లలిత రామ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లలిత రామ్ తెలుగు రచయిత్రి. ఆమె అవంతీ కళ్యాణం, మేఘ నవలలను రాసారు.[1]

జీవిత విశేషాలు[మార్చు]

ఆమె దేవులపల్లి కృష్ణశాస్త్రి మనుమరాలు, బుజ్జాయి కుమార్తె.[2] ఆమె ఆంగ్ల సాహిత్యంలో, బిజినెస్ లలో పట్టభద్రురాలు. ఆమె హైదరాబాదులో జన్మించి మద్రాసులో పెరిగింది. ఆమె బుజ్జాయి, లక్ష్మీ దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి కుమారుడు. ఆమె తన భర్తతో అమెరికా లోని నార్త్ పసిఫిక్ లో నివసిస్తున్నారు. ఆమె రచనా ప్రస్థానాన్ని వారసత్వంగా కొనసాగిస్తున్నారు. ఆమె రాసిన అవంతీ కళ్యాణం నవల ప్రసిద్ధి పొందింది. ఆమె 2014 లో "మేఘ" అనే నవలను వ్రాసారు. [3]

రచనలు[మార్చు]

  • అవంతీ కళ్యాణం[4]
  • మేఘ[5] [6]

పురస్కారాలు[మార్చు]

  • వంశీ అంతర్జాతీయ అవార్డు - సాంస్కృతిక చైతన్యం భారతదేశం బయట వ్యాప్తి చేసినందుకు.[7]

వ్యక్తిగత జీవితం[మార్చు]

ఆమె తండ్రి ప్రముఖ కార్టూనిస్టు బుజ్జాయి, తల్లి "లక్ష్మి" (భోగరాజు పట్టాభిసీతారామయ్య గారి ముని మనుమరాలు).[8] ఆమె సోదరి రేఖ సుప్రియ, సోదరుడు దేవులపల్లి కృష్ణశాస్త్రి రచయిత, చిత్రకారుడు, కార్టూనిస్ట్‌, గ్రాఫిక్‌ డిజైనర్‌.

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=లలిత_రామ్&oldid=2884276" నుండి వెలికితీశారు