Jump to content

దేవులపల్లి కృష్ణశాస్త్రి (రచయిత)

వికీపీడియా నుండి
దేవులపల్లి కృష్ణశాస్త్రి
"జంప్ కట్" పుస్తకావిష్కరణలో దేవులపల్లి
పుట్టిన తేదీ, స్థలందేవులపల్లి కృష్ణశాస్త్రి
మద్రాసు, తమిళనాడు
వృత్తిరచయిత
చిత్రకారుడు
కార్టూనిస్టు
గ్రాఫిక్ డిసైనర్
పౌరసత్వంభారతీయుడు
రచనా రంగంఆంగ్ల రచనలు
జీవిత భాగస్వామిచిత్ర

దేవులపల్లి కృష్ణశాస్త్రి రచయిత, చిత్రకారుడు, కార్టూనిస్ట్‌, గ్రాఫిక్‌ డిజైనర్‌. ఆయన ఆంగ్ల రచనల ద్వారా సుప్రసిద్ధుడు.[1] కృష్ణశాస్త్రి తొలి నవల "ఐస్ బోయిస్ ఇన్ బెల్ బాటమ్స్" దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. అది కొంత ఆత్మకథాత్మకంగా ఉంటుంది. ఆ పుస్తకం రెండో భాగం ‘రాలీ డేస్ అండ్ డిస్కో నైట్స్’.[2] [3] ఆయన రాసిన రెండవ పుస్తకం "జంప్ కట్".[4]

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన ప్రముఖ కార్టూనిస్టు బుజ్జాయి యొక్క కుమారుడు, భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి మనుమడు. ఆయన కుటుంబం మద్రాసులో 1960లు, 1970లలో సుమారు 25 సంవత్సరాలు నివసించారు.[3] ఆయనపై తన తాత గారు, నాన్నగారు ప్రభావం పడింది. ఆయన సినిమాలు చూడడం, బొమ్మలు గీయడం - ఇలా అన్నిటిలో ఆయన నాన్న గారిని అనుసరించడానికి ప్రయత్నించేవాడు. సృజనాత్మకమైన వృత్తిని చేపట్టేందుకు తగిన వాతావరణంలో ఆయన పెరిగాడు. అందువల్ల ఆయన చిత్రకళలోనికి ప్రవేశించాడు. ఆయన తాత గారైన కీర్తిశేషులు దేవులపల్లి సినిమాల్లో పనిచేసినా, ప్రాథమికంగా ఆయనకు మాత్రం తండ్రి బుజ్జాయి ద్వారానే సినీ రంగంపై ఆసక్తి పెరిగింది. వేసవి సెలవుల్లో ఆయన ఎండలో తిరక్కూడదని వారి తాత వారిని రోజుకో కథ రాయమనేవారు. అప్పటికే విన్నవైనా, లేదా కొత్తగా ఆలోచించినవైనా, స్వంత మాటల్లో, వారికి నచ్చినట్టు రాయాలి అనేవారు. అలా ముప్ఫై రోజుల్లో ఆయన ముఫ్పై కథలు రాసేవాడు. యిలా ఆయన ఇద్దరక్కచెల్లెళ్లు కూడా చేసేవారి. ఆ విధంగా ఆయనకు రచనా వ్యాసంగానికి బీజం పడింది. ఆయన జీవితంలో బాగా స్థిరపడ్డాక ఇంగ్లీష్‌లో నవలలు రాయడం మొదలెట్టాడు.

రచనలు

[మార్చు]
  • ఐస్ బోయిస్ ఇన్ బెల్ బాటమ్స్ (HarperCollins, 2011)[5]
  • జంప్ కట్ (HarperCollins, 2013)[6]
  • హౌ టు బి ఎ లిటరరీ సెన్సేషన్ [7]

‘జంప్ కట్’ గురించి

[మార్చు]

ఈ నవల్లో కథానాయకుడు సత్యజిత్‌రే. అతని తండ్రి రామన్ సినిమా రచయిత. పెద్దాయన ఆరోగ్యం బాగాలేదంటే చూడటానికి అమెరికా నుంచి ఇండియా వస్తాడు. తర్వాత ఏం జరిగింది, తండ్రి జీవితం గురించి అతనికెన్ని కొత్త విషయాలు తెలిశాయి… అన్నదే కథాంశం. కథ మొదలుకొని ప్రచారానికి వేసే పోస్టర్ల వరకూ అన్నీ వేరే చోటి నుంచి ఎత్తేసినవే ఉంటాయి ఎక్కువసార్లు. ఈ నవలలో అలాంటి సంఘటనల గురించి, అన్నిచోట్లా జరుగుతున్న మేథోచౌర్యం గురించి రాశాడు. దిగ్దర్శకుడు సత్యజిత్‌ రే అంటే ఎంతో అభిమానమున్న ఆయన ఈ పుస్తకంలో ప్రధాన పాత్రకు సత్యజిత్‌ రే రామన్‌ అని పేరు పెట్టారు. రచయిత తన జీవితంలో అధికభాగం గడిపిన మద్రాసు (ఇప్పటి చెన్నై) జీవితాన్నీ, అక్కడి పరిస్థితులనూ ప్రతిఫలించాయి. తాజా 'జంప్‌ కట్‌'లో ఆయన తమిళం, ఇంగ్లీషు కలగలిపి 'తంగ్లీష్‌'లో సంభాషణలు రాయడం విశేషం. నవలలోని పాత్రలు వాస్తవికంగా కనిపించడం కోసం, వాటి డైలాగులను సందర్భానుసారంగా అలా రాశాడు. తండ్రీ కొడుకుల అనుబంధాన్ని ప్రస్తావించే ఈ నవలకు ప్రాథమికంగా తమిళ చిత్ర పరిశ్రమను నేపథ్యంగా ఎంచుకున్నారు. దానికి, మేధాసంపత్తి హక్కుల అంశాన్ని జత చేశాడు.

వ్యక్తిగత జీవితం

[మార్చు]

ఆయన తండ్రి ప్రముఖ కార్టూనిస్టు బుజ్జాయి, తల్లి "లక్ష్మి" (భోగరాజు పట్టాభిసీతారామయ్య గారి ముని మనుమరాలు).[8] ఆయన సోదరీమణులు రేఖ సుప్రియ, లలిత రామ్ (రచయిత్రి). ఆయన జీవిత భాగస్వామి కూడా సృజనశీలి. ఆయన భార్య చిత్ర కూడా రచయిత్రి, పిల్లల చదువుకు సంబంధించిన పుస్తకాలకు బొమ్మలు గీసే చిత్రకారిణి కావడం విశేషం.[3]

మూలాలు

[మార్చు]
  1. "Riding on comedy". VENKY VEMBU. The HIndu. 6 February 2016. Retrieved 3 June 2016.
  2. మా తాత రోజుకో కథ రాయించేవారు :కృష్ణశాస్త్రి[permanent dead link]
  3. 3.0 3.1 3.2 Madras that is Chennai – in today's writing By T.K. Srinivasa Chari
  4. Does it ring a bell?
  5. "Vol XVII An Angel on the Rock". Archived from the original on 2016-08-10. Retrieved 2016-06-03.
  6. "Making the cut?". NIKHIL RAGHAVAN. The Hindu. 26 September 2013. Retrieved 3 June 2016.
  7. "How to be a Literary Sensation: A Quick Guide to Exploiting Friends, Family & Facebook for Artistic Gain (HarperCollins)By Krishna Shastri Devulapalli". Archived from the original on 2016-02-04. Retrieved 2016-06-03.
  8. మా తాత రోజుకో కథ రాయించేవారు :కృష్ణశాస్త్రి, ఆంధ్రజ్యోతి, నవ్యలో ఇంటర్వ్యూ

ఇతర లింకులు

[మార్చు]