వింజమూరి అనసూయ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వింజమూరి అనసూయా దేవి
వింజమూరి అనసూయా దేవి
వింజమూరి అనసూయా దేవి
వ్యక్తిగత సమాచారం
ఇతర పేర్లు అవసరాల అనసూయా దేవి
జననం (1920-05-12) 1920 మే 12
మరణం 2019 మార్చి 23 (2019-03-23)(వయసు 98)
సంగీత రీతి జానపద సంగీతము, లలిత సంగీతము
వృత్తి గాయని
క్రియాశీలక సంవత్సరాలు 1929-ఇప్పటి వరకు
సభ్యులు
వింజమూరి సీత

డా|| అవసరాల (వింజమూరి) అనసూయా దేవి (12 మే 1920 - 23 మార్చి 2019) ఒక ప్రముఖ జానపద కళాకారిణి, సంగీత దర్శకురాలు, రచయిత. హార్మోనియం వాయించటంలో దిట్ట. కళా ప్రపూర్ణ బిరుదాంకితురాలు. ఎనిమిదేళ్ళ వయసులోనే ఆమె పాట రికార్డ్ అయింది. ఆమె ఒక బాలమేధావి.

బాల్యం[మార్చు]

ఈమె మే 12, [[1920]- మార్చి 23, 2019] న ఒక సంగీత కళాకారుల, సాహిత్యకారుల కుటుంబంలో జన్మించింది. నిర్యాణం: (బృహత్ వాషింగ్టన్ DC, USA)కర్ణాటక సంగీతం మునుగంటి వెంకట్రావు దగ్గర నేర్చుకున్నది. ఆమె తండ్రి వింజమూరి వెంకట లక్ష్మీ నరసింహారావు ఒక కవి. తల్లి వింజమూరి వెంకటరత్నమ్మ 1914లో అనసూయ అనే పత్రికకు సంపాదకత్వం వహించేది.

విశేషాలు[మార్చు]

స్వాతంత్ర్యోద్యమంలో మహామహులైన గాంధీజీ, సుభాష్ చంద్రబోస్, జవహర్‌లాల్ నెహ్రూ, సర్వేపల్లి రాధాక్రిష్ణన్ లాంటి వారి సమక్షంలో పాడిన అనుభవం ఆమెకుంది. ఈమె మామయ్య దేవులపల్లి కృష్ణశాస్త్రి వ్రాసిన ప్రముఖ దేశభక్తి గీతం "జయజయజయ ప్రియ భారత" పాటకు బాణీ కట్టింది వింజమూరి అనసూయనే[1]

దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి మేనగోడలుగా, 1930 -50 దశకాలలో గురజాడ, రాయప్రోలు, శ్రీశ్రీ, నండూరి మొదలైన మహా కవుల గేయాలకు బాణీలు కట్టి చెల్లెలు సీతతో పాడి భావ గీతాలు. లలిత గీతాల ప్రక్రియకు, చెల్లెలు సీత తో కలిసి “సీతా -అనసూయ” లుగా ప్రాచుర్యం కలిగించిన తొలి గాయని.

· “జయ జయ ప్రియ భారత లాంటి అనేక దేశభక్తి గీతాలు, మొక్కజొన్న తోటలో & నోమీన మల్లాల లాంటి జానపద బాణీల స్వర కర్త.

· మారుమూల పల్లెలలో దాగి ఉన్న జానపదగేయాలకు సభా గాన మర్యాద కలిగించి సంగీత జగత్తులో ఉన్నత స్థానాన్ని కలిగించిన తొలి గాయని.

· భారత దేశంలో జానపద గేయాలకు కర్నాటక బాణీ లో స్వర రచన చేసిన తొలి స్వర కర్త.

· విశ్వవిద్యాలయాలలో శాస్త్రీయ సంగీతాన్ని పాఠ్యాంశంగా చేర్పించిన అసమాన గాయని.

· దక్షిణ భారత దేశంలో తొలి మహిళా సంగీత దర్శకురాలు.

· ప్రపంచవ్యాప్తంగా 11 జీవన సాఫల్య పురస్కారాలు, ఆంధ్రా యూనివర్సిటీ వారి “కళా ప్రపూర్ణ” మొదలైన శతాధిక గుర్తింపులు.

· అనేక దేశాలలో వేలాది కచేరీలు.

· 11 గ్రంధాల రచన.

పుస్తకాలు[మార్చు]

ఆమె రాసిన భావ గీతాలు, జానపద గేయాలు అనే రెండు పుస్తకాలను ఆమెకు 90 సంవత్సరాలు నిండిన సందర్భంగా చెన్నైలో 2008 ఏప్రిల్ 12 లో జరిగిన ఒక కార్యక్రమంలో విడుదల చేశారు. వీటితో బాటు ఆమె దాదాపు ఏడు పుస్తకాలను జానపద సంగీతం మీద ఏడు పుస్తకాలను విడుదల చేశారు.

పురస్కారాలు[మార్చు]

1977లో ఆమెకు ఆంధ్రా విశ్వవిద్యాలయం 'కళా ప్రపూర్ణ' అనే బిరుదునిచ్చి గౌరవ డాక్టరేట్ ఇచ్చి సన్మానించింది. ఇంకా అమెరికాలో జీవిత సాఫల్య పురస్కారాన్ని కూడా అందుకుంది. ప్యారిస్ లోనూ ఈమెకు క్వీన్ ఆఫ్ ఫోక్ అనే బిరుదును ప్రధానం చేశారు.

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

  1. http://www.hindu.com/fr/2008/04/11/stories/2008041150360200.htm
  2. http://www.hindu.com/fr/2008/04/11/stories/2008041151150300.htm
  3. http://www.hindu.com/fr/2008/02/01/stories/2008020151380600.htm
  4. జానపద సంగీత సామ్రాజ్ఞి - వింజమూరి అనసూయ
  5. జయ జయ ప్రియభారత ట్యూన్ నాదే
  6. తెలుగు స్వతంత్ర పత్రికలో అనసూయ సీతాదేవి 1
  7. తెలుగు స్వతంత్ర పత్రికలో అనసూయా సితాదేవి 2