". Deseret News. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 2 జూన్ 2016.