వింజమూరి వెంకట లక్ష్మీ నరసింహారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వింజమూరి వెంకట లక్ష్మీ నరసింహారావు
జననం1887
India India
వృత్తిరంగస్థల నటుడు

వింజమూరి వెంకట లక్ష్మీ నరసింహారావు) (జననం 1887 ) భారతీయ రంగస్థల నటుడు, తెలుగు-సంస్కృత పండితుడు, రచయిత.

జీవిత విశేషాలు

[మార్చు]

ఆయన పిఠాపురంలో జన్మించారు. ఆయన రంగస్థన నటనకు ఆకర్షితులై తన 10 వ యేట "మర్చంట్ ఆఫ్ వెనిస్" నాటకంలో "గ్రాసియానా" పాత్ర పోషించారు. అప్పటి ప్రధానోపాధ్యాయులైన కూచి నరసింహం దృష్టిలో పడ్డారు. ఆయన 1913 లో "కాకినాడ అమటూర్స్" నాటక కంపెనీలో చేరి "గయోపాఖ్యానం" నాటకంలో గయుని పాత్రను పోషించారు. అదే నాటకం యొక్క నాటక పోటీలలో ఆయన కుర్మ వెంకట రెడ్డి నాయుడి ద్వారా మొదటి బహుమతిని అందుకున్నారు. ఆయన "పాండవ విజయం" నాటకంలో ధర్మరాజు పాత్రను పోషించారు. ఆయనకు యిష్టమైన పాత్ర ధర్మవరం వారి చిత్రనళినీయం నాటకంలోని బాహుకుడు. 1918 లో విక్టోరియా హాల్ లో ప్రదర్శించబడిన నాటకాలు రాసపుత్ర విజయం, ప్రతారుద్రీయం, సారంగధర లలో పాత్రలను పోషించారు. ఆయన బళ్ళారి రాఘవ చే అభినందింపబడ్డారు.

కుటుంబం

[మార్చు]

ఆయన వెంకటరత్నమ్మను వివాహమాడారు. ఆమె తెలుగులో మొదటి మహిళా పత్రిక అయిన "అనసూయ "కు సంపాదకురాలిగా పనిచేసింది. ఆ పత్రికలో రచయిత్రులు, అజంతా శైలిలో చిత్రాలు ఉండెడివి. ఆయన కుమార్తెకు కూడా ఆ పత్రిక నామం అనసూయ గానే నామకరణం చేసారు. వారికి ఇద్దరు కుతుళ్ళు. వారు వింజమూరి అనసూయ, వింజమూరి సీతాదేవి. వీరిద్దరినీ కలసి "వింజమూరి సిస్టర్స్"గా పిలుస్తారు. వీరిద్దరూ దేవులపల్లి కృష్ణశాస్త్రి యొక్క మేనకోడళ్ళు.

పురస్కారాలు

[మార్చు]

ఆయన 1967 లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు.

మూలాలు

[మార్చు]
  • Luminaries of 20th Century, Potti Sreeramulu, Telugu University, 2005.
  • Encyclopaedia Indica, Volume 2, Jagdish Saran Sharma, S. Chand, 1981