Jump to content

పెద్దిరెడ్డి గంగాధరం

వికీపీడియా నుండి
పెద్దిరెడ్డి గంగాధరం
జననం
పెద్దిరెడ్డి గంగాధరం

1938 మే 30
మరణంమార్చి 26, 2016
వృత్తిసంగీతకారుడు
తల్లిదండ్రులుసత్యనారాయణమూర్తి, దేవీరత్నం

పెద్దిరెడ్డి గంగాధరం తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సంగీత కారులు. సంగీత ప్రపంచంలో 60 ఏళ్లు కాకినాడ నగరవాసులను గానమాధుర్యంతో ఉర్రూతలూగించిన స్వర గంధర్వుడు ఆయన. [1]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామం సమీపానగల హసనబాద్‌లో 1938 మే 30 న సత్యనారాయణమూర్తి, దేవీరత్నం దంపతులకు జన్మించారు. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి ఆర్కెస్ర్టాగా 1955లో ఐదుగురు సభ్యులతో స్ధాపించి గంగాధరం ఏపీలోనే కాకుండా ఆరేడు రాష్ట్రాల్లో సినీ మ్యాజికల్‌ నైట్స్‌ను నిర్వహించారు. [1]

గంగాధరం మ్యూజికల్ పార్టీ

[మార్చు]

ఆంధ్రప్రదేశ్‌లో ఆది ఆర్క్రెస్టాగా మొలకెత్తి ఈ నాటికీ నిఠారుగా తలఎత్తి నిలబడ్డ మహావృక్షం గంగాధరం మ్యూజిక్ పార్టీ. 1955వ సంవత్సరంలో ఆర్కె స్ట్రా అంటే ఏమిటో తెలియని రోజుల్లో కాకినాడ పట్టణంలో ఐదుగురు సభ్యుల తో మొట్టమొదటిగా కాకినాడ మ్యూజికల్ గ్రూప్‌గా ఏర్పడి ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలోనే కాకుండా ఒరిస్సా, మధ్యప్రదేశ్, వెస్ట్‌బెంగాల్, తమిళనాడు, మహా రాష్ట్రా వంటి రాష్ట్రాల్లో అనేక ఆర్కెస్ట్రాలు నిర్వహించారు.[2] ప్రముఖ హార్మోనిస్టు చించునాడు సన్యాసిరావు వద్ద కర్ణాటక సంగీతం, ఆకుల నరసింహరావు వద్ద హార్మోనియంలో మెళకువలు నేర్చుకున్న ఈయన 1955లో కాకినాడలో గంగాధరం మ్యూజిక్‌పార్టీని ఏర్పాటు చేసి దేశంలో అనే క చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు. ప్రముఖ నేపథ్య గాయకులు డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, పిఠాపురం నాగేశ్వరరావు, మాధవపెద్ది, సత్యం, ఆనంద్, జిక్కి తదితర గాయకులు గంగాధరం ఆర్కెస్ట్రాలో పాటలు పాడినవారే. సంగీత కళాకీర్తి పీఠంలో కాకినాడకు సముచితమైన స్థానాన్ని తన గంగాధరం ఆర్కె స్ట్రా ద్వారా సంపాదించిన గంగాధరం మాస్టారు 25, 50, 60 సంవత్సరాల వార్షికోత్సవాలను పెద్ద ఎత్తున నిర్వహించి ఆ కార్యక్రమాల ద్వారా ఎందరో ప్రముఖులకు సన్మానం చేశారు.[2][3]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయనకు భార్య విజయలక్ష్మి, కుమారుడు సతీష్‌, కుమార్తె ఉమ ఉన్నారు.

మరణం

[మార్చు]

ఆయన మార్చి 26 2016 శుక్రవారం రాత్రి అస్వస్థతకు గురై అస్తమించారు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "ఆర్కెస్ర్టాలకు ఆద్యుడు గంగాధరం ఇక లేరు". ఆంధ్రజ్యోతి. 27 March 2016. Retrieved 29 March 2016.[permanent dead link]
  2. 2.0 2.1 "అజరామర ఆనందానికి విరామం". సూర్య. 27 March 2016. Retrieved 29 March 2016.[permanent dead link]
  3. "'Swarabhishekam' on April 19". STAFF REPORTER. The Hindu. 29 March 2016. Retrieved 26 March 2016.

ఇతర లింకులు

[మార్చు]